Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/2015 ప్రణాళిక

వికీపీడియా నుండి

తెలుగు సినిమాల వ్యాసాలు నాణ్యతాపరంగా అభివృద్ధి చేసేందుకు వనరులు, వ్యూహాలు, ఆలోచనలు పంచుకునేందుకు ఏర్పాటుచేసిన ప్రాజెక్టు ఉపపేజీ ఇది. ఈ పేజీ 2015 సంవత్సరాంతం వరకూ జరగాల్సిన కృషిని క్రమబద్ధీకరించేందుకు తయారవుతోంది.

నేపథ్యం

[మార్చు]

తెలుగు వికీపీడియాలు నాలుగు వేలకు పైగా తెలుగు సినిమాల వ్యాసాలు ఉన్నాయి. సినిమా దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటీనటులు, స్టూడియోలు, సంస్థలు వంటివి కాకుండా కేవలం సినిమాల వ్యాసాలు మాత్రమే లెక్కించినా ఈ నాలుగు వేలు వస్తున్నాయి. 2006లో వైజాసత్య గారు మొట్టమొదట తెలుగు సినిమా ప్రాజెక్టు ప్రారంభించారు. 4 ఆగస్టు 2006న వైజాసత్య గారి బాట్ ష్ గప్‌చుప్ సినిమాతో ప్రారంభించి నెలరోజులు గడిచేనాటికి వేలాది సినిమాల పేజీలు మౌలిక సమాచారంతో ప్రారంభించారు. తర్వాత మరో సంవత్సరానికి తెవికీపీడియన్లు కాసుబాబు, నవీన్ గార్లు తెలుగు పీపుల్, నందమూరి ఫ్యాన్స్, ఐడిల్ బ్రైన్, సినీగోయర్, మెగాఫ్యాన్స్ వంటి వెబ్సైట్ల వారికి-తెవికీ కోసం సమాచారాన్ని ఉపయోగించుకుంటామని రాసి అనుమతులు తీసుకున్నారు, వాటిని వైజాసత్య గారు బహిరంగంగా తెవికీలో ఇక్కడ ప్రచురించారు. ఇవి గాక రాజశేఖర్ గారు ఘంటసాల గానామృతం వెబ్సైట్లో పలు సినిమాల్లోని పాటల పల్లవులు ఉండడంతో, వాటిని ఆయా సినిమాల పేజీల్లో రాసుకున్నారు. ఆ వెబ్సైటునే మూలంగా ఇచ్చారు.
ఇవి కాక తెవికీపీడియన్లైన ఎందరో మహానుభావులు ఈ వ్యాసాలను తోచిన విధంగా అభివృద్ధి చేశారు. నవతరంగం వంటి వెబ్సైట్లలో వచ్చిన తెలుగు సినిమాల వ్యాసాలను ఆయా రచయతలకు క్రెడిట్స్ ఇస్తూ నేరుగా తెచ్చి ముద్రించినవారున్నారు. పైన చెప్పిన వెబ్సైట్ల నుంచీ సమాచారం తెచ్చి తెవికీలో చేర్చీవుండొచ్చు. అలా కొన్ని వ్యాసాలు అభివృద్ధి చెందాయి.

ప్రస్తుత స్థితి

[మార్చు]
అరకొర సమాచారం

వేలాదిగా ఉన్న ఈ సినిమా వ్యాసాల్లో సింహభాగం అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా చాలా వ్యాసాల్లో వైజాబాట్ చేర్చిన సమాచారపెట్టె మాత్రమే ఉంది. కొన్నిటిలో రాజశేఖర్ గారు చేర్చిన సినిమా పాటల సమాచారం ఉంది. మరికొన్నిటిలో మాత్రమే కనీసం కథ, నటీనటులు-పాత్రలు వంటివి ఉన్నాయి.

శైలిలో లోపాలు

ప్రముఖమైన మాయాబజార్ వంటి సినిమాలు గమనిస్తే చాలా సమాచారం ఉన్నా, కేవలం పత్రికల్లోని వ్యాసాల సమాచారం అదే ఫక్కీలో చోటుచేసుకుంది. మరో మూలం నుంచి మరెవరైనా రాస్తే ఆ కొత్త మూలంలోని శైలిలోనే పెట్టేస్తున్నారు. ఇలా విజ్ఞానసర్వస్వ శైలికి చాలా దూరంగా సమాచారం పోగుబడిపోయింది.

మూలాలు

పలు వ్యాసాల్లో మూలాలే కనిపించడం లేదు. వైజాబాట్ వ్యాసాలు సృష్టించడానికి ఏదోక మూలం నుంచే సమాచారం వినియోగించివుంటారు. కానీ ఆ మూలం ఏమిటన్నది మాత్రం రాయలేదు. తద్వారా చాలా వ్యాసాలు మూలాలు లేనివిగా తయారయ్యాయి. ఐతే రాజశేఖర్ గారు మాత్రం ఆయన పాటలు చేర్చిన చాలా వ్యాసాల్లో మూలాలు అన్న శీర్షికన మూలాన్ని ప్రస్తావించారు. కొన్నిటిలో ఏవో అంతర్జాల మూలాల నుంచి మొత్తం వ్యాసాన్ని తెచ్చి యధాతథంగా ప్రచురించినప్పుడు ఆయా రచయితలకు క్రెడిట్స్ ఇచ్చారు, కొంతవరకూ వికీశైలికి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ క్రెడిట్స్ ఇచ్చిన విధానమూ, మొత్తం వ్యాసాన్ని యధాతథంగా ప్రచురించుకోవడమూను.

మొత్తంగా

తెలుగు సినిమా వ్యాసాల్లో నాణ్యతాలోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

చేయాల్సిన కృషి

[మార్చు]
ఏకసూత్రత కనిపించే శైలి

తెవికీ సినిమా వ్యాసాల శైలిలో ఓ ఏకసూత్రత కనిపించేందుకు కృషిచేయాలి. వేర్వేరు సినిమాలకు కొన్ని శీర్షకలు విభజించుకోవడం, సమాచారం చేర్చడం వంటివాటిలో వ్యాసాల్లో శైలీభేదాలు వస్తే వస్తాయి. కానీ ఏదేమైనా మొత్తంగా ఓ విశిష్టమైన వికీ శైలిని ఈ వ్యాసాల విషయంలో అభివృద్ధి చేయడం, వాటిని ఈ వ్యాసాలను అభివృద్ధి చేసేవారు అవగాహన చేసుకోవడం జరగాలి. ఇందుకు రిఫరెన్సుగా ఆంగ్ల వికీపీడియాలో నాణ్యమైన స్థితిలో ఉన్న సినిమా వ్యాసాలు ఉపకరిస్తాయి.

మూలాలు ఉపయోగించుకోవడం

తెలుగు సినిమాలకు సంబంధించిన పుస్తకాలు, పత్రికలు, వెబ్సైట్లు వగైరాల్లో చాలా సమాచారం దొరుకుతోంది. ఈ సమాచారాన్ని పైన చెప్పిన శైలిలో తెవికీలో చేర్చుకోవాలి. వీలున్నంతలో ఇన్ లైన్ రిఫరెన్సుల స్థాయిలో మూలాలు పెట్టాలి.

సినిమా పోస్టర్లు వంటివి సేకరించి చేర్చడం

సినిమాల పోస్టర్ల సేకర్తలు, స్టిల్స్ సేకర్తలు ఉన్నారు. తెవికీపీడియన్లు వీలువెంబడి వారి నుంచి తీసుకుని సముచిత వినియోగం క్రింద తెవికీలో చేరిస్తే బావుంటుంది.

మొత్తంగా

ఉన్న మూలాలు, ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు కూడి వీలున్నన్ని వ్యాసాలను నాణ్యతాపరంగా అభివృద్ధి చేయాలి. తెవికీలో సినిమా వ్యాసాలు రాయడానికి ఓ విశిష్టమైన శైలి ఏర్పాటుచేయాలి.

ప్రణాళిక

[మార్చు]

అందుబాటులోని మూలాలు

[మార్చు]

2015 ఆగస్టు నెలలో జరిగిన హైదరాబాద్ సమావేశానికి సినీ విమర్శకులు వెంకట్ సిద్దారెడ్డిని ఆహ్వానించాము. ఆ సందర్భంగా ఆయన తెవికీలోని సినిమా వ్యాసాల వివరాలు పవన్ సంతోష్ ద్వారా తెలుసుకుని కొన్ని పుస్తకాలు, వ్యాసాలు సూచించారు. కొన్నిటిని స్వయంగా ఇచ్చి స్కాన్ చేసి వాడుకోమన్నారు. ఆయా ఆకరాల వివరాలు:

  1. కాట్రగడ్డ మురారి రచించిన తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర
  2. 1970 సంవత్సరంలోని విజయచిత్ర సినిమా పత్రిక సంచికలు
  3. కౌముది.నెట్లో వచ్చిన మొదటి సినిమా శీర్షికలోని వ్యాసాలు
  4. "కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి" పుస్తకం నుంచి వ్యాసాలు (వీటిలో చాలావరకూ నవతరంగంలో పున:ప్రచురణ పొందాయి)

ఇటీవల కాలంలో తెలుగు సినిమా వ్యాసాల అభివృద్ధికి పవన్ సంతోష్ ఉపయోగిస్తున్న ఆకరం:

  1. సాక్షి ఫన్ డేలో సినిమా వెనుక స్టోరీ వ్యాసాలు

ప్రస్తుత కార్యప్రణాళిక

[మార్చు]

మన దృష్టిలో ఉన్న ఆకరాల్లో నెట్లో అందరికీ అందుబాటులో ఉన్నవి - మొదటి సినిమా, సినిమా వెనుక స్టోరీ శీర్షికల్లోని వ్యాసాలు. ముఖ్యంగా మొదటి సినిమా శీర్షికలో దాదాపు 50 వ్యాసాలు ఉన్నాయి. సినీ ప్రముఖులు, అందునా ఎక్కువమంది దర్శకులు, తమ బాల్యం, తామెలా సినిమాల్లో చేరారు, మొదటి సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఎలా లభించింది వంటి వివరాలన్నీ అందులో దొరుకుతున్నాయి. అవన్నీ ఉపయోగించి వారి మొదటి సినిమాల వ్యాసాలు అభివృద్ధి చేయవచ్చు. ఇక వారం వారం సాక్షి ఫన్ డేలో సినిమా వెనుక స్టోరీ పేరిట ఒక్కో హిట్ మూవీ గురించి సమస్తమైన వివరాలు వస్తున్నాయి. వీటిని కూడా వినియోగించుకోవచ్చు. ఐతే ఇక్కడ సభ్యులుగా సంతకం చేసేవారి మధ్య ఏయే ఆకరాలు ఎవరు స్వీకరిస్తారు. ఎవరేది రాస్తారు అన్నవి అనుకుంటే తేలికవుతుంది.

బాధ్యతలు

[మార్చు]

ఈ ప్రణాళికపై పనిచేసేందుకు ముందుకువచ్చిన ముగ్గురు సుల్తాన్ ఖాదర్, రాజశేఖర్, పవన్ సంతోష్ ల పరస్పరం అంగీకారంపై ఈ పంపకం జరుగుతోంది. బాధ్యతలు స్వీకరించేందుకు ఆయా సభ్యులు వారి పేరు పక్కన బైస్టాంపుతో సంతకం చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 08:40, 12 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అభివృద్ధి నమోదు

[మార్చు]

కార్యప్రణాళిక ప్రకారం చేస్తున్న అభివృద్ధిని సభ్యులు ఇక్కడ క్లుప్తంగా నమోదుచేయవచ్చు. సినిమా వ్యాసాల్లో మొత్తంగా చేసిన కృషి అంతటినీ కాక ఈ ప్రణాళికలోని మూలాల నుంచి అభివృద్ధి చేసిన వ్యాసాలు మాత్రమే.

మూలం పేరు అభివృద్ధి చేసిన వికీవ్యాసాలు పాల్గొన్న సభ్యులు
మొదటి సినిమా (1 సంకలనం) - మోహన్ గాంధీ అర్ధాంగి (1977 సినిమా) పవన్ సంతోష్
మొదటి సినిమా (2 సంకలనం) - బీరం మస్తాన్ రావు బుర్రిపాలెం బుల్లోడు పవన్ సంతోష్
"కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి" పుస్తకంలో
వందేమాతరం గురించి వ్యాసం
వందేమాతరం (1939 సినిమా) పవన్ సంతోష్
మహేష్.. ఆ పేరులోనే మత్తుంది వ్యాసం
(ఫన్ డే సినిమా వెనుక స్టోరీ)
అష్టా చమ్మా (సినిమా) పవన్ సంతోష్
మొదటి సినిమా కె.విశ్వనాథ్
(నవతరంగంలో పున:ప్రచురణ నుంచి)
ఆత్మగౌరవం,
డాక్టర్ చక్రవర్తి వ్యాసంలో అభివృద్ధి విభాగం
పవన్ సంతోష్
మొదటి సినిమా (1 సంకలనం) - కోడి రామకృష్ణ కోడి రామకృష్ణ పవన్ సంతోష్
"కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి" పుస్తకంలో
గృహలక్ష్మి గురించి వ్యాసం
గృహలక్ష్మి (1938 సినిమా) పవన్ సంతోష్
"పెన్ను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం" వ్యాసం
(ఫన్ డే సినిమా వెనుక స్టోరీ)
అతడు (సినిమా) పవన్ సంతోష్
మొదటి సినిమా - సాగర్
(నవతరంగంలో పున:ప్రచురణ నుంచి)
స్టూవర్టుపురం దొంగలు,
మావారి గోల (తక్కువ సమాచారం),
రాకాసి లోయ
పవన్ సంతోష్
"అతడే ఆమె సైన్యం" వ్యాసం
(ఫన్ డే సినిమా వెనుక స్టోరీ)
ఒక్కడు పవన్ సంతోష్
"సో మచ్ టు సే...సంతోషం" వ్యాసం
(ఫన్ డే సినిమా వెనుక స్టోరీ)
సంతోషం (2002 సినిమా) పవన్ సంతోష్
"మైండ్ బ్లాక్ చేసింది" వ్యాసం
(ఫన్ డే సినిమా వెనుక స్టోరీ)
పోకిరి పవన్ సంతోష్
"నలుగురూ మెచ్చిన ఆ నలుగురు" వ్యాసం
(ఫన్ డే సినిమా వెనుక స్టోరీ)
ఆ నలుగురు పవన్ సంతోష్
"అమ్మతోడు... రికార్డులను అడ్డంగా నరికేశాడు" వ్యాసం
(ఫన్ డే సినిమా వెనుక స్టోరీ)
ఆది (సినిమా) పవన్ సంతోష్
మొదటి సినిమా (1 సంకలనం) - మోహన్ గాంధీ ఎ. మోహన గాంధీ సుల్తాన్ ఖాదర్
మొదటి సినిమా (1 సంకలనం) - ముత్యాల సుబ్బయ్య ముత్యాల సుబ్బయ్య సుల్తాన్ ఖాదర్
మొదటి సినిమా (1 సంకలనం) - లయ లయ సుల్తాన్ ఖాదర్
మొదటి సినిమా (1 సంకలనం) - భీమినేని శ్రీనివాసరావు భీమినేని శ్రీనివాసరావు సుల్తాన్ ఖాదర్
మొదటి సినిమా (1 సంకలనం) - ఆర్.నారాయణమూర్తి ఆర్.నారాయణమూర్తి సుల్తాన్ ఖాదర్
మొదటి సినిమా (1 సంకలనం) -సాగర్ సాగర్ సుల్తాన్ ఖాదర్
మొదటి సినిమా (1 సంకలనం) -శ్రీను వైట్ల శ్రీను వైట్ల సుల్తాన్ ఖాదర్
మొదటి సినిమా (1 సంకలనం) -శ్రీను వైట్ల నీ కోసం సుల్తాన్ ఖాదర్
మొదటి సినిమా (1 సంకలనం) -వి. ఎన్. ఆదిత్య వి. ఎన్. ఆదిత్య సుల్తాన్ ఖాదర్
మొదటి సినిమా (1 సంకలనం) -సురేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి సుల్తాన్ ఖాదర్

సభ్యులు

[మార్చు]
  1. పవన్ సంతోష్ (చర్చ) 12:42, 29 ఆగష్టు 2015 (UTC)
  2. నాటి 101 చిత్రాలు పుస్తకంలోని సమాచారాన్ని ఉపయోగించవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 13:34, 29 ఆగష్టు 2015 (UTC)
  3. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:15, 7 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]