వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/స్త్రీవాదము - జానపదము 2024

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టు నిర్వహణ వనరులు[మార్చు]

ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయంగా గెలిచినా వారికి బహుమతులు ఉన్నాయి, కానీ మన తెలుగు వికీపీడియాలో గెలిచిన వారికీ నేను నా స్వంత ఖర్చులతో అనగా రూ. 3000/- తో బహుమతులు ఇద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంకా ఎవరైనా సహాయం చేయగలరా... Tmamatha (చర్చ) 12:57, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నేను నా స్వంత ఖర్చులతో అనగా రూ. 5000/- బహుమతుల మొత్తంలో చేరుస్తాను అయితే ఇందులో తెలుగు వికీపీడియాన్ లు పాల్గొన్న 2000/- ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ పోటీకి కేటాయించగలరు. --Kasyap (చర్చ) 15:23, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నేను కూడా నా స్వంత ఖర్చుతో అనగా రూ. 5000/- బహుమతుల మొత్తంలో చేరుస్తాను, దీనిని ప్రాజెక్టు బహుమతులు. ఇతర వాటికి కేటాయిద్దాం. అలాగే ఇంకో విషయం, ప్రాజెక్టు నిర్వహణకు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉపయోగిస్తున్న క్యాంప్ విజ్ టూల్ చేర్చాను, ధన్యవాదాలు. నేతి సాయి కిరణ్ (చర్చ) 15:29, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టుకి సూచనలు[మార్చు]

నమస్కారం User:Tmamatha గారు,

ప్రాజెక్టు పేజీని రూపొందించి పనులు ప్రారంభించినందుకు ధన్యవాదాలు, ఈ ప్రాజెక్టు చేపడుతున్నందుకు అభినందనలు.

అయితే ప్రాజెక్టు నిర్వహణకి సంబంధించి నా నుండి కొన్ని ముఖ్యమైన సూచనలు:

  1. ప్రాజెక్టు పేజీలో ప్రతి విషయాన్నీ కూలంకషంగా చదవండి, ప్రాజెక్టు అంశాలలో ఉన్న ప్రతి విషయంపై అవగాహన పెంపొందించుకోండి.
  2. ప్రాజెక్టుకి సంబందించి వ్యాసాలు నిర్మించాల్సిన పేజీల లిస్టు ఒకటి సేకరిస్తే తద్వారా పాల్గొనేవారు వ్యాసాలు నిర్మించడంలో అది ఉపయోగపడుతుంది.
  3. ప్రాజెక్టు గురించి చర్చా పేజీల ద్వారా, తెలుగు వికీ మొదటి పేజీ బ్యానర్ ద్వారా, తెలుగు వికీ సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి తెలిసేలా సమాచారం అందించండి.
  4. ప్రాజెక్టుకి సంబంధించి మూసలు నిర్మించడం, అలాగే క్యాంప్విజ్ లేదా ఫౌంటెన్ టూల్ ఉపయోగం గురించి పాల్గొనేవారికి శిక్షణ అందించాలి.
  5. ప్రాజెక్టులో కొత్తగా రాయాలి అనుకునే వారికి వికీలో వ్యాసాలు రాయటంపై శిక్షణ అందిస్తే బాగుంటుంది.
  6. ప్రాజెక్టులో పాల్గొనే వారికి డిజిటల్ సర్టిఫికెట్లు ఇవ్వగలిగితే మంచిది అని నా అభిప్రాయం.


పై విషయాలు అన్ని పోను, ప్రాజెక్టు నిర్వహణ కాలంలో ప్రతి రోజు వికీలో ప్రాజెక్టు ప్రగతిని గమనిస్తూ, ప్రాజెక్టు చర్చా పేజీని తరచుగా పరిశీలిస్తూ ఉండటం చాలా అవసరం. నాకు తోచిన మట్టుకు చెప్పాను, ఇంకా ఇతర సభ్యుల సూచనలు గ్రహిస్తూ ముందుకు వెళ్ళండి. అల్ ది బెస్ట్. నేతి సాయి కిరణ్ (చర్చ) 15:41, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం నేతి సాయి కిరణ్ గారు, మీ అమూల్యమైన సూచనలు, సలహాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రాజెక్టు పేజీ చదివి అందులోని విషయాలు సంగ్రహించి ప్రాజెక్టు పేజీ తయారుచేయడం జరిగినది. ఆ ప్రాజెక్టు పేజీలో నాకు తెలిసిన వ్యాసాల జాబితా చేర్చడం జరిగింది.
తెలుగు వికీ బ్యానర్ ని ప్రణయ్‌రాజ్ వంగరి గారిని అడగడం జరిగినది. అలాగే ఈ రోజు రాత్రి 12పిఎం లోపు అందరికి చర్చా పేజీల్లో సందేశం పంపిస్తాను. వాడుకరులకు క్యాంప్విజ్ లేదా ఫౌంటెన్ టూల్ గురుంచి శిక్షణ ఇద్దాం అనుకుంటున్నాను. డిజిటల్ సర్టిఫికెట్లతో పాటు పది వ్యాసాల కంటే ఎక్కువ రాసినవారికి ఈ ప్రాజెక్టు తరుపున ఒక స్టార్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను.
ఇంకా ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఈ ప్రాజెక్టు చర్చా పేజీలో ఎవరైనా తెలుపగలరు. Tmamatha (చర్చ) 14:10, 3 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు గడువు[మార్చు]

Tmamatha గారూ, స్త్రీవాదము - జానపదము 2024 వికీప్రాజెక్టుకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మీకు ధన్యవాదాలు. గత సంవత్సరం ఈ పోటీని ఏప్రిల్ 15 వరకు పొడగించారు. మరి ఈ సంవత్సరం కూడా గడువు పొడగించారా? లేక ముగిసిందా..? తెలుపగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:51, 2 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం ప్రణయ్‌రాజ్ వంగరి గారు. స్త్రీవాదము - జానపదము 2024 వికీప్రాజెక్టు మార్చి 31వ తేదీన ముగిసింది. 1742 వ్యాసాలతో తెలుగు వికీపీడియా మొదటి స్థానంలో ఉంది. వ్యాసాల మూల్యాకనం జరుగుతున్నది, 10 రోజుల్లో విజేతలను ప్రకటిస్తాను. Tmamatha (చర్చ) 03:44, 3 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు @Tmamatha గారు. పోటీ ముగిసింది కాబట్టి పోటీకి సంబంధించిన సైట్ నోటీస్ ను తీసేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:06, 3 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండి. ధన్యవాదాలు Tmamatha (చర్చ) 05:15, 3 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలితాలు?[మార్చు]

@ Tmamatha గారూ నమస్కారం.. స్త్రీవాదము - జానపదము 2024 వికీప్రాజెక్టు విజయవంతంగా ముగిసి తెలుగు వికీపీడియా మొదటి స్థానంలో ఉండటం హర్షణీయం. కొత్తవాడుకరిగా నేనూ ఈ ప్రాజెక్టులో పాల్గొని నావంతు ఉడతా సాహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. కానీ ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ఫలితాలు వెలువడలేదు. ఫలితాలు రావడానికి ఎంత సమయం పట్టవచ్చో తెలియజేయగలరు.--Muktheshwri 27 (చర్చ) 14:40, 17 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]