వెల్లూరు (తమిళనాడు)

వికీపీడియా నుండి
(వెలూరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Vellore district
district
Dry riverbed of Palar River at Arcot
Dry riverbed of Palar River at Arcot
ముద్దుపేరు(ర్లు): 
Fort city
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Country India
Stateతమిళనాడు
DistrictVellore
Established1996
HeadquartersVellore
TalukasVellore, Katpadi, Vaniyambadi, Ambur, Arakkonam, Arcot, Gudiyatham, Tirupattur and Walajah
ప్రభుత్వం
 • Collector & District MagistrateR Nanthagopal IAS
విస్తీర్ణం
 • district6,077 కి.మీ2 (2,346 చ. మై)
జనాభా
(2011)[1]
 • district39,28,106
 • సాంద్రత650/కి.మీ2 (1,700/చ. మై.)
 • మెట్రో ప్రాంతం
13,07,998
Languages
 • OfficialTamil
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
PIN
631xxx,632xxx,635601 to 635958
Telephone code0416
వాహనాల నమోదు కోడ్TN-23,TN-73,TN-83
Coastline0 kilometres (0 mi)
Largest cityVellore
Sex ratioM-50.06%/F-49.94% /
Literacy79.65%
Legislature typeelected
Legislature Strength12
Lok Sabha constituencyVellore, Arakkonam and Thiruvannamalai
Precipitation917 millimetres (36.1 in)
Avg. summer temperature39.5 °C (103.1 °F)
Avg. winter temperature15.6 °C (60.1 °F)
జాలస్థలిDistrict administration

వెలూరు లేదా వేలూరు లేదా వెల్లూరు తమిళనాడులో ఉన్న ఒక నగరము.

చరిత్ర[మార్చు]

పర్యాటకరంగం[మార్చు]

జిల్లా ప్రధానకేంద్రమైన వేలూరులో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న వాటిలో వేలూరు కోట ఒకటి. బ్రిటిష్ ప్రభుత్వకాలంలో వేలూరుకోట అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది. బ్రిటిష్ ప్రభుత్వపాలనా కాలంలో టిప్పు సుల్తాన్ కుటుంబం, శ్రీలంక చివరి రాజైన విక్రమరాజ సింహా లను ఈ కోటలో రాజఖైదీలుగా బంధించబడ్డారు. ఈ కోటలో ఒక చర్చి, ఒక మసీదు, ఒక హిందూ ఆలయం ఉన్నాయి. 1806లో ఈ కోట నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. విజయనగర చక్రవర్తి అయిన శ్రీరంగరాజా సకుంటుంబంగా హత్యచేయబడడానికి ఈ కోట సాక్ష్యంగా నిలబడింది.[2] మలైకొడి అనే ఊరిలో పచ్చని గిరుల వరుసల పాదాల వద్ద శ్రీపురం అనే మహాలక్ష్మీ స్వర్ణ దేవాలయం ఉంది. ఈ ఆలయం వేలూరు నగరానికి దక్షిణసరిహద్దులో తిరుమలైకొడి అనే ఊరిలో ఉంది. ఈ ఆలయం కళాత్మకంగా తయారు చేయబడిన బంగారు రేకుల తొడుగుతో చేయబడింది. [3] వేలూరు కోటలో జలకండీశ్వరర్ ఆలయం ఉంది. ఈ ఆలయం ఆకాలంనాటి శిల్పుల ప్రతిభకు అద్దంపట్టే శిల్పాలు అనేకం ఉన్నాయి. ఈ జిల్లాలో రత్నగిరి మురుగన్ ఆలయం వాలాజాబాద్ ధన్వంతరి ఆలయం ఉంది. డి.పి పాళయంలో విజయ ఆంజనేయస్వామి ఆలయం, పొన్నై నవ గ్రహ కోట్టై ఆలయం ఉన్నాయి. వేలూరు కోటలోపల అసంప్షన్ కేథడ్రల్, 150 సంవత్సరాల పురాతనమైన సెయింట్ జాంస్ చర్చి ఉన్నాయి. నగరానికి కేంద్రస్థానంలో పెద్ద మసీదు, భరతదేశంలోనే అతిపెద్ద అరబిక్ కాలేజి ఉన్నాయి. వాణియంబాడి - తిరుపత్తూరు రహదారి మార్గంలో పర్యాటక కేంద్రం వేసవి విడిది అయిన ఏలగిరి ఉంది.[4] ఏలగిరి కొండలు సముద్రమట్టానికి 1,410.6 మీటర్ల ఎత్తులో 30 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. 2. మిగిలిన వేసవి విడుదలలాగా కలుషితం కాకుండా ఏలగిరి సహజసౌందర్యం చెదరకుండా ఉండడం విశేషం. వర్షాకాలంలో మాత్రమే నీరు ఉండే జలగంపారి జలపాతం ఏలగిరిలోనే ఉంది. వేలూరుకు 25 కిలోమీటర్ల దూరంలో జవ్వాదు కొండల పాదాల వద్ద అమిర్తి నదీ సమీపంలో అమిర్తి అరణ్యం &, జూలాజికల్ పార్క్ ఉన్నాయి. .

వెలుపలి లింకులు[మార్చు]

  1. "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
  2. "Vellore sepoys rebelled". The Hindu. 06 Augus 2006. Retrieved 2013-07-07. Check date values in: |date= (help)
  3. "Golden Temple at Vellore". The Hindu. August 2007.
  4. "Miles to go for Yelagiri Hills as a tourist spot". The Hindu. May 25, 2008. Retrieved 07-04-2009. Check date values in: |accessdate= (help)