వృక్ష శాస్త్రీయ నామం
(శాస్త్రీయ నామము నుండి దారిమార్పు చెందింది)
వృక్ష శాస్త్రీయ నామం అనగా ఒక మొక్కకి ప్రపంచ వ్యాప్తంగా అందరికి అమోదయోగ్యమైన పేరును శాస్త్రీయ పద్ధతులను అనుసరించి నిర్ణయించడం. వృక్షశాస్త్రీయ నామంను ఆంగ్లంలో Botanical name అంటారు. శాస్త్రీయ నామంలో ప్రధానంగా రెండు పేర్లు ఉంటాయి. మొదటి పేరును ప్రజాతి నామమని, రెండవ పేరును జాతి నామమని పిలుస్తారు. ఇట్లా రెండు పేర్లతో జీవులను పిలవడాన్నే ద్వినామీకరణ విధానమని వ్యవహరిస్తారు. ఈ ద్వినామీకరణ పద్ధతిని గాస్పర్డ్ బాహిన్ (Gaspard Bauhin) 1596లో ప్రవేశపెట్టాడు. కరోలస్ లిన్నేయస్ (Linnaeus) 1753లో తన మొక్కల జాతులు (Species plantarum)లో ద్వినామీకరణ విధానాన్ని అన్ని మొక్కలకు అనువర్తింపజేశాడు.
కొన్ని మొక్కలు - శాస్త్రీయనామాలు
[మార్చు]మొక్క | శాస్త్రీయనామం | ఆధారం/మూలాలు |
---|---|---|
అరటి | మ్యూస పారడైసిక | [1] |
అశ్వగంధి | విథానియా సోమ్నిఫెరా | [2] |
ఆముదం | రిసినస్ కమ్యూనస్ | |
ఆపిల్ | ఫైరస్ మాలస్ | |
ఆవాలు | బ్రాసికా నైగ్రా | |
ఉమ్మెత్త | దతూర మెటల్ | |
ఉల్లి | ఎల్లియం సెపా | |
ఉసిరి | ఎంబ్లికా అఫిషినాలిస్ | |
ఎర్ర చందనం | రోకార్పస్ సాంటలైనస్ | |
కంది | కజానస్ కజాన్ | |
కాఫీ | కాఫియా అరబిక | |
కాలిఫ్లవర్ | బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్ | |
కొబ్బరి | కస్ న్యూసిఫెరా | |
క్యాబేజీ | బ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు | |
గంజాయి (హెరాయిన్) | కన్నాబినస్ సటైవం | |
గడ్డిచామంతి | ట్రైడాక్స్ ప్రొకెంబెన్స్ | |
గోంగూర | హైబిస్కస్ కన్నాబినస్ | |
గోధుమ | ట్రిటికం ఈస్టివం | |
జనుము | క్రోటలేరియా జెన్షియా | |
చామంతి | క్రైసాంథియమ్ ఇండికా | |
చింత | టామరిండస్ ఇండికా | |
చిక్కుడు | డాలికస్ లాబ్ లాబ్ | |
చెరకు | శాఖారమ్ అఫిసినెరం | |
జామ | సిడియం గువా | |
జీడిమామిడి | అనకార్డియం ఆక్సిడెంటేలిస్ | |
జీలకర్ర | కుకుమినమ్ సిమినమ్ | |
జొన్న | సోర్గం వల్గేర్ | |
టమాటో | లైకోపెర్సికం ఎస్కులెంటమ్ | |
టేకు | టెక్టోనా గ్రాండిస్ | |
తమలపాకు | హైపల్ బీటిల్ | |
తామర | నీలంబో న్యూసిఫెరా | |
తులసి | ఆసిమం సాంక్టం | [3] |
తేయాకు | ధియోసైనెన్‌సిస్ | |
దానిమ్మ | ప్యూనికా గ్రనాటమ్ | |
దాల్చిన చెక్క | సిన్నమోమమ్ జైలానిక | |
ద్రాక్ష | వైటిస్ వినిఫెర | |
నువ్వులు | సిసామమ్ ఇండికం | |
పత్తి | గాసీపియం హెర్బీషియం | |
పనస | ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా | |
పామ్ | ఇల్యుసిస్ గైనన్‌సిస్ | |
పెసర | పేసియోలస్ అరియస్ | |
పైనాపిల్ | అనానాస్ సెటైవా | |
పొగాకు | నికోటియానా టొబాకమ్ | |
ప్రొద్దు తిరుగుడు | హీలియాంథస్ ఎన్యూవస్ | |
బంగాళాదుంప | సొలానం ట్యూబరోసమ్ | |
బంతి | టాజినెస్ పాట్యులా | |
బెండ | హైబిస్కస్ ఎస్కులేంటస్ | [1] |
బఠాణి | పైసమ్ సెటైవం | |
బార్లి | హార్డియం వల్లారే | |
బిళ్ల గన్నేరు | వింకారోజియస్ | |
బొప్పాయి | కారియా పపాయా | |
మందార | హైబిస్కస్ రోజా సైనెన్సిస్ | [1] |
మల్లె | జాస్మినం ఇండికం | |
మామిడి | మాంజిఫెరా ఇండికా | [4] |
మినుము | పేసియోలస్ ముంగో | |
మిరియాలు | పైపర్ నైగ్రం | |
మిరప | కాప్సికం ప్రూటెన్సిస్ | |
ముల్లంగి | రఫానస్ సెటైవమ్ | |
మెంతి | ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్ | |
మొక్కజొన్న | జియామేజ్ | |
రాగులు | ఇల్యుసైన్ కొరకానా | |
లవంగం | యాజీనియా కారియోఫిల్లెటా | |
వంగ | సొలానం మెలాంజినమ్ | |
వరి | ఒరైజా సటైవా | |
వెదురు | బాంబూసా | |
వెల్లుల్లి | ఎల్లియం సెటైవమ్ | |
వేప | అజాడిరక్టా ఇండికా | |
వేరుశనగ | అరాఖిస్ హైపోజియం | |
శనగ | సైసర్ అరాటినం | |
సజ్జ | పెన్నిసేటం టైపాయిడం | |
సీతాఫలం | అనోనా స్క్వామోజ | |
సోంపు | పోనీక్యులమ్ వల్గేర్ | |
సోయాబీన్ | గ్లైసిన్ మాక్స్ |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "General Knowledge". www.eenadupratibha.net. Archived from the original on 2019-10-04. Retrieved 2020-03-23.
- ↑ Lmforteachers (2017-01-18). "competative exams spl: వృక్షశాస్త్రం మొక్కలు - శాస్త్రీయ నామాలు మారు పేర్లు". competative exams spl. Archived from the original on 2020-03-23. Retrieved 2020-03-23.
- ↑ డా.ఎం.రఘురాం, వృక్షశాస్త్ర ప్రయోగదీపిక,టెక్నికల్ పబ్లిషర్స్, గుంటూరు-2010, పుట-121
- ↑ "గోరింట శాస్త్రీయ నామం? | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Archived from the original on 2020-03-23. Retrieved 2020-03-23.