శ్రీ కృష్ణ జన్మభూమి
Krishna Janmasthan Temple Complex | |
---|---|
మతం | |
అనుబంధం | Hinduism |
జిల్లా | Mathura district |
దైవం | Keshavdeva |
పరిపాలన సంస్థ | Shri Krishna Janmasthan Seva Sansthan |
పవిత్ర సంవత్సరం | 1958 (Keshavdeva Temple) |
స్థితి | Active |
ప్రదేశం | |
ప్రదేశం | Mathura |
రాష్ట్రం | Uttar Pradesh |
దేశం | India |
Location in Uttar Pradesh | |
భౌగోళిక అంశాలు | 27°30′17″N 77°40′11″E / 27.504748°N 77.669754°E |
వాస్తుశాస్త్రం. | |
నిధులు | Dalmia and Birla family |
గ్రౌండ్‌బ్రేకింగ్ | 1953 (modern temple complex) |
పూర్తైనది | 1982 |
నాశనం | 1670 (former temple) |
దేవాలయాలు | Three |
శ్రీ కృష్ణ జన్మభూమి అనేది మథుర నగరంలో ఉన్న ఒక ధార్మిక దేవాలయం. ఈ ఆలయం పురాతన హిందూ మత దేవుడైన శ్రీకృష్ణుడి జన్మస్థలం.[1][2] ఇది కంసునికి చెందిన ఒక జైలు గది, ఇక్కడే శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు.
చరిత్ర
[మార్చు]చరిత్రకారుల ప్రకారం ఈ జైలు గది 'గర్భ గృహ' గా పేరొందింది, ఈ ఆలయ ఆవరణమే కృష్ణుడు జన్మించిన కచ్చితమైన ప్రదేశం. ఈ జైలు గది గోడ కంసరాజు యొక్క క్రూరత్వాన్ని గుర్తుచేస్తుంది. అనేక విగ్రహాలు, పురాతన కాలానికి చెందిన శిల్పాలు ఇక్కడి తవ్వకాలలో కనిపించాయి. ఈ జైలు గది క్రమంగా మారి ప్రస్తుతం అందమైన దేవాలయమయింది. లక్షలాది భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి సమయంలో ఆలయం వద్దకు తరలి వస్తారు. ఇక్కడ పండుగ సమయాలలో జరిపే ఉత్సవాలు, వేడుకలు భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. వేడుకలు శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన మధ్య రాత్రి సమయంలో ప్రారంభమవుతాయి.[1]
ప్రదేశం
[మార్చు]శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన మథుర నగరం యమునా నది ఒడ్డున ఉన్నది, ఇది రాజధాని నగరం ఢిల్లీకి సుమారు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం శ్రీకృష్ణ ప్రసిద్ధ కృష్ణ జన్మ భూమి మందిర్ భక్తులను అత్యంత గౌరవించే అతిధేయ ఆలయంగా ఖ్యాతి చెందింది. వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రదేశంలో భగవానుడు జన్మించాడని చెబుతుంటారు. పొరుగు పట్టణాలైన గోవర్ధన్, నందగావ్, బృందావన ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతం హిందువులకు ఒక ప్రధాన యాత్రా ప్రదేశం. ఈ ఆలయం మథుర నగరానికి మధ్యన ఉంది.[3]
పర్యాటక రంగం
[మార్చు]మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం భక్తులలో అత్యంత భక్తి విశ్వాసాలు నింపే ఆలయంగా ఉంది. దేవకి, వాసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మించిన ఈ ప్రదేశం ప్రముఖ పవిత్రాలయంగా విరాజిల్లుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-04. Retrieved 2015-09-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-09-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-04. Retrieved 2015-09-06.