సర్వాంగాసనము

వికీపీడియా నుండి
(సర్వాంగాసనం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సర్వాంగాసనం

సర్వాంగాసనము (సంస్కృతం: सर्वाङ्गसन) యోగాలో ఒక విధమైన ఆసనము. శరీరంలోని అన్ని అంగాలకు ఉపయోగపడే ఆసనం కాబట్టి దీనికి సర్వాంగాసనమని పేరు వచ్చింది.

పద్ధతి

[మార్చు]
  • మొదట శవాసనం వేయాలి.
  • తరువాత హలాసనంలో వలె కాళ్ళను మెల్లమెల్లగా తలవైపు వంచాలి.
  • నడుమును చక్కగా చేసి రెండు చేతులతో పట్టుకోవాలి.
  • ఆ తరువాత కాళ్ళను మెల్లగా పైకి ఎత్తి నిటారుగా ఉంచాలి. పాదాలు, పిక్కలు, తొడలు, నడుము అన్నీ చక్కగా నిటారుగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి.
  • కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు శ్వాసను మెల్లగా పీల్చి, మెల్లగా వదులుతూ ఉండాలి.
  • మెల్లమెల్లగా కాళ్ళు తలవైపు ఉంచి, నడుమును ముందుగా నేలపై ఆనించిన తర్వాత కాళ్ళు ఆనించాలి.
  • కొద్దిసేపు శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.

ప్రయోజనం

[మార్చు]
  • సర్వాంగాసనం మెడలోని అవటు గ్రంధిని ఉత్తేజపరచి రక్తప్రసారం పెంచుతుంది.
  • ఈ ఆసనం మూలవ్యాధి, వరిబీజము వంటి వ్యాధులను నివారిస్తుంది.
  • ఇది జననేంద్రియాల స్వస్థతను పెంచుతుమ్ది. స్త్రీలలో ఋతుచక్రంలోని దోషాలను తొలగిస్తుంది. పురుషులలో నపుంసకత్వాన్ని తొలగిస్తుంది.
  • ఇది ఊపిరితిత్తులకు రక్తప్రసారం సక్రమంగా జరగడం వలన వాటి సామర్థ్యం పెరుగుతుంది.

హెచ్చరిక

[మార్చు]

అధిక రక్తపోటు, వెన్నెముక సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, గుండె జబ్బులు కలవారు సర్వాంగాసనం వేయరాదు.