Jump to content

అశ్వనీ దత్

వికీపీడియా నుండి
(సి. అశ్వనీదత్ నుండి దారిమార్పు చెందింది)
అశ్వనీ దత్
జననం
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
వృత్తిసినీ నిర్మాత, పంపిణీదారు
పిల్లలుస్వప్న దత్, ప్రియ దత్, స్రవంతి దత్
బంధువులునాగ్ అశ్విన్, ప్రసాద్ వర్మ (అల్లుళ్ళు)

అశ్వనీ దత్ ప్రముఖ సినీ నిర్మాత. వైజయంతీ మూవీస్ పేరుతో పలు సినిమాలు నిర్మించాడు. విజయవాడలో జన్మించిన ఈయన ఎన్. టి. ఆర్ మీద అభిమానంతో చిన్న వయసు నుంచే నిర్మాతగా మారాడు. ఈయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు ఇద్దరూ సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు.

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

అశ్వనీ దత్ విజయవాడలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి అప్పట్లో ఎ క్లాస్ కాంట్రాక్టరు. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ఏళ్ళు కలింగ పైప్స్ కు ఏకైక పంపిణీదారుగా ఉన్నాడు. రచయిత, దర్శకుడు జంధ్యాల ఈయనకు బాల్య స్నేహితుడు. అశ్వనీదత్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ప్రియాంక దత్, స్వప్న దత్. వీరిద్దరూ సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు. ప్రియాంక దత్ దర్శకుడు నాగ్ అశ్విన్ ను 2015 లో వివాహం చేసుకుంది.[1][2] ఇక స్రవంతి దత్ హాస్పిటాలిటీ రంగంలో వ్యాపారవేత్త.

సినిమా కెరీర్

[మార్చు]

ఈయన చిన్న వయసులోనే నిర్మాతగా మారాడు. ఎన్. టి. ఆర్ కు అభిమాని. 1975 లో ఎన్. టి. ఆర్ కథానాయకుడిగా వచ్చిన ఎదురు లేని మనిషి వైజయంతీ మూవీస్ తొలి సమర్పణ. ఈ సినిమా వంద రోజులు ఆడింది.[3]

నిర్మించినవి

[మార్చు]

వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన సినిమాలు.

సంవత్సరం సినిమా గమనికలు
1975 ఎదురులేని మనిషి తెలుగు సినిమా రంగ ప్రవేశం
1978 యుగ పురుషుడు
1981 గురు శిష్యులు
1983 అడవి సింహాలు
1985 అగ్ని పర్వతం
1986 బ్రహ్మ రుద్రులు
1988 ఆఖరి పోరాటం
1990 జగదేక వీరుడు అతిలోక సుందరి
1992 అశ్వమేధం
1994 గోవిందా గోవిందా
శుభలగ్నం
1998 చూడాలని వుంది
1999 రాజకుమారుడు
రావోయి చందమామ
2000 ఆజాద్
2001 ప్రేమక్కే సాయి కన్నడ సినిమాలో అరంగేట్రం
2002 కంపెనీ హిందీ చిత్రసీమలో అరంగేట్రం
ఇంద్రుడు
2005 బాలు ABCDEFG
సుభాష్ చంద్రబోస్
జై చిరంజీవ
2006 సైనికుడు
2007 చిరుత
2008 కథానాయకుడు కుసేలన్‌తో ఏకకాలంలో రూపొందించబడింది
కంత్రి
2011 శక్తి
2018 మహానటి
దేవదాస్ [4]
2019 మహర్షి
2022 సీతా రామం
2024 కల్కి 2898 ఏ.డీ[5]

స్వప్న సినిమా

సంవత్సరం సినిమా
2001 స్టూడెంట్ నెం: 1
2002 ఒకటో నంబర్ కుర్రాడు
2015 ఎవడే సుబ్రహ్మణ్యం
2018 మహానటి
2021 జాతి రత్నాలు
2022 సీతా రామం
2023 అన్నీ మంచి శకునములే

రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్, సిరి మీడియా ఆర్ట్స్, యునైటెడ్ ప్రొడ్యూసర్స్ (అశ్వని దత్, అల్లు అరవింద్, కె. రాఘవేంద్రరావు)

సంవత్సరం సినిమా
1996 పెళ్లి సందడి
1997 మేరే సప్నో కి రాణి (హిందీ)
1998 పరదేశి
నినైతెన్ వంధై (తమిళం)
2003 పెళ్ళాం ఊరెళితే
గంగోత్రి
కలకత్తా మెయిల్ (హిందీ)
2004 ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి

శ్రీ ప్రియాంక పిక్చర్స్

విడుదల సంవత్సరం సినిమా పేరు
1994 శుభలగ్నం

రోజా ఆర్ట్ ప్రొడక్షన్స్

విడుదల సంవత్సరం సినిమా పేరు
1983 జానీ దోస్త్ (హిందీ)

మూలాలు

[మార్చు]
  1. "Director Nag Ashwin to wed Ashwini Dutt's daughter Priyanka". Indian Express. 10 October 2015. Retrieved 19 June 2018.
  2. Eenadu (25 September 2022). "పుత్రికోత్సాహం". Archived from the original on 25 September 2022. Retrieved 25 September 2022.
  3. "ఈ పాటకి నేను డ్యాన్స్‌ చేయాలా? : ఎన్టీఆర్‌". sitara.net. ఈనాడు. Archived from the original on 14 అక్టోబరు 2018. Retrieved 19 June 2018.
  4. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 మార్చి 2020. Retrieved 2 April 2020.
  5. Andhrajyothy (30 June 2024). "తెలుగు సినిమాగతిని 'కల్కి' మార్చేసింది..!". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.