సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు

వికీపీడియా నుండి
(సైబరాబాద్ పోలీసులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్
నినాదంమీ భద్రతే మా బాధ్యత
ఏజెన్సీ అవలోకనం
ఏర్పాటు2003
అధికార పరిధి నిర్మాణం
కార్యకలాపాల అధికార పరిధిసైబరాబాదు, తెలంగాణ, భారతదేశం
సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు is located in Telangana
సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు
సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు (Telangana)
చట్టపరమైన అధికార పరిధిరంగారెడ్డి జిల్లా
ప్రధాన కార్యాలయంగచ్చిబౌలి, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఏజెన్సీ అధికారులు
మాతృ ఏజెన్సీతెలంగాణ పోలీసు
వెబ్‌సైట్
అధికారిక వెబ్‌సైటు

సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గచ్చిబౌలిలో ఉన్న పోలీసు కమిషనరేట్. ఇది 2003లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను విభజించడం ద్వారా ఏర్పడింది.[1][2]

ఏర్పాటు

[మార్చు]

సైబరాబాద్ పోలీసును 2003 లో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం కింద స్థాపించారు. దీని అధికార పరిధి రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ ప్రాంతం వస్తుంది. దీని ప్రధాన కార్యాలయం గచ్చిబౌలిలో ఉంది.

సైబరాబాద్ పోలీస్ విభాగంలో మూడు కార్యాచరణ జోన్లున్నాయి. అవి మాదాపూర్, బాలానగర్, శంషాబాద్. మాదాపూర్ మండలంలో కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్ డివిజన్లు, బాలానగర్ మండలంలో బషీరాబాద్, బాలానగర్ డివిజన్లు, శంషాబాద్ మండలంలో రాజేంద్ర నగర్, షాద్ నగర్, శంషాబాద్, చేవెళ్ల డివిజన్లు ఉన్నాయి. సైబరాబాద్ పోలీసులకు మాదాపూర్, బాలానగర్, శంషాబాద్‌లో మూడు జోన్‌లతో కూడిన ట్రాఫిక్ వింగ్ కూడా ఉంది.

కమిషనర్లు

[మార్చు]
  1. సి.హెచ్‌. ద్వారకా తిరుమలరావు
  2. సీవీ ఆనంద్‌
  3. వి.నవీన్‌చంద్ [3]
  4. వీసీ సజ్జనార్‌ - 13 మార్చి 2018 - 25 ఆగస్టు 2021
  5. స్టీఫెన్ రవీంద్ర - 25 ఆగస్టు 2021 - ప్రస్తుతం

జోనులు

[మార్చు]

మాదాపూర్ జోను

[మార్చు]

శంషాబాద్ జోను

[మార్చు]

బాలానగర్ జోను

[మార్చు]

వివాదాలు

[మార్చు]

2019 హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం సైబరాబాద్ పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని విచారణ కమిషన్ న్యాయమూర్తి వి. ఎస్. సిర్పుర్కర్ ప్రకటించారు.[4] హేమాంగి శర్మ మోసం కేసులో సైబరాబాద్ పోలీసులు నకిలీ సాక్షులు, నకిలీ అఫిడవిట్లు, నకిలీ పంచనామా సహాయంతో తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు, తప్పుడు ఛార్జ్ షీట్‌లు నమోదు చేశారని ఒడిషా కవి తపన్ కుమార్ ప్రధాన్ సోషల్ మీడియాలో ఆరోపించాడు.[5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Hyderabad traffic guard's photo of feeding a homeless woman is going viral for all the right reasons". 2 April 2018.
  2. "Outer Ring Road in Hyderabad speed limit likely to be 120 kmph again". The New Indian Express.
  3. Andrajyothy (2016). "సైబరాబాద్‌ జంట కమిషనరేట్లకు కొత్త సారథులు". Archived from the original on 7 సెప్టెంబరు 2021. Retrieved 7 September 2021.
  4. "దిశా ఎన్‌కౌంటర్ - పది మంది అధికారులపై కమీషన్ హత్య అభియోగాలు కోరుతోంది". ది వైర్. 20 May 2022. Archived from the original on 17 అక్టోబరు 2022. Retrieved 22 అక్టోబరు 2022.
  5. ప్రధాన్, డాక్టర్ తపన్ కుమార్ (2019). నేను, ఆమె , సముద్రం. కోహినూర్ బుక్స్. ISBN 978-81-942835-9-1.

ఇతర లంకెలు

[మార్చు]

సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ అధికారిక వెబ్సైటు Archived 2020-12-10 at the Wayback Machine