అర్జున రణతుంగ
దేశమాన్య అర్జున రణతుంగ పార్లమెంటు సభ్యుడు | |
---|---|
రవాణా, పౌరవిమానయాన శాఖ మంత్రి | |
In office 20 December 2018 – 21 November 2019 | |
అధ్యక్షుడు | మైత్రిపాల సిరిసేన |
ప్రధాన మంత్రి | రణీల్ విక్రమసింఘే |
అంతకు ముందు వారు | నీమల్ సిరిపాల డి సిల్వా |
తరువాత వారు | మహీందా అమరవీర |
పెట్రోలియం వనరుల అభివృద్ధి శాఖ మంత్రి | |
In office 22 May 2017 – 26 October 2018 | |
అధ్యక్షుడు | మైత్రిపాల సిరిసేన |
ప్రధాన మంత్రి | రణీల్ విక్రమసింఘే |
అంతకు ముందు వారు | చందమ వీరక్కోడి |
తరువాత వారు | కబీర్ హాషిమ్ |
రేవులు, షిప్పింగు శాఖ మంత్రి | |
In office 12 January 2015 – 22 May 2017 | |
అధ్యక్షుడు | మైత్రిపాల సిరిసేన |
ప్రధాన మంత్రి | రణీల్ విక్రమసింఘే |
అంతకు ముందు వారు | మహీంద రాజపక్ష |
తరువాత వారు | మహీంద సమరసింఘే |
Deputy Minister of Tourism | |
In office 2005–2008 | |
అధ్యక్షుడు | Mahinda Rajapaksa |
ప్రధాన మంత్రి | Ratnasiri Wickremanayake |
Member of Parliament for Gampaha District | |
In office 2015–2020 | |
Member of Parliament for Kalutara District | |
In office 2010–2015 | |
Member of Parliament for Colombo District | |
In office 2001–2010 | |
President of Sri Lanka Cricket | |
In office 2008–2009 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | గంపాహా, శ్రీలంక (now in Sri Lanka) | 1963 డిసెంబరు 1
జాతీయత | శ్రీలంకేయుడు |
రాజకీయ పార్టీ | Democratic National Movement[1][2] (2015– present) Sri Lanka Freedom Party (2001 - 2010, 2015) Democratic National Alliance (2010 - 2015) |
ఇతర రాజకీయ పదవులు | United National Front for Good Governance (2015– present) United People's Freedom Alliance (2004–2010,2015) People's Alliance (2001–2004) |
కళాశాల | ఆనంద కాలేజీ, కొలంబో |
వృత్తి | Politician, Cricketer |
1963, డిసెంబర్ 1న జన్మించిన అర్జున రణతుంగ (Arjuna Ranatunga) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. శ్రీలంక జట్టుకు 56 టెస్టులకు, 193 వన్డేలకు నాయకత్వం వహించాడు. రణతుంగ ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ వ్యవహారాలను చూసే శ్రీలంక క్రికెట్‌కు అధిపతి.[3]
అర్జున రణతుంగ కొలంబోకు 20 మైళ్ళదూరంలో ఉన్న గంపహ పట్టణానికి చెందినవాడు. కొలంబోలో ఉన్న ఆనంద కళాశాలలో తన సోదరులతో కలిసి విద్యనభ్యసించాడు. అక్కడే అతని తల్లి టీచర్‌గా పనిచేసేది. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే రణతుంగ క్రికెట్ ఆడేవాడు. ఆనంద కళాశాలలో ఉన్నప్పుడు రెండేళ్ళు సీనియర్ జట్టుకు నాయకత్వం వహించాడు.
ఎడమచేతితో బ్యాంటింద్ చేసే రణతుంగ కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. 1981లో 18 సంవత్సరాల వయస్సులో తొలిసారిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినాడు. ఆ తరువాతి సంవత్సరంలోనే శ్రీలంక తరఫున తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. నూతనంగా టెస్ట్ హోదా పొందిన శ్రీలంకకు కూడా అది తొలి మ్యాచ్. ఆ మ్యాచ్‌లో రణతుంగ అర్థశతకం సాధించి శ్రీలంక తరఫున ఆ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.
1988లో రణతుంగకు శ్రీలంక జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించబడింది. సుదీర్ఘంగా 11 సంవత్సరాల పాటు 56 టెస్టులకు అతడు నాయకత్వం వహించాడు. ఆ దశలో పసికూనగా ఉన్న శ్రీలంక జట్టుకు ఒక మంచి జట్టుగా తయారుచేశాడు.
రణతుంగ క్రీడాజీవితంలో అత్యున్నత ప్రతిభ 1996లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ ద్వారా బయటపడింది. క్రీడాపండితుల అంచనాలను తారుమారు చేస్తూ అప్పటి ఫేవరైట్‌లనదగ్గ ఆస్ట్రేలియా జట్టుపైనే ఫైనల్లో ఓడించి కప్ సాధించడం శ్రీలంక క్రికెట్ జట్టు నాయకుడిగా అతనిసేవలౌ మరువలేనిది. టోర్నమెంటు ప్రారంభంనుంచే ప్రారంభ ఓవర్లలోనే బౌలర్లపై విరుచుకుపడి పరుగులవరద పారించిన ఘటనకు కారకుడు నాయకుడిగా రణతుంగ వ్యూహమే కారణం. కాని దురదృష్టవశాత్తు 1999లో శ్రీలంక జటు పేవలమైన ప్రదర్శన కారణంగా తన నాయకత్వ బాధ్యతలనే త్యజించవలసివచ్చింది. అయిననూ అతని ఘనమైన సేవలను గుర్తించి విజ్డెన్ ఆ సంవత్సరము విజ్డెన్ క్రికెటర్‌గా ప్రకటించింది. 2001లో రణతుంగ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.
టెస్ట్ క్రికెట్ గణాంకాలు
[మార్చు]1982లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన రణతుంగ చివరి టెస్ట్ మ్యాచ్ 2000-01లో చివరి టెస్ట్ దక్షిణాఫ్రికాతో ఆడే వరకు తన క్రీడాజీవితంలో మొత్తం 93 మ్యాచ్‌లు ఆడి 35.69 సగటుతో 5105 పరుగులు సాధించాడు. అందులో 4 సెంచరీలి, 38 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 135 పరుగులు (నాటౌట్) 1985-86లో పాకిస్తాన్ పై కొలంబోలో సాధించాడు.
వన్డే గణాంకాలు
[మార్చు]1981-82లో ఇంగ్లాండుపై కొలంబోలో తొలి వన్డే ఆడిన రణతుంగ 1999 ప్రపంచ కప్‌లో కెన్యాపై సౌతాంప్టన్లో చివరి వన్డే ఆడే వరకు మొత్తం 269 వన్డేలు ఆడి 35.84 సగటుతో 7456 పరుగులు సాధించాడు. వన్డేలలో 4 సెంచరీలు, 49 అర్థసెంచరీలు సాధించాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 131 పరుగులు (నాటౌట్) భారత్ పై 1997లో కొలంబోలో సాధించాడు.
జట్టు నాయకుడిగా
[మార్చు]అర్జున రణతుంగ శ్రీలంక జట్టుకు సుదీర్ఘకాలం పాటు నాయకత్వ బాధ్యతలు చేపట్టినాడు. 56 టెస్టులకు నాయకత్వం వహించి 12 మ్యాచ్‌లలో విజయం చేకూర్చాడు. 25 డ్రాగా ముగియగా, 19 మ్యాచ్‌లలో జట్టు ఓడిపోయింది. వన్డేలలో రణతుంగ 193 మ్యాచ్‌లలో నాయకత్వం వహించి 89 మ్యాచ్‌లలో విజయం సాధించాడు. 95 మ్యాచ్‌లలో ఓడిపోగా ఎనిమిదింటిలో ఫలితం తేలలేదు మరో వన్డే సమానంగా టై అయింది. రణతుంగ నాయకత్వ బాధ్యతల నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించిన రికార్డు సృష్టించాడు. 2006 అక్టోబర్లో న్యూజీలాండ్కు చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్ అధికమించే వరకు ఇది రికార్డుగా కొనసాగింది.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Edirisinghe, Dasun (21 January 2016). "DNM demands vacant UNP seat". The Island. Archived from the original on 7 March 2016. Retrieved 16 March 2016.
- ↑ Gooneratne, Lankesh (2 February 2016). "Ekanayake scotches rumours". Ceylon Today. Archived from the original on 7 June 2020. Retrieved 16 March 2016.
- ↑ BBC SPORT | Cricket | International Teams | Sri Lanka | Ranatunga begins Sri Lanka role