ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికా మూలం
పాలియో ఆంత్రొపాలజీలో, ఆధునిక మానవుల భౌగోళిక మూలాన్ని, శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల (హోమో సేపియన్స్) తొలి వలసలనూ వివరించే సిద్ధాంతాల్లో ప్రబలంగా ప్రాచుర్యంలో ఉన్నది, ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం. దీనిని "ఆఫ్రికా నుండి బయటకు 2" సిద్ధాంతం (OOA) అని, ఇటీవలి ఏకైక-మూల పరికల్పన (RSOH) అనీ, పునస్థాపన పరికల్పన అనీ, ఇటీవలి ఆఫ్రికన్ మూలం (RAO) మోడల్ అని కూడా పిలుస్తారు. [1][2][3] హోమో ఎరెక్టస్, ఆ తరువాత హోమో నియాండర్తాలెన్సిస్లు ఆఫ్రికా నుండి చేసిన తొలి వలసలను ఇది పరిశీలిస్తుంది.
జీవ వర్గీకరణ కోణంలో హోమో సేపియన్లకు "ఒకే మూలం" ఉందని ఈ నమూనా ప్రతిపాదిస్తుంది. దీనికి సమాంతరంగా ఇతర ప్రాంతాలలో జరిగిన మానవ పరిణామాన్ని ఈ సిద్ధాంతం పట్టించుకోదు. కానీ హోమో సేపియన్స్‌కు ఐరోపా, ఆసియాల్లోని ప్రాచీన మానవులకూ మధ్య జరిగిన పరస్పర సంకరాన్ని ఇది పరిగణన [4] లోకి తీసుకుంటుంది.[5][6][note 1] హెచ్. సేపియన్లు 3,00,000 – 2,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా కొమ్ములో [note 2]అభివృద్ధి చెందారు.[7][8] ఆధునిక ఆఫ్రికా-యేతర జనాభా అంతా కూడా ఆ కాలం తరువాత ఆఫ్రికాను నుండి వెళ్ళిన వారేనని ఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికన్ మూలం నమూనా ప్రతిపాదిస్తోంది.
ఆధునిక మానవుల "ఆఫ్రికా నుండి బయటకు" విస్తరణలు చాలానే జరిగాయి. బహుశా 2,70,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ విస్తరణలు, 2,15,000 సంవత్సరాల క్రితం కనీసం గ్రీస్ వరకు,[9][10][11] 1,30,000 నుండి 1,15,000 సంవత్సరాల మధ్యన ఉత్తర ఆఫ్రికా ద్వారా కచ్చితంగానూ ఇవి జరిగాయి.[12][13][14][15][16][17] ఈ తొలి వలస తరంగాలు 80,000 సంవత్సరాల క్రితం నాటికి చాలావరకు ఆగిపోయినట్లుగా లేదా తగ్గినట్లుగా కనిపిస్తోంది.
అత్యంత విశేషమైన "ఇటీవలి" వలస తరంగం 70,000-50,000 సంవత్సరాల క్రితం జరిగింది[18][19][20][21][22] "దక్షిణ మార్గం" అని పిలిచే మార్గం ద్వారా ఈ వలస తరంగం, ఆసియా తీరం వెంబడి వేగంగా వ్యాపించి, సుమారు 65,000-50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా చేరుకుంది.[23][24][note 3] (కొంతమంది పరిశోధకులు మరీ ప్రాచీన తేదీలను ఒప్పుకోనప్పటికీ, 50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు మానవుల తొలి రాక జరిగిందని మాత్రం అంగీకరించారు.[25][26] అయితే కొందరు మాత్రం ఆస్ట్రేలియాలో తొలుత స్థిరపడ్దవారు తొలి వలస తరంగంలో వచ్చి ఉండవచ్చని, మలి తరంగంలో వచ్చిన వారికి వీరు పూర్వీకులు కాకపోవచ్చనీ భావించారు [27]) అయితే ఐరోపాలో మాత్రం 55,000 సంవత్సరాల క్రితమే వలస వచ్చారని భావిస్తున్నారు. [28]
2010 లలో చేసిన జనాభా జన్యుశాస్త్ర అధ్యయనాలలో, యురేషియా, ఓషియానియాలలో హోమో సేపియన్‌లు, ప్రాచీన మానవుల మధ్య జాత్యంతర సంకరం జరిగిందనీ, ఆఫ్రికాలో మాత్రం జరగలేదనీ తేలింది.[29][30][31] అంటే ఆఫ్రికాయేతర ఆధునిక జనాభా సమూహాలన్నీ చాలావరకూ హోమో సేపియన్స్ నుండి ఉద్భవించాయనీ, కొంతవరకు ప్రాచీన మానవుల ప్రాంతీయ వైవిధ్యాల నుండి కూడా ఉద్భవించాయనీ చెప్పవచ్చు.
ప్రతిపాదిత వలస తరంగాలు
[మార్చు]3,00,000 నుండి 2,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఉద్భవించిన ఆధునిక మానవులు (హోమో సేపియన్స్) చేపట్టిన వలసలను "ఇటీవలి ఆఫ్రికన్ మూలం," లేదా ఆఫ్రికా నుండి బయటకు -2 (అవుట్ ఆఫ్ ఆఫ్రికా 2) అనే ఈ పరికల్పన వివరిస్తుంది. దీనికంటే చాలా ముందు, 18 నుండి 5 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య కాలంలో, ప్రాచీన మానవులు ఆఫ్రికా నుండి యురేషియాకు చేపట్టిన వలసలను ఆఫ్రికా నుండి బయటకు -1 (అవుట్ ఆఫ్ ఆఫ్రికా 1) సిద్ధాంతం వివరిస్తుంది. ఈ రెండూ వేరు.
21 వ శతాబ్దం ప్రారంభం నుండి, "ఇటీవలి ఏకైక-మూలం" వలసల చిత్రపటం చాలా క్లిష్టంగా మారింది. ఆధునిక-పురాతన మానవుల పరస్పర సంకరాలు దీనికి ఒక కారణం. అదే కాకుండా, "ఇటీవలి ఆఫ్రికా నుండి బయటకు" వలసలు ఒక్కసారి కాకుండా అలలు అలలుగా జరగడం కూడా మరొక కారణం. 2010 నాటికి, ఆధునిక మానవుల వలసలకు రెండు మార్గాలున్నాయని స్పష్టమైంది. నైలు లోయ, సినాయ్‌ల గుండా పోయే "ఉత్తర మార్గం" ఒకటి కాగా, రెండవది బాబ్-ఎల్-మండేబ్ జలసంధి ద్వారా సాగిన "దక్షిణ మార్గం". [33]
- తొలి హోమో సేపియన్స్, లేదా "మనకు దగ్గరి సంబంధం కలిగిన ఆఫ్రికాలోని మరొక జాతి", 2,70,000 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఆఫ్రికా నుండి వలస వచ్చి ఉండవచ్చు అని పోస్థ్ తదితరులు (2017) సూచించారు [34]
- మిస్లియా గుహ వద్ద సుమారు 1,85,000 సంవత్సరాల క్రితం నాటి ఎనిమిది దంతాలతో కూడిన పాక్షిక దవడ ఎముకను కనుగొన్నారు. అదే గుహలో 2,50,000 – 1,40,000 సంవత్సరాల క్రితం నాటి పొరల్లో లెవల్లోయిస్ రకానికి చెందిన పనిముట్లు ఉన్నాయి, ఈ పనిముట్లు, ఆ మానవ దవడ ఎముకలకు చెందినవేనని భావిస్తే ఈ వలస కాలాన్ని ఇంకా ముందుకు జరపాల్సి ఉంటుంది.[35][36]
- 1,50,000–1,30,000 సంవత్సరాల క్రితం ఈశాన్య ఆఫ్రికా నుండి అరేబియాకు వలసలు జరిగాయి. 2011 లో జెబెల్ ఫాయా వద్ద కనుగొన్న 1,27,000 సంవత్సరాల క్రితం నాటి శిలాజాలను బట్టి దీన్ని చెప్పారు. దక్షిణ చైనాలోని జిరేన్‌డాంగ్ గుహలో దొరికిన 1,00,000 సంవత్సరాల క్రితం నాటి శిలాజాలు ఈ వలసలకు సంబంధించినవే కావచ్చు [33] చైనాలో ఆధునిక మానవ ఉనికికి లభించిన ఇతర ఆధారాలు 80,000 సంవత్సరాల క్రితం నాటివి.
- 69,000 – 77,000 సంవత్సరాల క్రితం జరిగిన టోబా అగ్నిపర్వత సంఘటనకు [37] ముందు గాని తర్వాత గానీ, దక్షిణ మార్గం అని పిలవబడే దారిలో 50,000 – 70,000 సంవత్సరాల క్రితం అత్యంత ముఖ్యమైన వలసలు జరిగాయి. [37] ఆసియా దక్షిణ తీరం వెంట సాగిన ఈ వలస తరంగం 65,000-50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా చేరుకుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, ఈ తేదీ 50,000 సంవత్సరాల క్రితమేనని ఖాయమైంది.[25][38] ఈ తరంగం నుండి చీలిన శాఖ ఒకటి 50,000 సంవత్సరాల క్రితం పశ్చిమ ఆసియాను "తిరిగి ఆక్రమించింది". పశ్చిమ ఆసియా నుండి ప్రజలు 43,000 సంవత్సరాల క్రితం ఐరోపాకు వచ్చి నివసించడం మొదలు పెట్టారు [33]
- దక్షిణ తీర మార్గం తరువాత, 45,000 సంవత్సరాల క్రితం ఐరోపాలోకి ఉత్తర దిశగా మరొక వలస తరంగం వచ్చిందని వెల్స్ (2003) వివరించాడు.[note 4] అయితే, ఈ సిద్ధాంతాన్ని మెకాలే తదితరులు (2005), పోస్థ్ తదితరులు (2016) తోసిపుచ్చారు. ఒకే తీర వలస జరిగిందని, ఆ తరంగం లోంచే ఒక శాఖ చీలి ఐరోపా లోకి వెళ్ళిందనీ వారు వాదించారు.
ఉత్తర మార్గంలో వలస
[మార్చు]1,35,000 సంవత్సరాల క్రితం, ఉష్ణమండల ఆఫ్రికాలో తీవ్రమైన కరువు ఏర్పడింది. మానవులు సముద్ర తీరాల వైపుకు, ఖండాంతరాలకూ వలస వెళ్ళక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.[note 5]
ఆధునిక మానవులు ఎర్ర సముద్రానికి దక్షిణాన ఉన్న బాబ్-ఎల్-మండేబ్ జలసంధిని దాటి, అరేబియా లోని పచ్చని తీరప్రాంతాల వెంట, మిగతా యురేషియా లోకి వలస వెళ్లారు. ఇజ్రాయెల్‌లోని కఫ్జే గుహలో కనుగొన్న తొలి హోమో సేపియన్ల శిలాజాలు 80,000 నుండి 1,00,000 సంవత్సరాల క్రితం నాటివని గుర్తించారు. ఈ మానవులు 70,000 నుండి 80,000 సంవత్సరాల క్రితం అంతరించిపోవడం గానీ తిరిగి ఆఫ్రికాకు వెళ్ళిపోవడం గానీ జరిగి ఉండవచ్చు. బహుశా మంచుయుగ ఐరోపాలోని శీతల ప్రాంతాల నుండి తప్పించుకుని దక్షిణంగా వచ్చిన నియాండర్తల్‌లు వీరి స్థానాన్ని ఆక్రమించి ఉండవచ్చు. ఆటోసోమల్ మైక్రోసాటిలైట్ మార్కర్లను హువా లియు తదితరులు విశ్లేషించి అవి 56,000 సంవత్సరాల క్రితం నాటివని తేల్చారు. ఆ శిలాజం ఆఫ్రికాకు తిరిగి వెళ్ళిన వ్యక్తిదని వారు భావించారు. [41]
2011 లో యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ లోని ఫాయా-1 స్థలంలో కనుగొన్న రాతి పనిముట్లు కనీసం 1,25,000 సంవత్సరాల కిందట ఆధునిక మానవులు ఆ ప్రాంతంలో ఉన్నారని సూచిస్తున్నాయి.[12] దీంతో చాన్నాళ్ళుగా పట్టింపుకు నోచుకోని ఉత్తర ఆఫ్రికా మార్గానికి పునశ్చేతన కలిగింది.[13][42][14][15]
ఒమన్‌లో, 2011 లో బీన్ జోవెన్ కనుగొన్న ఒక స్థలంలో మలి నూబియన్ కాంప్లెక్స్‌కు చెందిన రాతి పనిముట్ల శకలాలు 100 కు పైగా కనిపించాయి. గతంలో ఇవి సూడాన్‌లోని పురావస్తు త్రవ్వకాలలో మాత్రమే కనిపించాయి. ఈ అరేబియా నూబియన్ కాంప్లెక్స్ వయసు సుమారుగా 1,06,000 సంవత్సరా లుంటుందని అంచనా వేసారు. దక్షిణ అరేబియాలో ఒక విశిష్టమైన రాతి యుగం నాటి టెక్నోకాంప్లెక్స్ ఉండేదని ఈ ఆధారాలు సూచిస్తున్నాయి.[43]
దక్షిణ మార్గంలో వలస
[మార్చు]తీర మార్గం
[మార్చు]- మరింత సమాచారం: దక్షిణాన మానవ వ్యాప్తి వ్యాసంలో
సుమారు 50-70 వేల సంవత్సరాల క్రితం మైటోకాండ్రియల్ హాప్లోగ్రూప్ L3 కలిగిన ప్రజలు కొందరు, తూర్పు ఆఫ్రికా నుండి సమీప ప్రాచ్యం లోకి వలస వెళ్ళారు. ఆఫ్రికాలోని 2,000 నుండి 5,000 మంది జనాభాలో, 150 నుండి 1,000 మంది మాత్రమే కలిగిన ఒక చిన్న సమూహం ఎర్ర సముద్రం దాటిందని అంచనా.[44] ఎర్ర సముద్రం దాటిన ఈ బృందం అరేబియా, పర్షియా పీఠభూమిలో తీరం వెంట ప్రయాణించి భారత దేశం చేరింది. ఇది వారి మొదటి ప్రధాన స్థిర నివాసకేంద్రంగా కనిపిస్తోంది.[45] వారు ఆసియా దక్షిణ తీరం వెంబడి ప్రయాణించి సుమారు 50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు చేరారని వెల్స్ (2003) వాదించాడు.
వర్తమాన కాలంలో బాబ్-ఎల్-మండేబ్ జలసంధి వద్ద ఎర్ర సముద్రం 20 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. కానీ 50,000 సంవత్సరాల క్రితం గ్లేసియేషను కారణంగా సముద్ర మట్టాలు 70 మీ. తక్కువగా ఉండేవి. దాంతో, ఈ వెడల్పు బాగా తక్కువగా ఉండేది. జలసంధి పూర్తిగా అదృశ్యం కానప్పటికీ, మామూలు తెప్పలపై దాటగలిగేంత సన్నగా ఉండేది. పైగా మధ్యలో ద్వీపాలు కూడా ఉండి ఉండవచ్చు.[46] [33] ఎరిట్రియాలో 1,25,000 సంవత్సరాల నాటి నత్త గుల్లలు కనిపించాయి.[47] తొలి మానవుల ఆహారంలో, సముద్రపు టొడ్డున గాలించి పట్టుకునే ఆహారం కూడా ఉండేదని దీనివలన తెలుస్తోంది.
దక్షిణ దిశగా జరిగిన వలసల కాలనిర్ణయం వివాదాస్పదాంశంగా ఉంది. [37] 69,000 – 77,000 సంవత్సరాల క్రితం నేటి టోబా సరస్సు వద్ద జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనానికి ముందు గానీ, తరువాత గానీ ఈ వలసలు జరిగి ఉండవచ్చు. ఈ విస్ఫోటనం భారతదేశంలో విరజిమ్మిన బూడిద పొరల క్రింద కనబడిన రాతి పనిముట్లు టోబాకు పూర్వమే వలసలు జరిగాయని సూచిస్తున్నాయి. అయితే ఈ పనిముట్ల మూలం వివాదాస్పదంగా ఉంది. [37] ఆఫ్రికా నుంచి బయటకు వలస వెళ్ళిన మానవుల్లో ఉన్న హాప్లో గ్రూప్ L3, 60,000-70,000 సంవత్సరాల క్రితం నాటిది. అంటే "టోబా సంఘటన తరువాత కొన్ని వేల ఏళ్ళకు మానవులు ఆఫ్రికా వదిలి వెళ్ళారని ఇది సూచిస్తోంది". [37] మానవ DNA లోని ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్‌లు) ఊహించిన దానికంటే నెమ్మదిగా జరిగాయని తెలిపే కొన్ని పరిశోధనా ఫలితాలను 2012 లో ప్రచురించారు. దీని ప్రకారం, వలసలు 90,000 – 1,30,000 సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చని భావించవచ్చు.[48] మునుపటి అంచనాల మాదిరిగానే ఆధునిక ఆఫ్రికాయేతర జనాభా పూర్వీకులు 50,000-65,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వెళ్ళారని మరికొన్ని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.[27][49][50]
పశ్చిమాసియా
[మార్చు]54,700 సంవత్సరాల క్రితం నాటి ఆధునిక మానవుని శిలాజం ఇజ్రాయెల్‌లోని మనోట్ గుహలో కనుగొన్నారు. దీనికి మనోట్ 1 అని పేరుపెట్టారు. అయితే, దీని కాలం పట్ల గ్రౌకట్ తదితరులు సందేహం వెలిబుచ్చారు (2015).
దక్షిణాసియా, ఆస్ట్రేలియా
[మార్చు]65,000–50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో మానవ నివాసాలు ఉన్నట్లు భావిస్తున్నారు. 2017 నాటికి, ఆస్ట్రేలియాలో మానవుల ఉనికిని సూచించే అత్యంత పురాతన ఆధారపు వయస్సు కనీసం 65,000 సంవత్సరాలు.[23][24] మెక్‌చెస్నీ ఇలా పేర్కొన్నాడు:
...M168 మార్కరు కలిగిన చిన్న బృందం ఒకటి ఆఫ్రికా నుండి బయల్దేరి, అరేబియన్ ద్వీపకల్పం, భారతదేశాల తీరం వెంట, ఇండోనేసియా గుండా ప్రయాణించి, 60,000 – 50,000 సంవత్సరాల మధ్య ఆస్ట్రేలియా చేరింది అని జన్యు ఆధారాలు చెబుతున్నాయి. ఈ వలస పరికల్పనను రాస్‌ముస్సెన్ తదితరులు (2011) సమర్ధించారు."[28]
ఆస్ట్రేలియాలో లేక్ ముంగో లోని శిలాజాలు సుమారు 42,000 సంవత్సరాల క్రితం నాటివి.[51][52] మాడ్జెడ్‌బెబే అనే స్థలం లోని ఇతర శిలాజాలు కనీసం 65,000 సంవత్సరాల క్రితం నాటివి.[24] అయితే, కొంతమంది పరిశోధకులు ఈ శిలాజాల వయస్సు అంత ఉండదని, అవి సుమారు 50,000 సంవత్సరాల క్రితం నాటివి అయి ఉంటాయనీ భావించారు.[25][53]
తూర్పు ఆసియా
[మార్చు]చైనాకు చెందిన టియాన్యువాన్ మనిషి 38,000 – 42,000 సంవత్సరాల క్రితానికి చెందినది. అదే ప్రాంతానికి చెందిన లియుజియాంగ్ మనిషి బహుశా 67,000 – 1,59,000 సంవత్సరాల క్రితం నాటిది. 2013 DNA పరీక్షల ప్రకారం, టియాన్యువాన్ మనిషి "ప్రస్తుత ఆసియన్లు, ఆదివాసీ అమెరికన్లకు " సంబంధించినవాడని తేలింది.[54][55][56][57] టియాన్యువాన్‌కు, 17,000 – 19,000 సంవత్సరాల క్రితం నాటి ఆధునిక మానవుడైన మినాటోగావా మనిషికీ అవయవ నిర్మాణంలో సారూప్యత ఉంది. మినాటోగావా మనిషి శిలాజాన్ని జపాన్‌లోని ఒకినావా ద్వీపంలో కనుగొన్నారు.[58][59]
ఐరోపా
[మార్చు]దక్షిణ వలసదార్లలో హాప్లోగ్రూప్ N కలిగిన శాఖ ఒకటి, తూర్పు ఆఫ్రికా నుండి నైలు నదిని వెంట, ఉత్తరం వైపుకు వెళ్లి, సినాయ్ ద్వారా ఆసియాలోకి ప్రవేశించిందని మెకాలే తదితరులు (2005) చెప్పారు. అక్కడ ఈ గుంపు శాఖలుగా చీలి, కొందరు ఐరోపాలోకి, మరికొందరు తూర్పు ఆసియాలోకీ వెళ్ళారు. ఐరోపాలో ఆధునిక మానవులు ఆలస్యంగా రావడం, పురావస్తు, DNA ఆధారాలూ ఈ పరికల్పనకు సమర్ధనగా నిలుస్తున్నాయి. వేటాడే, ఆహారాన్ని సేకరించే మానవుల 55 మైటోకాండ్రియల్ జన్యువులను (mtDNA) విశ్లేషించినపుడు, "55,000 సంవత్సరాల కిందట ఆఫ్రికాయేతరు లందరూ ఒకేసారి వేగంగా విస్తరించార"ని తేలిందని పోస్థ్ తదితరులు (2016) వాదించారు.
సిద్ధాంత చరిత్ర
[మార్చు]సాంప్రదాయిక పాలియోఆంత్రోపాలజీ
[మార్చు]లండన్ జూలో ఉన్న ఆఫ్రికా వాలిడుల (తోక లేని కోతులు) ప్రవర్తనను అధ్యయనం చేసాక, చార్లెస్ డార్విన్ ఆఫ్రికా వాలిడులతో మానవుల క్లాడిస్టిక్ సంబంధాన్ని సూచించాడు.[60] శరీర నిర్మాణ శాస్త్రవేత్త థామస్ హక్స్లీ కూడా ఈ పరికల్పనకు మద్దతు ఇచ్చాడు. ఆఫ్రికన్ వాలిడులకు మానవులకూ సన్నిహిత పరిణామ సంబంధాలు ఉన్నాయని అతడు అన్నాడు.[61] ఈ అభిప్రాయాలను జర్మన్ జీవశాస్త్రవేత్త ఎర్నెస్ట్ హేకెల్ వ్యతిరేకించాడు. అతను "ఆసియా నుండి బయటకు" సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాళ్ళలో ఒకడు. మానవులకు ఆగ్నేయ ఆసియా ప్రైమేట్స్‌తో ఎక్కువ సంబంధం ఉందని హేకెల్ వాదించాడు. డార్విన్ చెప్పిన ఆఫ్రికా పరికల్పనను తిరస్కరించాడు.[62][63]
మానవులు వాలిడుల నుండి వచ్చారని డార్విన్ తన డిసెంట్ ఆఫ్ మ్యాన్ పుస్తకంలో ఊహించాడు. వాలిడుల మెదడులు ఇప్పటికీ చిన్నవి గానే ఉన్నాయి. కానీ నిటారుగా నడుస్తూ, చేతులను తెలివితేటలను సూచించే పనుల కోసం వాడాయి; అలాంటి వాలిడులు ఆఫ్రికావి అని డార్విన్ అనుకున్నాడు:
ప్రపంచం లోని ప్రతీ ప్రాంతం లోనూ సజీవ క్షీరదాలకు అదే ప్రాంతానికి చెందిన అంతరించిన జాతులతో దగ్గరి సంబంధం ఉంటుంది. అందుచేత, గొరిల్లా, చింపాజీలకు దగ్గరి సంబంధీకులైన జాతులు గతంలో ఆఫ్రికాలో జీవించి ఉండే సంభావ్యత ఉంది; ఈ రెండు జాతులూ ఇప్పుడు మానవుడికి దగ్గరి సంబంధీకులు కాబట్టి, మన పూర్వీకులు ఇతర చోట్ల కంటే ఆఫ్రికా ఖండం లోనే ఉండేందుకు ఎక్కువ సంభావ్యత ఉంది. కానీ, ఈ విషయంపై కల్పనలు చెయ్యడం వలన ఉపయోగమేమీ లేదు. ఎందుకంటే దాదాపు మనిషంత పరిమాణంలో ఉండే, హైలోబేట్స్‌కు సంబంధించిన డ్రయోపిథెకస్ అనే కోతి, ఎప్పుడో.. ఎగువ మయోసీన్ కాలంలో ఐరోపాలో ఉండేది; ఇంత విస్తారమైన సమయంలో భూమి అనేకానేక మహా విప్లవాలకు లోనై ఉంటుంది, ఈ జీవులు చాలా పెద్ద యెత్తున వలసలు పోయేందుకు కూడా బోలెడు సమయం ఉంది.
—చార్లెస్ డార్విన్, డెసెంట్ ఆఫ్ మ్యాన్[64]
1871 లో పురాతన హోమినిన్ కాలపు మానవ శిలాజాలు దాదాపుగా లేవు. సుమారు యాభై సంవత్సరాల తరువాత, ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో మానవ శాస్త్రవేత్తలు చిన్నపాటి మెదడు కలిగిన పురాతన హోమినిన్ల శిలాజాలను కనుగొనడం మొదలైనప్పుడు, డార్విన్ ఊహాగానాలకు మద్దతు లభించింది. ఇటీవలి (పురాతనానికి వ్యతిరేకంగా) ఆఫ్రికన్ మూలం పరికల్పన 20 వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది. ఆధునిక మానవుల "ఇటీవలి ఆఫ్రికన్ మూలం" అంటే "ఒకే మూలం". దీన్ని బహుళ మూలాలకు వ్యతిరేక పదంగా వివిధ సందర్భాల్లో ఉపయోగించారు. మానవ శాస్త్రంలో జరిగిన ఈ చర్చ 20 వ శతాబ్దం మధ్యకాలం నాటికి ఏకైక మూలం వైపు మొగ్గు చూపింది. 20 వ శతాబ్దం మధ్య కాలం నాటికి కూడా, చెదురుమదురుగా ఉన్న బహుళ మూలాల సమర్ధకుల (కార్లెటన్ కూన్ వంటి వారు) పట్టు కాస్త బలంగానే ఉండేది. అతడు 1962 నాటికి కూడా, హెచ్. ఎరెక్టస్ నుండి హెచ్. సేపియన్స్ ఐదుసార్లు పుట్టుకొచ్చారని భావిస్తూండేవాడు.[65]
బహుళప్రాంతీయ మూలం పరికల్పన
[మార్చు]- మరింత సమాచారం: ఆధునిక మానవుల బహుళ ప్రాంతీయ మూలం వ్యాసంలో
ఇటీవలి మూలం నమూనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న పరికల్పన, ఆధునిక మానవుల బహుళ ప్రాంతీయ మూలం. దీనిని 1980 లలో మిల్ఫోర్డ్ వోల్పాఫ్ ప్రతిపాదించాడు. 18 లక్షల సంవత్సరాల క్రితం ప్లైస్టోసీన్ ప్రారంభంలో, ప్రపంచ జనాభా అంతటా హెచ్. ఎరెక్టస్ నుండి ఉత్పన్నమైందని ఈ పరికల్పన ప్రతిపాదించింది. ఈ పరికల్పనపై చర్చ 1980 ల చివరలోను 1990 ల లోనూ వివాదాస్పదంగా మారింది.[66] 1990 లలో జరిగిన ఈ చర్చల్లోనే "ఇటీవలి-మూలం", "అవుట్ ఆఫ్ ఆఫ్రికా" అనే పదాలు ప్రస్తుత పరిభాషలో చేరాయి.[67] ఇటీవలి మూలం మోడల్‌కు వ్యతిరేకంగా ఉన్న బహుళప్రాంతీయ పరికల్పన యొక్క "బలమైన" అసలు రూపానికి కాలదోషం పట్టింది. దాని బలహీన రూపాలు, పురాతన-ఆధునిక సమ్మేళనంతో కలిసిన "ఇటీవలి మూలం" పరికల్పనకు అనుబంధాలుగా మారాయి.[68]
ఇవి కూడా చూడండి
[మార్చు]నోట్స్
[మార్చు]- ↑ 1984 నుండి 2003 వరకూ, ఆధునిక మానవుల బహుళ ప్రాంతీయ మూలం ఒక ప్రత్యామ్నాయ పరికల్పనగా ఉండేది. దీని ప్రకారం, ఆఫ్రికా నుండి బయలుదేరిన హోమో సేపియన్లు, ప్రపంచం లోని వివిధ ప్రాంతాల్లోని స్థానిక హోమో ఎరెక్టస్ జనాభాలతో సంకరం జరిపారు.Jurmain, Robert; Kilgore, Lynn; Trevathan, Wenda (2008). Essentials of Physical Anthropology. Cengage Learning. pp. 266–. ISBN 978-0-495-50939-4. Retrieved 14 June 2011.
- ↑ ఆఫ్రికా ఖండానికి తూర్పు కొసన జిబౌటి, ఎరిట్రియా, ఇథియోపియా, సోమాలియా దేశాలు ఉన్న భౌగోళిక ప్రాంతాన్ని ఆఫ్రికా కొమ్ము (హార్న్ ఆఫ్ ఆఫ్రికా) అంటారు. సుమారు 20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ ప్రాంతంలో దాదాపు 11.5 కోట్ల మంది నివసిస్తున్నారు.
- ↑ McChesney (2015) : "...M168 మార్కరు కలిగిన చిన్న బృందం ఒకటి ఆఫ్రికా నుండి బయల్దేరి, అరేబియన్ ద్వీపకల్పం, భారదేశాల తీరం వెంట, ఇండోనేసియా గుండా ప్రయాణించి, 60,000 – 50,000 సంవత్సరాల మధ్య ఆస్ట్రేలియా చేరింది అని జన్యు ఆధారాలు చెబుతున్నాయి. ఈ వలస పరికల్పనను రాస్‌ముస్సెన్ తదితరులు (2011) సమర్ధించారు."
- ↑ McChesney (2015) : "ఆఫ్రికా నుండి వెళ్ళిన ప్రజల వారసులను వెల్స్ (2003) 11 వంశాలు గల జన్యు వృక్షంగా విభజించాడు. జెనోమ్ లోని వివిధ ప్రత్యేక స్థానాల్లో ఉండే ప్రతీ జెనెటిక్ మార్కరూ ఒక సింగిల్ పాయింట్ మ్యుటేషన్ను సూచిస్తుంది. తొలుత, M168 మార్కరు కలిగిన చిన్న బృందం ఒకటి ఆఫ్రికా నుండి బయల్దేరి, అరేబియన్ ద్వీపకల్పం, భారదేశాల తీరం వెంట, ఇండోనేసియా గుండా ప్రయాణించి, 60,000 – 50,000 సంవత్సరాల మధ్య ఆస్ట్రేలియా చేరింది అని జన్యు ఆధారాలు చెబుతున్నాయి. ఈ తొలి ఆస్ట్రేలియా వలసను రాస్‌ముస్సెన్ తది (2011) కూడా సమర్ధించారు. రెండోది, M89 మార్కరు కలిగిన బృందం ఒకటి 45,000 కిందట ఈశాన్య ఆఫ్రికా నుండి బయల్దేరి మధ్య ప్రాచ్యం లోకి వెళ్ళింది.అక్కడి నుండి, ఈ బృందం రెండుగా చీలింది. ఒక బృందం M9 మార్కరును పెంపొందించుకుంది. ఇది 40,000 ఏళ్ళ కిందట ఆసియాలోకి ప్రవేశించింది. ఈ ఆసియా (M9) బృందం మూడుగా చీలింది: 35,000 ఏళ్ళ కిందట మధ్య ఆసియా లోకి (M45); 30,000 ఏళ్ళ కిందట భారతదేశం లోకి (M20); 10,000 ఏళ్ళ కిందట చైనా లోకి (M122) వెళ్ళాయి. మధ్య ఆసియా బృందం (M45) రెండుగా చీలింది: 30,000 ఏళ్ళ కిందట ఐరోపా లోకి (M173), 20,000 ఏళ్ళ కిందట సైబీరియా వైపుకు (M242), వెళ్ళాయి. చివరిగా, సైబీరియా బృందం (M242) 10,000 ఏళ్ళ కిందట ఉత్తర దక్షిణ అమెరికాలకు (M3) వలస వెళ్ళింది. [28]
- ↑ ఆఫ్రికా లోని మలావీ సరస్సు అడుగున ఉన్న మట్టిలో కూరుకుపోయిన పుప్పొడిపై రేడియోకార్బన్ డేటింగు పద్ధతులు వాడి అక్కడి వృక్ష జాలపు వయసును ంర్ధారించే ప్రయత్నం చేసారు. ప్రతీ 300 ఏళ్ళకు ఒక నమూనా చొప్పున తీసుకున్నారు.. మహా కరువు కాలం నాటి నమూనాల్లో పుప్పొడి గానీ రాక్షసి బొగ్గు గానీ పెద్దగా లేదు. ఆ కాలంలో పెద్దగా పచ్చదనం లేదని దీన్ని బట్తి తెలుస్తోంది. ప్రస్తుతం దట్టమైన అడవులున్న మలావీ సరస్సు చుట్టుపట్ల ప్రాంతాలు సుమారు 1,35,000 – 90,000 సంవత్సరాల క్రితం ఎడారిగా ఉండేవి.[40]
మూలాలు
[మార్చు]- ↑ Liu, Prugnolle et al. (2006) . "Currently available genetic and archaeological evidence is supportive of a recent single origin of modern humans in East Africa. However, this is where the consensus on human settlement history ends, and considerable uncertainty clouds any more detailed aspect of human colonization history."
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;PMID 12802315
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Stringer, Chris (13 March 2012). Lone Survivors: How We Came to Be the Only Humans on Earth. Henry Holt and Company. p. 26. ISBN 978-1-4299-7344-1.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;PMID 10766948
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Mafessoni F (January 2019). "Encounters with archaic hominins". Nature Ecology & Evolution. 3 (1): 14–15. doi:10.1038/s41559-018-0729-6. PMID 30478304. S2CID 256713194.
- ↑ Villanea FA, Schraiber JG (January 2019). "Multiple episodes of interbreeding between Neanderthal and modern humans". Nature Ecology & Evolution. 3 (1): 39–44. doi:10.1038/s41559-018-0735-8. PMC 6309227. PMID 30478305.
- ↑ University of Huddersfield (20 March 2019). "Researchers shed new light on the origins of modern humans – The work, published in Nature, confirms a dispersal of Homo sapiens from southern to eastern Africa immediately preceded the out-of-Africa migration". EurekAlert!. Archived from the original on 11 మే 2019. Retrieved 23 March 2019.
- ↑ Rito T, Vieira D, Silva M, Conde-Sousa E, Pereira L, Mellars P, et al. (March 2019). "A dispersal of Homo sapiens from southern to eastern Africa immediately preceded the out-of-Africa migration". Scientific Reports. 9 (1): 4728. Bibcode:2019NatSR...9.4728R. doi:10.1038/s41598-019-41176-3. PMC 6426877. PMID 30894612.
- ↑ Zimmer, Carl (10 July 2019). "A Skull Bone Discovered in Greece May Alter the Story of Human Prehistory – The bone, found in a cave, is the oldest modern human fossil ever discovered in Europe. It hints that humans began leaving Africa far earlier than once thought". The New York Times. Retrieved 11 July 2019.
- ↑ Staff (10 July 2019). "'Oldest remains' outside Africa reset human migration clock". Phys.org. Retrieved 10 July 2019.
- ↑ Harvati K, Röding C, Bosman AM, Karakostis FA, Grün R, Stringer C, et al. (July 2019). "Apidima Cave fossils provide earliest evidence of Homo sapiens in Eurasia". Nature. 571 (7766): 500–504. doi:10.1038/s41586-019-1376-z. PMID 31292546. S2CID 256767567.
- ↑ 12.0 12.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;PMID 21273486
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 13.0 13.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;PMID 21212332
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 14.0 14.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;PMID 21601174
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 15.0 15.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;PMID 17372199
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Bae CJ, Douka K, Petraglia MD (December 2017). "On the origin of modern humans: Asian perspectives". Science. 358 (6368): eaai9067. doi:10.1126/science.aai9067. PMID 29217544.
- ↑ Kuo L (10 December 2017). "Early humans migrated out of Africa much earlier than we thought". Quartz. Retrieved 10 December 2017.
- ↑ University of Huddersfield (20 March 2019). "Researchers shed new light on the origins of modern humans – The work, published in Nature, confirms a dispersal of Homo sapiens from southern to eastern Africa immediately preceded the out-of-Africa migration". EurekAlert!. Retrieved 23 March 2019.
- ↑ Rito T, Vieira D, Silva M, Conde-Sousa E, Pereira L, Mellars P, et al. (March 2019). "A dispersal of Homo sapiens from southern to eastern Africa immediately preceded the out-of-Africa migration". Scientific Reports. 9 (1): 4728. Bibcode:2019NatSR...9.4728R. doi:10.1038/s41598-019-41176-3. PMC 6426877. PMID 30894612.
- ↑ Posth C, Renaud G, Mittnik M, Drucker DG, Rougier H, Cupillard C, et al. (2016). "Pleistocene Mitochondrial Genomes Suggest a Single Major Dispersal of Non-Africans and a Late Glacial Population Turnover in Europe". Current Biology. 26 (6): 827–833. doi:10.1016/j.cub.2016.01.037. hdl:2440/114930. PMID 26853362. S2CID 140098861.
- ↑ Karmin M, Saag L, Vicente M, Wilson Sayres MA, Järve M, Talas UG, et al. (April 2015). "A recent bottleneck of Y chromosome diversity coincides with a global change in culture". Genome Research. 25 (4): 459–66. doi:10.1101/gr.186684.114. PMC 4381518. PMID 25770088.
- ↑ Haber M, Jones AL, Connell BA, Arciero E, Yang H, Thomas MG, et al. (August 2019). "A Rare Deep-Rooting D0 African Y-Chromosomal Haplogroup and Its Implications for the Expansion of Modern Humans Out of Africa". Genetics. 212 (4): 1421–1428. doi:10.1534/genetics.119.302368. PMC 6707464. PMID 31196864.
- ↑ 23.0 23.1 Clarkson C, Jacobs Z, Marwick B, Fullagar R, Wallis L, Smith M, et al. (July 2017). "Human occupation of northern Australia by 65,000 years ago". Nature. 547 (7663): 306–310. Bibcode:2017Natur.547..306C. doi:10.1038/nature22968. hdl:2440/107043. PMID 28726833. S2CID 205257212.
- ↑ 24.0 24.1 24.2 St. Fleu, Nicholas (July 19, 2017). "Humans First Arrived in Australia 65,000 Years Ago, Study Suggests". The New York Times.
- ↑ 25.0 25.1 25.2 Wood, Rachel (2017-09-02). "Comments on the chronology of Madjedbebe". Australian Archaeology. 83 (3): 172–174. doi:10.1080/03122417.2017.1408545. ISSN 0312-2417. S2CID 148777016.
- ↑ O'Connell JF, Allen J, Williams MA, Williams AN, Turney CS, Spooner NA, et al. (August 2018). "Homo sapiens first reach Southeast Asia and Sahul?". Proceedings of the National Academy of Sciences of the United States of America. 115 (34): 8482–8490. doi:10.1073/pnas.1808385115. PMC 6112744. PMID 30082377.
- ↑ 27.0 27.1 Haber M, Jones AL, Connell BA, Arciero E, Yang H, Thomas MG, et al. (August 2019). "A Rare Deep-Rooting D0 African Y-Chromosomal Haplogroup and Its Implications for the Expansion of Modern Humans Out of Africa". Genetics. 212 (4): 1421–1428. doi:10.1534/genetics.119.302368. PMC 6707464. PMID 31196864.
- ↑ 28.0 28.1 28.2 McChesney 2015.
- ↑ Prüfer K, Racimo F, Patterson N, Jay F, Sankararaman S, Sawyer S, et al. (January 2014) [Online 2013]. "The complete genome sequence of a Neanderthal from the Altai Mountains". Nature. 505 (7481): 43–9. Bibcode:2014Natur.505...43P. doi:10.1038/nature12886. PMC 4031459. PMID 24352235.
- ↑ Lachance J, Vernot B, Elbers CC, Ferwerda B, Froment A, Bodo JM, et al. (August 2012). "Evolutionary history and adaptation from high-coverage whole-genome sequences of diverse African hunter-gatherers". Cell. 150 (3): 457–69. doi:10.1016/j.cell.2012.07.009. PMC 3426505. PMID 22840920.
- ↑ Hammer MF, Woerner AE, Mendez FL, Watkins JC, Wall JD (September 2011). "Genetic evidence for archaic admixture in Africa". Proceedings of the National Academy of Sciences of the United States of America. 108 (37): 15123–8. Bibcode:2011PNAS..10815123H. doi:10.1073/pnas.1109300108. PMC 3174671. PMID 21896735.
- ↑ Douka K, Bergman CA, Hedges RE, Wesselingh FP, Higham TF (2013-09-11). "Chronology of Ksar Akil (Lebanon) and implications for the colonization of Europe by anatomically modern humans". PLOS ONE. 8 (9): e72931. Bibcode:2013PLoSO...872931D. doi:10.1371/journal.pone.0072931. PMC 3770606. PMID 24039825.
- ↑ 33.0 33.1 33.2 33.3 Beyin (2011).
- ↑ Posth C, Wißing C, Kitagawa K, Pagani L, van Holstein L, Racimo F, et al. (July 2017). "Deeply divergent archaic mitochondrial genome provides lower time boundary for African gene flow into Neanderthals". Nature Communications. 8: 16046. Bibcode:2017NatCo...816046P. doi:10.1038/ncomms16046. PMC 5500885. PMID 28675384.; see also Zimmer C (4 July 2017). "In Neanderthal DNA, Signs of a Mysterious Human Migration". The New York Times. Retrieved 4 July 2017..
- ↑ "Scientists discover oldest known modern human fossil outside of Africa: Analysis of fossil suggests Homo sapiens left Africa at least 50,000 years earlier than previously thought". ScienceDaily (in ఇంగ్లీష్). Retrieved 2018-01-27.
- ↑ Ghosh, Pallab (2018). "Modern humans left Africa much earlier". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2018-01-27.
- ↑ 37.0 37.1 37.2 37.3 37.4 Appenzeller (2012).
- ↑ O'Connell JF, Allen J, Williams MA, Williams AN, Turney CS, Spooner NA, et al. (August 2018). "Homo sapiens first reach Southeast Asia and Sahul?". Proceedings of the National Academy of Sciences of the United States of America. 115 (34): 8482–8490. doi:10.1073/pnas.1808385115. PMC 6112744. PMID 30082377.
- ↑ Douka K, Bergman CA, Hedges RE, Wesselingh FP, Higham TF (2013-09-11). "Chronology of Ksar Akil (Lebanon) and implications for the colonization of Europe by anatomically modern humans". PLOS ONE. 8 (9): e72931. Bibcode:2013PLoSO...872931D. doi:10.1371/journal.pone.0072931. PMC 3770606. PMID 24039825.
- ↑ Jensen, Mari N. (8 October 2007). "Newfound Ancient African Megadroughts May Have Driven Evolution of Humans and Fish. The findings provide new insights into humans' migration out of Africa and the evolution of fishes in Africa's Great Lakes" (in English). The University of Arizona. Retrieved 25 September 2017.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Liu, Prugnolle et al. (2006).
- ↑ Scerri EM, Drake NA, Jennings R, Groucutt HS (1 October 2014). "Earliest evidence for the structure of Homo sapiens populations in Africa". Quaternary Science Reviews. 101: 207–216. Bibcode:2014QSRv..101..207S. doi:10.1016/j.quascirev.2014.07.019.
- ↑ Rose JI, Usik VI, Marks AE, Hilbert YH, Galletti CS, Parton A, et al. (2011). "The Nubian Complex of Dhofar, Oman: an African middle stone age industry in Southern Arabia". PLOS ONE. 6 (11): e28239. Bibcode:2011PLoSO...628239R. doi:10.1371/journal.pone.0028239. PMC 3227647. PMID 22140561.
- ↑ Zhivotovsky LA, Rosenberg NA, Feldman MW (May 2003). "Features of evolution and expansion of modern humans, inferred from genomewide microsatellite markers". American Journal of Human Genetics. 72 (5): 1171–86. doi:10.1086/375120. PMC 1180270. PMID 12690579.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;PMID 15339343
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Fernandes CA, Rohling EJ, Siddall M (June 2006). "Absence of post-Miocene Red Sea land bridges: biogeographic implications". Journal of Biogeography. 33 (6): 961–66. doi:10.1111/j.1365-2699.2006.01478.x. S2CID 73674987.
- ↑ Walter RC, Buffler RT, Bruggemann JH, Guillaume MM, Berhe SM, Negassi B, et al. (May 2000). "Early human occupation of the Red Sea coast of Eritrea during the last interglacial". Nature. 405 (6782): 65–9. Bibcode:2000Natur.405...65W. doi:10.1038/35011048. PMID 10811218. S2CID 4417823.
- ↑ Catherine B (24 November 2012). "Our True Dawn". New Scientist (2892): 34–37. ISSN 0262-4079.
- ↑ Karmin M, Saag L, Vicente M, Wilson Sayres MA, Järve M, et al. (April 2015). "A recent bottleneck of Y chromosome diversity coincides with a global change in culture". Genome Research. 25 (4): 459–66. doi:10.1101/gr.186684.114. PMC 4381518. PMID 25770088.
- ↑ Vai S, Sarno S, Lari M, Luiselli D, Manzi G, Gallinaro M, et al. (March 2019). "Ancestral mitochondrial N lineage from the Neolithic 'green' Sahara". Scientific Reports. 9 (1): 3530. Bibcode:2019NatSR...9.3530V. doi:10.1038/s41598-019-39802-1. PMC 6401177. PMID 30837540.
- ↑ Bowler JM, Johnston H, Olley JM, Prescott JR, Roberts RG, Shawcross W, Spooner NA (February 2003). "New ages for human occupation and climatic change at Lake Mungo, Australia". Nature. 421 (6925): 837–40. Bibcode:2003Natur.421..837B. doi:10.1038/nature01383. PMID 12594511. S2CID 4365526.
- ↑ Olleya JM, Roberts RG, Yoshida H, Bowler JM (2006). "Single-grain optical dating of grave-infill associated with human burials at Lake Mungo, Australia". Quaternary Science Reviews. 25 (19–20): 2469–74. Bibcode:2006QSRv...25.2469O. doi:10.1016/j.quascirev.2005.07.022.
- ↑ O'Connell JF, Allen J, Williams MA, Williams AN, Turney CS, Spooner NA, et al. (August 2018). "Homo sapiens first reach Southeast Asia and Sahul?". Proceedings of the National Academy of Sciences of the United States of America. 115 (34): 8482–8490. doi:10.1073/pnas.1808385115. PMC 6112744. PMID 30082377.
- ↑ "A relative from the Tianyuan Cave". Max Planck Society. 2013-01-21.
- ↑ "A relative from the Tianyuan Cave: Humans living 40,000 years ago likely related to many present-day Asians and Native Americans". 2013-01-21.
- ↑ "DNA Analysis Reveals Common Origin of Tianyuan Humans and Native Americans, Asians". 2013-01-24. Archived from the original on 2020-01-12. Retrieved 2019-11-26.
- ↑ "Ancient Bone DNA Shows Ancestry of Modern Asians & Native Americans". Caving News. 2013-01-31. Archived from the original on 2020-01-12. Retrieved 2019-11-26.
- ↑ Hu Y, Shang H, Tong H, Nehlich O, Liu W, Zhao C, et al. (July 2009). "Stable isotope dietary analysis of the Tianyuan 1 early modern human". Proceedings of the National Academy of Sciences of the United States of America. 106 (27): 10971–4. Bibcode:2009PNAS..10610971H. doi:10.1073/pnas.0904826106. PMC 2706269. PMID 19581579.
- ↑ Brown P (August 1992). "Recent human evolution in East Asia and Australasia". Philosophical Transactions of the Royal Society of London. Series B, Biological Sciences. 337 (1280): 235–42. Bibcode:1992RSPTB.337..235B. doi:10.1098/rstb.1992.0101. PMID 1357698.
- ↑ Lafreniere, Peter (2010). Adaptive Origins: Evolution and Human Development. Taylor & Francis. p. 90. ISBN 978-0-8058-6012-2. Retrieved 14 June 2011.
- ↑ Robinson D, Ash PM (2010). The Emergence of Humans: An Exploration of the Evolutionary Timeline. New York: Wiley. ISBN 978-0-470-01315-1.
- ↑ Palmer D (2006). Prehistoric Past Revealed: The Four Billion Year History of Life on Earth. Berkeley: University of California Press. p. 43. ISBN 978-0-520-24827-4.
- ↑ Regal B (2004). Human evolution: a guide to the debates. Santa Barbara, Calif: ABC-CLIO. pp. 73–75. ISBN 978-1-85109-418-9.
- ↑ "The descent of man Chapter 6 – On the Affinities and Genealogy of Man". Darwin-online.org.uk. Retrieved 11 January 2011.
- ↑ Jackson JP Jr (2001). "'In Ways Unacademical': The Reception of Carleton S. Coon's The Origin of Races" (PDF). Journal of the History of Biology. 34 (2): 247–85. doi:10.1023/A:1010366015968. S2CID 86739986. Archived from the original (PDF) on 14 May 2013.
- ↑ Stringer CB, Andrews P (March 1988). "Genetic and fossil evidence for the origin of modern humans". Science. 239 (4845): 1263–8. Bibcode:1988Sci...239.1263S. doi:10.1126/science.3125610. PMID 3125610.
Stringer C, Bräuer G (1994). "Methods, misreading, and bias". American Anthropologist. 96 (2): 416–24. doi:10.1525/aa.1994.96.2.02a00080.
Stringer CB (1992). "Replacement, continuity and the origin of Homo sapiens". In Smith FH (ed.). Continuity or replacement? Controversies in Homo sapiens evolution. Rotterdam: Balkema. pp. 9–24.
Bräuer G, Stringer C (1997). "Models, polarization, and perspectives on modern human origins". Conceptual issues in modern human origins research. New York: Aldine de Gruyter. pp. 191–201. - ↑ Wu L (1997). "The dental continuity of humans in China from Pleistocene to Holocene, and the origin of mongoloids". Quaternary Geology. 21: 24–32. ISBN 978-90-6764-243-9. }}
- ↑ Stringer C (2001). "Modern human origins – distinguishing the models". Afr. Archaeol. Rev. 18 (2): 67–75. doi:10.1023/A:1011079908461. S2CID 161991922.