అక్షాంశ రేఖాంశాలు: 27°54′N 93°21′E / 27.900°N 93.350°E / 27.900; 93.350

కురుంగ్ కుమే జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కురుంగ్ కుమే జిల్లా
అరుణాచల ప్రదేశ్ పటంలో కురుంగ్ కుమే జిల్లా స్థానం
అరుణాచల ప్రదేశ్ పటంలో కురుంగ్ కుమే జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల ప్రదేశ్
ముఖ్య పట్టణంకోలోరియాంగ్
జనాభా
 (2011)
 • మొత్తం89,717[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత50.7%[1]
 • లింగ నిష్పత్తి1029[1]
సార్లి లోయ

కురుంగ్ కుమే జిల్లా, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2] జిల్లా కేంద్రం కొలోరియాంగ్.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

కురుంగ్, కుమే పదాల కలయికతో ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి కురుంగ్, కుమే నదులు ప్రవహిస్తూ ఉండడమే ఇందుకు కారణం. పురాణకథనం అనుసరించి కురుంగ్, కుమే నదులు అక్కచెల్లెళ్ళని కురుంగ్ వారి తల్లితండ్రులల అనుమతి లేకుండా వివాహం చేసుకొందని. వారి తల్లితండ్రులు ఆమెను శపిస్తూ ఆమె మీద బూడిదను చల్లారని అందుకనే అది ఉగ్రంగా బూడిద వర్ణంలో ప్రవహిస్తుందని, కుమే తన తల్లి తండ్రుల అనుమతితో వివాహం చేసుకుని వారి దీవెనలందుకున్నదని అందుకే అది స్వచ్ఛంగా నెమ్మదిగా ప్రవహిస్తుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

1914లో ప్రస్తుత జిల్లా ప్రాంతం ఒకప్పుడి ఈశాన్య సరిహద్దు భాగంగా ఉండేది. 1954లో ఇది సుబంసిరి విభాగం సరిహద్దుగా మారింది. తరువాత ఇది దిగువ సుబన్సిరి జిల్లా అయింది. 2001 ఏప్రిల్ 1 దిగువ సుబంసిరి జిల్లలో కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లా రూపొందించబడింది.[3]

విభాగాలు

[మార్చు]

కురుంగ్‌కుమే జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: పాలిన్, నియాపిన్, కొలోరియాంగ్. అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గానికి చెంది ఉన్నాయి.[4]

జనాభా గణాంకాలు (2011)

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో మొత్తం జనాభా 92,076. వీరిలో 45,318 మంది పురుషులుకాగా, 46,758 మంది స్త్రీలు ఉన్నారు.[5] జిల్లా పరిధిలో మొత్తం 15,037 కుటుంబాలు ఉన్నాయి. జిల్లా సగటు లింగ నిష్పత్తి 1,032.జిల్లా మొత్తం జనాభాలో 2.5% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 97.5% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 69.4% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 48.2%. అలాగే కురుంగ్ కుమే జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 882 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 1,036గా ఉంది కురుంగ్ కుమే జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 16988, ఇది మొత్తం జనాభాలో 18%. 0-6 సంవత్సరాల మధ్య 8568 మంది మగ పిల్లలు ఉండగా, 8420 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 983, కురుంగ్ కుమే జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 48.75%. కురుంగ్ కుమే జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 44.7%, స్త్రీల అక్షరాస్యత రేటు 34.96%.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in.
  2. "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19.
  3. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
  5. "Kurung Kumey District Population Religion - Arunachal Pradesh, Kurung Kumey Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-19.

భౌగోళిక స్థితి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

27°54′N 93°21′E / 27.900°N 93.350°E / 27.900; 93.350