Jump to content

కోట శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
కోట శ్రీనివాసరావు
2016 లో శ్రీనివాసరావు
జననం (1942-07-10) 1942 జూలై 10 (వయసు 82)
కంకిపాడు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా, (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్)
వృత్తి
  • Actor
  • రాజకీయ నాయకుడు
  • హాస్యనటుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
పురస్కారాలుపద్మశ్రీ (2015)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
In office
1999–2004
అంతకు ముందు వారువంగవీటి రత్నకుమారి
తరువాత వారువంగవీటి రాధాకృష్ణ
నియోజకవర్గంవిజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
నివాసంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

కోట శ్రీనివాసరావు (జననం 1942 జూలై 10) తెలుగు సినిమా నటుడు. అతను తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. మాజీ రాజకీయవేత్తగా, శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు[1]. అతను 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తన అరంగేట్రం చేసాడు.[2] అతను 750కి పైగా చలన చిత్రాలలో నటించాడు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నాడు[3][4]. 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గానూ SIIMA అవార్డును అందుకున్నారు[5]. 2015లో, అతను భారతీయ సినిమాకి చేసిన కృషికి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు.[2][6][7]

అతను S/O సత్యమూర్తి (2015), అత్తారింటికి దారేది (2013), రక్త చరిత్ర (2010), లీడర్ (2010), రెడీ (2008), పెళ్లైన కొత్తలో (2006), సర్కార్ (2006) వంటి చిత్రాలలో తన విభిన్న పాత్రలకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు., బొమ్మరిల్లు (2006), ఛత్రపతి (2005), అతడు (2005), ఆ నలుగురు (2004), మల్లీశ్వరి (2004), ఇడియట్ (2002), పృధ్వి నారాయణ (2002), చిన్నా (2000), గణేష్ (1998), అనగనగా ఒక రోజు (1997), లిటిల్ సోల్జర్స్ (1996), ఆమె (1994), హలో బ్రదర్ (1994), తీర్పు (1994), గోవింద గోవింద (1993), గాయం (1993), డబ్బు (1993), శత్రువు (1990), శివ (1989), అహ నా పెళ్లంట (1987), ప్రతిఘటన (1986),, రేపాటి పౌరులు (1986).[8] 2003లో, అతను సామితో తమిళ పరిశ్రమలో ఒక విలన్‌గా అరంగేట్రం చేశాడు.[9][10]

జీవిత విశేషాలు

అతను కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు[11]. కోట 1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఇతను స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1966లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. సినిమా నటుడైన అతని కుమారుడు కోట ప్రసాద్ (1969-2010) 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[12][13][14] ప్రసాద్ జె.డి.చక్రవర్తి దర్శకత్వంలోని సినిమా సిద్ధంలో నటించాడు. 2010లో గాయం - 2 లో తన తండ్రితో పాటు నటించాడు.

కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఐదు నంది పురస్కారాలు అందుకున్నాడు.

కోటశ్రీనివాసరావు సోదరుడు కోటశంకరరావు కూడా సినిమా నటుడు. అతను జాతీయ బ్యాంకులో పనిచేసేవాడు. సోప్ ఒపేరాస్ లో కూడా నటించాడు.[15]

సినీరంగ ప్రవేశం

బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడించాడు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.

అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. కోట శ్రీనివాసరావు ప్రతినాయక పాత్ర పోషించారు. యోగి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. తరువాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖి సినిమాలో ఎన్టీఆర్కు తాతగా నటించారు మరొక సినిమా బృందావనంలో కూడా ఎన్టీఆర్కు తాతగా నటించారు. కోట శ్రీనివాసరావు గబ్బర్ సింగ్ లో శ్రుతిహాసన్ కు తండ్రిగా నటించారు. కోట శ్రీనివాసరావు బాబు మోహన్ తో కలిసి చాలా సినిమాలలో జోడిగా నటించారు. కోట శ్రీనివాసరావు రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాలో కోట శ్రీనివాసరావు కీలకపాత్రలో నటించారు. కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు.

ప్రజాదరణ పొందిన కోట డైలాగులు

  • ఈ డెవడ్రా బాబూ...
  • నాకేంటి ..మరి నాకేంటి.
  • మరదేనమ్మా నా స్పెషల్.
  • అయ్య నరకాసుర.
  • అంటే నాన్నా అది

పురస్కారాలు

2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న కోట శ్రీనివాసరావు.
  • పద్మశ్రీ పురస్కారం - 2015: 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుతం సత్కరించింది.[16]

నంది పురస్కారాలు

  1. నంది ఉత్తమ విలన్- గణేష్ (1998)
  2. నంది ఉత్తమ విలన్ - చిన్న (2000)
  3. నంది ఉత్తమ సహాయ నటుడు- పృథ్వీ నారాయణ (2002)
  4. నంది ఉత్తమ సహాయ నటుడు - ఆ నలుగురు (2004)అయో
  5. నంది ఉత్తమ సహాయ నటుడు - పెళ్లైన కొత్తలో (2006)

సినిమాల జాబితా

మూలాలు

  1. "Doubts over Vijayawada(East) seat for Kota Srinivasa Rao". The Hindu. 31 January 2004. Archived from the original on 15 July 2014. Retrieved 14 December 2014.
  2. 2.0 2.1 IANS (25 January 2015). "Actor Kota Srinivasa Rao gets Padma Shri". business-standard.com. Archived from the original on 14 April 2015. Retrieved 25 January 2015.
  3. "Srinivasa Rao Kota". IMDb. Archived from the original on 10 January 2015. Retrieved 14 December 2014.
  4. "Welcome to Superhit". Thesuperhit.com. Archived from the original on 30 December 2014. Retrieved 14 December 2014.
  5. "Allu Ramalingaiah award is special: Kota Srinivasa Rao". Filmibeat.com. Archived from the original on 25 July 2014. Retrieved 14 December 2014.
  6. "myinfoindia.com". www.myinfoindia.com. Archived from the original on 12 April 2015. Retrieved 8 April 2015.
  7. PTI (25 January 2015). "Advani, Bachchan, Dilip Kumar get Padma Vibhushan". The Hindu. Archived from the original on 20 January 2016. Retrieved 25 January 2015.
  8. "వెండితెరపై చెరగని 'కోట'". Eenadu. Retrieved 10 July 2021.
  9. "Kota Srinivasa Rao lashes out at directors". Super Good Movies. 17 January 2012. Archived from the original on 17 January 2012.
  10. "Telugu film 'Masti' deals with realistic subject: Film's producer Ravi K Punnam". IBNLive. Archived from the original on 27 April 2014. Retrieved 14 December 2014.
  11. "Happy Birthday Kota: వారీ.. ఏం యాక్ట్‌ జేసినవ్వొయ్‌". Sakshi. 10 July 2021. Retrieved 10 July 2021.
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-23. Retrieved 2013-11-17.
  13. "టోటల్ టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు ఇంటర్వ్యూ". Archived from the original on 2007-06-08. Retrieved 2007-10-27.
  14. Special Correspondent (20 June 2010). "Actor Kota's son killed in accident". The Hindu. Archived from the original on 20 January 2016. Retrieved 14 December 2014.
  15. "Kota's son killed in bike-lorry collision". Deccan Chronicle. 22 June 2010. Archived from the original on 22 June 2010.

బయటి లింకులు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కోట శ్రీనివాసరావు పేజీ