Jump to content

ఘాట్ రోడ్లు

వికీపీడియా నుండి
పశ్చిమ కనుమలలోని వల్పరాయ్‌కి వెళ్లే వంకర ఘాట్ రోడ్డు దృశ్యం

ఘాట్ రోడ్లు అంటే భారత ఉపఖండంలో పర్వత శ్రేణులు, పశ్చిమ, తూర్పు కనుమల గుండా వెళ్ళే రహదారులు. ఈ రోడ్లు విశేషమైన ఇంజినీరింగ్ నిర్మాణాలు.[1] వీటిలో చాలా వరకు బ్రిటిషు కాలంలో నిర్మించారు. వేసవి తాపాన్ని నివారించేందుకు నివాసితుల కోసం పర్వతాలలో ఏర్పాటు చేసిన హిల్ స్టేషన్లకు అనుసంధానం చేసేందుకు ఘాట్ రోడ్లను నిర్మించారు. తీర ప్రాంతాలను ఎగువ దక్కన్ పీఠభూమితో అనుసంధానించడానికి వీటిని నిర్మించారు.


పశ్చిమ కనుమలు

[మార్చు]

పశ్చిమ కనుమలు అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న తీర మైదానాలకు, దక్కన్ పీఠభూమికీ మధ్య ఉన్నాయి. కరావళి జిల్లాలను మాలెనాడు, బయలుసీమ ప్రాంతాలతో కలుపుతూ అనేక ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఈ ఘాట్‌లలో చాలా వరకు వర్షాకాలంలో - జూన్, జూలై, ఆగస్టు నెలల్లో - చాలా సుందరంగా ఉంటాయి. వర్షాల సమయంలో ఈ ఘాట్‌లలో కొన్నింటిలో కొండచరియలు విరిగి పడవచ్చు.[2]

కర్ణాటక

[మార్చు]

కర్ణాటక రాష్ట్రంలోని ఘాట్ రోడ్లు:

  • అగుంబే ఘాట్ - అగుంబే షిమోగా జిల్లాలోని ఒక చిన్న గ్రామం, పశ్చిమ కనుమలలోని కొండలు, తడి ప్రాంతం. ఇక్కడి రహదారి ఉడిపి జిల్లా (ఉడిపి)ని శివమొగ్గ (షిమోగా)తో కలుపుతుంది. [3] అగుంబే ఘాట్ వర్షం సమయంలో పొగమంచుగా ఉంటుంది. దానిపై సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసే స్థలాలుంటాయి. అగుంబే ఘాట్‌లో మినీ బస్సులు, ప్యాసింజర్ కార్ల వంటి చిన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది.
  • చార్మడి ఘాట్ - చార్మడి ఘాట్ దక్షిణ కన్నడ, చిక్కమగళూరు జిల్లాల సరిహద్దులో ఉంది. జాతీయ రహదారి 73 (పాత NH-234) ఈ ఘాట్ గుండా వెళుతుంది. [4]
  • షిరాడీ ఘాట్ - షిరాడీ ఘాట్ దక్షిణ కన్నడ తీరప్రాంత జిల్లాను హాసన్ జిల్లాతో కలుపుతుంది. జాతీయ రహదారి 75 (పాత NH-48) దక్షిణ కన్నడ జిల్లాలోని రేవు నగరం మంగళూరు నుండి ప్రారంభమై, రాష్ట్ర రాజధాని బెంగళూరుకు వెళ్తుంది. [5]
  • హులికల్ ఘాట్ - హులికల్ ఘాట్ (లేదా బలేబరే ఘాట్) రహదారి ఉడిపి జిల్లాను శివమొగ్గ జిల్లాతో కలుపుతుంది.[6]
  • సంపాజే ఘాట్ - సంపాజే ఘాట్ రోడ్డు మడికేరి మీదుగా వెళ్ళే మంగళూరు - మైసూరు హైవేలో భాగం.
  • బిస్లే ఘాట్ - బిస్లే ఘాట్ రోడ్డు పశ్చిమ కనుమల దిగువన ఉన్న దక్షిణ కన్నడ జిల్లాలోని కుక్కే సుబ్రమణ్య ఆలయ పట్టణాన్ని పశ్చిమ కనుమల పైన ఉన్న సకలేష్‌పురకు కలుపుతుంది.[7] ఈ ఘాట్ రోడ్డు పశ్చిమ కనుమలలోని ఎలిఫెంట్ కారిడార్‌లో (నీరు, ఆహారం కోసం అడవి ఏనుగులు అనుసరించే మార్గాలు) లో ఉన్నందున, దట్టమైన అడవి, అడవి ఏనుగుల నుండి వచ్చే ప్రమాదం కారణంగా దీనిని తక్కువగా ఉపయోగిస్తారు.
  • దేవిమనే ఘాట్ - దేవిమనే ఘాట్ రోడ్డు ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఇది పశ్చిమ కనుమల పైన ఉన్న సిర్సి పట్టణంతో తీరప్రాంత పట్టణమైన కుంటాను కలుపుతుంది.[8] రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు ఈ దారిలో నడుస్తాయి. దేవీమనే గ్రామంలో హిందూ దేవాలయం ఉంది.
  • మాలా ఘాట్ - మాలా ఉడిపి జిల్లాలో ఉంది. తీరప్రాంత పట్టణమైన కర్కాల నుండి మైనింగ్ పట్టణం కుద్రేముఖ్‌కు కలుపుతుంది. ఈ ఘాట్ ఉడిపి, చిక్కమగళూరు జిల్లాలను కలుపుతుంది. మాల-కుద్రేముఖ్ సెక్షన్‌లో 120 టన్నుల బరువున్న వాహనాలను తట్టుకునేలా ఘాట్‌ను రూపొందించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌తో కలిసి రాష్ట్ర ప్రజా పనుల శాఖ దీన్ని నిర్మించింది.
  • అరబైల్ ఘాట్ - ఆరబైల్ ఘాట్ రోడ్ ( జాతీయ రహదారి 52) ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఘాట్ దిగువన ఉన్న అంకోలాను ఘాట్ పైన ఉన్న హుబ్బల్లితో ఎల్లపురా మీదుగా కలుపుతుంది.
  • అనాషి ఘాట్ - అనాషి ఘాట్ ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఇది తీరప్రాంత నగరమైన కార్వార్‌ను దండేలితో కలుపుతుంది. ఈ రోడ్డు లోని ఘాట్ భాగం కద్రా వద్ద మొదలై అనాశి దగ్గర ముగుస్తుంది, దట్టమైన పశ్చిమ కనుమల గుండా వెళుతుంది. ఈ ఘాట్ కాళీ టైగర్ రిజర్వ్‌లో భాగం.

కేరళ

[మార్చు]

కేరళ రాష్ట్రంలోని ఘాట్ రోడ్ల స్థానాలు:

  • ఇడుక్కి ఘాట్‌లు - ఇడుక్కి కేరళలోని ఒక కొండ జిల్లా. మున్నార్ హిల్ స్టేషన్ ఈ జిల్లాలో ఉంది.
  • ఇల్లిక్కల్ కల్లు - ఇడుక్కి జిల్లా సమీపంలోని రాతి కొండపై రాతి ఏకశిలా. కొండపైకి వెళ్ళే మార్గం నిటారుగా, సన్నగా, వంకర్లతో ఉంటుంది.
  • కైతపర ఘాట్ - చదును చేయని, సన్నని రహదారి. అందమైన దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తుంది.
  • బేరంబాడి ఘాట్‌లు
  • పొన్ముడి ఘాట్ రోడ్
  • వాగమోన్ ఘాట్ రోడ్
  • రాణిపురం ఘాట్‌లు
  • శబరిమల ఘాట్‌లు
  • అతిరాపల్లి ఘాట్ రోడ్
  • సైలెంట్ వ్యాలీ ఘాట్‌లు
  • పక్రమతలం ఘాట్‌లు - పక్రమ్‌తాళం ఘాట్‌ల రోడ్డు కుట్టియాడి పట్టణాన్ని దక్కన్ పీఠభూమిలోని మనంతవాడి పట్టణంతో కలుపుతుంది. [9] ఈ రహదారి రాష్ట్ర రహదారి 54 Archived 2022-09-30 at the Wayback Machine లో భాగం. [10]
  • తామరస్సేరి ఘాట్‌లు - ఈ ఘాట్ రోడ్డు ( జాతీయ రహదారి 766 ) సముద్ర తీర నగరం కోజికోడ్, వాయనాడ్ జిల్లాలను కలుపుతుంది. [11]
  • కుట్టంపుజ - భూతతంకెట్టు - ఇడమలయార్ డ్యామ్ ఘాట్ రోడ్

మహారాష్ట్ర

[మార్చు]

మహారాష్ట్ర లోని ఘాట్ రోడ్ల స్థానాలు:

  • అంబోలి ఘాట్ - అంబోలి ఘాట్ రోడ్డు సావంత్‌వాడిని కర్ణాటకలోని కొల్హాపూర్, బెలగావికి కలుపుతుంది. అంబోలి, సింధుదుర్గ్, ఈ ఘాట్‌లోని హిల్ స్టేషన్లు.
  • భోర్ ఘాట్ - ముంబైని పూణే నగరానికి కలిపే రహదారి.
  • కసర ఘాట్ - ఈ ఘాట్ థానే నుండి నాసిక్ వరకు ప్రయాణించడానికి ఒక మార్గం.
  • మల్షేజ్ ఘాట్ - థానే జిల్లా నుండి అహ్మద్ నగర్ వరకు ఘాట్ రోడ్డు.
  • తమ్హిని ఘాట్ - పూణే జిల్లాలో ఉన్న కొంకణ్ ప్రాంతంతో కలుపుతుంది
  • అంబా ఘాట్ - కొల్హాపూర్ (ఘాట్ పైకి) రత్నగిరితో (ఘాట్ దిగువన) కలుపుతుంది

తూర్పు కనుమలు

[మార్చు]

తూర్పు కనుమలు భారత ద్వీపకల్పంలో, తూర్పు తీరం వెంబడి బంగాళాఖాతానికి, దక్కన్ పీఠభూమికీ మధ్య విస్తరించి ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఘాట్ రోడ్ల ప్రదేశాలు:

  • చింతూరు ఘాట్ - చింతూరు ఘాట్ రోడ్డు చాలా సుందరమైనది. ఇది ఆంధ్రప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ప్రవేశ ద్వారం.
  • కొండవీడు ఘాట్ - ఒక రహదారి కొండవీడు కోటకు కలుపుతుంది. దీనికి వరుసగా హెయిర్‌పిన్ మలుపులు ఉన్నాయి. [12]

ఒడిశా

[మార్చు]

ఒడిషా రాష్ట్రంలోని ఘాట్ రోడ్ల ప్రదేశాలు:

  • మహేంద్రగిరి ఘాట్ - ఘాట్‌కు ఉత్తరం వైపున భారతదేశంలోకెల్లా అత్యధిక మలుపులు ఉంటాయి. సన్నటి, వంకరగా ఉన్న ఈ రహదారిని చదును చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
  • తారాబు ఘాట్

తమిళనాడు

[మార్చు]

తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక ఘాట్ రోడ్లు ఉన్నాయి.[13] అవి:

  • నీలగిరి ఘాట్ రోడ్లు - ఈ రోడ్లు నీలగిరి జిల్లాలో ఉన్నాయి, ఇది పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల మధ్య కూడలి
  • కోడై ఘాట్ - కోడై ఘాట్ రోడ్ (స్టేట్ హైవే 156) దిండిగల్ జిల్లాలో ఉన్న కొడైకెనాల్ హిల్ స్టేషన్ వరకు వెళుతుంది.
  • ఏలగిరి ఘాట్ రోడ్ - ఈ రహదారి తిరుపత్తూరు జిల్లాలో ఉంది. ఇది వాణియంబాడి-తిరుపత్తూరు రోడ్డులో ఉన్న పొన్నేరి గ్రామం వద్ద ప్రారంభమవుతుంది. దీని 15 కి.మీ. పొడవులో 14 హెయిర్‌పిన్ బెండ్లున్నాయి.
  • ఏర్కాడ్ ఘాట్ రోడ్ - ఈ రహదారిలో 25 కి.మీ. ల ఘాట్ రోడ్డులో 20 హెయిర్‌పిన్ వంపులు ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్ సేలం జిల్లాలో ఉంది.
  • బర్గూర్ ఘాట్ రోడ్ - ఈ రహదారి ఈరోడ్ జిల్లాలోని అంతియూర్ వద్ద ప్రారంభమై కర్ణాటక రాష్ట్రంలోని కొల్లేగల్ వద్ద ముగుస్తుంది. రహదారి దట్టమైన అడవి గుండా వెళుతుంది, ఇది వర్షాకాలంలో సుందరంగా ఉంటుంది.
  • కొల్లిమలై/కొల్లి ఘాట్ రోడ్ - ఈ రహదారిలో 72 హెయిర్‌పిన్ బెండ్‌లున్నాయి. ఇది నమక్కల్ జిల్లాలో ఉంది. కొల్లి కొండలు భారతదేశంలో అత్యధిక హెయిర్‌పిన్ వంకలను కలిగి, భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డుగా ఉంది. ఘాట్ రోడ్డు కొల్లి కొండల దిగువన ఉన్న బెలుకురిచి గ్రామంలో ప్రారంభమవుతుంది. దీని పొడవు 24 కిలోమీటర్లు (15 మై.).
  • పచ్చైమలై హిల్స్ ఘాట్ రోడ్లు - ఈ రోడ్లు కొల్లి కొండలలో కూడా ఉన్నాయి. తురైయూర్-పచ్చమలై ఘాట్ రోడ్‌లో 14 హెయిర్‌పిన్ బెండ్‌లు ఉన్నాయి. ఇది తిరుచిరాపల్లి జిల్లాలో ఉంది.
  • వల్పరాయ్ ఘాట్ రోడ్ - కోయంబత్తూర్ జిల్లాలోని ఈ రహదారి మంకీ ఫాల్స్ వద్ద ప్రారంభమవుతుంది. ఇందులో 40 హెయిర్‌పిన్ బెండ్లున్నాయి
  • దింబమ్ ఘాట్ రోడ్ – పశ్చిమ కనుమలలో, తూర్పు కనుమలకు దగ్గరగా ఉన్న ఈ 14-కిలోమీటర్ల దారిలో 27 హెయిర్‌పిన్ బెండ్లున్నాయి. బన్నారి నుండి దింబం వరకు ఉన్న రహదారి ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యం మీదుగా వెళ్ళే జాతీయ రహదారి 948లో ఒక భాగం.
  • జవధు ఘాట్ రోడ్లు - జవాది కొండలు తిరువణ్ణామలై జిల్లాలోని తూర్పు కనుమలలో భాగంగా ఉన్నాయి. ఈ కొండలలోని ఘాట్ రోడ్లు గ్రామాలను జిల్లాలోని సమీప పట్టణాలతో కలుపుతాయి.
  • సిరుమలై ఘాట్ రోడ్ - ఈ రహదారి దక్షిణ తమిళనాడులోని దిండిగల్, మదురై జిల్లాల మధ్య ఉంది. దీనికి 26 హెయిర్‌పిన్ బెండ్‌లు ఉన్నాయి.
  • కల్రాయన్ ఘాట్‌లు - కల్రాయన్ కొండలలో అనేక ఘాట్ రోడ్‌లు ఉన్నాయి, ఇవి కల్లకురిచి, సేలం జిల్లాల్లోని తూర్పు కనుమలలో భాగంగా ఉన్నాయి.
  • బోడిమెట్టు ఘాట్ రోడ్ - ఈ రహదారి థేనిని కేరళ రాష్ట్రంలోని మున్నార్‌తో కలుపుతుంది. తేని జిల్లాలోని మధురై-కొచ్చి జాతీయ రహదారిలో భాగం. ఇది భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్లలో ఒకటి, ఇది 1,200 మీటర్ల ఎత్తులో ఉంది.
  • మేఘమలై ఘాట్‌లు - తేని జిల్లాలోని ఈ రహదారిలో 20 హెయిర్‌పిన్ వంకలున్నాయి. చుట్టూ పచ్చని టీ ఎస్టేట్‌లు ఉన్నాయి.
  • పోతిగై ఘాట్‌లు - అనేక ఘాట్ రోడ్‌లకు నిలయం. తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాలలో ఉన్న మంజోలై ఘాట్ చాలా అందంగా, దట్టమైన అడవితో కప్పబడి ఉంటుంది.
  • సెంగోట్టై ఘాట్ రోడ్ - ఈ రహదారి పునలూర్‌ను సెంగోట్టైనీ కలుపుతుంది.

తెలంగాణ

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని ఘాట్ రోడ్ల ప్రదేశాలు:

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "What You Need To Know About The Ghat Roads In Wayanad". thewoodsresorts.com. Retrieved 2022-03-18.
  2. "Traffic diversion at Marnalli on shiradi ghat after landslide". Udayavani. Retrieved 7 August 2021.
  3. "Traffic is now open on Agumbe Ghat road". thehindu.com. January 2017. Retrieved 26 May 2017.
  4. "Charmadi Ghat". karnatakaholidays.com. Archived from the original on 4 మార్చి 2017. Retrieved 27 May 2017.
  5. Sastry, Anil Kumar (15 January 2017). "State govt. cancels Shiradi Ghat road reconstruction contract". thehindu.com. Retrieved 26 May 2017.
  6. "Balebare Ghat". yennaarudupi.blogspot.in. 16 June 2013. Retrieved 27 May 2017.
  7. "Bisle Ghat road awaits repair". deccanherald.com. 3 July 2014. Retrieved 27 May 2017.
  8. "Devimane Ghat opens for vehicles". thehindu.com. 15 February 2013. Retrieved 30 July 2018.
  9. "Pakranthalam Churam View Point, SH54, Kavilumpara, Kerala". indiapl.com. Retrieved 2022-09-30.
  10. "State highway 54 (SH54) Kerala Travel Guide - Roadnow". roadnow.in. Archived from the original on 2022-09-30. Retrieved 2022-09-30.
  11. "National Highway 766 (NH766) Travel Guide - Roadnow". roadnow.in. Archived from the original on 2022-09-23. Retrieved 2022-09-23.
  12. "Kondaveedu Fort · Edlapadu Mandal, Kondaveedu, Guntur, Andhra Pradesh 522549, India". Kondaveedu Fort · Edlapadu Mandal, Kondaveedu, Guntur, Andhra Pradesh 522549, India (in స్పానిష్). Retrieved 2021-09-25.
  13. "Kolli Hills, the road with 70 hairpin bends". www.dangerousroads.org (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-03-18.