చిత్రావతి
చిత్రావతి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నదికి కుడివైపు ఉపనది. దీని పరీవాహక ప్రాంతం 5,908 చ.కి.మీ.[1] ఇది వర్షాకాలంలో ప్రవహించే వర్షాధారమైన నది.[2]
పుట్టపర్తి పట్టణం ఈ నదీ తీరాన ఉంది. సత్యసాయి బాబా ప్రశాంతి నిలయం ఈ నది ఒడ్డునే ఉంది. ప్రారంభ దశలో బాబా ఈ నదీ తీరంలో ఉపన్యాసాలు భక్తులకు వినిపించేవాడు. భజన కార్యక్రమాలు నిర్వహించేవాడు.
చిత్రావతి నది కర్ణాటక లోని చిక్కబళ్ళాపూర్ జిల్లాలో పుట్టి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, కడప జిల్లాల గుండా ప్రవహించి పెన్నానదిలో కలుస్తుంది.[3] కర్ణాటక లోని బాగేపల్లితో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని గోరంట్ల, హిందూపూర్, బుక్కపట్నం, ధర్మవరం, తాడిపత్రి, కదిరి మండలాలు దీని పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి.[4] కడప జిల్లా గండికోట వద్ద చిత్రావతి పెన్నానదిలో కలుస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండికోట ప్రాజెక్టును చేపట్టింది.[5][6] చిత్రావతి, పాపఘ్ని కలిసి మధ్య పెన్నా బేసిన్ అవుతాయి.
అనంతపురం జిల్లా, తాడిమర్రి వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన పరగోడు ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక సాగునీటి చెరువులకు నీరు అందదని ఆంధ్ర రైతులు వాదించారు.[7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ "Re-using Irrigation Drainage Gonchi Irrigation System in Penna River Basin" (PDF). Centre for World Solidarity. Archived from the original (PDF) on 2 ఏప్రిల్ 2015. Retrieved 8 July 2013.
- ↑ "A fight over river waters". Frontline. 20 (14). 5–18 July 2003. Retrieved 8 July 2013.
- ↑ "Captivating beauty of River Chitravathi". Deccan Herald. 14 September 2008. Archived from the original on 2 April 2015. Retrieved 8 July 2013.
- ↑ Narasaiah, M. Lakshmi (1999). Financing Of Weaker Sections By Regional Rural Banks. New Delhi: Discovery Publishing House. p. 32. ISBN 9788171414673.
- ↑ "Floods in Pennar, Chitravathi". The Hindu. 18 July 2008. Archived from the original on 29 జూలై 2008. Retrieved 8 July 2013.
- ↑ "Anantapuram District". Government of Andhra Pradesh. Archived from the original on 15 మే 2013. Retrieved 23 జూన్ 2020.
- ↑ "A fight over river waters". Frontline. 20 (14). 5–18 July 2003. Retrieved 8 July 2013.
- ↑ "Don't allow Chitravathi dam: Naidu". The Hindu. 14 April 2000. Retrieved 8 July 2013.[permanent dead link]
- ↑ "Another water dispute between AP and Karnataka — Paragodu project raises hackles". The Hindu Businessline. 22 April 2003. Retrieved 8 July 2013.[permanent dead link]