Jump to content

జగిత్యాల కోట

వికీపీడియా నుండి
జగిత్యాల కోట
జగిత్యాల, తెలంగాణ
రకముకోట
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
వాడిన వస్తువులురాతి

జగిత్యాల కోట తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల గ్రామంలో ఉన్న కోట. సా.శ. 1747లో 20 ఎకరాల స్థలంలో నిజాం కాలంఓ ఫ్రెంచి ఇంజినీర్ల పర్యవేక్షణలో ఈ కోట నిర్మించబడింది.[1][2]

చరిత్ర - నిర్మాణం

[మార్చు]

జగ్గదేవుడి పేరిట ఏర్పాటైన జగిత్యాల గ్రామం వందల ఏళ్లనుంచీ పరిపాలనా కేంద్రంగా ఉంది. ఎలగందల్ కోట పాలకులైన ముబారి జుల్‌ముల్క్‌ జాఫరుద్దౌలా, మీర్జా ఇబ్రహీంఖాన్‌లు ఈ జగిత్యాల కోటను నిర్మించారు.[3] నక్షత్రాకారంలో కట్టబడిన కోటకు అన్నివైపులా పెద్ద అఘాతాలను ఏర్పాటుచేసి, శత్రువులు కోటపై దాడి చేస్తే అడ్డుకునేందుకు దాదాపు 90ఫిరంగులను అమర్చారు. శత్రువులు రాకుండా నిర్మించిన ఈ కోటలో లోతైన అఘాతాలు, సైనికులకోసం ప్రత్యేక గదులు, ఫిరంగులు, ఆయుధాల నిల్వకు చీకటి గది, తాగునీటి కోసం నిర్మించిన బావి, సొరంగం ఉన్నాయి. కోట చుట్టూ ఉన్న అఘాతాల్లో, కోటలోని కోనేరులో ఎప్పటికి నీరు ఉంటుంది.

ఇతర వివరాలు

[మార్చు]

కోటలోని ఫిరంగులపై ఉర్దూ భాష మహ్మద్ ఖాసిం పేరు రాసి ఉంది. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (14 October 2016). "చారిత్రక ఖిల్లా." Archived from the original on 16 July 2018. Retrieved 16 July 2018.
  2. ఈనాడు. "జగిత్యాల ఖిల్లా". Archived from the original on 17 July 2018. Retrieved 17 July 2018. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 16 జూలై 2018 suggested (help)
  3. నవతెలంగాణ (25 January 2017). "పర్యాటక శోభితం." Archived from the original on 2018-07-16. Retrieved 17 July 2018.