పెనుకొండ
పెనుకొండ | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 14°5′4.8509″N 77°35′47.9533″E / 14.084680806°N 77.596653694°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి |
మండలం | పెనుకొండ |
విస్తీర్ణం | 65.55 కి.మీ2 (25.31 చ. మై) |
జనాభా (2011)[1] | 27,382 |
• జనసాంద్రత | 420/కి.మీ2 (1,100/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 13,860 |
• స్త్రీలు | 13,522 |
• లింగ నిష్పత్తి | 976 |
• నివాసాలు | 6,752 |
ప్రాంతపు కోడ్ | +91 ( 85572 ) |
పిన్‌కోడ్ | 515110 |
2011 జనగణన కోడ్ | 595435 |
పెనుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పట్టణం, అదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇక్కడ గల పెనుకొండ కోట వలన ప్రముఖ పర్యాటక కేంద్రం. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 36 కి. మీ. దూరంలో ఉంది. దీని పరిపాలనా నిర్వహణ పెనుకొండ నగరపంచాయితీ నిర్వహిస్తుంది
చరిత్ర
[మార్చు]సా.శ. 1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లింరాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసినాకా విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నాళ్ళ పాటు పెనుకొండకు మార్చారు.[2]
గ్రామ భౌగోళికం
[మార్చు]ఈ గ్రామ విస్తీర్ణం 6555 హెక్టార్లు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామంలో 6752 ఇళ్లున్నాయి. మొత్తం జనాభా 27382. గ్రామంలో మగవారి సంఖ్య 13860, ఆడవారి సంఖ్య 13522.[3]
విద్యా సౌకర్యాలు
[మార్చు]సమీప ఇంజనీరింగ్ కళాశాల హిందూపురంలో ఉంది. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అనంతపురంలో ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
[మార్చు]జాతీయ రహదారి 44 (భారతదేశం) పై ఈ పట్టణం ఉంది. ఊరిలో రైల్వే స్టేషన్ ఉంది.
భూమి వినియోగం
[మార్చు]2011 జనగణన ప్రకారం, రెవెన్యూ గ్రామ పరిధిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- అడవి: 2247 హెక్టార్లు
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 325 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2067 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 63 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 205 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 374 హెక్టార్లు
- బంజరు భూమి: 1098 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 171 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1360 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 283 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 121 హెక్టార్లు
- చెరువులు: 161 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]పర్యాటక ఆకర్షణలు
[మార్చు]- పెనుకొండ పెద్దకొండ: పెనుకొండ కొండ మీదకు ప్రభుత్వ నిధులతో తారు రోడ్డును 2012 వ సంవత్సరంలో ఏర్పాటు చెయడం జరిగింది. ముఖ్యంగా పెనుకొండ కొండపై నిర్మించబడిన నరసింహ స్వామివారిదేవాలయము, కోనేరు, చెరువు, శత్రు దుర్భేధ్యమైన కోట చూడదగిన ప్రదేశములు. ఇక్కద నరసింహస్వామివారి దేవాలయం ముందు విశాలమైన మైదానము ఉంది. ఇది వాహనములు నిలుపుటకు, విడదికొరకు అనువైన ప్రదేశం.
- పెనుకొండ కోట: బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాసనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి.
- బాబా ఫక్రుద్దీన్ దర్గా
- యెర్రమంచి గేటు: ఇందులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారు. పెనుకొండలో 365 దేవాలయాలు వుండేవని చరిత్ర చెబుతోంది. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించారు.
- షేర్ ఖాన్ మసీదు
- జామియా మసీదు
- పాంచ్ బీబీ దర్గా
- బాబయ్యకొండ (ఛిల్లాపహడ్)
- గగన మహాల్
- గాలి గోపురం
- తిమ్మరుసు బందీఖానా
- కుంభకర్ణ విగ్రహం
- కాళేశ్వరస్వామి ఆశ్రమం
- అజితనాధ దేవాలయం.
ప్రముఖులు
[మార్చు]- పరిటాల రవి - (1958 ఆగష్టు 30- 2005 జనవరి 24) పరిటాల రవి అనే రవీంద్ర ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. అతని భార్య పరిటాల సునీత, ప్రస్తుతం రాప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రవి తండ్రి పరిటాల శ్రీరాములు కూడా ఒక ప్రజానాయకుడు.
భూపోరాటాల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశాడు.ఇతను కూడా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా దర్శకుడు ఎన్. శంకర్ శ్రీరాములయ్య అనే సినిమా తీశాడు. రవి జీవితం నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ, రక్త చరిత్ర పేరుతో రెండు సినిమాలు తీశాడు. రాష్ట్రంలోని రాజకీయ నాయకుల్లో ఒకడైన పరిటాల రవీంద్ర ఈ నియోజక వర్గం నుండే ప్రాతినిధ్యం వహించాడు.
- సంధ్యావందనం శ్రీనివాసరావు - ఇతడు పెనుకొండలో 1918, ఆగష్టు 21న నారాయణరావు, గంగాబాయి దంపతులకు జన్మించాడు[4] ఇతడు సంగీతంలో ప్రాథమిక పాఠాలు పల్లవి పక్క హనుమంతాచార్, తిరుపతి రంగాచార్యులు, చిలమత్తూరు రామయ్యల వద్ద అభ్యసించాడు. తరువాత ఇతడు టైగర్ వరదాచారి, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ద్వారం వేంకటస్వామినాయుడు, మైసూరు వాసుదేవాచార్ల వద్ద సంగీతంలో మెళకువలు నేర్చుకున్నాడు. శ్రద్ధతో, ఉత్సాహంతో, పట్టుదలతో అనేక ప్రాచీన సంప్రదాయ కీర్తనలు సేకరించి, స్త్రీలపాటలు, పల్లెపదాలు అనేకం ప్రోదిచేసి వాటి ద్వారా ప్రాచీన రాగాల స్వరూపాలను కల్పన చేశాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "మా వ్యాసకర్తలు - [[భారతి (మాస పత్రిక)]] - సంపుటము 40 సంచిక 2- ఫిబ్రవరి 1963 - పేజీ100". Archived from the original on 2016-03-05. Retrieved 2021-12-28.
వెలుపలి లింకులు
[మార్చు]
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- శ్రీ సత్యసాయి జిల్లా మండల కేంద్రాలు
- Wikipedia articles with VIAF identifiers
- ఆంధ్రప్రదేశ్ చారిత్రక స్థలాలు
- ఆంధ్రప్రదేశ్ పట్టణాలు
- ఆంధ్రప్రదేశ్ జైనమత క్షేత్రాలు
- శ్రీ సత్యసాయి జిల్లా పుణ్యక్షేత్రాలు
- శ్రీ సత్యసాయి జిల్లా పట్టణాలు
- Pages using the Kartographer extension