పుదుచ్చేరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (బాటు: en:Puducherry వర్గాన్ని en:Puducherry (Union Territory)కి మార్చింది
చి r2.7.2) (బాటు: en:Puducherry (Union Territory) వర్గాన్ని en:Puducherryకి మార్చింది
పంక్తి 59: పంక్తి 59:
[[వర్గం:పుదుచ్చేరి]]
[[వర్గం:పుదుచ్చేరి]]


[[en:Puducherry (Union Territory)]]
[[en:Puducherry]]
[[hi:पॉन्डिचेरी]]
[[hi:पॉन्डिचेरी]]
[[kn:ಪುದುಚೇರಿ]]
[[kn:ಪುದುಚೇರಿ]]

18:07, 31 జనవరి 2013 నాటి కూర్పు

పుదుచ్చేరి ప్రాంత పటము

పుదుచ్చేరి లేదా పాండిచెర్రి (Pondicherry), దక్షిణ భారత దేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతము.

పుదుచ్చేరి లో నాలుగు విడి విడిగా ఉన్న జిల్లాలు ఉన్నాయి.

  • పుదుచ్చేరి లేదా పాండిచెర్రీ పట్టణము: బంగాళా ఖాతం తీరమున, తమిళనాడు రాష్ట్రం అంతర్భాగంగా - ఈ భాగం వైశాల్యం 293 చ.కి.మీ
  • కరైకాల్: బంగాళా ఖాతం తీరమున, తమిళనాడు రాష్ట్రం అంతర్భాగంగా - ఈ భాగం వైశాల్యం 160 చ.కి.మీ
  • యానాం: బంగాళా ఖాతం తీరమున, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతర్భాగంగా, కాకినాడ సమీపంలో - ఈ భాగం వైశాల్యం 30 చ.కి.మీ

పుదుచ్చేరిలోని నాలుగు భాగాల మొత్తం జనాభా షుమారు 9,70,000 (2001 జనాభా లెక్కలు ప్రకారం)

తమిళంలో 'పుదు - చ్చేరి' అంటే 'క్రొత్త - ఊరు' అని అర్ధం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీనిని ఫ్రెంచివారు "Poudichéry" అని పిలిచారు. ఎప్పుడో పొరబాటున ఆంగ్లంలో 'u' బదులు 'n' అని వ్రాయడం వల్ల దీనిని ఆంగ్లంలో 'పాండిచేరి' అని పిలువడం మొదలయ్యింది. తరువాత అదే ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఆంగ్లంలో అధికారికంగా 'పుదుచ్చేరి' అని పేరు మార్చే ప్రయత్నం జరుగుతున్నది.

చరిత్ర

పురాణకాలంలో ఇక్కడ అగస్త్యమహర్షి ఆశ్రమం ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒక సంస్కృత విద్యాలయం కూడా ఉండేదని కొన్ని పురాతనాధారాల వల్ల తెలుస్తోంది. క్రీ.శ. 2వ శతాబ్దంలో వ్రాయబడిన Periplus of the Erythraean Sea లో 'పొడుకె' అనే వాణిజ్యకేంద్రం గురించి వ్రాయబడినది. ఇదే ప్రస్తుత పుదుచ్చేరికి 2మైళ్ళ దూరంలో ఉన్న'అరికమేడు' అని 'హంటింగ్ ఫోర్డ్' అనే రచయిత అభిప్రాయం. అప్పటినుండి రోము ప్రాంతంతో పుదుచ్చేరి దగ్గరి రేవులకు సముద్ర వర్తక సంబంధాలుండేవి. రోముకు చెందిన కొన్ని పాత్రలు అరికమేడులో త్రవ్వకాలలో బయటపడినాయి. క్రీ.శ. 4వ శతాబ్దానంతరం ఈ ప్రాంతం వరుసగా పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజుల రాజ్యాలలో భాగంగా ఉంది. 1673లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ వారు ఇక్కడ నెలకొలిపిన వర్తక స్థావరం క్రమంగా ఫ్రెంచివారి అధికార కేంద్రమయ్యింది. తరువాత ఫ్రెంచి, బ్రిటిష్, డచ్చి వారి మధ్య అధికారం కోసం జరిగిన అనేక యద్ధాలు, ఒప్పందాల ప్రకారం పుదుచ్చేరి పై అధికారం మారుతూ వచ్చింది. 1850 తరువాత పుదుచ్చేరి, మాహె, యానాం, కరైకాల్, చందేర్ నగర్ లు ఫ్రెంచివారి స్థావరాలుగా ఉన్నఅయి. 1954 వరకు ఇదే పరిస్థితి సాగింది.


భారత స్వాతంత్ర్య సమర కాలంలోనే పుదుచ్చేరిని ఫ్రెంచి పాలన నుండి విముక్తి చేయడానికి అనేక ఉద్యమాలు సాగాయి. 1787, 1791లో కరైకాల్ రైతులు భూమి పన్నులను వ్యతిరేకించారు. 1873లో పొన్నుతంబి పిళ్ళై అనే న్యాయవాది పారిస్ న్యాయస్థానంలో ఒక కేసు గెలిచారు. (పుదుచ్చేరి కోర్టులో చెప్పులతో ప్రవేశించినందుకు ఆయనకు విధించిన జరిమానా అన్యాయమని అంగీకరించి పరిహారం చెల్లించారు). 1927 - 1930 కాలంలో విద్యార్ధి ఉద్యమాలు నడచాయి. జాతీయ నాయకులు పుదుచ్చేరి వాసులను సంబోధించి ప్రసంగించారు. 1934లో 'వి.సుబ్బయ్య' అనే స్వాతంత్ర్య నాయకుడు, కార్మిక నాయకుడు 'స్వతంత్రం' అనే మాస పత్రికను ప్రారంభించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచి వారి పై విముఖత మరింత పెరిగింది. 1946లో 'ఫ్రెంచి ఇండియా కాంగ్రెసు' ప్రాంభింపబడింది. 1948 లో భారతదేశంలో విలీనానికి తీర్మానం ఆమోదించారు. దీనికి కమ్యూనిస్టుల మద్దతు కూడా లభించింది. 1947 లో భారత స్వాతంత్ర్యానంతరం 1948లో ఫ్రంచి ప్రభుత్వంతో జరిగి ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాల ప్రజలు తమ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకొనే అవకాశం లభించింది. అయితే ప్రజా ప్రతినిధులలో కొంత ఊగిసలాట, అనిశ్చితి వల్ల, ఎన్నికలలో జరిగిన అవక తవకల వల్ల అసంగ్దిద్ధ పరిస్థితి నెలకొన్నది. 1954 మార్చి 18న పుదుచ్చేరిలో ప్రజా ప్రతినిధులంతా భారతదేశంలో విలీనానికి అంగీకరించారు. తరువాత కరైకాల్ లోనూ ఇదే జరిగింది. అలాగే యానాం విలీనానికి తీర్మానించిన ప్రజా ప్రతినిధులు బెదిరింపులను ఎదుర్కొని ప్రక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో తలదాచుకోవాల్సి వచ్చింది. వారంతా కలసి, మేయర్ సత్యానందం నాయకత్యంలో ఊరేగింపుగా యానాం వెళ్ళి , భారతజాతీయ పతాకాన్ని ఎగురవేసి యానాం విముక్తిని ప్రకటించారు. 1954 జులై 16న కుమరన్ నాయకత్యంలో మాహె పౌరులు కూడా భారతదేశంలో విలీనమైనారు. 1952 చందోర్ నగర్ కూడా భారత ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. దానిని పశ్చిమ బెంగాల్ లో హుగ్లీ జిల్లాలో భాగంగా ఏర్పరచారు.

1954 నవంబరు 1 నుండి పాలనా వ్యవహారాలు భారత దేశపు అధీనంలోకి వచ్చినా, 1962 వరకు అధికారికంగా భారతదేశంలో విలీనం జరుగలేదు. 1963లో పుదుచ్చేరి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయబడింది. ఆ సమయంలో ఫ్రెంచి పౌరసత్వాన్ని ఎన్నుకొన్న పుదుచ్చేరి వాసులు (వీరిలో చాలామంది మాతృభాష తమిళం), వారి సంతానం ఇప్పటికీ ఫ్రెంచి పౌరసత్వం కలిగి ఉన్నారు. పుదుచ్చేరిలో ఫ్ర్రాన్సు దేశపు రాయబార కార్యాలయ విభాగం ఒకటి, ఇంకా ఫ్రెంచి సాంస్కృతిక సంస్థలూ పని చేస్తున్నాయి.

పాలనా విధానం

పుదుచ్చేరి ఒక కేంద్ర పాలిత ప్రాంతం. కనుక ఇక్కడి పాలనా విధానం కూడా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే ఉంటుంది. ఎన్నుకొనబడిన ముఖ్య మంత్రి, కాబినెట్ మంత్రులు ఉన్నా కొన్ని విషయాలు కేంద్రప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంది. కేంద్రం ప్రతినిధిగా 'లెఫ్టినెంట్ గవర్నర్' ఉంటారు . అయితే కేంద్ర పాలిత ప్రాంతం పాలనకు అవసరమైన నిధులు ఎక్కువగా కేంద్రం నుండి వస్తాయి.

పుదుచ్చేరి నగరం

పుదుచ్చేరి వాసుల ప్రధాన భాష తమిళమైనా ఆంగ్లభాష, ఫ్రెంచిభాషలు ఈ పట్టణంలో బాగానే వాడబడుతాయి. ప్రధానమైన వీధి బోర్డులు మూడు భాషల్లోనూ ఉంటాయి.

1.25 మైళ్ళ పొడవు, 27 అడుగుల ఎత్తు ఉన్న గోడ (కరకట్ట) సముద్రం అలల తాకిడినుండి పుదుచ్చేరి నగరాన్ని కాపాడుతుంది. ఇది 1735లో ఫ్రెంచివారి కాలంలో నిర్మింప బడింది. 2004 లో వచ్చిన 'సునామీ' ఉప్పెన సమయంలో 24 అడుగుల ఎత్తు అలలనుండి ఈ గోడ పుదుచ్చేరి నగరాన్ని రక్షించింది.

పుదుచ్చేరికి చెందిన కొందరు ప్రముఖులు:

  • అరవింద మహర్షి: ఈయన స్మృత్యర్ధం నిర్మించిన అరవిందాశ్రమం ఆరొవిల్లిలో ఒక ప్రధాన పర్యటనా కేంద్రం, తాత్విక అధ్యయనా స్థానం.

ఇవి కూడా చూడండి

బయటి లంకెలు