బంజారా గోత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బంజారా గోత్రాలు

[మార్చు]

బంజారా గోత్రాలు ఇంటి పేర్లు బంజారా (లంబాడీ, సుగాలీ)

జాత్,గోత్ జాత్ అంటే జాతి,గోత్ అంటే గోత్రం అనగా వారి మూల పురుషుల పేర్లని అర్థం.బంజారా గోత్రాలను ఆరు రకాలుగా వర్గీకరించారు.ఈ గోత్రాలు గా వారి పూర్వీకులు నామకరణం చేశారు.[1].[2][3]

బంజారా గోత్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశం
బంజారా గోత్రాలు
వర్గీకరణఆంధ్రప్రదేశ్,తెలంగాణ షెడ్యూల్డ్ తెగల జాబితా
మతాలుహిందూమతం
వాస్తవ రాష్ట్రంఆంధ్రప్రదేశ్,తెలంగాణ
జనాభా గల రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్,తెలంగాణ,భారత దేశంలోని రాష్ట్రాలు
జనాభా1.2 కోట్లు సుమారు
Subdivisionsబంజారా సుగాలీ, లంబాడీ షెడ్యూల్డ్ ఉప తెగలు
Reservation (Education)యస్.టి
Reservation (Employment)యస్.టి

లంబాడీ / సుగాలీ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల జాబితా యస్. టి గ్రూపు లోని 28వ తెగ.[4]

గోత్ర పుట్టు పూర్వోత్తరాలు

[మార్చు]

బంజారా లంబాడీ సుగాలీ ల గోత్ర శాఖలను వారు వీరి ఈ విధంగా చెప్తూ వచ్చారు.ఛౌ గోత్ చవాణ్ అనగా ఆరు గోత్రాల వారు చౌహణ్ అన మాట సత్తావిస్ పాడా భూక్యా అనగా 27 గోత్రాల వారు భూక్యా (రాథోడ్) అనమాట.బార గోత్ పవార్ 12 గోత్రాల వారు పవార్లు,తేర పాడ బాణుత్ అనగా 13 గోత్రాలు బాణోత్ లు బావన్ పాడ వడ్త్యా 52 గోత్రాల వారు వడ్త్యా (జాదవ్) వారు ఎక్ జాత్ తూరి ఒకే ఒక గోత్రాల వారు తూరి గోత్రం అనేమాట.తూరి గోత్రం వాళ్ళను ఇలా అంటారు ఎక్ జాత్ తూరి తి సేగోత్ సారి అనగా ఒకే శాఖతో తూరి గోత్రం కలిపి సంపూర్ణ బంజారా గోత్రాలుగా చెప్పబడుచున్నది. పైన తెలిపినట్లు గోర్ బంజారాల ముఖ్యమైన ఆరుగురు మూల పురుషులతో ఆరు గోత్రాలు ఏర్పడ్డాయి.అవి 1.చౌహాణ్, 2.పవార్, 3.రాథోడ్ (భూక్యా), 4.జాదవ్ (వడ్త్యా), 5.బాణోత్, 6.తూరి, ఒక్కొక గోత్రంలో శాఖలు ఆ శాఖలో అనేక ఉప శాఖలుగా ఏర్పడ్డాయి.గోత్ అంటే గోత్రము జాత్ ,జతియా అంటే శాఖ పాత్(పాడ) అంటే ఉప శాఖ అని అర్థం.కొన్ని జిల్లాలో ‌వీరి ఇంటి పేర్లు గోత్రాలతో చెప్పుకుంటారు.

మరి కొన్ని జిల్లాలో వీరి ఇంటి పేర్లు ఉప గోత్రాలతో చెప్పుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాణోత్ గోత్రం, భూక్యా గోత్రం అంటే రాథోడ్ ‌గోత్రం వారు పెళ్ళి సంబంధాలు కుదుర్చుకుంటారు. వారు ఇలా అంటారు బాలా, భీకా అన్నదమ్ములు లోలోపల సంబంధాలు బాలాన్ భీకా భాయి, మాయి మాయి వేగి సగాయి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో బానోత్ గోత్రం మరియు భూక్యా గోత్రం వారు అన్నదమ్ములుగా భావిస్తున్నారు.ఆదిలాబాద్ జిల్లాలో రాథోడ్ వంశం వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.

ఏ వారం రోజు జన్మిస్తే ఆ పేర్లు

[మార్చు]

వీరి పేర్లు పూర్వ కాలంలో ఏ‌‌ రోజున వీరు జన్మిస్తే ఆ రోజున ఏ వారం ఉంటుందో అదే వారం పేరు మీదుగా పేరు పెట్టేవారు. ఉదాహరణకు సోమవారం రోజున మగ పిల్లవాడు జన్మిస్తే సోమియ్యా అని ఆడ పిల్ల పుట్టినచో సోమ్లి అని మంగళవారం రోజున పుట్టినచో మంగియ్యా అని అమ్మాయి పేరు మంగ్లీ అని బుధవారం జన్మిస్తే బదియ్యా , అమ్మాయి ఐతే బద్లీ అని గురువారం ను లంబాడీ భాషలో వరస్పత్ అంటారు.ఆ రోజు జన్మిస్తే వసీయ్య,అమ్మాయి ఐతే వాస్లీ,హస్లీ శుక్రవారం జన్మిస్తే శకర్యా, అమ్మాయి శక్రీ,శనివారం ను థావర్ అంటారు ఆ రోజు జన్మిస్తే థావర్యా, తార్యాయ తాయి,తారి ఇలా ఏ వారం పుట్టిన ఆ వారం పేర్లు పెట్టేవారు.కాని కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీరి పేర్లలో కూడా మార్పులు వచ్చాయి.ఇప్పటి కాలంలో వీరు దేవి దేవతల పేర్లు, సినీ నటీనటుల పేర్లు, క్రికెటర్ల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉదాహరణం సీతా,సరస్వతీ,లక్ష్మీ,పార్వతీ,శివా,శంకర్,బ్రహ్మానంద్,శ్రీదేవి, శిల్పా,రోజా,సౌందర్య, భూమిక,నయనతార నాగార్జున్,వెంకటేశ్, పవన్, కల్యాణ్,అర్జున్,సచిన్,కపిల్, రోహిత్, రవీంద్ర,సౌరభ్,అభినవ్ మొదలగునవి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మత మార్పిడి చేస్తూన్న కాలంలో సిక్కు మత గురువు లలో తొమ్మిదో గురువు అయిన టేక్ బహదూర్ కి మత మార్పిడిని నిరాకరించడంతో 1675 నవంబర్ 11న భాయ్ గురుభక్త సింగ్ ని కళ్ళముందే శిరశ్చేదం చేయించారు.సిక్కు గురువు యొక్క పార్థివ దేహాన్ని అంతిమ సంస్కారం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు కానీ ఢీల్లికి చెందిన ప్రముఖ వ్యాపారి వీరుడు ధీరుడు ఐనా బాబా లక్కీషా బంజారా చక్రవర్తి ఔరంగజేబు సైన్యంతో పోరాడి ఢీల్లి లోని రాయిసినా తాండకు తీసుకుని వచ్చి గురువు యొక్క పార్థివ దేహానికి తన ఇంట్లోనే దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించారు.ఇది సిక్కు మతములో బాబా లక్కీషా బంజారా సృష్టించిన కొత్త అన్యాయంగా చెప్పవచ్చు.అప్పటి నుండి సిక్కులతో బంజారాలకు ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల వీరు తమ పేరు చివర సింగ్ ‌అని పెట్టుకోవడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాల వల్ల ‌తమ యొక్క పేరు చివర నాయక్ అని కూడా పెట్టుకుంటున్నారు.

బంజారా కసళాత్ (కుశల ప్రశ్న)

[మార్చు]

పంచ పంచాయత్ రాజా భోజ్ జేర్ సభా!

పచారె లాఖ్ అన్ న పచారె సవ్వా లాఖ్!

భాయిర్ ఆణంద్ సగార్ కసళ్ !

సుక సుకటా గగన్ గగన్ కీ డోర్ తమ్ సమందర్ హామ్ మాచళా తమ్ హామ్ కరా కళ్ళోళ్ !

ధోళో ఘోడొ హసులో ఖిటీ టాకొ లగామ్! సగాతీ సగా మళగె దస్ దన్ కరా మక్కామ్ !

డుంగర్ థే జబ్ దుర్ థె ఆభ్ హుయీ పఛాణ్ గద్ కరా గలకా కరా తొ హిరా నిపజె ఖాణ్ !

హిరా హిరా కా కహూ హిరా జగమే దోయ్ ఎక్ హిరా సుందర్ బసే దుజా కొఖ్‌ మే సోయ్ !

సోనేర్ థాళీ కాసేర్ కచోళి సగాతి సగా మళగే సితళ్ వెగీ ఛాతీ !! "పంచో"!!

ఆచీ ఆచీ రకాడజో ! థోతి థోతి టాళజో !! హామ్ తో తమార్ సరాణ్ ఆయేఛా..... చుకీభులీ పదరేం లెలీజో లాజ్ హామారీ రకాడజో! సగా ఆపళ్ సే కసళ్ భాయీ ఆపణ్ సే ఆణంద్ ఛోక భాయీ ఆపణ్ సే కసళ్ ఛోక...!

భావార్థము:- నా ప్రియమైన బంధువులారా ? వినండీ ఇది పవిత్రమైన సభ ఇది పంచాయితి కాదు.ఇది రాజా భోజ్ రాజుని సభ ఈ సభకు ఆహ్వనించబడ్డ లక్షల బంధువులు ఇంకా ఆహ్వానం అందకుండనే వచ్చిన వారు లక్షపాతిక వేలు.ఈ రోజు వరకు మా జీవితం ఎన్నో ఒత్తిడితో విచే పవనము మరియు ఆకాశంలో అందనంత ఎత్తులో ఎగిరే గరుడ పక్షి వలే ఉంది. ఇప్పుడు మనం అనేక రోజుల తర్వాత కలిసాము నడుడర్రి మనమందరం ఆనందాన్ని అస్వాదిద్దాం. మీ చిరునవ్వు వలే తెల్లటి గుర్రాన్ని పరిశుభ్రంగా చేసుకుందాం .

బంధుబలగం కలిసాము మనం కలవడం ఈ సందర్భం నిజంగా లక్షలో ఒక్కసారి మాత్రమే. పది రోజు మనమందరం కలసి ఉందాం ఈ రోజు వరకు మనం కొండ కోనాల్లో ఉన్నాం. చాలా దూర ప్రాంతంలో నివాసమై ఒకరి ముఖం ఒక్కరం చూడ లేక పోయాం ఇప్పుడు కలిసాం సౌభాగ్యం తో మన పరిచయాలు ఎర్పడ్డాయి. ఒక మనిషి(వజ్రం) ఇతర మనుషుల(వజ్రాల)తో కలసినప్పడు అప్పుడు అనిపిస్తుంది మనుషుల(వజ్రాల గని) జాతరల తలపిస్తుంది. ఇంత ప్రేమ అనురాగంతో నిండిన వజ్రానికి మేము మా హృదయంలో పదిలంగా ఉంచుకుంటాము. బంగారపు పళ్ళేంలోనే కంచు గిన్నెకు అందం.అదే మాదిరిగా కలుసుకోవడం మనా ఈ సంబంధం విశ్వంలోనే ఘనం దినికి ఎవరిది దిష్టి తాకకుడదు.ఈ విధంగా కలసుకోవడంతో చాలా ఆనందాన్ని పొందాము.

బంజారా గోత్ర నామాలు

[మార్చు]
  1.రాథోడ్ (భుక్యా)  27 గోత్రాలు 
 2.జాదవ్ (వడ్త్యా)   52 గోత్రాలు
 3.బాణోత్ (ఆడే)   13+2 గోత్రాలు
 4.చౌహాణ్ (లావ్డ్యా)   6 గోత్రాలు
 5.పవార్ (పమార్)   12 గోత్రాలు
 6.తూరి           4  గోత్రాలు 

రాథోడ్ గోత్రం

[మార్చు]

రాథోడ్ లేదా భూక్యా గోత్రం లో మొతం 27 ఉప గోత్రాలు ఉన్నాయి అవి

  1.కడావత్     2.ఖేతావత్
  3.మేగావత్    4.నేణావత్
  5.రామావత్,   6.దేవ్సో త్,
  7.ఖోలా/ఖోలావత్ 8.కరంటోట్     
  9.రాత్లావత్,    10.ఉదావత్,
  11.ధేగావత్, 12.ఖాట్రోత్/ఖాట్రావత్ 
             ‌‌
  13.ఖోక్నోత్,    14.రణ్సోత్,
  15.పాత్లోత్/పాత్లావత16.డుంగావత్,
  17.సాంగావత్,   18.మేరాజోత్
  19.ఆళోత్.      20.సోట్కి
  21.ఢేగావత్.     22.భీలావత్
  23.బాగావత్.     24.మేరావత్
  25.కానావత్.     26.డాలావత్
  27.పితావత్

రాథోడ్ గోత్రంలో మొత్తం ఇరువై ఏడు ఉపగోత్రాలు ఉంటాయి. రాథోడ్ గోత్రం తప్ప మిగిలిన గోత్రాలతో వారు పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.

జాదవ్ గోత్రం

[మార్చు]

జాదవ్ (వడ్తియా)గోత్రంలో 52 ఉప గోత్రాలు ఉన్నాయి అవి.

  1.బాదావత్  2.బోడ,
  3.లాకావత్  4.లుణావత్,
  5.మాళోత్   6.తేజావత్,
  7.ఘుగ్లోత్   8.ధారావత్,

  9.బర్మావత్  10.బోడా(తిలావత్),

  11.నేతావత్  12.గోరామ్,
  13.అజ్మేర   14.పోరికా,
  15.తేరావత్  16.మేరావత్,
  17.గాంగావత్ 18.కుణ్సోత్,
  19.తూరి    20.హానావత్,
  21.ధేనావత్  22.నూణావత్,
  23.లాలావత్  24.టేపావత్,
  25.ఉందావత్  26.హలావత్,
  27.హాన్మావత్  28.దేశావత్,
  29.భరోత్    30.కాసావత్,
  31.భగవాన్దాస్ 32.మోహన్దాస్,
  33.జల్లోత్   34.సెజావత్,
  35.దుర్గావత్  36.పాడియాపుష్ణవత్
  37.పెంజీ    38.జైగావత్,
  39.హెమావత్  40.మోహవత్,
  41.గోటావత్   42.మోగ్లావత్,
  43.తోహవత్   44.జైతావత్,
  45.హర్కావత్  46.రుద్రవత్,
  47.కానావత్   48.హజ్రావత్,
  49.ప్రేమావత్   50.రత్నావత్,
  51. కాగ్లావత్ 

ఈ జాదవ్ గోత్రంలో ఒక గోత్రం తక్కువ అయిందని వారు కాకిని చేర్చుకున్నారని అంటారు. వడ్తియా గోత్రంలో మొత్తం యాభై రెండు ఉప గోత్రాలు ఉంటాయి.కాని 52 ఉప గోత్రాల పేర్లు కూడా సరిగా ఎవ్వరు చేపక పోవడం బంజారా సాహిత్య పుస్తకాల్లో కూడా లేక పోవడం వలన ఇవి ఎంతా వరకు నిజమో తెలియదు. ఈ గోత్రం తప్ప మిగిలిన అన్ని గోత్రాలతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.

బాణోత్ (ఆడే) గోత్రం

[మార్చు]

బాణోత్ గోత్రంలో లో 15 ఉప‌ గోత్రాలు ఉన్నాయి అవి

 1.రుపావత్,   2.ధరంసోత్,
 3.జాటోత్,    4.ఆడే/ బానావత్,
 5.సబ్దసోత్,   6.కర్ణావత్,
 7.ధానావత్,   8.లావోరి,
 9.కుంతావత్,  10.ముణావత్,
 11.పానావత్,  12.భోజావత్,
 13.ధీరావత్,   14.ముదావత్
 
  15. పద్మావత్  

ఇందులో మొత్తం పదిహేను ఉప గోత్రాలు ఉంటాయి. ఈ గోత్రం తప్ప మిగిలిన అన్ని గోత్రాలతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.

చౌహాణ్ గోత్రం

[మార్చు]

చౌహాణ్ (చవాన్) గోత్రంలో 6 ఉప గోత్రాలు ఉన్నాయి అవి

 1.కేళుత్,   2.కోర్రా,
 3.పాల్తీయా, 4.సపావట్,
 5.లావ్డీయా, 6.మూడ్/ముదావత్.

పవార్ గోత్రం

[మార్చు]

పవార్ లేదా పమార్ గోత్రంలో 12 ఉప గోత్రాలు ఉన్నాయి అవి

  1.ఇస్లావత్,    2.అమ్గోత్,
  3.ఝర్పూల్లా,   4.నూణ్సావత్,
  5.ఇంద్రావత్,   6.వాంక్డోత్,
  7.ఐత్ పవార్   8.జైత్ పవార్,
  9.బాణి పవార్, 10.లోకా పవార్,
 11.తర్బాణి పవార్,12.ముంజ్వాణి,

మొత్తం పన్నెండు ఉప గోత్రాలు తప్ప మిగిలిన అన్ని గోత్రాలతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.

తూరి గోత్రం

[మార్చు]

తూరి గోత్రంలో 4 ఉప గోత్రాలు ఉన్నాయి అవి

1.తెంగావత్, 2.జెసావత్,
3.బింజోర్,  4.రాస్వాస్,

ఈ తూరి గోత్రం వడ్తియా గోత్రం వారు అన్నదమ్ములుగా భావిస్తారు.ఈ గోత్రం వారు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కన్పించరు.

బంజారా-ఉప కులాలు

[మార్చు]
  • ఢాడి బంజారా
  • భాట్ బంజారా
  • ఢాలియా బంజారా
  • నావి బంజారా
  • సనార్ బంజారా

ప్రముఖ రాజకీయ వ్యక్తులు

[మార్చు]

బంజారా లంబాడీ,సుగాలీ ప్రముఖ రాజకీయ వ్యక్తుల జాబితా

పోరిక బలరాం నాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు

రవీంద్రనాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు

అంబాజీ జాదవ్ మాజీ ఎమ్మేల్యే

అమర్ సింగ్ తిలావత్ మాజీ మంత్రి

పోరిక జగన్ నాయక్ మాజీ ఎమ్మేల్యే

రమేష్ రాథోడ్ మాజీ పార్లమెంట్ సభ్యులు

అజ్మీరా చందులాల్ మాజీ మంత్రి

అజ్మీరా గోవింద్ నాయక్ మాజీ ఎమ్మేల్యే

రెడ్యా నాయక్ మాజీ మంత్రి

బద్ధు చౌహన్ మాజీ ఎమ్మేల్యే

రాగ్యా నాయక్ మాజీ ఎమ్మేల్యే

సీతారాం నాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు

సభావత్ రాములు నాయక్ మాజీ యంఎల్సీ

ధీరావత్ భారతి మాజీ ఎమ్మేల్యే

సుమన్ రాథోడ్ మాజీ ఎమ్మేల్యే

బానోతు చంద్రావతి మాజీ ఎమ్మేల్యే

సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి

అజ్మీరా రేఖ నాయక్ మాజీ ఎమ్మేల్యే

మాలోత్ కవిత మాజీ పార్లమెంట్ సభ్యురాలు

బానోతు హరిప్రియ నాయక్ మాజీ ఎమ్మేల్యే

బానోతు మదన్ లాల్ మాజీ ఎమ్మేల్యే

బానోతు శంకర్ నాయక్ మాజీ ఎమ్మేల్యే

రాథోడ్ బాపు రావు మాజీ ఎమ్మేల్యే

లావుడ్యా రాములు నాయక్ మాజీ ఎమ్మేల్యే

ప్రస్తుత ఎమ్మేల్యేలు(2023 నుండి)

[మార్చు]

మురళి నాయక్ భూక్యా ఎమ్మేల్యే

అనిల్ జాదవ్ ఎమ్మేల్యే

జాటోత్ రామచంద్రు నాయక్ ఎమ్మేల్యే

నేనావత్ బాలునాయక్ ఎమ్మేల్యే

రాందాస్ మాలోత్ ఎమ్మేల్యే

రమావత్ రవీంద్ర కుమార్ ఎమ్మేల్యే

మూలాలు

[మార్చు]
  1. "Banjara Gotra (pada), Caste And Subcaste List - Welcome To Banjara One Formerly GoarBanjara.com" (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-08-31. Retrieved 2024-04-23.
  2. Madhubabu (2011-01-16). "Banjara(Vana chara): Banjara-Lambadi". Banjara(Vana chara). Retrieved 2024-04-23.
  3. "Banjara Caste | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2024-04-23.
  4. by (2017-10-24). "Schedule Tribes of Telangana". Telangana PCS Exam Notes (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-29.