గోత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యుడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది పురుషుడే కాబట్టి, గోత్రం మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది. గోత్రం అనగా గో అంటే గోవు, గురుడు, భూమి, వేదం అని అర్థములు. ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు. ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.

గోత్రాలు ఆటవిక కాలం/ ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి. తొలుత గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల (తండ్రికి) పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధములు ఉండ రాదని, వేరు గోత్రికుల మధ్య వివాహములు జరపటము మంచిదని గోత్రములు అందునకు ఉపకరిస్తాయని, ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు. తండ్రి (మూల పురుషుడు) చేసిన పని, వాడిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించ బడినాయి. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద, ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి.

కొవ్వూరు గోదావరి గట్టు మీద విశ్వామిత్రుడి విగ్రహం

బ్రాహ్మణుల గోత్రాలు[మార్చు]

  • భారతదేశమునందు కల బ్రాహ్మణ కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక గోత్రము, ప్రతి గోత్రానికి ముగ్గురు (త్రయార్షేయ) లేదా అయిదుగురు (పంచార్షేయ) ఋషుల వరస ఉంటుంది. ఈ ఋషుల వరసే ఈ కుటుంబాల మధ్య వారధి. బ్రాహ్మణ వివాహ విధి ప్రకారము, స్వగోత్రీకులు (ఒకే గోత్రం ఉన్న అబ్బాయి, అమ్మాయి) వివాహమాడరాదు. అలానే, త్రయార్షులలో మొదటి ఋషి కలవరాదు. వీరు దాయాదుల లెక్కన వస్తారు. ప్రతి గోత్రము సప్తర్షులలో ఒకరి నుండి వచ్చినదే.
  • బౌద్ధాయనస్రౌత-సూత్రము ప్రకారము విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి (కృష్ణాత్రియ) , వశిష్ట, కాశ్యప, అగస్త్య అనే 8 మంది ఋషులు, వారి సంతానము పేర్లే బ్రాహ్మణ గోత్రములు. ప్రజాపతి కి, ఈ 8 మంది ఋషులకి సంబంధము లేదు. వీరిని, వీరి సంతానమును గోత్రములని, మిగతావారిని "గోత్రవ్యయవ" అని అంటారు. గోత్రములన్నీ గుంపులుగా విభజింపబడ్డాయి. వశిష్ట గణము నాలుగుగా విభజింపబడింది. అవి ఉపమన్యు, పరాశర, కుండిన, వశిష్ట. వాటికి మళ్ళీ పక్షాలు ఉన్నాయి. గణము, పక్షము, గోత్రము, ఇలా వస్తాయి. గణము, పక్షము, గోత్రము, అన్నీ కలిపి చదవడానిని ప్రవర అంటారు. పరాశర గోత్రానికి ప్రవర "వశిష్ట, శాక్త్య, పరాశర". ఉపమన్యుకు "వశిష్ట, భరద్వసు, ఇంద్రప్రమద". 19 మంది ఋషులు దాకా, ఏకార్షేయ, ద్వార్షేయ, త్రయార్షేయ, ఇలా ఎంత మందితో అయినా ప్రవర ఉండవచ్చు. ఆంధ్రదేశములో కాశ్యపస గోత్రానికి కనీసము రెండు ప్రవరలు ఉన్నాయి. ఒకటి త్రయార్షేయ ప్రవర, ఇంకొకటి సప్తార్షేయ ప్రవర. ప్రవరలు రెండు విధాలుగా ఉన్నాయి.
  1. శిష్య - ప్రశిష్య - ఋషి పరంపర
  2. పుత్ర పరంపర
  • పుత్ర పరంపరలో ఒక ఋషి కలిసినా, వివాహము నిషిద్ధము. శిష్య - ప్రశిష్య - ఋషి పరంపరలో సగము, లేదా అంతకన్నా ఎక్కువ మంది ఋషులు కలిస్తే వివాహము నిషిద్ధము

క్షత్రియ గోత్రాలు[మార్చు]

బ్రాహ్మణ గోత్రాలవలే క్షత్రియ కులాలవారికి కూడా సప్తఋషుల పేర్లమీద లేదా వారి వంశస్తుల పేర్ల మీద ఉన్నాయి. విశ్వామిత్ర, జమదగ్ని, పరాశర, భారద్వాజ, గౌతముడు గౌతమ, [[అత్రి మహర్షి|అత్రి కృష్ణాత్రియ, శ్రీవాస్తవ, వశిష్టుడు వశిష్ట, కశ్యపుడు కాశ్యప, కౌండిన్య, ధనుంజయ, పశుపతి. ఈ గోత్రాలు ఉత్తర భారతదేశపు రాజపుత్రులుకు, దక్షణ భారతదేశపు ఆంధ్ర క్షత్రియులుకు ఉన్నాయి.

గోత్రాల వివరణ[మార్చు]

గోత్రములు: ఇవి అనేకములు. అందు కొన్ని శిష్యపరంపరను కొన్ని పుత్రపరంపరను తెలియ చేయును. వీనిని ఇన్ని అని లెక్క పెట్టిచెప్పుట అసాధ్యము. అయినను ఇందు ముఖ్యమైనవి ఏఁబది. అవి కాశ్యప భారద్వాజ హరిత కౌండిన్య కౌశిక వసిష్ఠ గౌతమ గార్గేయ శ్రీవత్స ఆత్రేయ ముద్గల శఠమర్షణాదులు. వానిలో ప్రతిదానియందును అంతర్భాగములు అనేకములు ఉన్నాయి. మఱియును అవి ఏకార్షేయములు ద్వ్యార్షేయములు త్ర్యార్షేయములు పంచార్షేయములును అయి ఉండును. అనఁగా ప్రవర చెప్పునపుడు కొందఱు ఒక ఋషిని కొందఱు ఇద్దఱు ఋషులను కొందఱు ముగ్గురు ఋషులను కొందఱు అయిదుగురు ఋషులను చెప్పి చెప్పుదురు అని అర్థము.

ఇవికూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

సూచనలు[మార్చు]

  • Ruegg, D. Seyfort (1976) . 'The Meanings of the Term "Gotra" and the Textual History of the "Ratnagotravibhāga"'. Bulletin of the School of Oriental and African Studies, University of London, Vol. 39, No. 2 (1976), pp. 341–363

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గోత్రాలు&oldid=4010733" నుండి వెలికితీశారు