బహమనీ సామ్రాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బహమనీ సామ్రాజ్యం

1347–1518
బహమనీ సామ్రాజ్యం, 1470లో
బహమనీ సామ్రాజ్యం, 1470లో
రాజధానిగుల్బర్గా, తర్వాత బీదర్
ప్రభుత్వంMonarchy
చరిత్ర 
• స్థాపన
1347
• పతనం
1518
Preceded by
Succeeded by
ఢిల్లీ సుల్తానులు
కుతుబ్ షాహీ వంశము

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.శ.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు 210 – 300
బృహత్పలాయనులు 300 – 350
ఆనంద గోత్రీకులు 295 – 620
శాలంకాయనులు 320 – 420
విష్ణుకుండినులు 375 – 555
పల్లవులు 400 – 550
పూర్వమధ్య యుగము 650 – 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు 624 – 1076
పూర్వగాంగులు 498 – 894
చాళుక్య చోళులు 980 – 1076
కాకతీయులు 750 – 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320–1565
ముసునూరి నాయకులు 1333–1368
ఓఢ్ర గజపతులు 1513
రేచెర్ల పద్మనాయకులు 1368–1461
కొండవీటి రెడ్డి రాజులు 1324–1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు 1395–1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము 1336–1565
ఆధునిక యుగము 1540–1956
అరవీటి వంశము 1572–1680
పెమ్మసాని నాయకులు 1423–1740
కుతుబ్ షాహీ యుగము 1518–1687
నిజాము రాజ్యము 1742–1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము 1800–1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1912–1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు 1948–1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ 1953–1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 1956–2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర 2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు

బహమనీ సామ్రాజ్యము దక్షిణ భారత దేశమున దక్కన్‌ యొక్క ఒక ముస్లిం రాజ్యము. ఈ సల్తనత్‌ను 1347లో టర్కిష్ గవర్నర్ అల్లాద్దీన్‌ హసన్‌ బహ్మన్‌ షా, ఢిల్లీ సుల్తాన్‌, ముహమ్మద్ బిన్ తుగ్లక్కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి స్థాపించాడు. అతని తిరుగుబాటు సఫలమై, ఢిల్లీ సామ్రాజ్యము యొక్క దక్షిణ ప్రాంతాలతో దక్కన్‌లో ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాడు. 1347 నుండి దాదాపు 1425 వరకు బహమనీల రాజధాని ఎహసానాబాద్‌ (గుల్బర్గా). ఆ తరువాత రాజధాని, మహమ్మదాబాద్‌ (బీదర్‌) కు తరలించారు. బహమనీలు దక్కన్‌ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ ఓరుగల్లు ముసునూరి చక్రవర్తులపై, విజయనగర వారిపై పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్‌ గవాన్ యొక్క వజీరియతులో (14661481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్, బీరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ సల్తనత్, దక్కన్‌ సల్తనత్ లుగా పేరు పొందాయి.

సామ్రాజ్య స్థాపకుడి చరిత్రపై కథనం

[మార్చు]

బహమనీ సామ్రాజ్య స్థాపకుడు హసన్ గంగు గురించి ఒక కథనం ప్రచారంలో ఉంది. సన్ గంగు ఒక బ్రాహ్మణుడి వద్ద పొలం పనులు చేస్తూండేవాడు. ఒకరోజు పొలం దున్నుతూండగా, అతడికి ఒక నిధి దొరికింది. ఆ నిధిని తీసుకువెళ్ళి బ్రాహ్మణునికి ఇచ్చాడు. అతడి నిజాయితీకి సంతోషించిన బ్రాహ్మణుడు, అతణ్ణి, రాజు కొలువులో పని ఇప్పించాడు. తిరుగుబాటు తరువాత, అతడు రాజైనపుడు, [1]. అయితే ఈ కథనాన్ని ధ్రువపరచే చారిత్రిక ఆధారాలు దొరకలేదు.

బహమనీ సుల్తానుల జాబితా

[మార్చు]
  • అల్లాద్దీన్‌ హసన్‌ బహ్మన్‌ షా 1347 - 1358
  • మహమ్మద్‌ షా I 1358 - 1375
  • అల్లాద్దీన్‌ ముజాహిద్‌ షా 1375 - 1378
  • దావూద్‌ షా 1378
  • మహమ్మద్‌ షా II 1378 - 1397
  • ఘియాతుద్దీన్‌ 1397
  • షంషుద్దీన్‌ 1397
  • తాజుద్దీన్ ఫిరోజ్‌ షా 1397 - 1422
  • అహ్మద్‌ షా I వలీ 1422 - 1436
  • అల్లాద్దీన్‌ అహ్మద్‌ షా II 1436 - 1458
  • అల్లాద్దీన్‌ హుమాయున్‌ జాలిమ్‌ షా 1458 - 1461
  • నిజాం షా 1461 - 1463
  • మహమ్మద్‌ షా III లష్కరి 1463 - 1482
  • మహమ్మద్‌ షా IV (మెహమూద్‌ షా) 1482 - 1518
  • అహ్మద్‌ షా III 1518 - 1521
  • అల్లాద్దీన్‌ 1521 - 1522
  • వలీ అల్లా షా 1522 - 1525
  • కలీమల్లా షా 1525 - 1527

బయటి లింకులు

[మార్చు]

దక్కన్‌ పాలకుల కాలక్రమము

మూలాలు

[మార్చు]
  1. మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లా చరిత్ర - పేజీ 211