భోపాల్ రాష్ట్రం (1949-1956)
Bhopal State | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
Former State 1949–1956 | |||||||||
Etymology: from Bhojpal or Bhoj's dam[1] | |||||||||
Country | India | ||||||||
Region | Central India | ||||||||
Before was | Bhopal State | ||||||||
Admission to Union | 1 June 1949 | ||||||||
Capital and largest city | Bhopal | ||||||||
Government | |||||||||
విస్తీర్ణం | |||||||||
• Total | 17,801 కి.మీ2 (6,873 చ. మై) | ||||||||
జనాభా (1931) | |||||||||
• Total | 73,00,000 | ||||||||
Time zone | UTC+05:30 (IST) | ||||||||
|
భోపాల్ రాష్ట్రం భారతదేశంలో 1949 నుండి 1956 వరకు ఉనికిలో ఉన్నఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం భోపాల్ సంస్థానం నుండి ఉద్భవించింది. 1956లో పొరుగు రాష్ట్రాలతో విలీనం చేయబడి మధ్యప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. భారత జాతీయ కాంగ్రెస్ చెందిన శంకర్ దయాళ్ శర్మ1952 నుండి 1956 వరకు భోపాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.
చరిత్ర.
[మార్చు]భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు భోపాల్ సంస్థానాన్ని వంశపారంపర్య నవాబులు పాలించారు. భారత స్వాతంత్ర్య చట్టం 1947 ఫలితంగా, సంస్థానాలు బ్రిటిష్ వారి ఒప్పంద బాధ్యతల నుండి విడుదల అయ్యాయి. భారతదేశం, పాకిస్తాన్ కొత్త డొమినియన్లలో ఏదో ఒకదానిలో చేరాలా వద్దా అని నిర్ణయించుకోవటం వాటి ఇష్టానికే వదిలివేసారు.1948 మార్చిలో, చివరి నవాబు భోపాల్‌ను స్వతంత్ర రాష్ట్రంగా పాలించాలనే కోరికను వ్యక్తం చేశాడు. అయితే, 1948 డిసెంబరులో అతని పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. దీనితో శంకర్ దయాళ్ శర్మతో సహా ప్రముఖ నాయకులందరిని అరెస్టు చేయడానికి దారితీసింది. 1949 జనవరి 23న, బహిరంగ సమావేశాలపై ఆంక్షలను ఉల్లంఘించినందుకు శర్మకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు. మరికొందరు సత్యాగ్రహులను కూడా అరెస్టు చేశారు. తరువాత రాజకీయ ఖైదీలుగా భావించి విడుదల చేశారు. 1949 ఏప్రిల్ 30న నవాబు భారత ఆధిపత్యంలో చేరే ఒప్పందంపై సంతకం చేశారు.[2] భోపాల్ రాష్ట్రాన్ని 1949 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానితో "పార్ట్ సి" రాష్ట్రంగా ప్రకటించి, భారత రాష్ట్రపతి నియమించిన చీఫ్ కమిషనర్ పాలన ప్రవేశపెట్టారు.
అస్థిరత
[మార్చు]1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, భోపాల్ రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైంది. భోపాల్ నగరం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించబడింది.
భౌగోళిక శాస్త్రం
[మార్చు]భోపాల్ రాష్ట్రంలోప్రస్తుత భోపాల్,రైసెన్,సెహోర్ జిల్లాలుఉన్నాయి.
ప్రభుత్వం
[మార్చు]1952లో జరిగిన శాసనసభకు, పార్లమెంటుకు జరిగిన మొదటి ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. 30 మంది సభ్యులతో భోపాల్ రాష్ట్ర శాసనసభ ఏర్పడింది: [3]
- 25 – భారతజాతీయ కాంగ్రెస్
- 1 – హిందూ మహాసభ
- 4 - స్వతంత్ర
శంకర్ దయాళ్ శర్మ (19 ఆగస్టు 1918 - 26 డిసెంబరు 1999) 1952 మార్చి 20న రాష్ట్ర మొదటి (ఏకైక) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో అతను భారతదేశం లోనే అత్యంత పిన్నవయస్కుడైన ముఖ్యమంత్రిగా గుర్తింపుపొందాడు. [4]
ఇది కూడ చూడు
[మార్చు]23°15′N 77°24′E / 23.250°N 77.400°E
మూలాలు
[మార్చు]- ↑ "History of Bhopal | District Bhopal, Government of Madhya Pradesh | India". Retrieved 2023-04-24.
- ↑ S.R. Bakshi and O.P. Ralhan (2007). Madhya Pradesh Through the Ages. Sarup & Sons. p. 360. ISBN 978-81-7625-806-7.
- ↑ "Statistical Report on General Election, 1951 : To the Legislative Assembly of Bhopal" (PDF). Election Commission of India. Retrieved 2014-10-13.
- ↑ Raj Bhavan, Bhopal: Commissioner Period Archived 2 నవంబరు 2011 at the Wayback Machine