మాన్సా జిల్లా
మాన్సా జిల్లా
ਮਾਨਸਾ ਜ਼ਿਲ੍ਹਾ | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
ముఖ్య పట్టణం | మాన్సా |
విస్తీర్ణం | |
• Total | 2,174 కి.మీ2 (839 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 7,68,808 |
• జనసాంద్రత | 350/కి.మీ2 (900/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-PB |
Vehicle registration | PB-31 |
లింగ నిష్పత్తి | 1000/880 ♂/♀ |
అక్షరాస్యత | 63% |
పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో మాన్సా జిల్లా (పంజాబీ - ਮਾਨਸਾ ਜ਼ਿਲ੍ਹਾ ) ఒకటి. జిల్లాలో బుధ్లడ, మాన్సా అనే 2 తాలూకాలు ఉన్నాయి.[1] భిఖి, బుధ్లడ మన్సా ఝునిర్, సర్దుల్గర్ అనే 5 డెవలెప్మెంటు బ్లాకులు 3 ఉపతాలూకాలు ఉన్నాయి. మాన్సా పట్టణం, ఈ జిల్లాకు కేంద్రం.
భౌగోళికం
[మార్చు]భౌగోళికంగా జిల్లా త్రికోణాకారంగా ఉంటుంది. జిల్లా వాయవ్య సరిహద్దులో భటిండా, ఈశాన్య సరిహద్దులో సంగ్రూర్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులో హర్యానా రాష్ట్రం ఉన్నాయి. ఇది భటిండా- జింద్ - ఢిల్లీ రైలు మార్గంలో ఉంది. అలాగే బర్నాలా- సర్దుల్గర్- సిర్సా (హర్యానా) రహదారి మార్గంలో ఉంది. జిల్లాలో 3 తాలూకాలున్నాయి: బుధ్లడా, మాన్సా, సత్దిల్గర్. జిల్లాలోని సర్దుల్గర్ తాలూకా గుండా ఘగ్గర్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో పంజాబీ అధికార భాషగా ఉంది.
చరిత్ర
[మార్చు]మాన్సా జిల్లా మునుపు ఫుకియా సిఖ్ సామ్రాజ్యం (1722- 1948) లో భాగంగా ఉంటూ వచ్చింది తరువాత కైథల్ సిఖ్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. ఈ జిల్లా 1992 ఏప్రిల్ 13 న ఏర్పాటైంది. భటిండా జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. ఈ పట్టణాన్ని భాయి గురుదాస్ స్థాపించాడని భావిస్తున్నారు. భాయి గురుదాస్ ధింగర్‌లో నివసించే వాడు. ఆయన మాన్సాలో నివసిస్తున్న ధైల్వాల్ జాట్ సిఖ్ కన్యను వివాహం చేసుకున్నాడు. ఒకరోజు ఆయన తన భార్యను తీసుకుని వెళ్ళడానికి ఈ ఊరికి వచ్చిన సమయంలో ఆయన అత్తమామలు భార్యను పంపడానికి నిరాకరించారు. తరువాత గురుదాస్ వారింటి ముందు తపసు చేయడం ఆరంభించాడు. తరువాత కొంతకాలానికి అత్తమామలు భార్యను పంపడానికి అంగీకరించినా గురుదాస్ భార్యను నిరాకరించి తన తపస్సు ఆపలేదు. ఈ సంఘటనకు నిదర్శనంగా ఇక్కడ సమాధి నిర్మించి ప్రతిసంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. లాడూలు, గురు సంప్రదాయానికి చెందిన ప్రజలు ఈ సమాధి దర్శించడానికి అధికంగా వస్తుంటారు. 1952 నుండి ఇక్కడ నగరపాలక వ్యవస్థ ఆరంభం అయింది.
- నగరంలో రెండు కాలేజీలు ఉన్నాయి: నెహ్రూ మెమోరియల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్, ఎస్.డి కన్య మహావిద్యాలయ కాలేజ్.
- 3 సీనియర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి.
- 90 పాఠశాలలు ఉన్నాయి.
- 1 మిడిల్ స్కూల్
- 1 ప్రైమరీ స్కూల్ ఉంది.
- జిల్లా గ్రంథాలయం ఉంది.
- 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.: పి.ఎస్ సిటీ, పి.ఎస్ సాదర్
- ఒక రైల్వేస్టేషను ఉంది.
పురాతన కాలం
[మార్చు]ఈ ప్రాతంలో ఒకప్పుడు సింధూనాగరికత ఉండేది. జిల్లాలోని పలు ప్రాంతాలలో పురాతన కాలంలో హరప్పా, మొహంజుదారో సంస్కృతి ఉన్నట్లు పురాతత్వ పరిశోధనలు ౠజువు చేస్తున్నాయి.
[2][3] ఈ ప్రాంతం 3 సంస్కృతికి చెంది ఉంది : ప్రి హరప్పా, హరప్పా, లేట్ హరప్పా సంస్కృతులకు చెంది ఉంది.
పూర్వ హరప్పన్
- అలిపూర్ మంద్రన్
- బగ్లియన్ డీ థెన్
- బారెన్
- చోటి మానస
- గుర్ని కలాన్
- హాసంపూర్
- హిర్కే
- లక్ష్మీర్వాలా
- నైవాన్ తెహ్
- హరప్పా కాలం
- అలి డా తెహ్
- అలిపూర్ మంద్రన్
- బగ్లియన్ డీ తెహ్
- చోటి మానస
- డాలేవన్
- గుర్ని కలాన్
- హాసన్‌పూర్
- హిర్కెబ్
- కర్నపురా
- లక్ష్మీర్ వాలా
- వాలా
- లలియన్ వాలి
- నైవాలా తెహ్
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 7,68,808,[4] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 489వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | 350 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.62%. |
స్త్రీ పురుష నిష్పత్తి. | 880:1000 |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 62.8%[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
వ్యవసాయం , పరిశ్రమలు
[మార్చు]మాన్సా జిల్లా పంజాబు కాటన్ బెల్టులో భాగంగా ఉంది. అందువలన ఈ ప్రాంతాన్ని " ఏరియా ఆఫ్ వైట్ గోల్డ్ " (తెల్ల బంగారు ప్రాంతం) అని అంటారు. జిల్లాకు వ్యవసాయభూములు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. జిల్లాలో రాష్ట్రంలోని అతిపెద్ద " థర్మల్ పవర్ స్టేషను " ఉంది. ఈ థర్మల్ పవర్ స్టేషను సామర్థ్యం 1980 మె.వా. ఈ ప్రాంతంలో పరిశ్రమలు, వాణిజ్యం అరుదుగా నగర ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి.
ప్రధాన నగరాలు , పట్టణాలు
[మార్చు]బుధ్లడ
[మార్చు]ఖత్లి కులానికి చెందిన బుధ, లఢ అనే అన్నదమ్ములు నివసించిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి బిధ్లడ అనే పేరు వచ్చింది. ఇది ఢిల్లీ, భతిండా రైల్వే మార్గంలో ఉంది. ఇది మిలటరీ ఉద్యోగుల నియామక కేంద్రంగానూ, ముఖ్యమైన వ్యాపార కేంద్రంగానూ గుర్తించబడుతుంది.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- * కెప్టెన్ కె.కె గౌర్
- * గవీ చాహల్ -ఏక్టర్
- * డీప్ ధిల్లాన్ -గాయకుడు
- * కుల్‌వీందర్ బిల్లా - గాయకుడు
- * లాభ్ హీరా - గాయకుడు
- * జైస్మీన్ జస్సి -
మూలాలు
[మార్చు]- ↑ "Gurpreet gets Mansa seat". News in English. Ludhiana. The Tribune. January 10, 2012. Retrieved July 17, 2012.
- ↑ Lal, B.B; Gupta, S.P. (1984) [1981-82]. Frontier of Indus Valley Civilization. Delhi.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - ↑ "Ancient history of Mansa district". B.B. Lal and S.P. Gupta. www.punjabrevenue.nic.in. Archived from the original on 18 జూలై 2011. Retrieved 23 January 2012.
- ↑ 4.0 4.1 "District Census 2011". www.census2011.co.in. 2011. Retrieved 22 January 2012.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Alaska 710,231