మునుగోడు మండలం
Jump to navigation
Jump to search
మునుగోడు మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
మునుగోడు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, మునుగోడు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°04′00″N 79°04′00″E / 17.0667°N 79.0667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | మునుగోడు |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 241 km² (93.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 45,477 |
- పురుషులు | 23,396 |
- స్త్రీలు | 22,081 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.46% |
- పురుషులు | 65.56% |
- స్త్రీలు | 39.05% |
పిన్కోడ్ | 508244 |
ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 21 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం మునుగోడు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 45,477 - పురుషులు 23,396 - స్త్రీలు 22,081
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 241 చ.కి.మీ. కాగా, జనాభా 45,477. జనాభాలో పురుషులు 23,396 కాగా, స్త్రీల సంఖ్య 22,081. మండలంలో 11,269 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మునుగోడు
- కిష్టాపురం
- ఇప్పర్తి
- సింగారం
- కస్లాపురం
- పలివెల
- చల్మెడ
- కొంపల్లి
- చీకటిమామిడి
- కోరటికల్
- చొల్లేడు
- కల్వకుంట్ల
- పులిపలుపుల
- కాలవలపల్లి
- జమిస్తాన్పల్లి
- గూడాపూర్
- సోలిపురం
- కోతులారం
- రత్తిపల్లి
- వూకొండి
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.