యమున (నటి)
యమున | |
---|---|
జననం | ప్రేమ |
వృత్తి | నటి |
పిల్లలు | విశేష్టి, కౌశికి |
యమున దక్షిణ భారత సినిమా నటి. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించడమే కాక కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలలో, టెలివిజన్ ధారావాహికలలో నటించింది.[1][2] ఈమె కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఈమె అసలు పేరు ప్రేమ. దర్శకుడు కె.బాలచందర్ ఈమె పేరును యమునగా మార్చాడు.
వృత్తి
[మార్చు]యమున కన్నడ సినిమా మోడద మరెయల్లిలో శివరాజకుమార్ సరసన తొలిసారి నటించింది. ఈమె సుమారు 50 తెలుగు, కన్నడ చిత్రాలలో కథానాయికగా నటించింది.[3] 1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది.[4][5] ఈ సినిమా మీడియాలో ప్రాచుర్యం పొందిన సబితా బధేయి అనే ఆమె వాస్తవగాధ ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో ఈమె ఒక ప్రభుత్వోద్యోగి చేత మోసగింపబడి, వైవాహిక హక్కులకోసం, తన అక్రమ సంతానానికి సరైన గుర్తింపు కోసం పోరాడే యువతి గౌరి పాత్రను ధరించింది.[6] ఈమె తరువాత వినోద్ కుమార్ సరసన మరో అవార్డు చిత్రం మామగారులో నటించింది.[7] తరువాత పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలను ధరించింది.[8] కన్నడ సినిమాలలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్‌ల సరసన నటించింది.[9] ఈమె వివాహం తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం మానివేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. ఈటీవిలో ప్రసారమైన ధారావాహిక అన్వేషితలో ఈమె నటించింది.
బూటకపు ఆరోపణలు
[మార్చు]2011లో బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్ ఐ.టి.సి.రాయల్ గార్డెనియాలో జరిగిన పోలీసు దాడిలో వ్యభిచార ఆరోపణలపై ఈమెను అరెస్టు చేశారు.[10] యూట్యూబులో ఒక ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను బూటకమైనవిగా కోర్టు కొట్టివేసినట్లు ఈమె తెలియజేసింది.[11]
నటించిన సినిమాలు
[మార్చు]ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- టాక్సీవాలా (2018) - శిశిర తల్లి
- భగీరథుడు (2010 సినిమా)
- మనసు పిలిచింది (2009)
- ఓ చినదాన (2002)
- శ్రీ మంజునాథ (2001) - గంగానది
- బాచి (2000) - పార్వతి
- ఎదురులేని మనిషి (2001) - భవాని
- ప్రేమకు పది సూత్రాలు (1995)
- డియర్ బ్రదర్స్ (1995)
- మంత్రాల మర్రిచెట్టు (1994)
- బంగారు కుటుంబం (1994) - కృష్ణవేణి
- బ్రహ్మచారి మొగుడు (1994) - జయలక్ష్మి
- రాజధాని (1993)
- గోవిందా గోవిందా (1993) - లక్ష్మీదేవి
- ఆదర్శం (1993) - వాణి
- సూరిగాడు (1992)
- ప్రేమ విజేత (1992)
- గౌరమ్మ (1992)
- కాలేజీ బుల్లోడు (1992)
- మామగారు (1991)
- ఎర్ర మందారం (1991) - అరుంధతి
- పీపుల్స్ ఎన్కౌంటర్ (1991)
- ఘటన (1990)
- ఉద్యమం (1990)
- ఆడది (1990)[12]
- పుట్టింటి పట్టుచీర (1990)
- అగ్నిప్రవేశం(1990)
- మౌన పోరాటం (1989) - దుర్గ
- సిస్టర్ నందిని (1988)
టి.వి.సీరియళ్లు
[మార్చు]యమున ఈ క్రింది ధారావాహికలలో నటించింది.
- విధి (ఈటీవి) - సరోజ/రోసీ
- అన్వేషిత (ఈటీవి) - స్నిగ్ధాదేవి
- రక్త సంబంధం (జెమిని టీవి)
- అల్లరే అల్లరి (ఈటీవి ప్లస్)
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (విధి -2వ భాగం, ఈటీవి) - రోసీ
- దామిని (జెమిని టీవి)
- అలా వైషూ నిలయంలో (ఈటీవీ ప్లస్)- వైషూ (వైష్ణవి)
- మౌనపోరాటం (ఈటీవీ) - దుర్గ
మూలాలు
[మార్చు]- ↑ "Yamuna profile on Fimibeat". filmibeat.com. Filmibeat. Archived from the original on 3 డిసెంబరు 2016. Retrieved 24 November 2016.
- ↑ Bollineni, Haribabu. "Why Senior Actress Tried to Commit Suicide?". chitramala.in. Chitramala. Archived from the original on 24 నవంబరు 2016. Retrieved 24 November 2016.
- ↑ Shyam, Prasad S (27 September 2016). "Yamuna back on the big screen". Bangalore Mirror. Archived from the original on 3 ఏప్రిల్ 2019. Retrieved 30 May 2020.
- ↑ "1989 Nandi Awards". awardsandwinners.com. Archived from the original on 2014-10-19. Retrieved 2020-05-30.
- ↑ "List of winners of the Nandi Award for Best Feature Film". telugufilmz.org.[permanent dead link]
- ↑ "Mouna Poratam Music by S Janaki". sjanaki.net. Archived from the original on 2019-10-24. Retrieved 2020-05-30.
- ↑ "1991 Nandi awards". awardsandwinners.com. Archived from the original on 16 April 2016. Retrieved 24 November 2016.
- ↑ "1990 Nandi Awards". awardsandwinners.com. Awards & Winners. Archived from the original on 15 July 2015. Retrieved 24 November 2016.
- ↑ "ఆ రూమర్ వచ్చాక... సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నటి యమున". telugu.webdunia.com. Webdunia. Archived from the original on 24 నవంబరు 2016. Retrieved 24 November 2016.
- ↑ Bojja, Kumar. "వ్యభిచారంలో ఇరికించారు, చనిపోవాలనుకున్నా: నటి యమున అంతరంగం, కన్నీళ్లు..." filmibeat.com. Filmibeat. Archived from the original on 24 November 2016. Retrieved 24 November 2016.
- ↑ "Yamuna back on the big screen". bangaloremirror.indiatimes.com. BangaloreMirror. Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 27 September 2016.
- ↑ Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]