Jump to content

ఉదయం (పత్రిక)

వికీపీడియా నుండి
ఉదయం దినపత్రిక వ్యవస్థాపకుడు దాసరి నారాయణరావు చిత్రం

ఉదయం దినపత్రిక 1984 సంవత్సరంలో సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత దాసరి నారాయణరావు ప్రారంభించారు.

ఉదయం పత్రికను తారక ప్రభు పబ్లికేషన్స్ సంస్థ ప్రచురించేది. దీనికి దాసరి నారాయణరావు ఛైర్మన్, రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకుడుగా కొద్ది సంవత్సరాలు పనిచేసాడు. ఇది హైదరాబాదు, విజయవాడ నుండి ప్రచురించబడేది. ఉదయం పత్రిక ప్రారంభించిన ఒక నెల తర్వాత 2,24,000 ప్రతులతో ఆంధ్రప్రదేశ్, దినపత్రిక రంగంలో రెండవ స్థానంలో నిలచింది.[1] ప్రసాద్ తరువాత కె.రామచంద్రమూర్తి, కె.ఎన్.వై.పతంజలి పత్రికను నిర్వహించారు.

1991లో మాగుంట సుబ్బరామిరెడ్డి ఉదయం పత్రికను కొన్నారు. గజ్జెల మల్లారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, తరువాత కె.రామచంద్రమూర్తి ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కార్మిక సమస్యలు తలెత్తి పత్రిక మూతపడింది.[2]

ప్రత్యేకతలు

[మార్చు]
  • అప్పటికి అత్యధికంగా అనగా రెండు లక్షల కాపీలతో పత్రిక ప్రారంభమైంది.
  • ఉదయంలో సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రచురించబడిన కొన్ని 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టులు' చాలా ప్రాచుర్యం పొందాయి.
  • హైదరాబాదు నగరం కోసం ప్రత్యేకంగా టాబ్లాయిడ్ ప్రచురించడం మొదలుపెట్టినది.
  • విద్యార్థుల కోసం వెలువరించిన అనుబంధం "దిక్సూచి" చాలా ప్రసిద్ధమైంది.

మూలాలు

[మార్చు]
  1. December 2, Amarnath K. Menon; March 15, 2013 ISSUE DATE:; March 5, 1985UPDATED:; Ist, 2014 17:20. "In one month, Telugu daily Udayam touches remarkable circulation figure of 2,24,000". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-07-19. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "పత్రికారంగంలో కొత్త 'ఉదయం'". Sakshi. 2017-05-31. Retrieved 2020-07-19.

వెలుపలి లంకెలు

[మార్చు]