గూడూరు (నెల్లూరు)
వికీపీడియా నుండి
| ?గూడూరు,నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| దూరాలు • నెల్లూరు నుండి • తిరుపతి నుండి • చెన్నై నుండి |
• 45 కి.మీలు ద (భూమార్గం) • 95 కి.మీలు ఈ (భూమార్గం) • 120 కి.మీలు ఉ (భూమార్గం) |
| ముఖ్య పట్టణము | గూడూరు,నెల్లూరు |
| ప్రాంతం | కోస్తా |
| జిల్లా(లు) | నెల్లూరు |
| గ్రామాలు | 23 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
114,356 (2001) • 56814 • 57542 • 67.48 • 74.77 • 60.31 |
| మునిసిపల్ కమీషనర్ | |
| శాసన సభ ప్రతినిధి | |
| కోడులు • టెలీఫోను • వాహనం |
• +08624 • ఎపి-26 |
గూడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. గూడూరు పట్టణం నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, అభ్రకం(మైకా) ప్రధానమైనవి. గూడూరు పట్టణం రాష్ట్రంలోని అతిముఖ్యమైన రైల్వేజంక్షన్ లలో ఒకటి. గూడూరు పట్టణ జనాబా సుమారు 1,10,000.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి దేవాలయము చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ది చెందినదట. శాతవాహనులు, పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు మరియు వెంకటగిరి సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.
[మార్చు] వాణిజ్యం
[మార్చు] నిమ్మకాయలు
నిమ్మకాయలు ఇక్కడ ప్రధానమైన ఉత్పత్తి. గూడూరు చుట్టుప్రక్కల నిమ్మకాయల పంట విస్తారంగా సాగులో ఉంది. ఇక్కడి నుండి నిమ్మకాయలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేయబడతాయి.
[మార్చు] అభ్రకం(మైకా)
కొంతకాలం కింద వరకూ ఇక్కడి మైకా గనులు కూడా వ్యాపారంలో ప్రముఖ పాత్ర వహించాయి. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాలలో కలవు. ఇక్కడి మైకా గనులు 1,000 చ.అ. విస్తీర్ణంలో కలవు. ఇక్కడ ముస్కోవైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, వెర్మిక్యులైట్ రకముల మైకా లభిస్తుంది.
[మార్చు] రొయ్యల సాగు
గూడూరు పరిసర ప్రాంతాలలో రొయ్యల సాగు ఒక ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడి రొయ్యలు వివిధ దేశాలకు ఎగుమతి చేయబడతాయి.
[మార్చు] రవాణా సౌకర్యాలు
[మార్చు] రహదారి మార్గము
గూడూరు పట్టణం చెన్నై - కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై - నెల్లూరు నగరాల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, తిరుమల, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.
[మార్చు] రైలు మార్గము
గూడూరు జంక్షన్ చెన్నై - విజయవాడ రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి. తిరుపతి కి నేరుగా రైలు దొరకనప్పుడు చెన్నై మార్గంలో రైలు ఎక్కి గూడూరులో దిగితే స్టేషను బయటే తిరుపతి, తిరుమల లకు నేరుగా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం, కన్యాకుమారి .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు.
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం గూడూరు శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] ఆలయములు
- శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం
- శ్రీ అళగనాధ స్వామి ఆలయం
- శ్రీ ప్రసన్న వేంకటేశ్వర ఆలయం
- శ్రీ కృష్ణ ధర్మరాజ స్వామి ఆలయం
- శ్రీ కోదండరామాలయం
- శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం
- శ్రీ మూలస్థానేశ్వర ఆలయం
- శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం
- శ్రీ షిర్డి సాయిబాబా ఆలయం
- జైన దేవాలయం
[మార్చు] విద్యాలయాలు
గూడూరు పట్టణంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలు కలవు.నాలుగు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కలవు అవి. శ్రీ కరుణామయి ఢిగ్రీ కళాశాల, శ్రీ స్వర్ణాంధ్రభారతి ఢిగ్రీ కళాశాల, ఎస్.వి.ఆర్ట్స్ ఢిగ్రీ కళాశాల, విద్యాలయ ఢిగ్రీ కళాశాల.
పట్టణంలో రెండు ఇంజనీరింగ్ కళాశాలలు కలవు. నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల. ఇవి కాకుండా అనేక ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు ,పాఠశాలలు కలవు.
[మార్చు] మండలంలోని పట్టణాలు
[మార్చు] గ్రామాలు
- అయ్యవారిపాలెం
- చెమిద్తి
- చెన్నూరు - I
- చెన్నూరు - II
- తూర్పు గూడూరు (r)
- గొల్లపల్లె
- కందలి
- కండ్ర
- కొమ్మనేటూరు
- కొండగుంట
- కుందకూరు
- మంగలాపూరు
- మేకనూరు
- మిట్టాత్మకూరు
- ఎన్.ఎస్.స్వామి ఖండ్రిక (నిర్జన గ్రామము)
- నెల్లటూరు
- నెర్నూరు
- పాలిచెర్ల
- పాలిచెర్లరాజుపాలెం
- రెడ్డిగుంట
- వేడిచెర్ల
- వెందోడు
- విందూరు
- పశ్చిమ గూడూరు (r)
|
|||||||