తమలపాకు
వికీపీడియా నుండి
| తమలపాకు | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
తమలపాకు.
|
|||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Piper betle లిన్నేయస్ |
|||||||||||||||
|
|
తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు.
[మార్చు] ఉపయోగాలు
- తమలపాకులను పూజ చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.
- తాంబూలములో ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూలసేవనము మన సంప్రదాయం.
- తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
- శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.
- తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.
- తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
- అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.