తెలుగు పద్యము
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| పద్య విశేషాలు |
|---|
| వృత్తాలు |
| ఉత్పలమాల, చంపకమాల |
| మత్తేభం, శార్దూలం |
| తరళం, తరలము |
| తరలి, మాలిని |
| మత్తకోకిల |
| జాతులు |
| కందం, ద్విపద |
| తరువోజ |
| అక్కరలు |
| ఉప జాతులు |
| తేటగీతి |
| ఆటవెలది |
| సీసము |
పద్యము తెలుగు కవితా రచనలో ఒక విధానము. పురాతన తెలుగు రచనలు ఎక్కువగా పద్యరూపంలోనే ఉన్నాయి. పద్యంలోని ముఖ్య లక్షణం ఛందస్సు
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.
సీ.
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్తమే రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల.
- పోతన భాగవతము నుండి
కం.
పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామ భద్రుండట ;నే
పలికిన భవహర మగునట
పలికెద; వేరొండు గాథ పలుకగ నేలా!
- పోతన భాగవతము నుండి.
తే.గీ.
భరత ఖండంబు చక్కని పాడి యావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి.
-చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు.
చం.
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్
- పెద్దన మనుచరిత్రము నుండి.
ఆ.వె.
తెలు గదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలు గొకండ;
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స.
-శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద నుండి.