బూర్గుల రామకృష్ణారావు
| బూర్గుల రామకృష్ణారావు | |
బూర్గుల రామకృష్ణారావు |
|
| జననం | 1899 మార్చి 13 మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం, పడకల్ గ్రామం |
|---|---|
| మరణం | 1967 సెప్టెంబర్ 14 |
| నివాసం | మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం, పడకల్ గ్రామం |
| ఇతర పేర్లు | బూర్గుల రామకృష్ణారావు |
| ప్రాముఖ్యత | స్వాతంత్ర్య సమర యోధుడు,కవి,రచయిత |
| వృత్తి | మొదటి హైదరాబాద్ రాష్ట్రముఖ్యమంత్రి(1952) కేరళ గవర్నర్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ బహుభాషావేత్త స్వాతంత్ర్య సమరయోధుడు రచయిత న్యాయవాది |
| పదవి | డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డాక్టర్ ఆఫ్ లాస్ |
| తండ్రి | నరశింగరావు |
| తల్లి | రంగనాయకమ్మ |
బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు.
విషయ సూచిక |
బాల్యం, విద్యాభ్యాసం [మార్చు]
రామకృష్ణారావు 1899 మార్చి 13న రంగనాయకమ్మ, నరసింగరావులకు మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం లోని పడకల్ గ్రామంలో జన్మించాడు. ఇంటిపేరు పుల్లంరాజు. అయితే తన స్వగ్రామమైన బూర్గుల పేరుమీదుగా రామకృష్ణారావు బూర్గుల అని ప్రసిద్ధుడై, బూర్గుల ఆయన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. తండ్రి వద్ద తెలుగు, ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు భాషలు నేర్చుకున్నాడు. హైదరాబాదు లోని ధర్మవంత్ పాఠశాలలోను, నిజాం కాలేజీలోను ఆయన విద్యాభ్యాసం సాగింది. నిజాం కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో ప్రథముడిగా వచ్చి వాకర్ మెడల్ను గెలుచుకున్నాడు. తరువాత పూనా (పుణె) ఫెర్గుసన్ కాలేజీలో బి.ఏ. చదివాడు. అక్కడ మరాఠీ నేర్చుకున్నాడు. తరువాత బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. చదివాడు.
రాజకీయ జీవితం [మార్చు]
1912లో వివాహం జరిగింది. ఆమె 1920లో మరణించడంతో, 1924లో మళ్ళీపెళ్ళి చేసుకున్నాడు. 1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నాడు. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నాడు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసాడు. కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.
హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టి తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అద్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. 1948 లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.[1]
1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యాడు. పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలోనూ సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు.[2] 1956లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అయినపుడు, కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. బూర్గుల, కేరళ రాష్ట్రానికి గవర్నరుగా వెళ్ళాడు. 1960 వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత 1962 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు.
1967 సెప్టెంబర్ 14న బూర్గుల మరణించాడు.
సాహితీ వ్యాసంగం [మార్చు]
బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. పారశీక వాఞ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం మొదలైనవి ఆయన ఇతర రచనలు.
పురస్కారాలు [మార్చు]
- 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవపట్టాను ప్రదానం చేసింది.
- 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ అనే పట్టాను ఇచ్చింది.
మూలాలు, వనరులు [మార్చు]
- అమరావతి పబ్లికేషన్సు వారి తెలుగు వెలుగులు పుస్తకం
| ఇంతకు ముందు ఉన్నవారు: ఎం కె వెల్లోడి |
హైదరాబాదు రాష్ట్రం ముఖ్యమంత్రి 06/03/1952—31/10/1956 |
తరువాత వచ్చినవారు: నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ |
|
||||||||||||||||||||||||||||||||||
|
||||||||