Jump to content

కౌతరం

అక్షాంశ రేఖాంశాలు: 16°20′5.568″N 81°4′41.304″E / 16.33488000°N 81.07814000°E / 16.33488000; 81.07814000
వికీపీడియా నుండి
(కౌత్రం నుండి దారిమార్పు చెందింది)
కౌతరం
పటం
కౌతరం is located in ఆంధ్రప్రదేశ్
కౌతరం
కౌతరం
అక్షాంశ రేఖాంశాలు: 16°20′5.568″N 81°4′41.304″E / 16.33488000°N 81.07814000°E / 16.33488000; 81.07814000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంగుడ్లవల్లేరు
విస్తీర్ణం13.44 కి.మీ2 (5.19 చ. మై)
జనాభా
 (2011)
7,170
 • జనసాంద్రత530/కి.మీ2 (1,400/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,564
 • స్త్రీలు3,606
 • లింగ నిష్పత్తి1,012
 • నివాసాలు2,013
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521331
2011 జనగణన కోడ్589613

కౌతరం, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన గుడ్లవల్లేరు నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2013 ఇళ్లతో, 7170 జనాభాతో 1344 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3564, ఆడవారి సంఖ్య 3606. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1664 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 233. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589613[2].

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి గుడ్లవల్లేరులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల గుడ్లవల్లేరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్‌ గుడ్లవల్లేరులోను, మేనేజిమెంటు కళాశాల గుడివాడలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల గుడ్లవల్లేరులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.శ్రీ కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల వజ్రోత్సవాలు 2016, ఆగష్టు-14వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించెదరు. [14]

చెక్ పోస్ట్ వద్దనున్న ఉర్దూ ప్రాథమిక పాఠశాల.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కౌతరంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కౌతరంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కౌతరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 262 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1080 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1080 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కౌతరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1080 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కౌతరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బియ్యం

సమీప గ్రామాలు

[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

గ్రామానికి రైలు సౌకర్యాలు

[మార్చు]

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 56 కి.మీ

రైలు వసతి

[మార్చు]

గ్రామంలో ఇతర మౌలిక వసతులు

[మార్చు]

గ్రామీణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

[మార్చు]

1908, ఫిబ్రవరి-11వ తేదీన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రిజిష్టరు కాబడిన ఈ సంఘం, 106 సంవత్సరాల చరిత్ర, బియ్యం మిల్లు నిర్వహణ, ధాన్యం నిలవలకు గోదాములు, రైతులకు ఎరువుల సరఫరా, గ్రామస్థుల నగదు, బంగారు నగల భద్రతకు లాకర్ల వ్యవస్థ, 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సభ్యులకు డివిడెండ్లు, ఈ సంఘానికి ప్రత్యేకం. జిల్లాలోని పురాతన సొసైటీలలో ఒకటిగా, దశాబ్దాలుగా నిరంతర డివిడెండ్లను పంచే ఏకైక సంఘంగా వినుతికెక్కినది. [6]

గ్రామ పంచాయతీ

[మార్చు]

పద్మాలపాలెం, కౌతరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013 జూలైలో కౌతరం గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి పడమట సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [8]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ వరసిద్ధివిఘ్నేశ్వరస్వామివారి ఆలయం:ఈ ఆలయం కౌతరం-సీతపేటలో ఉంది.

  • శ్రీ మరిడి మహాలక్షి అమ్మవారి ఆలయం:కౌతరం గ్రామంలోని ఈ పురాతన ఆలయంలో, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో శుక్ల పక్షంలో, పది రోజులపాటు అమ్మవారి వార్షిక వేడుకలు కన్నుల పండువగా నిర్వహించెదరు. ఈ పదిరోజులూ, అమ్మవారికి రోజుకొక అలంకారంతో గ్రామస్థులు పూజాదికాలు నిర్వహించెదరు. చివరి రోజున గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల భక్తులు, సంప్రదాయానుసారం, మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మొక్కుబడుల నేపథ్యంలో ప్రతి ఇల్లూ, ఆడబడుచులు, పిల్లా పాపలతో కళకళలాడుతుంది. ఈ ఉత్సవాలకొరకు సుదూర ప్రాంతాల నుండి బంధువులు, గ్రామస్థులు తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అమ్మవారి ఎదుట అన్న కుంభరాశి పోసి, పూజాధికాలు నిర్వహించెదరు. మహిళలు పంచభక్ష్య పరమాన్నాలను అమ్మవారికి సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటారు. ముత్తైదువలు సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. ఘటం, పోతురాజుల గడతో గ్రామోత్సవం నిర్వహించెదరు. 11 రోజులుగా అమ్మవారికి నవాలంకరణలు చేసి భక్తిశ్రద్ధలతో పూజాదికాలు చేసిన భక్తులు సంప్రదాయానుసారం, అమ్మవారిని ఊరిపొలిమేరలలో విడిచి వచ్చెదరు. కొలుపుల జాతరగా పిలిచే ఈ ఉత్సవాల పరిసమాప్తితో ఆలయం నుండి అమ్మవారిని భుజాలపై ఎత్తుకొని వీధులలో గ్రామోత్సవం నిర్వహించెదరు. మళ్ళీ 12 సంవత్సరాలకు గ్రామానికి రావాలంటూ గ్రామ పొలిమేర పసుభట్లపాలెంలోని ఊరిచివర డొంక పొలాల గట్టున అమ్మవారిని విడిచి పెడతారు. మట్టితో చేసిన అమ్మవారి ప్రతిమ కాలానుగుణంగా ప్రకృతిలో కలిసిపోయి పంచభూత రూపాలుగా గ్రామాన్ని కాపాడుతుందని గ్రామస్థుల విశ్వాసం. దీనితో ఉత్సవాలు పరిసమాప్తి చెందుతవి. [3], [4] & [5]

శ్రీ గౌతమేశ్వరస్వామివారి ఆలయం:ఈ ఆలయానికి మొత్తం మూడుచోట్ల 8.83 ఎకరాల మాన్యం భూమి ఉంది. [12]ఈ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలను పురస్కరించుకొని, 2016, మే-21వ తేదీ శనివారం, వైశాఖపౌర్ణమినాడు, స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. [13]

  • శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:గ్రామంలోని ఒకటవ వార్డులోని ఈ ఆలయ అభివృద్ధి, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు మహిళలే నిర్వహించుచున్నారు.ఈ ఆలయంద్వారా పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను దత్తత తీసుకొని చదివించుచున్నారు. ఈ పథకానికి దాతల విరాళలను గూడా స్వీకరించుచున్నారు. [7] ఈ ఆలయ 17వ వార్షికోత్సవాన్ని, 2016, జనవరి-29వ తేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాకు ప్రతేక ఫలరసాల అభిషేకాలు, విశేష పూజాధికాలు నిర్వహించారు. పెద్ద యెత్తున ప్రసాదాలు పంపిణీ చేసారు. [10]
  • శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం
  • శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం:స్థానిక 1వ వార్డు పరిధిలో ఉన్న ఈ ఆలయంలో, 2015, ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు, నెయ్యల సంఘీయులు, శ్రీ కనకదుర్గమ్మ తల్లి 40వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ వర్గీయులు, శ్రావణమాసంలో ఒక అదివారంనాడు, అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అమ్మవారి భారీప్రభతో కనకతప్పెట్లు, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాల ప్రదర్శన నిర్వహించారు. కౌతరం, కూరాడ, గుడ్లవల్లేరు గ్రామాలలో ప్రభను ఊరేగించారు. [9]

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం:ఈ ఆలయానికి మొత్తం మూడుచోట్ల 10.10 ఎకరాల మాన్యం భూమి ఉంది. [12]ఈ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలను పురస్కరించుకొని, 2016, మే-21వ తేదీ శనివారం, వైశాఖపౌర్ణమినాడు, స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. [13]

శ్రీ సీతారామాలయం:కౌతవరం గ్రామానికి శివారు గ్రామం పద్మాలపాలెం గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని, నాయీ బ్రాహ్మణ సంఘీయుల ఆధ్వర్యంలో, రెండు సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయం ప్రముఖ వేమవరం శ్రీ కొండలమ్మ ఆలయానికి ప్రక్కనే ఉంది. [11]

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]
నార్ల తాతారావు : కౌతవరం గ్రామంలో 1917 జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్.విద్యుత్తురంగ నిపుణుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7927. ఇందులో పురుషుల సంఖ్య 4002, స్త్రీల సంఖ్య 3925, గ్రామంలో నివాసగృహాలు 2120 ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013, జూన్-18; 13వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, మే-10; 15వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014, మే-12; 7వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014, మే-13; 16వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2014, డిసెంబరు-10; 9వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, జూన్-26; 31వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015, జూలై-25; 25వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015, ఆగష్టు-31; 25వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2016, జనవరి-30; 26వపేజీ. [11] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, ఫిబ్రవరి-17; 3వపేజీ. [12] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, మే-12; 1వపేజీ. [13] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, మే-22; 1వపేజీ. [14] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, ఆగష్టు-14; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కౌతరం&oldid=4252979" నుండి వెలికితీశారు