క్రిష్ణగిరి (తమిళనాడు)
Krishnagiri District கிருட்டினகிரி மாவட்டம் Kiruttinakiri Mavattam | |
---|---|
District | |
![]() Location in Tamil Nadu, India | |
Country | ![]() |
State | తమిళనాడు |
Division | krishnagiri |
Municipal Corporations | Krishnagiri |
Headquarters | krishnagiri |
Talukas | Krishnagiri |
ప్రభుత్వం | |
• Collector | T. P. Rajesh IAS |
Languages | |
• Official | Tamil |
ప్రామాణిక కాలమానం | UTC+5:30 (IST) |
PIN | 635xxx |
Telephone code | 04343 |
ISO 3166 కోడ్ | [[ISO 3166-2:IN|]] |
వాహనాల నమోదు కోడ్ | TN-24,TN-70[1] |
Largest city | Hosur |
Largest metro | Hosur |
Central location: | 12°31′N 78°12′E / 12.517°N 78.200°E |
జాలస్థలి | krishnagiri |
విషయ సూచిక
పేరువెనుక చరిత్ర[మార్చు]
క్రిష్ణ అనేది నలుపు అనే మాటకు పర్యాయపదం. నల్లటి గిరులు ఉన్నాయి కనుక ఇది క్రిష్ణగిరి అయింది. క్రిష్ణగిరిలో నల్లని గ్రానైటు గనులు అత్యధికంగా ఉన్నాయి. అంతేగాక ఈ ఉరు క్రిష్ణదేవరాయలు పాలనలో భాగంగా ఉంటూ వచ్చింది. కృష్ణదేవరాయలు మరణానంతరం ఈ ఊరికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు.[3]
భౌగోళికం & వాతావరణం[మార్చు]
క్రిష్ణగిరి జిల్లా వైశాల్యం 5143 చదరపు మైళ్ళు. క్రిష్ణగిరి జిల్లా తూర్పు సరిహద్దులో వేలూరు మరియు తిరువణ్ణామలై జిల్లాలు, పడమర సరిహద్దులో కర్నాటక రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ మరియు రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో ధర్మపురి జిల్లాలు ఉన్నాయి. క్రిష్ణగిరి జిల్లా సముద్రమట్టానికి 300-1400 మీటర్ల ఎత్తులో ఉపస్థితమై ఉంది. ఇది ఉత్తరంగా 11°12' -12° 49' అక్షాశం, తూర్పుగా 77° 27' E -78° 38' రేఖంశంలో ఉపస్థితమై ఉంది.
తాలూకా హెడ్‌క్వార్టర్ | అక్షాంశం (N) | రేఖాంశం (E) |
---|---|---|
క్రిష్ణగిరి తాలూకా | 12o32’44” | 78o13’36” |
పొళ్ళాచ్చి తాలూకా | 12o20’ | 78o22’ |
ఉతంగిరి తాలూకా | 12o15’ | 78o33’ |
హోసూరు తాలూకా | 12o48’ | 77o50’23” |
డెంకని కోట్టై తాలూకా | 12o02’ | 77o47’ |
వర్షపాతం[మార్చు]
క్రిష్ణగిరి పర్వతాలతో నిండిన భూభాగం కలిగిన జిల్లా. మైదానభూభాగంలో దక్షిణ పెన్నా నది జాలాలతో పంటలు పండిస్తున్నారు. జిల్లాలోని తూర్పు భూభాభాగం వేడివాతావరణం, పడమర భూభాభాగం విభిన్నంగా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిఉంది. వార్షిక వర్షపాతం 830 మిల్లీమీటర్లు ఉంటుంది. జూన్ మాసంలో వేసవి, జూలై మాసలో వర్షాలు, డిసెనర్- ఫిబ్రవరి వరకు చలిఉంటుంది.
సంవత్సరం | వర్షపాతం (మిల్లీమీటర్లు) |
---|---|
2001–2002 | 825.700 |
2002–2003 | 521.600 |
2003–2004 | 1075.600 |
2004–2005 | 230.620 |
2005–2006 | 1262.800 |
భూవివరణ[మార్చు]
మొత్తం పంటభూమి, నీటిపారుదల, వైవిధ్యమైన పంటలు పండిస్తున్న భూమి, సారవంతమైన భూమి, చిత్తడినేలలు మరియు అరణ్యం.
వర్గీకరణ | భూభాగం. | శాతం |
---|---|---|
అరణ్యం | 202409 | 39% |
బీడు | 24194 | 5% |
వ్యవసాయేతర ఉపయోగం | 21466 | 4% |
సారవంతమైన భూమి | 6341 | 1% |
సతతహరిత భూమి | 7378 | 1% |
విద్యారంగం[మార్చు]
క్రిష్ణగిరి జిల్లాలో ప్రభుత్వనిర్వహణలో నడుస్తున్న కమ్యూనిటీ పాలిటెక్నిక్ ఉంది. అంతేకాక తమిళనాడు ఆది ద్రావిడర్ హౌసింగ్ డెవలెప్మెంటు కార్పొరేషన్ నర్సింగ్ మరియు కేటరింగ్ ఒకేషనల్ ట్రైనింగ్ కోర్సులను చదవడానికి అవకాశం కలిగిస్తుంది. ఈ కోర్సులను ప్రైవేట్ శిక్షణా సంస్థద్వారా షెడ్యూల్డ్ జాతి మరియు షేడ్యూల్డ్ తెగల ప్రజలకు శిక్షణ అందిస్తుంది. అలాగే పారిశుధ్యకార్మికులకు కూడా ఈ శిక్షణకు అవకాశం ఇస్తుంది.
అలాగే క్రిష్ణగిరి జిల్లాలో ప్రభుత్వం ఈ క్రింది విద్యా సంస్థలను నిర్వహిస్తుంది.
సంఖ్య. | |
---|---|
ప్రాథమిక పాఠశాలలు | 988 |
మాధ్యమిక పాఠశాలలు | 107 |
ఉన్నత పాఠశాలలు | 113 |
హయ్యర్ సెకండరీ పాఠశాలలు | 72 |
వృత్తివిద్యా శిక్షణా సంస్థలు | 5 |
సంగీత పాఠశాలలు | 1 |
ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలలు | 2 |
పాలిటెక్నిక్ | 4 |
ఇంజనీరింగ్ కాలేజ్ | 5 |
ఆర్ట్స్& సైన్సు కాలేజ్ | 8 |
ఆర్ధికరంగం[మార్చు]
- క్రిష్ణగిరి జిల్లా మామిడికాయలకు ప్రసిద్ధిచెందింది. అలాగే క్రిష్ణగిరి జిల్లా గ్రానైట్ పరిశ్రమకు కూడా ప్రసిద్ధిచెందినది. జిల్లా అంతటా క్వారీలు మరియు ప్రొసెసింగ్ యూనిట్లు విస్తరించి ఉన్నాయి. హోసూరు జిల్లాలో అత్యధికంగా పారిశ్రమికంగా అభివృద్ధిచేయబడింది.
- తమిళనాడు రాగి పంటలో 40% క్రిష్ణగిరి జిల్లాలో ఉత్పత్తి చేయబడడం ప్రత్యేకత.[4]
వ్యవసాయం[మార్చు]
క్రిష్ణగిరి జిల్లాలో ప్రధాన పంట వ్యవసాయం వరి, మొక్కజొన్నలు, బనానా, చెరకు, కాటన్, చింతపండు, కొబ్బరి, మామిడి, వేరుశనగ, కూరగాయలు మరియు పూలతోటలు. వ్యవసాయ వాణిజ్యానికి క్రిష్ణగిరి అనుకూలమైనది. " రిఒజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్శిటీ " 18.5 హెక్టార్ల వైశాల్యంలో 1973 నుండి కావేరిపట్నం యూనియన్‌లో శక్తివంతంగా నిర్వహించబడుతుంది. ఆధునిక వ్యవసాయంలో రైతులకు సహకరించడానికి ఈ సంస్థ కృషిచేస్తుంది. ఈ సంస్థ పరిశోధనల ద్వారా హైబ్రీడు విత్తనాలను ఉత్పత్తిచేస్తుంది. ఈ విత్తనాలు నాణ్యమైన పంటను అత్యధికమైన పంటను అందిస్తుంది.
ఉత్పత్తి | వైశాల్యం (ఎకరాలు) |
---|---|
వడ్లు | 20,687 |
రాగి | 48,944 |
ఇతర చిరు ధాన్యాలు | 11,937 |
పప్పులు | 48,749 |
చెరకు | 50,000 |
మామిడిపండ్లు | 30,017 |
కొబ్బరి | 13,192 |
చింతపండు | 1,362 |
ఇతరపంటలు | 43,199 |
పశుపోషణ మరియు చేపల పెంపకం[మార్చు]
చేపల పెంపకం
2007 జూలై 15 గణాంకాలను అనుసరించి చేపల పెంపకం వివరణ.
రిజర్వాయర్ పేరు | టార్గెట్ (ఎం.టి) | సాధన | ఆదాయం (రూపాయలు) | లాభపడిన మత్స్యకారులు / మొత్తం |
---|---|---|---|---|
క్రిష్ణగిరి ఆనకట్ట | 51.0 | 6.810 | 4844 | 23/4844 |
పాంబరు ఆనకట్ట | 30 | 2.018 | 13570 | 16/13570 |
కేలవర్పళ్ళి ఆనకట్ట | 29.0 | 15.110 | 95387 | 30/95387 |
బారూరు సరసు | 284.0 | 17.600 | 124600 | 37/124600 |
చిన్నారు ఆనకట్ట | 6.8 | 0.931 | 10410 | 5/10410 |
మైలు రావణన్ సరసు | 3.0 | 0.164 | 820 | 1/820 |
రామనాయకన్ సరసు | 4.0 | 0.273 | 2305 | 1/2305 |
పశుపోషణ[మార్చు]
2006-2007 గణాంకాలను అనుసరించి క్రిష్ణగిరి జిల్లా పశుపోషణ ఆదాయవివరణ.
వర్గీకరణ | అందుకున్న ఆదాయం |
---|---|
పాలు | 24,94,926 |
గుడ్లు | 3,88,192 |
పోర్క్ | 1,54,496 |
పశువుల అమ్మకం | 4,21,578 |
మిగిలినవి | 13,55,244 |
కృత్రిమ గర్భధారణ | 5,79,898 |
ఎల్.ఎన్ 2 (నత్రజని ద్రావణం) | 1,27,819 |
మొత్తం ఆదాయం | 55,22,153 |
ప్రయాణసౌకర్యాలు[మార్చు]
The following major roads pass through Krishnagiri
రహదారులు[మార్చు]
ఆరంభం/ముగింపు | జాతీయరహదారి నంబర్. | కిలోమీటర్లు |
---|---|---|
కన్యాకుమారి- వారణాసి | 7 | 2460 |
క్రిష్ణగిరి-రాణిపేట | 46 | 144 |
పాండిచ్చేరి-క్రిష్ణగిరి | 66 | 214 |
క్రిష్ణగిరి-మదనపల్లి | 219 | 175 |
సర్జాపూర్–బగలూర్–హోసూర్ | 207 | 40 |
రైలుమార్గాలు[మార్చు]
సేలం, బెంగుళూరు బ్రాడ్‌గేజి మార్గం హోసూరు గుండా నిర్మించబడింది. హోసూరు మరియు జోలార్‌పేట రైలు మార్గం క్రిష్ణగిరి మార్గం మీదుగా నిర్మితమై ఉంది. హోసూరు లోని పారిశ్రామిక అభివృద్ధికి సహకరించేలా ఈ మార్గం మరింతగా అభివృద్ధిపనులు కొనసాగుతున్నాయి. ఈ మార్గం క్రిష్ణగిరిని చెన్నై మరియు దాని నౌకాశ్రయాలతో చక్కగా అనుసంధానిస్తుంది.సరికొత్త ఆర్థికప్రణాళికా నివేదికలు ఈ రైలు మార్గ నిర్మాణం జోలార్‌పేట మరియు తిరుపత్తూరు మద్య ఈ మార్గ నిర్మాణపు పనులు మొదలైయ్యాయని తెలుస్తుంది. ఒది కందిలి, క్రిష్ణగిరి చోళగిరిరి లను అనుసంధానిస్తూ నిర్మించబడుతూ ఉంది. 104 కిలోమీటర్ల పొడవున నిర్మించబడిన ఈ మార్గం రాయకోట్టై మార్గంలో కలుపబడుతుంది.
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ www.tn.gov.in
- ↑ (Excel)
|format=
requires|url=
(help). Cite web requires|website=
(help); Missing or empty|title=
(help); Missing or empty|url=
(help) - ↑ "Krishnagiri Etymology". District Admin., Krishnagiri. Cite web requires
|website=
(help) - ↑ http://www.tn.gov.in/deptst/agriculture.pdf