గణపవరం(ప.గో)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గణపవరం(ప.గో)
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో గణపవరం(ప.గో) మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో గణపవరం(ప.గో) మండలం యొక్క స్థానము
గణపవరం(ప.గో) is located in ఆంధ్ర ప్రదేశ్
గణపవరం(ప.గో)
ఆంధ్రప్రదేశ్ పటములో గణపవరం(ప.గో) యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°42′00″N 81°28′00″E / 16.7000°N 81.4667°E / 16.7000; 81.4667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము గణపవరం(ప.గో)
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 99.95 km² (38.6 sq mi)
జనాభా (2001)
 - మొత్తం 66,656
 - సాంద్రత 247.104/km2 (640/sq mi)
 - పురుషులు 33,478
 - స్త్రీలు 33,178
అక్షరాస్యత (2001)
 - మొత్తం 78.18%
 - పురుషులు 82.49%
 - స్త్రీలు 73.83%
పిన్ కోడ్ {{{pincode}}}
గణపవరం(ప.గో)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం గణపవరం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 12,384
 - పురుషుల సంఖ్య 6,099
 - స్త్రీల సంఖ్య 6,285
 - గృహాల సంఖ్య 3,098
పిన్ కోడ్ - 534198
ఎస్.టి.డి కోడ్ 08818

గణపవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల ఊరు. ఈ మండలం భీమవరం నుండి పదిహేను కిలోమీటర్లు మరియు తాడేపల్లి గూడెం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతావనికి ఆంధ్రరాష్ట్రం ధాన్యాగారం అయితే ఈ ప్రాంతం ఆంధ్రరాష్ట్రానికి ధాన్యాగారం అనేవారు. గణపవరాన్ని రైసుమిల్లుల పట్టణంగా వ్యవహరించేవారు. ఒకప్పటి రైసు మిల్లుల పట్టణం ఇప్పుడు మంచినీటి చేపల రొయ్యల పెంపకానికి కేంద్రంగా మారిపోయింది.

దేవాలయాలు[మార్చు]

గ్రామ దేవత మారెమ్మ దేవాలయం. సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవాలయము. పెద్ద వీధిలో ఆంజనేయస్వామివారి దేవాలయములు ఉన్నాయి. గ్రామదేవత మారెమ్మ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద వీధిలో కల ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల స్వామివారి విగ్రహం అతి భారీ ఎత్తులో పెద్దగా ఉంటుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గణపవరం గ్రామానికి పూర్వనామం పద్మినీపురం. ఈ పద్మినీపురానికి గతంలో కొలని ప్రభువులు ముఖ్యపట్టణంగా చేసుకుని పరిపాలించేవారని, వారి పేరుమీదుగానే దీనికి ఆ పేరు వచ్చిందని గ్రామనామాలపై పరిశోధించిన జి.ఆర్.వర్మ భావిస్తున్నారు.[1]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12384.[2] ఇందులో పురుషుల సంఖ్య 6099, మహిళల సంఖ్య 6285, గ్రామంలో నివాసగృహాలు 3098 ఉన్నాయి.

 1. పిల్లలు: 1,417(మొత్తం 6 సం. లోపు)
  1. బాలురు: 688
  2. బాలికలు: 729

కళాశాలలు[మార్చు]

 • S.Ch.V.P.M.R. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్థాపితం 1972)
 • S.C.B.R. ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపితం 1969)

విశేషాలు[మార్చు]

.* ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా రైసుమిల్లులు కలిగిన మండలంగా పేరెన్నిక గలిగి ఉండేది.

 • 1874లో కట్టిన పశ్చిమడెల్టా నీటిపారుదల వ్యవస్థలో ప్రాముఖ్యంగల చిలకంపాడు లాకులు ఉన్నాయి. గత 130 సంవత్సరాలుగా ఈ లాకులు రైతులకు సేవలందిస్తున్నాయి. 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. గణపవరం, పెంటపాడు, నిడమర్రు, ఉండి, ఆకివీడు, కాళ్ళ మండలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఈ లాకుల ద్వారానే అందుతుంది. ప్రస్తుతం ఈ లాకులు కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకొన్నాయి.
 • మరియు గణపవరం మహాలక్ష్మి సినిమా హల్ తెలియనివారు ఉండరనె చెప్పలి.
 • mahalakshmi theatre ganpavaranike oka gurthipu thechindhi.2010 ki mundhu enno theatre lu unna anni konni karanalu valla mutha padayi mariyu endaro prajalu atma viswasanni choragonna maroka theatre kumari kuda e mahdayane open ayyindhi

గణపవరంలో రైసు మిల్లుల స్థితి గతులు[మార్చు]

గణపవరంలో దాదాపు 40 ట్రేడింగ్, నాన్ ట్రేడింగ్ రైస్‌మిల్లులుఉండేవి. జిల్లాలోనే రైస్‌మిల్లింగ్ పరిశ్రమకు ఇది ప్రముఖ కేంద్రంగా వెలిగింది. 2000 నాటికే మొత్తం మిల్లులన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం ఒకే ఒక ట్రేడింగ్ రైస్‌మిల్లు, రెండో మూడో నాన్‌ట్రేడింగ్ ఉండటం గమనార్హం. మిల్లు గోదాములకు అద్దెలకు ఇవ్వగా కొన్ని మిల్లులు విద్యా సంస్థలుగానూ, మరికొన్ని ఐస్ ఫ్యాక్టరీలుగానూ మారాయి. కొన్ని మిల్లులను తొలగించి ఇళ్ల స్థలాలుగా అమ్మివేసారు. క్షణం తీరిక లేకుండా ఉండే రైస్ మిల్లింగ్ పరిశ్రమ దాదాపు కనుమరుగయిపోయింది.

గణపవరానికే పేరు తెచ్చిన రైసు మిల్లుల మూతకు కారణాలు

రైస్ మిల్లులకు లక్ష్యాలు విధించి ముక్కుపిండి లెవీ వసూలు చేయడం తప్ప వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వల్ప వడ్డీపై రుణాలు, ఇతర ప్రోత్సాహకాలు, పన్నుల రాయితీ వంటి సహకారం కోసం ఎదురుచూసినా మిల్లర్లకుఫలితం కనిపించలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కొత్త మిల్లులతో ఇవి పోటీపడలేకపోవడం మరొక కారణమయినది.కొత్త మిషనరీ ఏర్పాటుకు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడి అవసరం కావడం. పాత మిషనరీతో మిల్లింగ్ చేసిన బియ్యానికి విదేశీ మార్కెట్లో డిమాండు లేకపోవడం.కొత్త మిషనరీ ఏర్పాటుకు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడి అవసరం కావడం. పాత మిషనరీతో మిల్లింగ్ చేసిన బియ్యానికి విదేశీ మార్కెట్లో డిమాండు లేకపోవడం. జిల్లాలో ఇతర ప్రాంతాలు, పొరుగునున్న తూర్పుగోదావరి జిల్లాతో పోలిస్తే గణపవరంలో మిల్లింగ్ ఖర్చులు ఎక్కువ కావడం. తాడేపల్లిగూడెంలో బస్తా మిల్లింగ్‌కు 6 రూపాయలు ఖర్చు అవుతుండగా గణపవరంలో 11 రూపాయలు ఖర్చు అవడం. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో ధాన్యం ఉత్పత్తి పెరిగి ఇక్కడి నుండి బియ్యం ఎగుమతి మందగించడం. కుండీలలో నానబెట్టిన బాయిల్డ్ రైస్‌లో క్వాలిటీ లేకపోవడం. మిల్లు తిరిగినా... తిరగకపోయినా మినిమమ్ ఛార్జీ కింద నెలకు 50 వేల రూపాయలు బిల్లు విద్యుత్‌శాఖ వసూలు చేయడం.ఇత్యాది కారణాలతో గణప వరంలో మిల్లుల పరిశ్రమ నాశనమయినది.

మండలంలో సమస్యలు[మార్చు]

శిథిలమవుతున్న లాకులను పునరుద్దరించడం. మిల్లుల మూతతో వలసలు పోతున్న కార్మికులకు జీవనాధారం చూపడం. ఎప్పుడూ గోతులతో ఉండే రహదారులను పటిష్ఠంగా మార్చడం.ganapavaram lo Bobbili vantenaku chala pramukyata unnadi idi pastutam padipoyi punarnirmana disaga unnadi ippude Praja pratinidulu melukoni maro vantena nirmanam chepattalani akanksha.

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి ‘వేంగీ విషయం’లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.  Check date values in: |date= (help)
 2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు