నెక్ టై
టై, లేదా నెక్ టై పశ్చిమ దేశాల్లోని ఫార్మల్ వేర్ లో ఒక భాగం. సాధారణంగా పురుషులు కాలర్ చుట్టూ అలంకార ప్రాయంగా కట్టుకునే రిబ్బను వంటి గుడ్డ. కాలరు విధానం బట్టి టై నాట్ (ముడి) ఉంటుంది. కాలరు వద్దనున్న గుండీని పెట్టుకొన్నచో ఇది ఫార్మల్ వేర్ అవ్వగా, అదే గుండీని విప్పేసి, వదులుగా తగిలించుకొన్నచో ఇది క్యాజువల్ వేర్ అవుతుంది.
టై నాట్ రకాలు
[మార్చు]టై నాట్ లు (ముడులు) ముఖ్యంగా నాలుగు రకాలు. అవి (అతి సులభమైన దాని నుండి అతి కష్టమైన వరుస లో) :
- ఫోర్ ఇన్ హ్యాండ్ (Four in Hand) లేదా క్రావాట్ (Cravat)
- ప్రాట్ (Pratt), షెల్బీ (Shelby) లేదా ప్రాట్-షెల్బీ (Pratt-Shelby)
- హాఫ్ విండ్సర్ (Half Windsor) లేదా సింగిల్ విండ్సర్ (Single Windsor)
- విండ్సర్ (Windsor), ఫుల్ విండ్సర్ (Full Windsor) లేదా డబుల్ విండ్సర్ (Double Windsor)
90వ దశకం ద్వితీయార్థంలో కేంబ్రిడ్జి క్యావెండిష్ ల్యాబొరెటరీకి చెందిన థామస్ ఫింక్, యోంగ్ మావో అనే పరిశోధకులు మ్యాథమ్యాటికల్ మోడలింగ్ అనే పధ్ధతిని ఉపయోగించి సాంప్రదాయిక టైని కట్టుకునే నాట్ లలో ఎనభై ఐదు వివిధ రకాలు సాధ్యపడతాయని కనుగొన్నారు. వీటిని ద ఎయిటీ ఫైవ్ వేస్ టు టై ఎ టై (The 85 Ways to Tie a Tie) అనే పుస్తకంలో ప్రచురించారు. వీటిలో సమరూప, సంతులన యొక్క నాణ్యతలను బట్టి పదమూడింటిని కళాసౌందర్యాత్మక నాట్ లుగా గుర్తించారు. ఈ పుస్తకం ద్వారా, ప్రాచుర్యం ఎక్కువ గల నాలుగు నాట్ లని గుర్తించగలగటమే కాకుండా, అదనంగా గుర్తించిన తొమ్మిది నాట్ లలో కొన్ని ప్రాచుర్యం లేని నాట్ లను, అది వరకు లేని మరికొన్ని సరిక్రొత్త నాట్ లను గుర్తించగలిగారు.
ఇవే కాకుండా ఇతర నాట్ లు:
- స్మాల్ (Small), ఓరియెంటల్ (Oriental) లేదా కెంట్ (Kent)
- నికీ (Nicky)
- ఆట్లాంటిక్ (Atlantic)
- ప్రింస్ ఆల్బర్ట్ (Prince Albert), డబుల్ (Double) లేదా క్రాస్ విక్టోరియా (Cross Victoria)
- క్రిస్టెంసన్ (Christensen) లేదా క్రాస్ (Cross)
- ఇడైటీ (Ediety) లేదా మెరోవింగియన్ (Merovingian)
యూట్యూబ్ లో ఈ క్రింది నాట్ లు ఎలా వేయాలో చూడవచ్చును.
- షెల్ (Shell)
- ఎల్డ్ రెడ్జ్ (Eldredge)
- ట్రినిటీ (Trinity)
- కేప్ (Cape)
- ప్లాట్స్ బర్గ్ (Plattsbrgh)
- క్యావెండిష్ (Cavendish)
- గ్రాంట్ చెస్టర్ (Grantchester)
- బాల్థస్ (Balthus)
- ఓరియెంటల్ (Oriental)
- సెయింట్ ఆండ్ర్యూస్ (St. Andrews)
- విక్టోరియా (Victoria)
సభ్యత్వ గుర్తింపు గా టై లు
[మార్చు]ఒకే క్లబ్బుకి, మిలిటరీ రెజిమెంట్ కి, పాఠశాలకి, వృత్తిపరమైన సంఘాల (రాయల్ కాలేజీ, ఇంస్ ఆఫ్ కోర్ట్ ల) ఇత్యాది వాటికి చెందిన వ్యక్తుల సభ్యత్వ గుర్తింపు కోసం ఒకే తీరైన, రంగులు గల టై ల వాడకం ఇంగ్లండులో 19వ శతాబ్దంలో మొదలైనది.
యునైటెడ్ కింగ్డం లోని చాలా ఉన్నత పాఠశాలల్లో, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, కెనడా, భారతదేశాలలోని కొన్ని వాటిలో ప్రత్యేకమైన డిజైను గల టైలు యూనీఫారం లలో భాగాలుగా కలిగి ఉన్నాయి. చాలా ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలో కూడా టై తప్పని సరి.
యూకే, ఐరోపా దేశాలలో గేడిగా (ధరించిన వ్యక్తికి ఎడమ వైపు ఎత్తుగా, కుడి వైపు పల్లంగా) సమాంతరంగా చారలు ఉన్న టై లని ఇందుకు ఉపయోగిస్తారు.
ఐరోపా చారలకు వ్యతిరేకంగా (ధరించిన వ్యక్తికి కుడి వైపు ఎత్తుగా, ఎడమ వైపు పల్లంగా) ఉన్న టై లను అమెరికాలో ఎటువంటి సభ్యత్వానికి గుర్తింపుగా కాకుండా మామూలుగానే ఉపయోగిస్తారు. ఎటొచ్చీ ఏదైనా సభ్యత్వానికి గుర్తింపుగా కావాలన్నప్పుడు అమెరికాలో కూడా ఐరోపా శైలి టై లనే వినియోగిస్తారు.
చారలకి ప్రత్యామ్నాయంగా టై పిన్ వద్ద ఒక చిహ్నం గానీ, అల వంటి చిహ్నం గల టైలు గానీ, లేదా ఆసాంతం పునరావృత్తమైన ఒకే చిహ్నం గల టైలు గానీ ఉపయోగిస్తారు. ఒక్కోసారి ఈ రెండు రకాలు (చారలు, ప్రత్యామ్నాయం) ఎంపిక కోసమో లేదా సభ్యత్వ స్థాయి లలో తేడాల కోసమో ఉపయోగించటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఈ రెండు ప్రత్యామ్నాయాల కలయిక (చారలతో బాటు ఆసాంతం ఒకే చిహ్నం పునరావృత్తమైన టైల) ని కూడా ఉపయోగించటం జరుగుతుంది.
మహిళల టై లు
[మార్చు]కొన్ని సందర్భాలలో నెక్ టైలు మహిళలకి ప్రత్యేకించి హోటళ్ళు, రెస్టారెంట్లలో యూనిఫారంలో భాగాలుగా ఉంటాయి. చాలా దేశాలలో బాలికలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో టైలు యూనిఫారం లలో భాగాలు. కేవలం ఫ్యాషన్ కొరకు కూడా కొంత మంది మహిళలు టైలన వాడగలరు. 70, 80వ దశకాలలో యువతులు క్యాజువల్ వేర్ గా టైలు వాడటం అసాధారణంగా పరిగడించబడలేదు. 1977 లో డయేన్ కీటన్ అనే నటీమణి అన్నీ హాల్ అనే చిత్రంలో అదే పాత్రని పోషించింది. ఇందులో తను టైలని వాడినది. ఈ చిత్రం విజయవంతమవటంతో కొద్ది రోజులు ఈ ఫ్యాషన్ కొనసాగింది. ఐరోపా అమెరికాలలో 1993 లో టైలు మహిళలకి మరల అలంకార ప్రాయాలైనాయి.
సమస్యలు , వ్యతిరేకత
[మార్చు]నెక్ టై లని సమర్థించేవారి, వ్యతిరేకించేవరి వాదోపవాదాలు సామాజిక అనుసరణ, వృత్తిపర అంచనాలు, వ్యక్తిగత అభిప్రాయాలు, వాటిని రూపొందించే ప్రక్రియ చుట్టూ అల్లుకొని ఉంటాయి.
ఆరోగ్య , భద్రత ప్రమాదాలు
[మార్చు]చిక్కు పడే, ఇంఫెక్షన్ సోకే, నరాలు కుంచించుకు పోయే ప్రమాదాలు ఉన్నందువలన వ్యతిరేకులు టై లని వాడవద్దనే హితవు పలుకుతారు. పోలీసులు, జైలు గార్డులు, కొన్ని వైద్య సంబంధిత వృత్తులు, భారీ మెషీన్ ల వద్ద పని చేసేవారికి చిక్కు పడటం వలన చిన్న ఇబ్బందుల నుండి ప్రాణహాని జరిగే వరకు ప్రమాదం ఉంది. ఇటువంటి వారు టైలు వాడటం మానేయటం కాని, లేదా లాగితే విడిపోయే ప్రీ-నాటెడ్ టై (ముడి వేసేవి కాకుండా, కాలరుకి తగిలించుకుండేవి) లని వాడటం శ్రేయస్కరం. కాలరు ఎక్కువ బిగుతుగా ఉంటే గొంతు వద్ద ఉన్న నరాలు కుంచించుకుపోయి ఫలితంగా కంటి చూపు మందగించే ప్రమాదం కూడా ఉంది. వేసుకున్నవారికే కాక అవతలి వారికి కూడా టై ప్రమాదాలు తెస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఇతర దుస్తులతో పోలిస్తే టై లని శుభ్రపరచే సందర్భాలు తక్కువగా ఉండటంతో ఇవి వ్యాధులని త్వరగా వ్యాపింపజేస్తాయి. 2007 సెప్టెంబరు 17 లో బ్రిటీషు ఆసుపత్రులలో టైలని వాడకూడదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
యూకేలో సరదాకి అవతలి వ్యక్తి టై లాగుతూ ఉంటారు. దీనిని పీనటింగ్ (peanuting) లేదా స్క్వాట్ నాటింగ్ (squatknotting) అని అంటారు. ఒక్కోసారి దీనిని బెదిరింపుగా కూడా చేస్తుంటారు.
నెక్ టై వ్యతిరేక భావము
[మార్చు]20 వ శతాబ్దంలో కార్యాలయాలకు వెళ్ళే స్త్రీపురుషుల సంఖ్య పెరిగింది. పని చేసే వైఖరిని, క్రమశిక్షణని, అమ్మకాలని పెంపొందించే సమర్థత టై లకి ఉండటంతో వీటిని ధరించే అవసరం పెరిగింది.
1966 వ సంవత్సరం వరకు టైల వాడకం సర్వసాధారణమైననూ, 1967-69 వరకూ అవసరమైన చోట తప్పితే, దీనిని పాత పద్ధతిగానే భావించారు. 80 వ దశకంలో పునరుత్థానం చెందిననూ, 90 వ దశకంలో (పశ్చిమ దేశాలలో) ఆపిల్ ఇంక్, అమెజాన్, ఈబే, జెనెన్ టెక్, మైక్రోసాఫ్ట్, మోంసాంటో, గూగుల్ వంటి సాంకేతికాధారిత సంస్థలలో క్యాజువల్ డ్రస్ లని ప్రోత్సహించటంతో మరల టైలు ఆదరణ కోల్పోయాయి.
ఐరోపా దేశాల అణచివేత ధోరణికి నిరసనగా ఇరాన్ పాలకులు టైని నిషేధించారు. 1970 లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమయంలో అమెరికా వార్తాపత్రికలు ఇరాన్ అతివాదులని టర్బంస్ అనీ, మితవాదులని నెక్-టైస్ అని వ్యవహరించటం జరిగింది.
వివిధ నాట్ లలో టైలు
[మార్చు]-
స్మాల్
-
ఫోర్ ఇన్ హ్యాండ్
-
హాఫ్ విండ్సర్
-
విండ్సర్
-
అట్లాంటిక్
-
ఎల్డ్ రెడ్జ్
-
క్రాస్
-
డయాగనల్
-
మెరోవింగియన్
-
ఓరియంటల్
-
సెయింట్ ఆండ్ర్యూస్
-
ఓనస్సిస్
-
ట్రినిటీ
-
కేప్
-
సాధారణ టైని బౌ టై నాట్ తో కట్టిన విధానము. అబ్రహం లింకన్ ఎక్కువగా, అప్పుడప్పుడూ అడాల్ఫ్ హిట్లర్ తమ టై లని ఇలా కట్టుకొనేవారు
యూ ట్యూబ్ లో టై నాట్ కట్టే విధానాలు
[మార్చు]- బాల్థస్ నాట్
- కేప్ నాట్
- క్యావెండిష్ నాట్
- క్లౌన్ నాట్
- ఎల్డ్రెడ్జ్ నాట్
- గ్రాంట్ చెస్టర్ నాట్
- మెరోవింగియన్
- నికీ నాట్
- ట్రినిటీ నాట్