పాద హస్తాసనం
Appearance
(పాదహస్తాసనం నుండి దారిమార్పు చెందింది)
పాద హస్తాసనం యోగాసనాలలో ఒక ఆసనం. ఈ ఆసనం లో చేతులతో పాదములను అందుకోవడం వలన దీనికి పాదహస్తాసనం అని పిలుస్తారు. అర్ధ చంద్రాసనం నుంచి శ్వాస వదులుతూ ముందుకి వంగి చేతులతో పాదాలను తాకాలి.
పద్ధతి
[మార్చు]- నిటారుగా నిలబడాలి.
- మెల్లగా చేతులను నిటారుగా పైకి తీసుకురావాలి.
- శరీరం ను మెల్లగా పైకి సాగదీసి కటి(hip) భాగము నుండి ముందుకు వంచాలి. ఈ స్థితి లో శరీరము 900 కోణము లో కనిపించును.
- ఇప్పుడు మెల్లగా చేతుల ను పఠం లో చూపిన విధంగా పాదాలకిరువైపులా ఉంచాలి. తలను మోకాలికి ఆనించాలి.
- ఇలా కొద్ది క్షణాలు ఉన్న తరువాత మెల్లగా యధా స్థితికి రావాలి.
ఉపయోగాలు
[మార్చు]- ఉదర భాగంలోని గ్రంధులను ఉతేజపరుచును.
- అజీర్ణము(Indigestion), మూలశంఖ(constipation), ఉదర వాయువుల సమస్యల(gastric troubles) ను తగ్గించును.
- వెన్నుముఖకు శక్తినిచ్చును.
- రక్త ప్రసరణ ను వృద్ధి చెయ్యును.
- వీపు, నడుము కండరాలకు శక్తినిచ్చును.