పాద హస్తాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A woman performing the uttanasana pose, standing and bending forward such that her hands touch the ground to the sides of her feet
ఉత్థానాసనం

పాద హస్తాసనం యోగాసనాలలో ఒక ఆసనం. ఈ ఆసనం లో చేతులతో పాదములను అందుకోవడం వలన దీనికి పాదహస్తాసనం అని పిలుస్తారు. అర్ధ చంద్రాసనం నుంచి శ్వాస వదులుతూ ముందుకి వంగి చేతులతో పాదాలను తాకాలి.

పద్ధతి

[మార్చు]
  • నిటారుగా నిలబడాలి.
  • మెల్లగా చేతులను నిటారుగా పైకి తీసుకురావాలి.
  • శరీరం ను మెల్లగా పైకి సాగదీసి కటి(hip) భాగము నుండి ముందుకు వంచాలి. ఈ స్థితి లో శరీరము 900 కోణము లో కనిపించును.
  • ఇప్పుడు మెల్లగా చేతుల ను పఠం లో చూపిన విధంగా పాదాలకిరువైపులా ఉంచాలి. తలను మోకాలికి ఆనించాలి.
  • ఇలా కొద్ది క్షణాలు ఉన్న తరువాత మెల్లగా యధా స్థితికి రావాలి.

ఉపయోగాలు

[మార్చు]
  • ఉదర భాగంలోని గ్రంధులను ఉతేజపరుచును.
  • అజీర్ణము(Indigestion), మూలశంఖ(constipation), ఉదర వాయువుల సమస్యల(gastric troubles) ను తగ్గించును.
  • వెన్నుముఖకు శక్తినిచ్చును.
  • రక్త ప్రసరణ ను వృద్ధి చెయ్యును.
  • వీపు, నడుము కండరాలకు శక్తినిచ్చును.