"ఆరుద్ర" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), , → , (10), కి → కి , తో → తో (2) using AWB
చి (→‎కవిత్వం: clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), , → , (10), కి → కి , తో → తో (2) using AWB)
| weight =
}}
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన [[త్వమేవాహం]] (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి [[శ్రీశ్రీ]] ప్రశంస పొందిన '''ఆరుద్ర''' ( [[ఆగస్టు 31]], [[1925]] - [[జూన్ 4]], [[1998]]) పూర్తిపేరు '''భాగవతుల సదాశివశంకర శాస్త్రి''' . [[శ్రీశ్రీ]] తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.<ref>"ఆరుద్ర" మేడిపల్లి రవికుమార్, [[సాహిత్య అకాదెమీ]], 2007 ప్రచురణ ISBN 81-260-2333-3</ref><ref>ది హిందూ ఆంగ్లపత్రిక అధికారిక వెబ్సైట్ నుండి [http://www.hinduonnet.com/thehindu/mp/2002/08/19/stories/2002081900840200.htm A humanist lyricist] వివరాలు[[జూన్ 23]],[[2008]]న సేకరించబడినది.</ref> ఈయన భార్య [[కె.రామలక్ష్మి]] కూడా ప్రముఖ [[తెలుగు]] రచయిత్రి.
 
== తొలి జీవితం ==
[[ఫైలు:ARUDRA BY BAPU.png|200PX|left|thumb|'''ప్రముఖ చిత్రకారుడు [[బాపు]] గీసిన ఆరుద్ర రేఖా చిత్రం''']]
ఆరుద్ర [[1925]], [[ఆగస్టు 31]]న [[విశాఖపట్నం]]లో జన్మించాడు. [[విశాఖపట్నం]] ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాత [[విజయనగరం]]లో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెనై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' [[ఆనందవాణి]] ' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో [[శ్రీశ్రీ]] , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. [[అభ్యుదయ రచయితల సంఘం]] ([[అరసం]]) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఆరుద్ర మహాకవి [[శ్రీశ్రీ]]కి వేలువిడిచిన మేనల్లుడు. ప్రముఖ రచయిత [[చాగంటి సోమయాజులు]] (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.
 
==సాహిత్య సేవ==
1946 లో [[చెన్నై]] వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్ పార్కులొ నీళ్ళు త్రాగి కడుపు నింపుకోవల్సి వచ్చిన సందర్భాలున్నాయని ఆరుద్ర చెప్పుకున్నాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహిత్య సేవకు అడ్డం రాలేదని ఆయన అన్నాడు. నెలకొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలలనుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]] సంపుటాలవరకు ఆరుద్ర " దోహదం" తో పల్లవించని సాహితీ శాఖలేదు. [[త్వమేవాహం]]తో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు , గేయ నాటికలు , కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన..... ఇంత వైవిద్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.
 
తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. [[త్వమేవాహం]] , [[సినీవాలి]] , [[కూనలమ్మ పదాలు]], [[ఇంటింటి పద్యాలు]] వంటి అనేక కావ్యాలతో పాటు '''వెన్నెల- వేసవి''' , '''దక్షిణవేదం''', '''జైలుగీతాలు''' వంటి అనువాద రచనలు '''రాదారి బంగళా''', '''శ్రీకృష్ణదేవరాయ''' , [[కాటమరాజు కథ]] వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]] ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ట. దీనికోసం మేధస్సునే కాకుండా , ఆరోగ్యాన్ని కూడా ఖర్చుపెట్టాడు. '''వేమన వేదం''' , '''మన వేమన''', '''వ్యాస పీఠం''', '''గురజాడ గురుపీఠం''', ప్రజాకళలో ప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు. '''రాముడికి సీత ఏమౌతుంది?''','''గుడిలో సెక్స్''' వంటి రచనలు ఆరుద్ర పరిశీలనా దృష్టికి అద్దంపడతాయి. సంగీతం పైనా, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. [[చదరంగం]] పైనకొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత. ఇలా పలు రచనా ప్రక్రియలలో చేపట్టి, కవిత్వం- పరిశోధనా రెంటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడు [[హేతువాది]] ఆరుద్ర.
 
==రచనలు==
* [[అత్తా ఒకింటి కోడలే]] " జోడుగుళ్ల పిస్తోలు ఠా "
* [[యం.ఎల్.ఏ.]] చిత్రంలో " ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం మరియు " నీ ఆశ అడియాశ "
* [[అందాల రాముడు]] చిత్రంలో " ఎదగడానికికెందుకురా తొందర "
* [[గోరంత దీపం]] చిత్రంలో " రాయినైనా కాకపోతిని "
* [[ముత్యాల ముగ్గు]] చిత్రంలో " ఏదో ఏదో అన్నది మసక వెలుతురు " మరియు ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ
* [[బాల భారతం]] చిత్రంలో " మానవుడే మహనీయుడు "
* [[ఇద్దరు మిత్రులు (1961 సినిమా)|ఇద్దరు మిత్రులు]] చిత్రంలో - " హలో హలో అమ్మాయి "
* [[ఆత్మ గౌరవం]] చిత్రంలో " రానని రాలేనని ఊరకె అంటావు. "
* [[ఆత్మీయులు]] చిత్రంలో " స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు "
మొదలగు సినిమా పాటలు వ్రాసి పాటకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని ప్రసాదించి ప్రతిపాటలో తన ముద్రను కనిపింపచేశాడు.
 
 
==బయటి లింకులు==
* ఆరుద్ర తోఆరుద్రతో ముఖాముఖీ ఆడియో [http://www.eemaata.com/em/issues/200807/1303.html]
* [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=53 ఏ.వి.కె.ఎఫ్.ఫౌండేషన్ వారి అధికారిక వెబ్సైట్ నుండి ఆరుద్ర వారి రచనల పుస్తకాల వివరాలు]
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mana%20veimana&author1=aarudra&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=1985%20&language1=telugu&pages=170&barcode=2990100051710&author2=&identifier1=&publisher1=S.V.University,%20Tirupati&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=%20SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-08&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data/upload/0051/715 మన వేమన గ్రంథ ప్రతి]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1957007" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ