ఫరూఖ్‌నగర్ మండలం

వికీపీడియా నుండి
(ఫరూఖ్ నగర్ మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఫరూఖ్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

ఫరూఖ్ నగర్
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటంలో ఫరూఖ్ నగర్ మండల స్థానం
రంగారెడ్డి జిల్లా పటంలో ఫరూఖ్ నగర్ మండల స్థానం
ఫరూఖ్ నగర్ is located in తెలంగాణ
ఫరూఖ్ నగర్
ఫరూఖ్ నగర్
తెలంగాణ పటంలో ఫరూఖ్ నగర్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°04′40″N 78°12′04″E / 17.0778°N 78.2011°E / 17.0778; 78.2011
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రం ఫరూఖ్ నగర్
గ్రామాలు 30
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,12,633
 - పురుషులు 57,361
 - స్త్రీలు 55,272
అక్షరాస్యత (2011)
 - మొత్తం 57.95%
 - పురుషులు 69.32%
 - స్త్రీలు 46.01%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఫరూఖ్‌నగర్ దీనిని షాద్‌నగర్ అని కూడా అంటారు. ఈ మండలంలో 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.ఇది షాద్‌నగర్ రెవిన్యూ డివిజిను పరిధిలో ఉంది.

మండల జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 1,12,458. ఇందులో పురుషుల సంఖ్య 57,299, స్త్రీల సంఖ్య 55,159. అక్షరాస్యుల సంఖ్య 68042.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు

మండలంలోని ప్రముఖులు[మార్చు]

  • బూర్గుల రామకృష్ణా రావు:హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు షాద్‌నగర్ మండలానికి చెందిన వ్యక్తి. 1915 నుంచే ఈయన పోరాటం ప్రారంభమైంది. పలుమార్లు జైలుకు వెళ్ళినాడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గేయాలు, రచనలు చేసి ప్రజలలో ఉత్తేజం కలిగించాడు. ఈయన స్వస్థలం ఈ మండంలోని బూర్గుల గ్రామం. ఇంటిపేరు పుల్లంరాజు అయిననూ ఊరిపేరే ఇంటిపేరుగా మారిపోయింది. 1952లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అవరతణకు వీలుగా ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు. ఆ తర్వాత కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126

వెలుపలి లంకెలు[మార్చు]