బాదినేనిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


బాదినేనిపల్లె
రెవిన్యూ గ్రామం
బాదినేనిపల్లె is located in Andhra Pradesh
బాదినేనిపల్లె
బాదినేనిపల్లె
అక్షాంశ రేఖాంశాలు: 15°15′18″N 78°57′40″E / 15.255°N 78.961°E / 15.255; 78.961Coordinates: 15°15′18″N 78°57′40″E / 15.255°N 78.961°E / 15.255; 78.961 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొమరోలు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం461 హె. (1,139 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం627
 • సాంద్రత140/కి.మీ2 (350/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523369 Edit this at Wikidata

బాదినేనిపల్లె, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 369. ఎస్.టి.డి. కోడ్ = 08405.

గ్రామ చరిత్ర[మార్చు]

క్రీ.శ. 8వ మరియు 9వ శతాబ్దాలలో బాదినేనిపల్లె రాజధానిగా బాదినేనిపల్లె తెలుగు చోళ వంశమనే స్థానిక రాజవంశము పరిపాలించింది. వీరి బాదినేనిపల్లెతో పాటు జిల్లాలో కొంతమేరకు ప్రాంతాన్ని కూడా పాలించారు. వీరు చెక్కించిన మూడు శాసనాలు బాదినేనిపల్లెలోని రామస్వామి ఆలయం యొక్క ఉత్తర ద్వారం దగ్గర లభ్యమయ్యాయి.[2] ఈ ఆలయపు దక్షిణ ద్వారం వద్ద 1555 సంవత్సరానికి చెందిన మరొక దానశాసనం కనుగొనబడింది.[3]

సమీప పట్టణాలు[మార్చు]

గిద్దలూరు 16 కి.మీ, రాచెర్ల 21.6 కి.మీ, చంద్రశేఖరపురం 31.2 కి.మీ, బెస్తవారిపేట 32.9 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కిలారు రాజ్యలక్ష్మమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ షిర్డీ సాయి మందిరం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 627 - పురుషుల సంఖ్య 312 - స్త్రీల సంఖ్య 315 - గృహాల సంఖ్య 168

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 728.[4] ఇందులో పురుషుల సంఖ్య 363, స్త్రీల సంఖ్య 365, గ్రామంలో నివాస గృహాలు 199 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[5] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2; 4వపేజీ.