రాచర్ల (ప్రకాశం జిల్లా)
రాచర్ల (ప్రకాశం జిల్లా) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 15°28′N 78°57′E / 15.467°N 78.950°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | రాచర్ల |
విస్తీర్ణం | 23.18 కి.మీ2 (8.95 చ. మై) |
జనాభా (2011)[1] | 6,518 |
• జనసాంద్రత | 280/కి.మీ2 (730/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,979 |
• స్త్రీలు | 3,539 |
• లింగ నిష్పత్తి | 1,188 |
• నివాసాలు | 1,608 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08405 ) |
పిన్‌కోడ్ | 523368 |
2011 జనగణన కోడ్ | 591177 |
రాచర్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం లోని ఒక గ్రామం,ఇది మండల కేంద్రం.
గ్రామ చరిత్ర
[మార్చు]ఊరికి దగ్గరలో నల్లగుండు అనే పెద్ద రాతిబండ ఉంది. పూర్వం బ్రిటీస్ వారు ఇక్కడ బాంబులతో ఈ గుండును పగులగొట్టాలని ప్రయత్నం చేసిన ఆనవాల్లు ఇక్కడ చూడవచ్చు. రాచర్ల మండలం పాలిటిక్స్ కు అనుగుణంగా ఉంటుంది. వేలుముద్ర వ్యక్తులే ఇక్కడ రాజకీయం చేస్తుంటారు, చదువుకున్న వాళ్ళు ఉన్నా పట్టించుకోరు. రాచర్ల నుండి కొండకు దగ్గర ఒక బావి ఉంది. ఈ బావికి చాల ప్రాముఖ్యత ఉంది. దీనిని వేమారెడ్డి బావి అని అంటారు.
గణాంకాలు
[మార్చు]2001 వ . సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,645. ఇందులో పురుషుల సంఖ్య 2,787, మహిళల సంఖ్య 2,858, గ్రామంలో నివాస గృహాలు 1,393 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,318 హెక్టారులు.
సమీప గ్రామాలు
[మార్చు]పలకవీడు 5 కి.మీ, గుడిమెట్ల 8 కి.మీ, అక్కపల్లి 9 కి.మీ, చినగానిపల్లి 9 కి.మీ,
విద్యా సౌకర్యాలు
[మార్చు]రాచర్ల బస్టాండ్ సెంటర్లో 2012 నుండి దాదాపు 13 సంవత్సరాలుగా కామన్ సర్వీస్ సెంటర్ (సీయస్సి) శ్రీ బాలాజీ నెట్ సెంటర్ ద్వారా దేశబోయిన అశోక్ కుమార్ మరియూ దేశబోయిన అంజన్ కుమార్ లు ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు మరియూ జిరాక్స్ అందిస్తున్నారు .
రాచర్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ముందుగా వెలసింది .....తరువాత స్పందన స్కూల్ వెలసింది ఆ తరువాత విద్వాన్ స్కూల్ ఒక్కొటిగా వెలసినవి. మోడల్ స్కూల్ వెలసి ఇంటర్ విద్యను ప్రవేశపెట్టినది. రాచర్లలో ఆడపిల్లలకి ప్రత్యేకంగా కస్తూరిబా స్కూల్ వెలసినది. రాచర్లలో రెండు డైట్ కాలేజీలుమ్ రెండు బి ఎడ్ కాలేజీలు ఉన్నాయి.
- మొయినుద్దీన్ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల
- కస్తూర్బా గాంధీ విద్యాలయం
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల - రాచర్లలోని ఈ పాఠశాల, 1892, ఆగస్టు-14 న ప్రారంభించారు. మొదట చెట్లకింద, ఆ తర్వాతఅద్దె భవనాలలో 3 దశాబ్దాలుగా సొంతభవనాలలో నడుస్తున్నది. ఒక్కసారి పాఠశాలలో అడుగుపెడితే స్వాతంత్ర్య సంగ్రామంనాటి ముచ్చట్లే కాదు, ప్రజాస్వామ్యంలో పలు ఘట్టాలను మన ముందు పరుస్తుంది.
- వెలుగు గురుకుల పాఠశాల
- ఈ పాఠశాలలో 10 వ తరగతి చదువుచున్న బొడిచెర్ల స్వరూప అను విద్యార్థిని, జాతీయస్థాయి సబ్-జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనది. ఈమె 2 నెలల క్రితం ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో తన ప్రతిభను ప్రదర్శించింది.
- ఈ పాఠశాలకు చెందిన అంజలీబాయి అను విద్యార్థిని, జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనది. ఇటీవల కృష్ణా జిల్లాలోని కేతనకొండలోని స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన 60 స్కూల్ గేంస్ ఫెడెరేషన్ హ్యాండ్ బాల్ కప్ పోటీలలో అండర్-14 విభాగంలో పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించి ఈమె ఈ అర్హత సాధించింది. ఈమె 2015, జనవరి మొదటివారంలో మహారాష్ట్రలోని నాగపూరు నగరంలో నిర్వహించే జాతీయపోటీలలో పాల్గొంటుంది.
- స్పందన ఉన్నత పాఠశాల
గ్రామ పంచాయతీ
[మార్చు]- రాచర్లకు చెందిన దప్పిలి రంగారెడ్డి, 1955 నుండి1959 వరకు, 1983 నుండి 1988 వరకు సర్పంచిగా పనిచేసాడు. ఇతని తరువాత కుమార్తె కొండా రంగరాజ్యం, 2006 నుండి 2011 వరకు సర్పంచిగా పనిచేసింది.
- 1973లో ఈ గ్రామానికి జరిగిన పంచాయతీ ఎన్నికలలో సర్పంచిగా పేర్ల చెన్నారెడ్డి ఎన్నికైనాడు. 1977లో ఎన్నికలు జరుగకపోవటంవలన, వీరు పదేళ్ళపాటు సర్పంచిగా కొనసాగారు. అప్పట్లో పంచాయతీకి స్టాంప్ డ్యూటీ మినహా ఎలాంటి నిధులూ మంజూరయ్యేవి కావు. అది గూడా ఏడాదికి పదివేలలోపు. ఈ నిధులతో, మహిళల అవస్థలు తీర్చేటందుకు, రాచర్ల, కాలువపల్లె గ్రామాలలో ప్రజామరుగు దొడ్లు నిర్మించారు. రాచర్లలో ప్రధాన రహదారిని బాగుపరిచారు. ఈయన హయాంలో గ్రామంలో ఒక్క కేసూ లేదు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో బందం శకుంతల, సర్పంచిగా ఎన్నికైంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- రాచర్ల మండలం జల్లివానిపుల్లలచెరువుకు పడమటి దిక్కున అరు కిలోమీటర్ల దూరంలో వున్న నల్లమల అటవి ప్రాంతంలో నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం ఉంది.
- శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం రాచర్ల గ్రామ చెరువు కట్టపై ఉంది.
- శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- రాచర్ల గ్రామంలో అంజనా పర్వతంపై వెలసిన శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు నిర్వహించెదరు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.
- శ్రీ మడియాలయ్యస్వామి (శ్రీ వీరభద్రస్వామి) వారి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ అలయంలో 2015, జూన్-10,11.12 తేదీలలో విగ్రహ ప్రథిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. 10వ తేదీ బుధవారం ఉదయం గణపతిపూజ, రక్షా బంధనం, ప్రధాన కలశ స్థాపన, యంత్రాభిషేకం, దీక్షా హోమం నిర్వహించారు. 11వ తేదీ గురువారంనాడు, గ్రామోత్సవం, గణపతి, రుద్ర, వాస్తు, నవగ్రహ హోమాలు నిర్వహించారు. 12వ తేదీ శుక్రవారం ఉదయం, యంత్ర, ప్రాణప్రతిష్ఠ, విగ్రహ, శిఖర ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రికి చెంచులక్ష్మి నాటకం ప్రదర్శించారు.
- శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం:- రాచర్ల మండల కేంద్రంలోని హరిజన పాలెంలో నూతనంగా నిర్మించిన ఈ అలయంలో 2015,జూన్-10,11.12 తేదీలలో విగ్రహ ప్రథిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. 10వ తేదీ బుధవారం ఉదయం సుప్రభాతం, అంకురార్పణ, వాస్తుహోమం నిర్వహించారు. 11వ తేదీ ఉదయం, శాంతిహోమం, సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. 12వ తేదీ శుక్రవారం ఉదయం, యంత్ర, ప్రాణప్రతిష్ఠ, విగ్రహ, శిఖర ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
ప్రధాన పంటలు
[మార్చు]రాచర్ల గ్రామంలో మూడు రకాల నేలలు ఉన్నాయి ఎర్ర నేలలు ఎక్కువగా మిరప, కంది,మొక్క జొన్న, పత్తి, నూగు, శెనగ కాయలు ఇంకా చాల రకాలు అవసరం బట్టి వేసేవారు నల్ల నేలల్లో పత్తి, మినప, శనగలు, గోధుమ ఇసుక నేలల్లో కంది పంట అధిక ప్రాధాన్యత ఇట్చేవారు.
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు అలాగే పక్కోడి జీవితం ఎలా పడగొట్టాల అని ఆలోచిస్తుంటారు. కానీ ఏమీ కాదు అని వారికి కూడా తెలుసు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017