మహామేఘవాహన సామ్రాజ్యం
మహామేఘవాహన సామ్రాజ్యం మహామేఘబాహన ମହାମେଘବାହନ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సా.శ.పూ 2 వ శతాబ్దం–సా.శ. 5వ శతాబ్దం | |||||||||
రాజధాని | సింహపురి (ప్రస్తుతం సింగుపురం) | ||||||||
సామాన్య భాషలు | సంస్కృతం, ప్రాకృతం,తెలుగు(?) | ||||||||
మతం | జైనమతం | ||||||||
ప్రభుత్వం | రాజరికం | ||||||||
చారిత్రిక కాలం | ప్రాచీన యుగం | ||||||||
• స్థాపన | సా.శ.పూ 2 వ శతాబ్దం | ||||||||
• పతనం | సా.శ. 5వ శతాబ్దం | ||||||||
|
మహామేఘవాహన వంశం (కళింగ వంశం, చేది వంశం) (ఒరియా - ମହାମେଘବାହନ; Mahā-Mēgha-Bāhana) సా.పూ.250ల నుండి సా.శ 5వ శతాబ్దం వరకు, కళింగ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం. వీరిలోని మూడవ పాలకుడు ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రసిద్ధమైంది
చరిత్ర
[మార్చు]మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం సా.పూ. 255లో జరిగింది. అది భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేసుకున్నాడు. అశోకుని సామ్రాజ్యం క్షీణించి కళింగ స్వతంత్య్ర రాజ్యమయ్యింది. స్వతంత్య్రాన్ని ప్రకటించుకున్న మొదటి రాజు ఎవరనేదానిమీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కళింగుల గురించి తెలుస్తున్న చరిత్ర అంతా, హాతిగుంఫా శాసనం నుండే సేకరించడింది ఇది ఖారవేలుని పరిపాలనాకాలంనాటిది.
పాలకులు
[మార్చు]- ఖేమ్ రాజ లేదా క్షేమరాజు
- వుధ రాజ లేదా వృద్ధరాజు
- ఖారవేల లేదా భిక్కు/భిక్షురాజు - ఈ వంశస్థులలో ప్రముఖుడు ఖారవేలుడు. హాతిగుంఫా శాసనం వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందాడు. పాటలీపుత్రాన్ని పాలిస్తున్న పుష్యమిత్రుని ఓడించి మౌర్య రాజులు అంతకుముందు తీసుకువెళ్ళిన జైన విగ్రహాలను తిరిగి కళింగ రాజ్యానికి తీసుకొచ్చాడు.
- వక్రదేవ/కుడేపసిరి
- వడూఖ/బడుఖ
శాతవాహనులతో యుద్ధాలు
[మార్చు]ఖారవేలునికి, అతని సమకాలీనుడైన శాతవాహన రాజు శాతకర్ణి జరిగిన యుద్ధంలో పిథుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని హథీగుంఫ శాసనం (సా.పూ. 183) ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యుద్ధంలో ఖారవేలుడు విజయం సాధించాడని చెప్పలేం "శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్ణబెణ్ణానది (కృష్ణానది) వరకు పురోగమించి ముషికనగరాన్ని హడలుకొట్టినాయట. "ఏమయినా తరచూ కళింగుల మధ్య, శాతవాహనుల మధ్య జరిగిన యుద్ధాలవల్ల తీరాంధ్రప్రాంతం కొంత కళింగుల వశమయ్యింది. ఆంధ్రులకు చాలా నష్టం జరిగింది. పిథుండ నగగరం బహుశా "ప్రతిపాలపురం" లేదా భట్టిప్రోలు అయ్యి ఉండవచ్చును. ఖారవేలుడు సర్వ రాష్ట్రిక, భోజక ప్రభువులను ఓడించాడు. అంగ వంగ దేశాలనుండి రత్నాలు తెచ్చాడు.
మతం
[మార్చు]పరమతసహనాన్ని పాటించిన మహామేఘవాహనులు., జైనమతాన్ని పోషించినట్టు తెలుస్తుంది.[1][2]
చిత్రమాలిక
[మార్చు]-
ఖారవేలుని హాతిగుంఫా శాసనం
-
భువనేశ్వర్ వద్ద ఉన్న ఉదయగిరి కొండల్లో హాతిగుంఫా
మూలాలు
[మార్చు]- ↑ Hampa Nagarajaiah (1999). A History of the Early Ganga Monarchy and Jainism. Ankita Pustaka. p. 10. ISBN 978-81-87321-16-3.
- ↑ Kailash Chand Jain (2010). History of Jainism. D. K. Print World (P) Limited. p. 437. ISBN 978-81-246-0547-9.