మొదటి బుక్క రాయలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మొదటి హరిహర రాయలువారి సోదరుడు మొదటి బుక్క రాయలు. ఇతడు క్రీ. శ. 1356నందు విజయనగర సింహాసనమధిష్టించాడు. ఇతడు విజయనగర రాజ్య స్థాపనమున, తరువాత బహుమనీ సుల్తాను లతో జరిగిన యుద్ధములందు తన అన్నగారయిన మొదటి హరిహర రాయలునకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇతని కుమారుడు కంప రాయలు అనేక హిందూ క్షేత్రములను మహమ్మదీయుల అధీనమునుండి స్వాధీనము చేదుకున్నాడు.
బహుమనీ సుల్తానులతో యుద్దాలు
[మార్చు]మొదటి యుద్దములు
[మార్చు]బహుమనీ సుల్తాను అయిన మహమ్మద్ షా I ఓరుగల్లును ముట్టడించి, ఓరుగల్లునకు సహాయముగా వచ్చిన విజయ నగర ప్రభువులను కూడా ఓడించి, ఆ తరువాత 1366న అపరాధరుసుము చెల్లించమని బుక్క రాయలకు తాకీదు పంపించాడు, దానితో బుక్క రాయలు కోపితుడై బహుమనీ రాజ్యమునందున్న ముద్గల్లు కోటను ఆక్రమించాడు. బహుమనీ సేనలు విజయనగర సైన్యమును ఎదుర్కొని, ఆదవాని, కౌతల ప్రాంతములందు జరిగిన యుద్ధములందు విజయనగర సైనికులను ఓడించినాయి. ఈ యుద్ధమున సాధారణ ప్రజానీకానికి అనేక కష్టాలు ప్రాప్తించినాయి. వేలకొలదీ ప్రజలు నిరాశ్రయలు అయినారు. వందల కొలది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. చివరకు బుక్క రాయలు సుల్తానుతో సంధి చేసుకొనినాడు, సంధి షరతులను అనుసరించి, ఇరువురూ సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఖేధమూ కలిగించకూడదు.
రెండవ యుద్దములు
[మార్చు]మొదటి యుద్ధము తరువాత 1375 వరకూ యధాస్థితి కొనసాగినది. కానీ 1375 వ సంవత్సరమున మహమ్మద్ షా దివంగతులయినారు. తరువాత అతని వారసుడు ముజాహిద్ షా సింహాసనము అధిరోహించాడు. ఈ సమయములో బుక్క రాయలు కృష్ణా నది, తుంగభద్రా నది ప్రాంతముల మధ్య నున్న ప్రదేశమును ఆక్రమించెను. అంతే తిరిగి మరో యుద్ధము ప్రారంభమయినది. ఈ యుద్ధమున విజయనగర సైనికులు ఓడిపొయినారు. బహుమనీ సైనికులు విజయ నగర సైనికులను తుంగభద్రా నది దాటువరకూ తరిమివేసినారు.
కవులు
[మార్చు]- ఉత్తర హరివంశమునకు కర్త అయిన నాచన సోమన వీరి ఆస్తానంలోని వాడే!
మంత్రి
[మార్చు]బుక్క రాయలకు మంత్రిగా అసాధారణ మేథా సంపత్తి కలవాడుగా పేరుగాంచిన మాధవులు, వీరి గురువుగారు విద్యారణ్యస్వామి.
ఇంతకు ముందు ఉన్నవారు: మొదటి హరిహర రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1356 — 1377 |
తరువాత వచ్చినవారు: రెండవ హరిహర రాయలు |