రిషి వ్యాలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రిషి వ్యాలి లేదా ఋషి వ్యాలి, అర్థం "ఋషి కొండవాలు". ఇది ఒక ఆశ్రమ పాఠశాల, దీనిని జిడ్డు క్రిష్ణమూర్తి స్థాపించారు. జిడ్డు క్రిష్ణమూర్తి' నవయుగ ఋషిగా ప్రసిధ్ధి. ఈ ఆశ్రమపాఠశాల కొండవాలు (ఆంగ్లంలో 'వ్యాలీ') ప్రాంతంలో ఉన్నందున, నవయుగ 'ఋషి' స్థాపించినందున, ఈ ప్రాంతానికి "ఋషివ్యాలీ" లేదా ఋషి వ్యాలి అనేపేరు సార్థకమయింది. ఈ ఋషి వ్యాలి, మదనపల్లె పట్టణానికి 16 కి.మీ. దూరంలో, మదనపల్లె కదిరి మార్గంలో యున్నది. ప్రధాన రహదారి నుండి, 5 కి.మీ. లోభాగాన ఈపాఠశాల గలదు. హార్సిలీ హిల్స్ నుండి, ఈ లోయప్రాంతం సుందరంగా కనిపిస్తుంది. బాహుదా కాలువ పుట్టుక స్థానం, హార్శిలీ హిల్స్, ఈ ఋషివ్యాలీ ప్రాంతాలే.

ఆశ్రమ పాఠశాల[మార్చు]

జిడ్డు కృష్ణమూర్తిగారు స్థాపించిన విశ్వప్రసిధ్ధి చెందిన పాఠశాల. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు విడిది, భోజన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకు విద్యతోపాటు శారీరిక, మానసిక వికాసం కలిగే విధంగా విద్యాబోధన జరుగుతుంది.

బయటి లింకులు[మార్చు]