వాడుకరి చర్చ:K.Venkataramana/పాత చర్చ 5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
     పాత చర్చ 5   
All Pages:  ... (up to 100)


విషాద గీతాలు

నమస్తే వెంకటరమణ గారు,
మీరు రద్దు చేసిన 3 మార్పులపై చిన్న request;

విషాద గీతాలు

దీన్ని బొమ్మను చేసి ప్రాణముపోసి పేజీకి దారిమార్పు చేశారు. ఇది సరి కాదేమో అని నా మనవి. ఎందుకంటే విషాదగీతాలు ఎన్నో ఉండవచ్చు. విషాద గీతాలు అనగానే దాన్ని "బొమ్మను చేసి ప్రాణముపోసి" కి పంపిస్తే విషాద గీతం అంటే అది ఒక్కటే అనే స్ఫురణ కలిగిస్తుంది. నా సూచన ఎమిటంటే: ప్రస్తుతానికి విషాద గీతాలు అనే వర్గం కానీ వ్యాసం కానీ అవసరం లేదు. తెలుగు పాటలు/గీతాలు వర్గం సుసంపన్నమైన తర్వాత (అంటే ఉన్న పాటల సాహిత్యంలో ఒక 40% వికీలో చేర్చబడిన తర్వాత ఇలా విషాద గీతాలు, అనంద గీతాలు, యుగళ గీతాలు, సోలో గీతాలు, రాముని పాటలు, శివుని పాటలు, అమ్మవారి పాటలు మొదలైన స్పెషల్ వర్గాలు create చేయవచ్చు).

రాముని పాటలు, శివుని పాటలు

ఇవి పాటల జాబితాలు. వీటిని వ్యాసం అనలేము. ఇవి actually వర్గాలు. నా అభిప్రాయం మళ్ళీ అదే. ఇప్పుడు ఉన్న పాటల సంఖ్యను బట్టీ. ఈ వర్గం ఇప్పుడు అవసరం లేదు.

తెలుగు పాటలు అనే వర్గం ఈ విధంగా ఉండవచ్చు

  1. తెలుగు సినిమా పాటలు (వర్గం) : సినిమా పాటలు లక్షలుగా ఉన్నందువలన ఇవి special వర్గం కీందకి వస్తాయి. వీటిలో ముఖ్య విభాగాలు - రచయిత grouping (ప్రస్తుతానికి) ఇవి కొల్లలుగా వచ్చిన తర్వాత - పాడినవారి grouping, సంగీతం అందించిన వారి grouping create చేయవచ్చు. special categories గా - విషాద గీతాలు, అనంద గీతాలు, ప్రేమ గీతాలు, భక్తి గీతాలు, శివుని పాటలు, రాముని పాటలు, etc create చేయవచ్చు.దీనికి ఇంకాచాలా time వుంది అని నా అభిప్రాయం.
  2. తెలుగు లలిత గీతాలు: కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, నారాయణరెడ్డి నుంచి వడ్డేపల్లి కృష్ణ వంటి భావకవులు రచించిన పాటలు. సినిమాల్లో ఉపయోగించినవి కొన్ని ఐతే ఉపయోగించనివి మరికొన్ని. వీటిలో భావగీతాలు, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు ముఖ్యమైన విభజన.
  3. జానపద గీతాలు: పల్లెల్లో ప్రజలు పాడుకునే మధుర గీతాలు. వీటిలో రచయితలు తెలియనివి చాలా అయితే తెలిసినవి కొన్ని. వీటిని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ గీతాలుగా విభజించవచ్చు.
  4. సాంప్రదాయ గీతాలు: అన్ని ప్రదేశాల్లో ఇళ్ళలో పాడుకునే పాటలు - పూజల పాటలు, వ్రతం పాటలు, మంగళహారతి పాటలు, దేవుని మేలుకొలుపు పాటలు, పెళ్ళి పాటలు, దంపుదు పాటలు, etc
  5. క్రైస్తవ గీతాలు: ఇవి కూడా కొకొల్లలు. వీటికి కూడా special category create చేసే అంత సాహిత్యం వుంది.
  6. సంగీత రచనలు (అన్నమయ్య, త్యాగరాజ, రామదాస, క్షేత్రయ్య, శ్యామశాస్త్రి కీర్తనలు) ఇవి ఇక్కడ కాకుండా సంగీతం విభాగంలో చేరిస్తే సరిపోతుంది. కావాలనుకుంటే ఇక్కడా ఒక విభాగం ఇచ్చి దారి మార్పు చేయవచ్చు.

దయచేసి ఈ request పరిగణించగలరు.--Krittivaas

సలహాలకు ధన్యవాదాలు

కృత్తివాస్ గార్కి, మీ సినిమా పాటల పరిజ్ఞానానికి అభినందనలు. మీరు తెలియజేసిన వర్గీకరణ చాలా బాగుంటుంది. దీనిని తెలియ జేసినందుకు ధన్యవాదాలు. మీరు తెలియజేసినట్లు తెలుగు పాటలు/గీతాలు వర్గం సుసంపన్నమైన తర్వాత ఈ వర్గీకరణ చేయవచ్చు. మీరు తెలియ జేసిన విషయం ప్రకారం విషాద గీతాలు దారిమార్పును తొలగించి దానిని వ్యాసంగా మలచితిని. మీకు తెలిసిన యితర రచయితల మరికొన్ని విషాద గీతాలను కూడా చేర్చి సహకరించండి. మీరు విషాద గీతాలు వ్యాసంలోని విషయభాగాన్నంతా మొదట తీసివేసినట్లు గమనించితిని. అందువల్ల ఆ మార్పును రద్దు చేసితిని. మీకు సదరు వ్యాసంలోని చర్చా పేజీలో గానీ, నిర్వాహకులకు గానీ పైన మీరు తెలియజేసిన అమూల్య సలహాలను తెలియజేసిన యెడల దానిని సరిదిద్దుకోవచ్చు. శివుని పాటలు , రాముని పాటలు వంటి వ్యాసాలను శివుని పాటల జాబితా మరియు రాముని పాటల జాబితా లుగా మార్చవచ్చునేమో పరిశీలించి తెలియజేయండి. మంచి సమాచారాన్నందించినందుకు ధన్యవాదాలు. మీ కృషిని కొనసాగించండి.---- కె.వెంకటరమణ చర్చ 05:34, 29 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వంశవృక్షం

మూస:గిడుగు వంశవృక్షం చాలా బాగుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:10, 2 ఆగష్టు 2014 (UTC)

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:40, 3 ఆగష్టు 2014 (UTC)

విశేష వ్యాసాలు

తెవికీలో చాలా వ్యాసాలు విస్తరింవబడినవి ఉన్నట్లున్నవి. ఉదాహరణకు పాలగిరి వ్రాసిన అనేక నూనెల వ్యాసాలు, రసాయన శాస్త్ర వ్యాసాలన్నీ పూర్తిగా విస్తరింపబడినవి ఉన్నవి. వాటిని విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? చంద్రకాంతరావు గారు విశేషంగా వ్రాసిన తెలంగాణ వ్యాసం వంటివాటిని విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? మీరు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 లో సూచించని అనేక విస్తరిత వ్యాసాలు తెవికీలో ఉన్నవి. వాటిని కూడా విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 లో సూచించిన వ్యాసాలను విశేషంగా అభివృద్ధి చేసినయెడల వాటిని విశేష వ్యాసాల హోదాలు ఎలా యివ్వాలి. విశేష వ్యాసాల వర్గంలో చేర్చితే సరిపోతుందా? సందేహ నివృత్తి చేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 13:07, 4 ఆగష్టు 2014 (UTC)

వెంకటరమణ గారూ, మీరన్నట్టు, తెవికీలో చాలా వ్యాసాలు విస్తరింపబడి యున్నవి. అందుకొరకే విశేష వ్యాసాల పరిగణనా ప్రక్రియ. ఈ సంవత్సరాంతానికి ఓ వంద విశేష వ్యాసాలు చూడవచ్చనే ఆశ.
తెవికీలో 25 విశేష వ్యాసాలున్నాయి (మొత్తం వ్యాసాల సంఖ్య = 58,545 - ఆగస్టు 4, 2014 నాటికి)
ఇవికీలో 4,323 విశేష వ్యాసాలున్నాయి (మొత్తం వ్యాసాల సంఖ్య = 4,573,497)
తెవికీలో అనేక వ్యాసాలు విస్తరింపబడి యున్నవి, ప్రతిపాదనలలో వాటి పేర్లు ఉండవచ్చు, లేకపోవచ్చు.
ప్రతిపాదింపదలిస్తే;
విశేష వ్యాసాల కొరకు ఏ సభ్యులైనా ప్రతిపాదించవచ్చు.
ఎన్నైనా ప్రతిపాదించవచ్చు.
చంద్రకాంతరావు గారు వ్రాసిన తెలంగాణా వ్యాసమూ ప్రతిపాదించవచ్చు.


విశేష వ్యాసాల ప్రతిపాదన ఎన్నిక కొరకు ఈలింకులు చూడండి. విశేష వ్యాసాల జాబితా
వికీపీడియా:విశేష వ్యాసాలు. అలాగే "విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది" కొరకు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు చూడండి. అలాగే ఇవికీలో ఈపేజీ చూడండి Wikipedia:Featured_articles.
కేవలం విశేష వ్యాసం వర్గంలో ఉంచిన యెడల అది విశేష వ్యాసం కాదు. ఇవికీ నుండి తర్జుమా కొరకు విషయాన్ని ఇవికీనుండి కాపీ చేసి తెవికీలో వుంచినందువలన, ఆ వ్యాసం ఇవికీలో విశేష వ్యాసం అయివున్నందువలన, విశేష వ్యాసం వర్గంలో చేరి ఉండవచ్చు. అలా అయిన పక్షంలో, ఆవ్యాసం నుండి వర్గం:విశేష వ్యాసం తొలగించవచ్చు.

విశేష వ్యాసాల ఎన్నిక సభ్యుల అభిప్రాయాలతోనే జరుగుతుంది. ఈ ఎన్నిక ప్రక్రియ వలన లభాలేమంటే, ప్రతిపాదించేవారు ఆయా వ్యాసాలను ఒక సారి పరికిస్తారు, వాటి నాణ్యతా విషయాలు గుర్తిస్తారు, ఇంకా ఇతర విషయాల దిద్దుబాట్లు చేస్తారు, ఆతరువాతే ప్రతిపాదిస్తారు. సరిగ్గా మనకు కావలసిందీ ఇదే.

విశేష వ్యాసాల కొరకు నిబంధనలు / మార్గదర్శకాలు ;
  • వ్యాసం పరిపూర్ణంగాను, ఖచ్చితత్వాన్ని కలిగి వుండాలి
  • నిష్పక్షపాతంగా వుండాలి
  • సమతౌల్యతలను పాటించి వుండాలి
  • మూలాలు కలిగి ఉండవలెను
  • అధిక లింకులు కలిగి ఉండవలెను
  • ఎర్రలింకులు లేకుండా ఉండవలెను.
  • సంబంధిత వ్యాసాలకు, వాటి విషయాలకు తగిన బొమ్మలు కలిగి వుండాలి
  • సభ్యుల ఆమోదాలతోను, నిర్ణయాలతో ఎన్నికై వుండాలి.
విశేష వ్యాసంగా ఎన్నికైన వ్యాసాన్ని,

ఇంకనూ చర్చించవలసిన విషయాలుంటే, సభ్యులు చర్చించవచ్చు. (ఈ విభాగాన్ని రచ్చబండలోనూ, విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 చర్చాపెజీలోనూ ఉంచుతున్నాను). అహ్మద్ నిసార్ (చర్చ) 14:47, 4 ఆగష్టు 2014 (UTC)

రావురూకల్ మార్పు గురించి

ఈ గ్రామం పేరు రావురూకల్ అని కాకుండా రావురూకుల అని వ్యవహారంలో ఉంది. కాబట్టి రావురూకుల అనే పేరుతో ఒక పేజీ సృష్టించి రావురూకల్ పేజీలోని సమాచారాన్నంతా దానిలోకి బదలాయించాను. కాబట్టి రావురూకల్ ను రావురూకుల కు దారిమార్పు చేస్తే సరిపోతుంది.--స్వరలాసిక (చర్చ) 00:26, 1 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ మీరన్నట్లు రావురూకల్ వ్యాసాన్ని రావురూకుల వ్యాసంలో పేజీ చరిత్రతో సహా విలీనం చేసి దారిమార్పు చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 12:20, 1 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు --స్వరలాసిక (చర్చ) 14:54, 1 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అచాటినా అచాటినా : తెలుగు పేరు

నమస్తే రమణ గారు,
మొలస్కా జాతికి చెందిన అచాటినా అచాటినా కి తగిన తెలుగు పేరు సూచించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:55, 6 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, ఈ పదం యొక్క సాధారణ నామం 'జెయింట్‌ ఆఫ్రికన్‌ ల్యాండ్‌ స్నెయిల్‌' అని ఉన్నది. దీనిని "ఆఫ్రికా మహా భూ నత్త" అని అంటే బాగుండునేమో పరిశీలించగలరు. ఈ నత్త గూర్చి కొన్ని విశేషాలు ఇక్కడ చూడవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 16:23, 6 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు. వ్యాసం పేరు ఆఫ్రికా రాక్షస నత్త కు మార్చాను--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:21, 10 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ గారూ ఆఫ్రికా రాక్షస నత్త పేరు బాగుంది.---- కె.వెంకటరమణ చర్చ 09:48, 10 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అమీర్ ఖాన్ వ్యాసం గురించి

నమస్తే రమణ గారు,అమీర్ ఖాన్ వ్యాసంలో ఈ క్రింది వాక్యం చదివాను. అందులో సజన్ముడు అనే పదం ఇంతవరకు వినలేదు. మీకు దాని అర్థం తెలిస్తే చెప్పగలరు. అతను ముస్లిం విద్వాంసుడు మరియు రాజకీయ నాయకుడు అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంశస్థుడు మరియు రాజ్య సభ మాజీ చైర్ పర్సన్ డా. నజ్మా హెప్తుల్లా రెండవ సజన్ముడు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:21, 10 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, ఈ పదం నేను కూడా మొదటిసారి చూశాను. ఆంగ్ల వికీలో గల Najma Heptulla వ్యాసంలో గల "She is also a second cousin to actor Aamir Khan." అనే వాక్యాన్ని గూగుల్ అనువాదం పరికరం "ఆమె నటుడు అమీర్ ఖాన్ రెండవ సజన్ముడు ఉంది." అని అనువాదం చేసింది. దీని ప్రకారం "సజన్ముడు" అనగా "cousin" అని తెలుస్తుంది. ఆంధ్రభారతి నిఘంటువు లో కూడా "cousin" అనే పదానికి "జ్ఞాతి" "సజన్ముడు" అనే అర్థాలు ఉన్నవి.---- కె.వెంకటరమణ చర్చ 16:52, 10 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు రమణ గారూ. సజన్ముడు అను కొత్త పదమునకు అర్థము తెలిసినది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:30, 13 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విశేష వ్యాసాలు - పహారా

లోహిత్ గారూ నమస్తే.. నేను చేస్తున్న {విశేష వ్యాసం|తేదీ} మార్పులను కొంచెం గమనిస్తూ వుండండి. ఎక్కడైనా పొరపాట్లు జరిగినట్టు అనిపిస్తే కొంచెం తెలుపగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 16:25, 13 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చేర్చిన మూసలు సరిగానే ఉన్నవి. వికీపీడియా:విశేష వ్యాసాలు లో 27 వ్యాసములున్నవి. కానీ వర్గం:విశేషవ్యాసాలు లో 32 ఉన్నవి. వర్గంలో ఎక్కువగా ఐదు వ్యాసాలున్నవి. వాటిలో ఈ క్రింది వాడుకరులు విశేష మూసను చేర్చారు. ఆ వ్యాసాలు ప్రతిపాదించబడినవేనా? అవి ఆమోదం పొందినవా? అవి ఆమోదం పొందినవైనచో వికీపీడియా:విశేష వ్యాసాలు లో చేర్చవచ్చు. లేనిచో ఆ పేజీలలో {{విశేషవ్యాసాలు}} మూసను తొలగించవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 18:17, 13 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  1. ఆఫ్ఘనిస్తాన్ - Sai2020 - 27,ఏప్రిల్ 2008 న ఈ దిద్దుబాటు ద్వారా,
  2. బ్రాహ్మణగూడెం - Sai2020 - 27,ఏప్రిల్ 2008 న ఈ దిద్దుబాటు ద్వారా,
  3. మహాత్మా గాంధీ - Dev - 28, ఆగష్టు 2008 న ఈ దిద్దుబాటు ద్వారా
  4. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ - Sai2020 - 27,ఏప్రిల్ 2008 న ఈ దిద్దుబాటు ద్వారా,
  5. వైరస్ - Dev - 10, డిసెంబరు 2007 న ఈ దిద్దుబాటు ద్వారా,

విశేష వ్యాసాల మూసను చేర్చారు. వాటిని పరిశీలించవలెను.---- కె.వెంకటరమణ చర్చ 18:17, 13 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పరిశీలించాను, ఇది తేలింది;
విశేషవ్యాసాలు కావచ్చు : వీటిని విశేషవ్యాసాలుగా పరిగణించి ప్రదర్శించారు కూడా. బహుశా విశేషవ్యాసాల జాబితాలో చేర్చడానికి మరచిపోయి ఉండవచ్చు. కావున ఈ వ్యాసాలను విశేష వ్యాసాలుగా వాటి జాబితాలో చేర్చవచ్చు.
  • {విశేషవ్యాసం|27 ఏప్రిల్ 2008} - ఆఫ్ఘనిస్తాన్
  • {విశేషవ్యాసం|2008 ఏప్రిల్ 26} – మిన్నియాపోలిస్
  • {విశేషవ్యాసం|2008 ఏప్రిల్ 26} – బ్రాహ్మణగూడెం
ఈవారం వ్యాసాలు కావచ్చు : ఈ క్రింది వ్యాసాలను పరిశీలిస్తే, ఈవారం వ్యాసాల్లా అనిపించాయి. కానీ విశేషవ్యాసం మూస పెట్టారు. బహుశా ఈవారం వ్యాసం మూస స్థానంలో విశేషవ్యాసం మూస పెట్టారు. కానీ వీటిని మీరు ఓసారి పరిశీలించండి, అర్హతలు గోచరిస్తే చొరవతీసుకుని విశేషవ్యాసాలుగా ప్రకటించి, వాటి జాబితాలో చేర్చండి.
  • {విశేషవ్యాసం|46వ వారం} – వైరస్
  • {విశేషవ్యాసం|2007 49వ వారం} – మహాత్మా గాంధీ


అలాగే ఈ ప్రక్రియలోని ఉపోద్ఘాతములో మొదటి పాయింట్ ఒక క్లిష్టమైన ఘట్టాన్ని ప్రస్తావించడం జరిగినది. అదేమంటే,

అహ్మద్ నిసార్ గార్కి, ప్రస్తుతం మొదటి పేజీలో "ఈ వారం వ్యాసం" లో కొన్ని వ్యాసాలు చేర్చబడుచున్నవి. "విశేష వ్యాసం" అనే శీర్షిక నిర్వహింపబడుట లేదు. అటువంటి సందర్భంలో మూస:విశేష వ్యాసము1 లో మార్పులు చేసినా ప్రయోజనం లేదని నా అభిప్రాయం. 2006 జూలై 8 న క్రొత్త మొదటి పేజీ ఆవిష్కరణ జరిగినది. అంతకు పూర్వం మొదటి పేజీలో "విశేష వ్యాసం శీర్షిక" ఉండేది. అందువల్ల ఆ శీర్షిక నిర్వహణార్థం మూస:విశేష వ్యాసము1 లో కొత్త విషయాలను చేర్చేవారు. ప్రస్తుతం "ఈ వారం వ్యాసం" శీర్షిక నిర్వహింపబడుతున్నందున. ఆ మూసలో విషయాలను చేర్చవలసిన పనిలేదు.---- కె.వెంకటరమణ చర్చ 03:51, 14 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అహ్మద్ నిసార్ గారూ, విశేష వ్యాసం అనేది సాధారణంగా ఒక వ్యాసం యొక్క నాణ్యతా స్థాయిని గుర్తించే సూచకం. ఆంగ్లంలో ఒక వ్యాసాన్ని విశేష వ్యాసం స్థాయికి తెచ్చిన తర్వాత మొదటి పేజీలో ప్రదర్శించడం ఆనవాయితీ. అయితే శైశవ స్థాయిలో తెవికీలో ఏదో కాస్త మెరుగుగా ఉంది అనిపించగానే దానిని విశేషవ్యాసం అని చెప్పేసి మొదటి పేజీలో ప్రదర్శించాం. కానీ ఆ తర్వాత నిజంగా వ్యాసాలను విశేషవ్యాసం స్థాయిలో చేర్చాలి, కానీ ప్రదర్శించటానికి అన్ని విశేషవ్యాసాలు లేవు అన్న సంకల్పంతో "ఈ వారం వ్యాసం" వ్యాసాలు అన్న జాబితా మొదలైంది. వికీ పెరుగుతున్న కొద్ది, ఆ వికీ యొక్క దృష్టిలో నాణ్యతా ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఒక సారి ఈ విశేషవ్యాసాలను చూసి, అవి ఆ స్థాయిలో లేవనిపిస్తే మూసను/వర్గాన్ని తీసెయ్యవచ్చు. --వైజాసత్య (చర్చ) 08:59, 14 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, అలాగే చేద్దాం. ఇపుడు తెవికీ బాల్యదశలో వున్నది. అయినా న్యూట్రిషన్ సరిగా లేదు (నవ్వకండి :)). విశేషవ్యాసాలు - ఈవారం వ్యాసాలుగానూ, ఈవారం వ్యాసాలు నేటివ్యాసాలుగానూ రూపుదిద్దుకునే రోజులు దగ్గర వస్తున్నాయి. ఈ సందర్భంలో వెంకటరమణ గారికి అభినందించకుండా ఉండలేక పోతున్నాను, అయ్యవారూ, యు ఆర్ ది బెస్ట్ అసెట్ ఆఫ్ తెవికీ. మే గాడ్ బ్లెస్ యు. అలాగే రమణ గారూ, శుద్ధి చేయవలసిన గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా వర్గం తయారు చేసారు, అభినందనలు, వీటిని శుద్ధి చేసుకుంటే వందలకొద్దీ క్వాలిటీ వ్యాసాలు తయారయే సూచనలు కనిపిస్తున్నాయి. అహ్మద్ నిసార్ (చర్చ) 14:14, 14 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:ఇండో-ఇరానియన్ భాషలు

రమణగారూ, {{ఇండో-ఇరానియన్ భాషలు}} సరిగా పనిచేయడం లేదు, కొంచెం చూడగలరు, తర్జుమా కావాలంటే నేను చేయగలను. అహ్మద్ నిసార్ (చర్చ) 20:52, 14 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్మద్ నిసార్ గారూ {{ఇండో-ఇరానియన్ భాషలు}} పనిచేయుచున్నది.భారతీయ భాషలలో కొన్నింటిని అనువాదం చేశాను.మిగిలినవి అనువాదం చేయాలి.---- కె.వెంకటరమణ చర్చ 03:29, 15 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ

మొదటి పేజీలో ఈ వారం వ్యాసం కొమరం భీం మీరు మార్చారు. ఏదో తేడా వచ్చింది. ఒకసారి మొదటి పేజీ చూసి లోపాన్ని సవరించండి.--Rajasekhar1961 (చర్చ) 04:03, 22 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారూ ,మొదటి పేజీలోని ఈ వారం వ్యాసం శీర్షికలో వాడుకరి:R.Karthika Raju గారు కొన్ని మార్పులు చేశారు. అందువల్ల మారినది. సరిచేశాను. కొంత సమయానికి మారవచ్చు. ఆయన వరంగల్ జిల్లా లో 20,సెప్టెంబరు 2014 లో అధిక సమాచారాన్ని కూడా తొలగించారు.దానికి కూడా సరిచేశాను.---- కె.వెంకటరమణ చర్చ 04:20, 22 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:35, 22 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మూస సహాయము

రమణ గారు,
మూస:Infobox actor లో వ్యాస నామమును పసుపు రంగు నేపధ్యములో చూపబడినది (ఉదా:రాజసులోచన. ఇదే మార్పును మూస:Infobox person లో కూడా చేయవచ్చునా?నేను ప్రయత్నించాను కానీ కుదరలేదు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:43, 24 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, మీరు కోరిన మార్పు మూస:సమాచారపెట్టె వ్యక్తి లోనూ మరియు మూస:Infobox person లోనూ మార్చబడినది. ఉదాహరణకు విజయ నిర్మల మరియు ఘట్టమనేని కృష్ణ వ్యాసాలలో సమాచారపెట్టెలోని మార్పును గమనించండి.---- కె.వెంకటరమణ చర్చ 13:17, 24 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు రమణ గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:12, 25 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ అనువాదవ్యాసాలు

లోహిత్ గారూ, గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి తరువాత వాటిని [వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన] వర్గంలో ఉంచాలని మూసలో వున్నది. ఆ వర్గం సృష్టించబడియున్నదా లేదా కొత్త వర్గం సృష్టించాలా, ఓ సారి చూసి చెప్పండి. ఆగా ఖాన్ వ్యాసం దాదాపు శుద్ధి చేయబడినది. కాని దాని వర్గీకరణ విషయంలో, నుదహరించిన వర్గం లేదు. అహ్మద్ నిసార్ (చర్చ) 04:12, 25 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అహ్మద్ నిసార్ గారూ, వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన లో యిదివరకు మెరుగుపరచిన వ్యాసాలున్నవి. ఒకసారి వర్గాన్ని చూడండి.అది వర్గీకరింపబడలేదు. దానిని వర్గీకరించాను. మీరు శుద్ధిచేసిన వ్యాసానికి ఆ వర్గాన్ని చేర్చండి.---- కె.వెంకటరమణ చర్చ 12:30, 25 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు, ఆగా ఖాన్ కనబడుతోంది, మిగతావాటికి వర్గం చేరుస్తాను. అహ్మద్ నిసార్ (చర్చ) 12:37, 25 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ పేజీల చరిత్రను తరలించడం సాధ్యమేనా?

చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేసిన సభ్యులు కటకం వెంకట రమణ గారికి, Naidugari Jayanna గారికి, YVSREDDY గారికి, రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. YVSREDDY గారు , రాజశేఖర్ గార్ల సమ్మతితో నియంతలు పేజీ ని నియంత పేజీలో విలీనం చేసి అలాగే చరిత్ర ను కూడా విలీనం చేసి, ఈ చర్చకు అర్ధవంతనైన ముగింపును ఇద్దాం.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:09, 23 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, మీరు కోరుకుంటున్నది వ్యాస చరిత్రల విలీనమా? లేదా నియంతలు వ్యాస శీర్షిక మార్పు చేయడమా? తెవికీలో రెండు వ్యాసములు అక్షర భేదములతో సృష్టింపబడి రెండింటిలో ఒకే విషయము గురించి ఉంటే వాటిని విలీనం చేసి వ్యాస చరిత్రలను విలీనం చేయడం సరియైన పని. ఈ విషయంలో నియంత అనే వ్యాస శీర్షిక సృష్టింపబడినా అందులో "నియంత" (dictator) కు సంబంధించిన అంశాలేవీ యిదివరకు సృష్టింపబడలేదు. కానీ ఒక సినిమాకు దారిమార్పు చేయడం మాత్రమే జరిగినది. అందువలన విలీనం చేయవలసిన ఆవశ్యకత లేదని నా అభిప్రాయం. ఒకవేళ నియంతలు శీర్షికను నియంత గా మార్చవలెనన్న మొదట నియంత వ్యాసాన్ని దారిమార్పులేకుండా నియంత (అయోమయ నివృత్తి) కి తరలించి, ఆ తదుపరి నియంతలు వ్యాసాన్ని నియంత అనే శీర్షికగా మార్పు చేస్తూ తరలించవచ్చును. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.---- కె.వెంకటరమణ చర్చ 14:25, 25 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఏక వచన శీర్షిక ఉపయుక్తం కనుక పై విధంగా సరిచేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 13:06, 29 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి

రమణ గారూ, వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి#తెవికీ సమూహపు అధికారికసిఫారసులు వద్ద సిఫారసులు ఆంగ్లంలో వ్రాసాను, కాస్త చూసి, సరిగా ఉన్నాయో లేవో చూసి, మార్పులు చేర్పులు అవసరమున్నచో చేయవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 11:15, 29 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రమణ గారూ, పైన చెప్పిన విషయం మీరు గమనించారని భావిస్తున్నాను. ఆంగ్లంలో వ్రాసిన సిఫారసులు సరిగా వుంటే వాటిని కాపీ చేసి, పేజీలో తెలుగు విభాగంలో అతికించగలరు. అనగా, మన తెలుగు సమూహం నుండి అధికారిక సిఫారసులు, కమ్యూనిటీ కన్సల్టేషన్ చర్చాపేజీలో వ్రాస్తున్నాము. అహ్మద్ నిసార్ (చర్చ) 12:27, 29 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అహ్మద్ నిసార్ గారూ మీరు కోరిన విధంగా ఆ పేజీలో ఈ సిఫారసులను చేర్చాను.---- కె.వెంకటరమణ చర్చ 12:57, 29 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు, అలాగే, సదరు చర్చాపేజీ (మన సమూహం చర్చించిన పేజీ) యొక్క లింకునూ అందులో చేర్చగలరా!. వారికి ప్రూఫ్ గానూ వుంటుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 13:54, 29 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అహ్మద్ నిసార్ గారూ వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి పేజీని మెటా వికీ పేజీలో లింకుగా చేర్చాను.---- కె.వెంకటరమణ చర్చ 16:02, 29 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలగ దాసరులే గంటె భాగవతులు

పై వ్యాసాన్ని తరలించడానికి తరలించడానికి నాకు సమ్మతమే.......... అలాగే కానీయండి. Bhaskaranaidu (చర్చ) 15:01, 30 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం యొక్క ప్రారంభకులైన భాస్కరనాయుడు గారు వ్యాస శీర్షిక మార్పుకు తన అంగీకారాన్ని తెలిపినందున వ్యాస చరిత్రకు భంగం కలుగకుండా వ్యాసాన్ని తెలగ దాసరులే గంటె భాగవతులు వ్యాసాన్ని గంటె భాగవతులు వ్యాసానికి దారిమార్పు లేకుండా తరలించితిని.---- కె.వెంకటరమణ 15:11, 30 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల అభివృద్ధికి వ్యాసాల్లోనే సోర్సులు

మిత్రులకు నమస్కారం,
తెవికీలో వ్యాసాలు అభివృద్ధి చేసేందుకు కాస్త సోర్సుల కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో తెవికీలో వికీమీడియా సహకారంతో తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు ప్రారంభించిన విషయం తెలిసిందే. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలను జాబితా చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులో పుస్తకాలను జాబితా చేస్తూ పుస్తకం ఉన్న డీఎల్‌ఐ లింకులు, రచయిత పేరు, గ్రంథం విభాగం, వివరాలు వంటి వాటివి ఇస్తున్నాము. ఈ పుస్తకాలను వినియోగించుకుని వ్యాసాలు అభివృద్ధి చేయడం, కొత్తవి తయారు చేయడం దీని పరమలక్ష్యం. ఈ క్రమంలో మరో ముందడుగుగా నేను, రాజశేఖర్ గారూ చర్చించుకుని వికీపీడియన్లు తేలికగా వ్యాసాలు అభివృద్ధి చేసేందుకు కాపీరైట్ పరిధిలో లేని పుస్తకాలకు సంబంధించిన పేజీల్లో ఆయా పుస్తకాల ముందుమాటలు, విషయసూచికలు, కవర్‌పేజీ, లోపలి వివరాల పేజీలను కొత్తగా తయారుచేసే వ్యాసాల్లో చేర్చనున్నాము. శ్రీమాధవాచార్య విద్యారణ్యస్వామి (నాటకం), మాలతి (నాటకం), మాళవికాగ్నిమిత్రము (కందుకూరి వీరేశలింగం) వంటి పుస్తకాల గురించి తయారుచేసిన చిరువ్యాసాల్లో సంబంధిత పుస్తకాల వివరాలున్న పేజీలు చేర్చాము. సహ సభ్యులు వీలున్నంతవరకూ ఆయా వ్యాసాల్లో చేర్చిన పేజీలు చూసి వివరాలతో అభివృద్ధి చేయగలరని ఆశిస్తున్నాము.
ఇది పైలట్ ప్రాజెక్ట్/చిరు ప్రయత్నం లాంటిది మీరు ఇందుకై ఆసక్తి చూపితే నాకు చెప్పగలరు. మనం మరిన్ని నాణ్యమైన వ్యాసాలు అభివృద్ధి చేద్దాము. నా ప్రతిపాదన గమనించినందుకు ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 10:41, 5 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మంగలి వ్యాసం - వాండలిజం

వాడుకరి:Royalvaidya మంగలి వ్యాసంలో ఉన్న సమాచారాన్ని ఎటువంటి ముందస్తు నోటీసు లేకుందా తీసివేసి కొత్త సమాచారాన్ని చేరుస్తున్నారు. ఈ విషయంపై ఆయన చర్చా పేజీ లో మరియు వ్యాస చర్చా పేజీ లో చేర్చినా ఆయన సమాచారాన్ని తీసివేయడం ఆపలేదు. నిర్వాహకులు స్పందిచమని మనవి.ఈ విషయాన్ని రచ్చబండ లో కూడ రాశాను. అక్కడ స్పందించగలరు--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:37, 22 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

దీపావళి శుభాకాంక్షలు

మీకూ, మీ కుటుంబసభ్యలకు దీపావళి శుభాకాంక్షలు. వెలుగుల పండుగ మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుతున్నాను.

అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా ఓం శాంతి శాంతి శాంతి:

మీ సన్నిహితుడు
పవన్ సంతోష్ (చర్చ) 12:54, 23 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

thank you and same to you my dear brother-- కె.వెంకటరమణ 13:43, 23 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మంగలి చిత్రమాలిక

చిత్రమాలిక సెక్షన్ లో ఈ క్రింది చిత్రము గతంలో ఉన్నది. తిరిగి చేర్చగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:50, 25 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
దస్త్రం:Boy meets barber.JPG|right|thumb|300px|బాలునికి క్షవరం చేస్తున్న మంగలి

చేశాను---- కె.వెంకటరమణ 15:52, 25 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు రమణ గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:54, 26 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు లేవు మూస

నేను కొన్ని వ్యాసాలలో మూలాలు లేవు మూసను చేర్చాను. అవన్నీ మూలాలు లేని వ్యాసాలు వర్గంలో కనిపిస్తాయి. వాటిలో కొన్ని వ్యాసాలకు ఆంగ్లవికీ లింకులున్నాయి. అందునుండి మూలాల్ని తెవికీ వ్యాసంలోకి కాపీచేసి మూలాలు లేవు మూసను తొలగించండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:08, 5 నవంబర్ 2014 (UTC)

Khjipeta lo chudadagina pradeshalu inka vunnai sir plzz add Cheyandi117.245.109.248 23:39, 13 నవంబర్ 2014 (UTC)habeeb

Article request: Nadiya Ke Paar (1982 film)

Hi! I found en:Nadiya Ke Paar (1982 film) was dubbed into Telugu. Are you interested in starting a Telugu article on it?

Thanks WhisperToMe (చర్చ) 06:17, 1 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

రమణ వాడుకరి:Kvr.lohith గారూ నమస్తే మీ మెయిల్, ఫోన్ నంబర్ నాకు ఫేస్బుక్ మెసెంజర్‌లో ఇవ్వగలరా....విశ్వనాధ్ (చర్చ) 13:13, 3 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

11 వ వార్షికోత్సవాల గురించి.....

ఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu


సంఖ్యానుగుణ వ్యాసముల గురించి

మీరన్నది నిజమే. సంఖ్యానుగుణ వ్యాసములను విస్తరించలేము. కాని కొన్ని సంఖ్యానుగుణ వ్యాసములు ఒక వ్యాసమంత వున్నవి. అవి వుండ వచ్చా....?అలాంటి వాటిని చేర్చవచ్చా? తెవికీ లో సంఖ్యానుగుణ వ్యాసములు అనే వర్గమున్నది. ఇటు వంటి వ్యాసాలు ఇది వరకు వున్నవి గాన నేను కూడ చేర్చితిని. వాటిని తప్పకుండా విలీనము చేయండి. ధన్యవాదములు. ఎల్లంకి (చర్చ) 14:13, 27 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తరింపనలవికాని మొలక వ్యసాల విలీనానికి అంగీకరించిన ఎల్లంకి గారికి ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 15:21, 28 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల దారిమార్పు లేకుండా తొలగింపు

రమణ గారూ, ఆంధ్ర లొయోల కళాశాల వారు రూపొందిస్తున్న వ్యాసాలను మీరు వాస్తవ పేజీ లేకుండా దారిమార్పు చేస్తున్నారు. ఈ విషయాన్ని దయచేసి ఆయా విద్యార్థుల చర్చా పేజీలలో సూచించగలరు, అలానే వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_లొయోల_కళాశాల/భౌతికశాస్త్రం వద్ద మార్పులను సరిచేయగలరు. దయచేసి భౌతికశాస్త్రంలో ఏ-ఏ వ్యాసాలు ఈ విద్యార్థులు వ్రాయవచ్చో తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:37, 28 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అవును ఒకసారి వాళ్ళకు తెలియచెసి తరువాత దారి మార్పు చేయవచ్చు..--విశ్వనాధ్ (చర్చ) 13:48, 28 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారూ మీ సూచనకు ధన్యవాదాలు. ఈ వ్యాసాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_లొయోల_కళాశాల/భౌతికశాస్త్రం లో భాగంగా తయారవుతున్నాయని మీరు తెలియ జేసిన వరకు నేను గమనించలేదు. ఆయా వ్యాసాల శీర్షికల అనువాదం తప్పుగా యున్నందున వాటిని దారిమార్పులతో తరలించలేదు. కొన్ని వ్యాసాలు యిదివరకు యున్నందున వాటిలో విలీన మూసను ఉంచితిని. భౌతికశాస్త్ర ప్రాజెక్టు చేస్తున్న ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థులకు ధన్యవాదాలు. వారికి తగిన సహకారం అందించగలను. వారి చర్చాపేజీలలో తగిన సలహాలను,సూచనలను అందించగలను. ఈ విషయమై విశ్వనాధ్ గారి సూచనకు ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 15:26, 28 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు --రహ్మానుద్దీన్ (చర్చ) 08:44, 29 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]


చేతి పుస్తకము గురించి

చేతి పుస్తకము (హాండ్ బుక్) కు కావలసిన సమాచరమంతా.... సకలనం చేసి రచ్చబండ లో పెట్టాను. దానిని పరిశీలించి ఉచితమైన మార్పులు చేర్పులు చేసి, తగు పేరును చూచించ వలసినదిగ కోరడమైనది. దీనిని త్వరలో ముద్రిస్తే 11 వ వార్షిక ఉత్సవాలకు అందు బాటులోని రాగదు. ఎల్లంకి (చర్చ) 05:13, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:తెలుగు వికీపీడియా మార్గదర్శిని అనే క్రొత్త పుటలో వివరాలు చూడండి. ఎల్లంకి (చర్చ) 11:27, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కోణీయ ద్రవ్యవేగం వ్యాసం గురించి

కోణీయ ద్రవ్యవేగం వ్యాసం యాంత్రికానువాదమన్నారు. అది ఎలాగో చెప్పండి. --Nageswara rao nani (చర్చ) 10:33, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Nageswara rao nani గారూ, మీరు సృష్టించిన కోణీయ ద్రవ్యవేగం వ్యాసం గూగుల్ అనువాద పరికరంతో ఆంగ్ల వ్యాసం యొక్క అనువాదంలా ఉంది. అనువాదం యాంత్రికంగా ఉంది. వాక్యాలలో స్పష్టత లేదు. ఈ వ్యాసాన్ని శుద్ధి చేయవలసి ఉన్నది. ఈ వ్యాసంలో కొన్ని ఆంగ్లపదాలను సరిగా అనువదించలేదు. అందువలన యాంత్రిక అనువాద మూసను ఉంచాను. సరిగా అనువాదం, శుద్ధి జరిగిన తరువాత ఈ మూసను తొలగించవచ్చు. -- కె.వెంకటరమణ 16:25, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఫోన్

దయచేసి ఒకసారి ఫోన్ చేయగలరా.Rajasekhar1961 (చర్చ) 12:53, 31 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]