Jump to content

వాడుకరి చర్చ:K.Venkataramana/పాత చర్చ 6

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
     పాత చర్చ 6   
All Pages:  ... (up to 100)


నూతన సంవత్సర శుభాకాంక్షలు

వెంకటరమణ గారూ,
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు 2015 ఆంగ్ల సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. మీ విశేష కృషిని తెవికీలో ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇట్లు,
మీ మిత్రుడు,
--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:40, 2 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 12:08, 2 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం

వెంకట రమణ గారూ దయచేసి ఒకసారి ఇక్కడ కల బడ్జెట్ పేజీలో లెక్క చూడగలరా. ఈరోజు ఓపెన్ చేయాలనుకుంటూన్నాం, తప్పులు దొర్లకూడదని మరొకసారి క్రాస్ చెక్ కోసం ఈ లింక్‌లో చేయగలరు.--విశ్వనాధ్ (చర్చ) 15:00, 13 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఉండేల మాలకొండారెడ్డి

వెంకటరమణ గారూ ఉండేల మాలకొండారెడ్డి వ్యాసం విస్తరించాను. గమనించండి.--స్వరలాసిక (చర్చ) 08:00, 19 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారూ, విస్తరించినందుకు ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 12:27, 26 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్థన

Kvr.lohith గారికి, నమస్కారము. నేను మొదటి సారిగా 24.1.15 న ఒక పుటను దిగుమతి చేశాను. దానితో పాటు మిగాతా అనుబంధములు కూడా దిగుమతి అయ్యాయి.[1] తదుపరి కొన్ని గంటల అనంతరం తెలుగు వికీ మూసలు, మూలాలు పని చేయలేదు. నేను దిగుమతి చేసి కారణము వల్ల, జరిగిందేమోనని ఈ రోజు వాటిలో కొన్ని తొలగించాను. ఆ తదుపరి సమస్య మరింత జటిలం అయ్యింది. తెలిసి తప్పు చేయలేదు. కనుక మీరు సహృదయముతో అర్థము చేసుకొన గలరు. దయచేసి సమస్యకు పరిష్కారము చూపగలరు. తోటి వికీ వాడుకరులకు కలిగిన అసౌకర్యమునకు మంచి మనసులతో మన్నించ గలరు. వీలయినంత త్వరలో ఈ సమస్య సరి దిద్దగలవారు సహాయ పడగలరని అభ్యర్థించు చున్నాను. JVRKPRASAD (చర్చ) 00:37, 25 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు నా అభ్యర్థనకు స్పందించినందులకు ముందుగా ధన్యవాదములు. మూలాలు, మూసలు లింకులు వాటికి బ్లాక్ అయినట్లుగా మొదట సమస్య వచ్చినది మరియు అవి అలానే ఉన్నాయి. ఆసమస్యకు మూల కారణం (నేను కాదని అనుకుంటున్నాను) ఇంకా తెలియడము లేదు. మీరు శ్రద్ధ తీసుకున్నందులకు చాలా సంతోషం. JVRKPRASAD (చర్చ) 00:45, 26 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, navbox మూసలన్నీ పనిచేయడంలేదు. అది మీ తప్పిదంవల్ల కాదని తెలుస్తుంది. కన్నడ వికీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా navbox మూసలు పనిచేయడం లేదు. మూలాల మూసలు కొన్ని సరిచేసితిని. కానీ కొన్నిసార్లు error వచ్చి, మరికొన్ని సార్లు పనిచేయడం లేదు. అందువలన మనం చేయగలిగేదేమీ లేదని నా అభిప్రాయం. కొన్ని వికీలలో ఇలా వస్తుండటం వల్ల తరువాత సరిఅవుతాయని అనుకుంటున్నాను. ఈ మూసల దోషాలను మీరు ఎంతమాత్రము బాధ్యులు కాదు. మీ కృషిని కొనసాగించండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 07:27, 26 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Kvr.lohith గారికి, నమస్కారము. మీరు విషయమును క్షుణ్ణముగా గమనించినందులకు, నా మనఃక్లేశాన్ని తొలగించినందులకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ సహాకారమునకు నా కృతజ్ఞతలు. JVRKPRASAD (చర్చ) 07:35, 26 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

మూసల తెలుగు అనువాదము

Kvr.lohith గారు, నమస్కారము. మూస:Convert/ అనే వాటికి తెలుగు అనువాదము మీటరు, అడుగులు ఇలా అనువాదము చేయగలరని ఆశిస్తున్నాను. అలాగే రైల్వే మూసలలో మునుపటి స్టేషను, తదుపరి స్టేషను , వాటి లింకులు కూడా తెలుగులో అనువదించ వలసి ఉన్నది. వీటికి సంబంధించిన వర్గాలు, మూసలు, వ్యాసాలు, ఏమైనా మీకు అవసరమయితే సమాచారము అందించగలను. JVRKPRASAD (చర్చ) 08:52, 30 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారూ, సమయం దొరకనందున మీరు కోరిన సహాయం సకాలంలో చేయనందుకు మన్నించవలెను. {{RailGauge}} , {{Convert}} లలో కొన్ని మార్పులు చేశాను. ఒకసారి మీరు తయారుచేసిన రైల్వే మూసలలో పరిశీలించండి. ప్రమాణాలు సరిగానే వస్తున్నవి.-- కె.వెంకటరమణ 14:09, 7 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Kvr.lohith గారు, మీకు ముందుగా ధన్యవాదములు. కోరిన సహాయం మీరు ఎప్పుడు చేశారని కాదండి, ఎంత బాగా సమస్య పరిష్కారము చేశారనేది చాలా ముఖ్యం. ఈ సందర్భముగా మీకు ఎప్పుడు వీలయితే అప్పుడు, భారతీయ రైల్వేలు మూసలు, హిందూమతము, రసాయనిక శాస్త్రము, లలో అవసరమయినవి చిన్న చిన్న మార్పులు సహృదయముతో చేయగలరని ఆశిస్తున్నాను. మీ సహాయ సహకారములు మునుముందు కూడా అందించ గలరని కోరుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 14:19, 7 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కూర్మపల్లి వ్యాసం

nenu kurmapalli anu ma voori Peru tho page nu create chesanu kani, adhi serch chesthe ravatam ledhu, andhukani Adilabad district Mandamarri mandal lo gala Kyathampalli anu Peru ni kurmapalli ga marchi dhanni searching chesthe vachhelaga cheyandi, aa Kyathampalli ane page nu rasindhi kuda nene... 04:26, 5 ఫిబ్రవరి 2015‎ Ramesh panasa (చర్చ • రచనలు • నిరోధించు)‎

రమేశ్ గారూ, మీ ఊరు కూర్మపల్లి అనే వ్యాసం ఉన్నది. దీనిని మీరు 03:45, 18 జనవరి 2015‎ న సృష్టించారు. మీరు ఆంగ్లంలో సృష్టించిన వ్యాస శీర్షికను తెలుగులోనికి మార్చితిని. మీరు కూర్మపల్లి అనే వ్యాసం పరిశీలించండి. అందులో గల విషయాలను తెలుగు అనువాదం చేయండి. విస్తరించండి. మీ గ్రామంలో గల వివిధ చిత్రాలను చేర్చండి. మంచి వ్యాసంగా తీర్చిదిద్దండి. యిదే విధంగా తెవికీలో మరిన్ని వ్యాసాలను వ్రాయాలని మా అభిలాష. మీకు కావలసిన సహాయాన్ని అందించగలను.-- కె.వెంకటరమణ 12:30, 5 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

ధన్యవాదాలు. నేను ఇక పై నిత్యం వ్యాసాలు ప్రచురిస్తూ ఉంటాను.తిరువిడందై వ్యాసంలో బస్సు వివరాల్లో నేను పౌనఃపున్యం అన్న పదాన్ని వాడాను. దాన్ని ఎవరో కాల వ్యవధి అని మార్చారు. అది ఎవరు మార్చారో తెలుసుకోవడం ఎలా? దయచేసి తెలియజేయగలరు. నేను కోవెల అనే అచ్చ తెలుగు పదాన్ని వాడితే ఎవరో ఆలయం అనే సంస్కృత పదాన్ని పెట్టారు. అదే విధంగా నేను పౌనఃపున్యం అన్న పదాన్ని వాడితే ఎవరో కాలవ్యవధి అనే తప్పు పదాన్ని చొప్పించారు. పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సి. అంటే ఎన్ని నిముషాలకు ఒక బస్సు ఉంటుందో అని అర్థము. కాలవ్యవధి అంటే డ్యూరేషన్ అనగా ప్రయాణానికి పట్టే సమయము అని అర్థము. దయచేసి మార్చగలరు.--15:58, 7 ఫిబ్రవరి 2015‎ Hydkarthik (చర్చ • రచనలు • నిరోధించు)‎

కార్తీక్ గారు, మీరు వ్యాసం విస్తరించినందుకు ధన్యవాదాలు. ఆ వ్యాసంలో "పౌనః పున్యం" అనే పదాన్ని వాడారు. ఆ పదానికి భౌతిక శాస్త్రంలో అయితే "ఒక సెకనులో ఒక వస్తువు చేసే కంపనాలు" అని అర్థం. గణితంలో అయితే సాంఖ్యక శాస్త్రంలో ఒక తరగతి అంతరంలో గల మొత్తం అంశాలను తెలియజేస్తుంది. ఈ వ్యాసం విషయంలో నిర్ణీత కాల వ్యవథులలో బస్సులు నడిచే వేళను అనే అర్థం స్ఫురించేందుకు "కాలవ్యవధి" అనే పదాన్ని నేనే మార్చాను. ఒక వేళ మీరు వ్రాసిన వ్యాసంలో ఎవరైనా ఏదైనా మార్పులు చేసినట్లైతే ఆ వ్యాసం పై భాగంలో గల "చరిత్రను చూడండి" బటంపై నొక్కండి. వ్యాస చరిత్ర కనబడుతుంది. దయచేసి మీరు మీ అభిప్రాయాలను గానీ, సందేహాలను గానీ వ్రాసిన తర్వాత ~~~~ అని చేర్చండి. అపుడు మీ సంతకం కనబడుతుంది.-- కె.వెంకటరమణ 16:02, 7 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పౌనః పున్యం అనునది సరైన పదం అనిపిస్తే మీరు మార్చండి. అభ్యంతరం లేదు.-- కె.వెంకటరమణ 16:02, 7 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పౌనఃపున్యం అంటే కేవలం ఒక క్షణానికో లేదా ఒక నిముషానికో అనిఅర్థము కాదు అని నా అభిప్రాయము. నిర్ణీత కాలానికి ఎన్ని? అని నా అభిప్రాయము. ఆంగ్లంలో ఫ్రీక్వెన్సి తెలుగులో పౌనఃపున్యం అనేవి రెండూ ఒకటే అర్థాన్ని కలిగి ఉన్నాయిHydkarthik (చర్చ) 16:08, 7 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Hydkarthik గారూ, ఫ్రీక్వెన్సీ అనే ఆంగ్ల పదానికి భౌతిక,గణిత శాస్త్ర పరంగా పౌనః పున్యం అనే అర్థాలున్నాయి. ఈ విషయంలో బస్సులు నడిచే సమయాల మధ్య నిర్ణీత కాల వ్యవధిని సుచించేందుకు ఆ పదం వాడాను. మీరు అనుకున్నది సరైనదని అనిపిస్తె "పౌనః పున్యం" అని మార్చండి. నాకు అభ్యంతరం లేదు.-- కె.వెంకటరమణ 16:19, 7 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికి 11-వ వార్షికోత్సవాల పుట

అలాగే తెవికి 11-వ వార్షికోత్సవాల పుటలో కొన్ని మార్పులను చేయవలసినదిగా రచయితను సంప్రదించాలనుకుంటున్నాను. ఎలా? వార్షికోత్సవ సంబరాలు అన్న ప్రయోగం శుద్ధ తప్పు. ఉత్సవము అన్నా సంబరము అన్నా ఒకటే అర్థము. కాబట్టి ఉత్సవ సంబరాలు అని అనకడదు. వార్షికోత్సవాలు లేక వార్షిక సంబరాలు అని అనాలి. ఈ విషయం పుట రచయితకు చేరవేయునదెటుల?Hydkarthik (చర్చ) 16:18, 7 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కార్తీక్ గారూ, వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/ProgramDetails వ్యాస శీర్షికలో Tewiki 11th Anniversary Celebrations కు సరైన తెలుగు అనువాదం "తెవికీ 11వ వార్షికోత్సవాలు" అనే ఉన్నది. వ్యాసంలోని ఉప విభాగంలో "11వ వార్షికోత్సవ సంబరాలు" అని ఉన్నది. దీనిపై మీ అభిప్రాయాలను ఆ వ్యాసంలోని చర్చాపేజీ అయిన వికీపీడియా చర్చ:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations లో తెలియజేయండి.-- కె.వెంకటరమణ 16:29, 7 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారికి, Anniversary == వార్షికోత్సవం, Celebrations = సంబరాలు లేదా వేడుకలు, సీతమ్మ తల్లి అంటాము తప్ప మరో పదము(లు) వాడము. వికీ మీద ప్రేమతో ఇదే అంతే అని అనుకోవచ్చును. తదుపరి frequency=పౌనఃపున్యం అనే పదము శాస్త్రములలో వాడతాము కాని, సామాజికం (శాస్త్రము) నందు కాలానికి ఎక్కడా కనిపించదనే అనుకుంటాను. frequency == వ్యవధి (కాలం) అని ఉండాలి. మనము ఆలోచన చేస్తాము, వేరొకరు ప్రశ్నిస్తారు, మరొకరు నిర్ణయము చేస్తారు. ఆలోచించే వారిని సరాసరిగా ప్రశ్నించరు (మన గురించి కాదు). నాలుగు మూలస్థంభాలు (వికీ) అంటే జీవం ఉన్న మానవులుగా అనుకోవాలేమో అని అనుకుంటున్నాను. వికీ చాలా మారాలి ఇంకా. ఎదురు చూద్దాము మార్పు కొరకు. JVRKPRASAD (చర్చ) 01:33, 8 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

2014 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. JVRKPRASAD (చర్చ) 03:09, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కార విజేత- 2014 గా ఎన్నిక అయ్యినందుకు అభినందనలు Palagiri (చర్చ) 04:41, 11 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ, 2014 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా శుభాకాంక్షలు. మీరు తిరుపతి వస్తారనుకున్నాను, కానీ రాలేదని తెలిసి నిరశ చెందాను. మిమ్ములను కలిసే అవకాశం కోల్పోయాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:10, 17 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

డి. రామానాయుడు

ప్రపంచ రికార్డు గ్రహీత దగ్గుబాటి రామానాయుడు గారి వంశవృక్షాన్ని తయారుచేయగలరా. ఒక చిన్న అభ్యర్ధన. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 15:08, 19 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, మీరు కోరినట్లు {{దగ్గుబాటి రామానాయుడు వంశవృక్షం}} అనే మూసను తయారుచేసితిని. పరిశీలించండి. అందులో చేర్చవలసినవేమైనా ఉంటే తెలియజేయగలరు.-- కె.వెంకటరమణ 18:06, 21 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:cleanup - ఎలా ఉపయోగించాలి?

Kvr.lohith గారు, ఇప్పుడు మీరు ఉపయోగిస్తున్న (AWB) మూస:cleanup - ఎలా ఉపయోగించాలో దయచేసి తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 09:24, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, ఆటోవికీ బ్రౌజరు (AWB) వాడకం ద్వారా బాటుచేయకలిగిన కొన్ని పనులూ చేయవచ్చు. దీనిని తే.21.02.2015దీ. న వైజాసత్య గారు కొందరు నిర్వాహకులకు శిక్షణనిచ్చారు. రాజశేఖర్ గారూ, విశ్వనాథ్ గార్లు ఈ బ్రౌసరు వాడకాన్ని తెసుసుకున్నారు. నేను విశ్వనాథ్ గారిని సంప్రదించి అది వాడే విధానాన్ని ఫోన్ లో , ఫేసు బుక్ ఛాటింగు ద్వారా తెలుసుకున్నాను. ఆయన సవివరంగా అన్ని విషయాలను తెలియజేశారు. తెలియజేసిన విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు. మీరు ఆయనను సంప్రదించవచ్చు. నేను ఇంకా ఈ వాడకం గూర్చి పూర్తి అవగాహనతో లేను. పూర్తిగా తెలుసుకున్న పిదప చెప్పగలను.-- కె.వెంకటరమణ 09:35, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములండి ! JVRKPRASAD (చర్చ) 09:37, 22 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Taxobox

అసిడియేషియా పేజీ ఒకసారి చూడండి. Taxobox లో ఏవో లోపాలున్నాయి. దయచేసి సరిచేయండి.--Rajasekhar1961 (చర్చ) 05:58, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ ఆ వ్యాసంలో టాక్సోబాక్స్ సరిచేసితిని.-- కె.వెంకటరమణ 13:46, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సమాచారపెట్టెలోని సమాచారాన్ని అనువదించాను. మరళ అదే సమస్య మొదలైంది. మరొకసారి చూడండి.--Rajasekhar1961 (చర్చ) 13:54, 4 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ చేశాను-- కె.వెంకటరమణ 01:29, 5 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Module:Convert/data

Sorry that I have to use English. I noticed that you have done some translations for Module:Convert/data. Thanks, but the convert modules are complex and special procedures are required for translations to work effectively. Please see User:Johnuniq/translate where I am asking for assistance. We need to leave translation of the units until after other items have been fixed. I will probably replace the data module with the current version from enwiki, but will later try to incorporate your translations into the master list of units. Johnuniq (చర్చ) 03:14, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు

హలో K.Venkataramana/పాత చర్చ 6! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

-- JVRKPRASAD (చర్చ) 06:51, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పేజీలో చేరాను. వ్యాసాల విస్తరణకు కృషిచేస్తాను.-- కె.వెంకటరమణ 16:35, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గ్యాలరీ బొమ్మల అమరిక

బొబ్బిలి పేజీలో గ్యాలరీ క్రింద బొమ్మలను చేర్చాను. వాటికి సరైన క్రమంలో ఏర్పాటుచేయగలరా. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:36, 14 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

బొబ్బిలి వ్యాసం లోని గ్యాలరీని సరిచేసితిని.-- కె.వెంకటరమణ 16:13, 27 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వేలు

వేలు వ్యాసంలో anatomy మూసను చేరిస్తే అదేదో అయింది. ఒకసారి మూసను చూసి సరిచేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:59, 27 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారూ మూసను సరిచేసితిని. -- కె.వెంకటరమణ 16:14, 27 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చక్కని మూస

{{గ్రంథాలయ పుస్తకాల జాబితా/అన్నమయ్య గ్రంథాలయం}} చక్కని మూసను తయారుచేసినందుకు ధన్యవాదాలు. తెవికీలో మూసలు తయారుచెయ్యటంలో చక్కని ప్రావీణ్యం సంపాదించినందుకు సంతోషంగా ఉంది. ఇదివరకు దేవా గారని నిర్వాహకుడు ఉండేవారు. ఆయన కూడా చాలా చక్కని మూసలు తయారుచేస్తుండేవారు --వైజాసత్య (చర్చ) 23:31, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రంథాలయాల పుస్తకాల జాబితా మూస చాలా బాగుంది. హేట్స్ ఆఫ్ రమణగారు.--Rajasekhar1961 (చర్చ) 03:50, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రాజెక్టుకు అందం ఎలా వస్తుందో తెలిసింది. అద్భుతంగా తయారు చేసారు. దయచేసి నా ప్రాజెక్టులో మీ పేరు చేర్చమని అభ్యర్ధన..--విశ్వనాధ్ (చర్చ) 05:09, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు తెలియజేసిన వైజాసత్య,రాజశేఖర్ మరియు విశ్వనాథ్ గార్లకు ధన్యవాదాలు-- కె.వెంకటరమణ 10:57, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

బెంగుళూరు దండు

ఆ స్టేషనును కన్నడం లో బెంగుళూరు దండు అనియు హిందీలో బెంగుళూరు ఛావని అనియు ఆంగ్లమున బెంగుళూరుకంటోన్మెంట్ అనియు అందురు. కంటోన్మెంట్ ను తెలుగులో కూడ దండు అని అందురు. కావున ఆ పేరు పెట్టాను. దయచేసి గమనించగలరు. ఈ పుట లో ఒక చిత్రపటం కలదు. దయచేసి అది చూడుడి... 03:24, 19 ఏప్రిల్ 2015‎ Hydkarthik (చర్చ • రచనలు • నిరోధించు)‎

ఈ జవాబు వ్రాశినది ఎవరో కానీ, భారతదేశములోని అన్ని భాషల పదాలతో వ్యాసాములు వ్రాయాలనుకుంటే సరి. అసలు బెంగుళూరు దండు అని ఇచ్చిన లింకులో తెలుగులో [2]ఎక్కడ ఉందో తెలియజేస్తే మంచిది. ఏదో వ్రాస్తే ఎలా ? కానీ ఇది తెలుగు వికీ కావున ఆ పదము చెల్లదు. సినిమాలకు కూడా అనేక పేర్లు ఒక దానికే ఉంటాయి. బెంగుళూరు దండు కన్నడ వ్యాసము, బెంగుళూరు ఛావని కాదు బైంగళూర్ కౌంట్ అని హిందీ వ్యాస జాబితాలోకి రాసుకుంటే మంచిదేమో. hydkarthik మరియు అతని యొక్క సలహాదారులు, భారతీయ రైల్వేలు నందు కాక కన్నడ మరియు హిందీ భాషలలో కొత్తగా వర్గాలను తయారు చేస్తూ ఈ విధము అయిన తెలుగు కాని వ్యాసాలు చేర్చుకోండి. ఈ గందరగోళం ఉండదు. JVRKPRASAD (చర్చ) 04:13, 19 ఏప్రిల్ 2015 (UTC)03:45, 19 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రమణ గారూ, మీరును అలోచించవలయును. బెంగుళూరు సిటీ స్టేషను యొక్క తెవికి పుటకి బెంగుళూరు నగర స్టేషను అను పేరు పెట్టినప్పుడు ఎవరును అభ్యంతర పెట్టలేదు. ఇప్పుదు మాత్రము ఈ లాగు ఎందులకు చేయుచున్నరు?..04:38, 19 ఏప్రిల్ 2015‎ Hydkarthik (చర్చ • రచనలు • నిరోధించు)‎

మీ దృష్టికి ఒక విషయము తేవదలచుకుంటున్నాను. బెంగుళూరు సిటి స్టేషను యొక్క తెవికి పుటకు "బెంగుళూరు నగర రైల్వే స్టేషను" అని పేరు పెట్టినప్పుడు ఆ స్టెషను భారతీయ రైల్వేలో ఎక్కడ ఉంది అని మీరు అడగలేదు కదా. ఈ విషయంలో మాత్రం ఈలాగు ఎందుకు చేయుచున్నారు? దండు అనునది కన్నడ పదము మాత్రమే కాదు. తెలుగు పదము కూడాను. గమనించగలరు.భారతదేశములోని అన్ని భాషల పదాలతో వ్యాసాములు వ్రాయవలెనని నాకు ఉద్దేశ్యము లేదు. అది తెలుగు పదమే. సినిమాలకు కూడా అనేక పేర్లు ఒక దానికే ఉంటాయి అని మీరు అన్నది నాకు అర్థము కాలేదు. దయచేసి విశదీకరించండి. లింకు చూడండి. -- 04:46, 19 ఏప్రిల్ 2015‎ Hydkarthik (చర్చ • రచనలు • నిరోధించు)‎

  • Hydkarthik గారూ, మీరు పంపిన లింకు] లోని చిత్రంలోని రైలుపైగల వ్రాత ప్రకారం "బెంగళూరు దండు" అని, పేజీ శీర్షికలో "విజయవాడ - బెంగుళూర్ కంటోన్మెంట్. ప్యాసింజర్" అని ఉన్నది. అధికారిక వెబ్సైట్ లోని శీర్షిక ప్రకారం మూలాన్నిచ్చి వ్రాయునపుడు వ్యాస శీర్షిక "బెంగళూరు కంటోన్మెంట్ రైల్వేస్టేషను" అని ఉండాలి. గమనించగలరు. contonment అనే పదానికి తెలుగు లో సైనిక ప్రదేశం అనే అర్థం ఉన్నది. కన్నడ భాషలో దాని అర్థం ದಂಡುನೆಲೆ,ಕಂಟೋನ್ಮೆಂಟು అని ఉన్నది. అందువల్ల కర్ణాటక లోని రైల్వే స్టేషను కనుక వారు చిత్రంలో చూపినట్లు బెంగళూరు దండు అని వ్రాసారు. అందువల్ల మీరు సృష్టించిన "బెంగళూరు దండు రైల్వేస్టేషను" ను "బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను" గా మార్చవలసి ఉంటుంది.
  • తెలుగు భాషలో contonment అనే పదానికి "దండు" అని అర్థం గల అంతర్జాల నిఘంటు ఆధారాలు ఏమైనా తెలియజేయగలరా?
  • మీరు తెలుగు భాషపై మక్కువతో నామవాచకములైన పదాలను తెలుగు లోనికి మార్చడానికి ప్రయత్నించరాదు.
  • బెంగళూరు సిటీ రైల్వేస్టేషను అని ఉండాలని మీరు భావించినపుటు బెంగుళూరు నగర రైల్వేస్టేషన్ వ్యాస చర్చా పేజీలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. మీ కోరిక ప్రకారం బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ వ్యాసాన్ని దారిమార్పు చేసాను.
  • సినిమా పేర్ల విషయంలో ఒక సినిమా "దిల్" అని తెలుగులో వచ్చింది. మనం తెవికీ వ్యాసంగా వ్రాసినపుడు "దిల్" అనే శీర్షికతోనే వ్రాయాలి కానీ. "హృదయం" అని వ్యాసం వ్రాయరాదు.
  • ఆంగ్ల పుస్తకం tell me your dreems అని ఉన్నచో "మీ కలలు చెప్పండి" అని వ్యాసం వ్రాస్తామా! టెల్ మీ యువర్ డ్రీమ్స్ అనే వ్రాస్తాము.
  • దయచేసి అర్థం చేసుకొని అనవసర చర్చల జోలికి పోకండి. మీరు తెవికీలో మంచి వ్యాసాలు వ్రాసే సమర్థులు యిదివరకు తిరువిడందై అనే మంచి వ్యాసాన్ని అందించారు. మీ కృషిని కొనసాగించాలని మా విన్నపం.-- కె.వెంకటరమణ 13:15, 19 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సప్తగిరి వడిబండి

I noticed that you tagged సప్తగిరి వడిబండి for deletion because it didn’t have correct heading. You shouldn't do that. You should move the article to correct page title. Thank you Supdiop (చర్చ) 14:09, 19 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Supdiop గారూ మీ కోరిక ప్రకారం వ్యాసాన్ని సప్తగిరి ఎక్స్‌ప్రెస్ కు తరలించితిని.-- కె.వెంకటరమణ 22:13, 21 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

వెంకట రమణ గారికి, దిగవల్లి రామచంద్ర ధన్యావాదాలు. మా దిగవల్లి వంశవృక్షము ఇప్పుడే చూశాని. నిన్న రాలేదు. అది తాయారు పెట్టినందుకు మీకు, మిమ్మ ప్రోత్సహించి నందుకు డాక్టరు రాజశేఖర్ గారికి అభినందనలు ధస్యవాదులు. కొన్ని సవరణలు చేయాల్సివున్నది. నేను వాటిని వివరంగా చాసి మళ్లీ వ్రాస్తాను --దిగవల్లి రామచంద్ర (చర్చ) 06:10, 21 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తల్లాప్రగడ సుబ్బారావు గారి వ్యాసం తయారుచేశారు. వారిని దిగవల్లి వంశవృక్షంలో చేర్చండి.--Rajasekhar1961 (చర్చ) 12:55, 21 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
దిగవల్లి రామచంద్ర గారికి మీ వంశవృక్షం తయారుచేసే భాగ్యం నాకు కలిగినందుకు ధన్యుడను. మీతరానికి సంధించిన వివరాలను, ఆ వంశవృక్షంలోని లోపాలను, చేర్చవలసిన అంశాలను తెలియజేస్తే వాటిని కూడా చేర్చవచ్చు.-- కె.వెంకటరమణ 22:16, 21 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారూ మీరు తెలియజేసినట్లు తల్లాప్రగడ సుబ్బారావు గారుని మూసలో చేర్చాను.-- కె.వెంకటరమణ 22:16, 21 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకట రమణ గారికి. మా వంశ వృక్షంలో కొన్ని చిన్న మార్పులుఈ క్రింద ఇచ్చిన పట్టిక ప్రకారం చేయాలి.

I request you to make the following corrections in దిగవల్లి వంశవృక్షం. I thank you in advance

Generation number colour of the square What is written there What is to be written Any other change to be carried out
2nd Generation గులాబీరంగు గడి రంగ రాజు రాగ రాజు Nil
5th Generation కాషాయ రంగు గడి 1730 -1790 1734 - 1790 1734 -1790 ని వెంకయ్య గారి గడిలో పెట్టాలి. నాగువమ్మదాంట్లో కాదు
6th generation నీలి రంగు గడి 1790 -1852 1760 - 1850 1790-1850 ని రామలింగం గడిలో పెట్టాలి సీతమ్మ దాంట్లో కాదు
7th generation ముదురు కాషాయి రంగు 1794- 1856 ని తిమ్మరాజు గారి గడి లో పెట్టాలి, సీతమ్మదాంట్లో కాదు
8th generation నిమ్మ రంగు గడి వెంకటరత్నంగారిక మొదటి భార్య సీతమ్మ ని చేర్చాలి
9th generation అరటి పసుపు మహలక్ష్మి సీతాసుందరి కి మధ్య సీతాపతి తమ్ముడుని చేర్చాలి
9th generation అరటి పసుపు సీతాపతి ని చేర్చిన తరువాత మొదటి నలుగురు కి తల్లి సీతమ్మ
9th generation అరటి పసుపు చివరి ఇద్దరకీ ((సీతాసుందరి, వేంకటశివరావు) కు తల్లి సూర్యమాణిక్యాంబ

10th generation 10 generation is to be added: I will send it by e mail to Dr.Rajasekhar garu --దిగవల్లి రామచంద్ర (చర్చ) 14:47, 22 ఏప్రిల్ 2015 (UTC) Required corrections I prepared as table and pasted above but I find that they come up like a running text. I will send the table and the 10th generation to Dr. Rajasekhar.--దిగవల్లి రామచంద్ర (చర్చ) 15:16, 22 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

దిగవల్లి రామచంద్ర గారూ, మీరు చేర్చిన అంశాలను పట్టికరూపంలోనికీ మార్పు చేసితిని. అందులో మీరు తెలియజేసిన అంశాలను మూసలో చేర్చితిని. 10,11 వ తరాల వారి వివరాలను అందించండి. టెక్స్ట్ రూపంలో ఉన్ననూ పట్టికరూపంలోనికి మార్పు చేయుదును. ధన్యవాదములు-- కె.వెంకటరమణ 17:47, 22 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్లవిషయం ఉన్న వ్యాసాలు

రమణ గారూ, ఆంగ్ల విషయం ఉన్న వ్యాసాలు తొలగించాలని, వ్యాసంలో ఉన్న ఆంగ్ల విషయం తొలగించాలని రచ్చబండలో ప్రతిపాదన చెయ్యండి. అలాగే చర్చించి, ఆయా వ్యాసాలను తొలగిద్దాం, లేదా ఆంగ్లభాగాలను మరుగునపెట్టడమో, తొలగించడమో చేద్దాం. మీరు చంద్రకాంతరావుగారిలా తెవికీలో చక్కని నిర్వాహకులుగా పరిణితి చెందినందుకు సంతోషంగా ఉన్నది. --వైజాసత్య (చర్చ) 11:31, 21 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారూ రచ్చబండలో ఆంగ్ల వ్యాసాల తొలగింపు ప్రతిపాదన చేసాను. వాటి జాబితా తయారుచేయడానికి సహాయం అందించగలరు.-- కె.వెంకటరమణ 22:32, 21 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అభ్యర్థన

Venkataramana garu, I am surprised that you work till late hours and attended to my request promptly. God bless you. I am pasting here under the required information for creating 10th and 11th generations in our digavalli family tree. Kindly do the needful

ADDING 10TH AND 11TH GENERATIONS IN DIGAVALLI FAMILY TREE

  • From B/F 9th Generation couple : Digavalli Venkata Sivara Rao (1898-1992)=Kamala
add 10th generation: (1)Jaylakshmi (1930-1998)=Bendapudi Sarveswararao, (2)BalaTripura Sundari (1932-2008)=Kotamraju Janardhanarao, (3)Digavalli Venkata Ratnam (1936-2010)=Vijayalkshmi (4) Digavalli Suryanarayana Murthy (1938)=Rajarajeswari, (5) Lallitha(1940)=Arikapalli Ramachandra rao, (6)Digavalli Ramachandra (1943)=Jayalakshmi, (7)Suryamanikyamba(1948)=Machiraju Suryanarayana Murthy
  • From B/F 10th generation 1st Couple Jayalkshmi(1930-1998)=Bendapudi Sarveswararao :
11th generation: Bendapuri Perraju
  • From B/F 10th generation 2nd Couple Bala Tripura Sundari(1932-2008)=Kotamraju Janardhanarao:
11th generation: (1) Narasingarao(1954),(2)Venkata Sivarao(1956), (3)Venkateswarulu(1958),(4)Aswani(1960), (5) Sudhakar(1962), (6)Sreenivasarao(1964)
  • From B/F 10th generation 3rd Couple: Digavalli Venkata Ratnam(1936-2010)=Vijayalakshmi
11th generation : (1) Kamala Sundari (1960)= Choragudi Prasad, (2) Syamala(1962)=Vaddadi Udaya Sankar, (3)Digavalli Venkata Sivarao(1965)=Neeta Meharotra
  • From B/F 10th generation couple: Digavalli Suryanarayana Murthy (1938)=Rajarajeswari
11th generation : (1)Digavalli Sreenivasarao(1968)=Kasthuri, (2)Pavani(1971)=Challapalli Ramesh, (3)Pallavai(1973)=Kalapath Ramana
  • From B/F 10th generation couple: Lalitha(1940)=Arikapalli Ramachandra rao
11th generation (1)Arikapalli Giridhararao(1963)=Rekha, (2)Arikapalli Sekharrao(1964)=Uma, (3)Leaorao(1972)= RichaArora
  • From B/F 10th generation couple: Digavalli Ramachandra(1943)=Jayalakshmi
11th generation: Kamala Bindu(1979)=Chayanam BKP Sarma
  • From B/F 10th generation couple: Suryamanikyamba(1948)=Machiraju Suryanarayana Murthy
11th generation: Padma Deepthi(1985)=Thatavarthy Kiran Raj
  • I have also sent handwritten tree showing only 10th 11th generation to Dr. Rajasekhar. Excuse me for writing in English.

--దిగవల్లి రామచంద్ర (చర్చ) 03:31, 23 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

దిగవల్లి రామచంద్ర గారూ మీ కోరిక ప్రకారం పైన తెలియజేసిన 10,11 వ తరాలను చేర్చితిని.-- కె.వెంకటరమణ 17:55, 23 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు చాలా ధన్య వాదులు. నేను ఇప్పుడే చూశాను. --117.195.128.108 02:44, 24 ఏప్రిల్ 2015 (UTC)(దిగవల్లి రామచంద్ర ఐ.పి.నెంబరుతో సంతకం)[ప్రత్యుత్తరం]
దిగవల్లి రామచంద్ర గారూ, మీ కోరిక ప్రకారం అన్ని అంశాలను చేర్చితిని. దిగవల్లి వంశ వృక్షం అయినందున ఆడపిల్లల కుటుంబాల వివరాలు మూసలో తొలగించితిని.దిగవల్లి కుటుంబానికి చెందినవారిని మాత్రమే సూచిండడం జరిగినది.ఇంకా ఏమైనా సమాచారం చేర్చవలసి ఉన్నా తెలియజేయండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 12:37, 24 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తల్లాప్రగడ సుబ్బారావు

వెంకటరమణ గారు, మా వంశ వృక్షములో తల్లాప్రగడసుబ్బారావుగారిని చేర్చటం చాల మంచి పని చేశారు. thanks please put the year of his life time 1856-1890 that is important and give links at his name when it appeared in Digavalli Thimmaraju gari article and vice versa. Sorry for the trouble.--దిగవల్లి రామచంద్ర (చర్చ) 10:53, 23 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

దిగవల్లి రామచంద్ర గారూ, తల్లాప్రగడ సుబ్బారావు గారి భార్య సుందరమ్మ అని ఉన్నది. వ్యాసములో ఆయన మేనమామ వెంకటరత్నం కుమార్తె సుందరమ్మ ఒక్కరేనా? సందేహ నివృత్తి చేయగలరు.-- కె.వెంకటరమణ 12:39, 24 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అవును వెంకటరమణగారు, ఇద్దరూ సుందరమ్మలే, అందుకనే 7వ తరం వెంకటశివరావు(1829-1892)గారి భార్య సుందరమ్మగారిని మానాన్నగారి డైరీ లో పెద్దసుందరమ్మ అని వున్నది . చాల ధన్యవాదాలు మీకునూ డాక్టరు రాజ0శేఖరం గారికి.--117.213.233.30 13:16, 24 ఏప్రిల్ 2015 (UTC) (దిగవల్లి రామచంద్ర ఐ.పి.నెంబరుతో సంతకం)[ప్రత్యుత్తరం]

మూలకాలు-మూస

రమణ గారు,ప్రస్తుతం నేను మొలకలుగా ఉన్న మూలకాల వ్యాసాలను విస్తరిస్తున్నాను,ఈ క్రమంలో ఈ వ్యాసాలకు మూలల వ్యాసాల పేర్ల మూసను జోడిస్తే బాగుంటుందని భావిస్తున్నాను.ఈ మూసతయారులో మీరు సహాయం చెయ్యగలరా?Palagiri (చర్చ) 08:01, 24 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మిత్రులు పాలగిరి రామకృష్ణారావు గారూ, మూలకాల మూస అవసరం ఉన్నది. మూసలో ప్రాతినిధ్యమూలకాలు, జడవాయువులు,పరివర్తన మూలకాలు, అంతరపరివర్తన మూలకాలు విభాగాలుగా చేర్చి అందులో ఆయా గ్రూపులను ఉప అంశాలుగా చేర్చి అందులో మూలకాలను చేర్చితే బాగుంటుంది. నేను తయారుచేసేందుకు ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 12:33, 24 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
మిత్రులు పాలగిరి రామకృష్ణారావు గారూ, మీరు రసాయన మూలకాల వ్యాసాలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు కోరినట్లు {{రసాయన మూలకాలు}} మూసను తయారు చేసాను. పరిశీలించండి. లాంథనైడ్లు, ఆక్టినైడ్లు కూడా చేర్చుతాను. ఏవిధమైన మార్పులు చేయలన్నా తెలియజేయండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 00:51, 25 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పెళ్ళకూరు జయప్రద

పై వ్యాసాన్ని విస్తరించేందుకు మరి కొంత సమయం కావాలి. అంత వరకు ఓపిక పట్టగలరు --స్వరలాసిక (చర్చ) 03:32, 27 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ, వ్యాసం విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. సమయం తీసుకోండి. మీరు విస్తరిస్తున్నారు.మొలక స్థాయి దాటే వరకు ఆ వ్యాసం లో {{in use}} మూసను ఉంచండి.-- కె.వెంకటరమణ 00:51, 28 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

List of post-nominal letters (United Kingdom) వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

రమణ గారూ, List of post-nominal letters (United Kingdom) అనే వ్యాసాన్ని మౌంట్‌బాటన్ వ్యాసంలో ఉపయోగించిన మూస:post-nominals కొరకు ఆంగ్ల వికీ నుండి తీసుకోవడం జరిగింది. ఈ వ్యాసాన్ని తొలగిస్తే ఆ మూస సరిగా పనిచేయకపోవచ్చు. గమనించి తగు నిర్ణయం తీసుకోగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:18, 27 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ దీనిని తొలగించినా మూస సరిగానే పనిచేయుచున్నది. సదరు వ్యాసంలో కూడా మార్పు లేదు. కనుక తొలగించితిని.తరువాత ఏవైనా మార్పులు వస్తే సరిచేయవచ్చు.--- కె.వెంకటరమణ 00:48, 28 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రమణ గారూ, అటులనే. ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:51, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రొయ్య సంబంధిత వ్యాసాల విలీనము

రమణ గారూ రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలను రొయ్య వ్యాసంలో విలీనము చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను రొయ్య చర్చా పేజీలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:51, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారు మీరన్నట్లు రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలు మొలక స్థాయిలో ఉన్నాయి. వాటిని రొయ్య లో విలీనం చేస్తే మంచి వ్యాసంగా తయారవుతుంది. అయితే ఈ విలీన విషయాల గురించి సంబంధిత మూడు వ్యాసాలలో కూడా {{విలీనం|రొయ్య}} అనే విలీన ప్రతిపాదన ట్యాగును చేర్చి చర్చ జరగాలి. ఆ చర్చలో విలీనం చేయవచ్చు అనే అభిప్రాయం వస్తే వెంటనే విలీనం చేయవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 07:08, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సూచనకు ధన్యవాదములు రమణ గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:02, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటిపేజీ నిర్వహణకి గుర్తింపు

బంగారు వికీపతకం
2014 లో మొదటి పేజీ నిర్వహణకు విశేషకృషి చేసిన వెంకటరమణ గారికి అభినందనలు. గుర్తింపు గా అందుకోండి ఈ బంగారు వికీపతకం.--అర్జున (చర్చ) 09:10, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పతకము అందుకొన్న సందర్భముగా హృదయపూర్వక అభినందనలు రమణ గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:03, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు

కోట వేంకటాచలం పేజీలో బొమ్మను చేర్చాను. కానీ అవి కనిపించడం లేదు. ఏదో లోపం ఉన్నది. దయచేసి సవరించండి.--Rajasekhar1961 (చర్చ) 06:36, 1 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చేశాను--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 10:09, 13 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సముదాయేతర సంస్థలు

వెంకటరమణ గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 06:08, 3 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పనప్పాకం అనంతాచార్యులు

మీరు సృష్టించిన వ్యాసం "పనప్పాకం అనంతాచార్యులు" అని వున్నది. కానీ అనంతా చార్యులు గారి ఇంటి పేరు "పనప్పాకం" కాదు ప న స్పా కం" నేను నిన్న రాత్రి అది గమనించకుండా ఇంకా చాలా విషయాలు జతచేర్చటాని పూనుకుని మొదలు పెట్టాను. లైట్లు పోయాయి. ఇవాళ పొద్దున్న చూసేటప్పటికి ఈ పొరపాటు కనపబడింది. మీరు మొదలు పెట్టిన వ్యాసం పేరు సరి చేయటం ఎలా?. అది నీలుగాక పోతే నేను కొత్తగా మొదలు పెట్టమంటారా? వారిని గూర్చి మానాన్నాగారు చాల గొప్ప గా వ్యాసం వ్రాశారు. అందులో చాలా విశేషాలువున్నవి.--దిగవల్లి రామచంద్ర (చర్చ) 01:33, 13 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

దిగవల్లి రామచంద్ర గారూ ఈ వ్యాసం నేను ప్రారంభించినది కాదు. మీ సూచన మేరకు పనస్పాకం అనంతాచార్యులు గా దారిమార్పు లేకుండా తరలించాను. ఆయన గూర్చి ఏ విధమైన తెలుగు మూలాలు లభ్యమగుటలేదు. కానీ ఆంగ్లలో హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ మరియు 1947 నుండి వెలువడిన తెలుగు జర్నల్స్ లో 89వ నామం వంటి లింకులలో "పనప్పాకం అనంతాచార్యులు" అనే ఉన్నది. పరిశీలించి ఏది సరియైనదో చూడగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:07, 13 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకట రమణ గారు, ధన్యవాదులు. ఇప్పుడు నేను ఈ వ్యాసమును విస్తరించటం మొదలు పెట్టాను. ఇవాళ్టి కి పరిచయం తిరగవ్రాశాను. చూడండి. మీ సలహాలు అందచేయండి--దిగవల్లి రామచంద్ర (చర్చ) 06:27, 13 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణగారు, క్షమించాలి పైవ్యాసము పనప్పాకం అనంతాచార్యులు నేను మిమ్ములను పోరపాటుగా పనస్పాకం అని దారి మళ్లింప చేయమన్నాను. క్షమించి పనప్పాకం అనే వుంచండి. రాజశేఙర్ గారితో ఇప్పడే చెప్పాను--దిగవల్లి రామచంద్ర (చర్చ) 14:06, 13 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకటరమణ గారు. క్షమించాలి పనప్పాకం అని వున్నదానిని మీచేత పొరపాటున పనస్పాకం గా దారి మళ్ళింపమని కోరాను. అది పొరపాటైపోయింది. క్షమించి దానిని రద్దు చేసి పనప్పాకం అనే వుంచమని ప్రార్ధించుచున్నాను. ముందు చాల జాగ్రత్తాగా వుంటాను--దిగవల్లి రామచంద్ర (చర్చ) 14:10, 13 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారు మీ అభ్యర్థన మేరకు పనప్పాకం అనంతాచార్యులు వ్యాసానికి మరల దారిమార్పు చేసారు.పనప్పాకం అనంతాచార్యులు మరియు పనప్పాకం ఆనందాచార్యులు ఒకె వ్యాసం అయినందున వాటిని విలీనం చేయడం జరుగుతుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 15:38, 13 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

దన్యవాదాలు సార్

గేట్ పాస్ అయిన విద్యార్ధికి 1వ పలితం లా అంత సంతోషం కలిగింది నాకు. నాంచారిమడూర్ పేజికిని చూసే ప్రతిసారీ మీ పేరు గుర్తుకు వచ్చేలా అనుబందం ఏర్పుడింది. దన్యవాదాలు సార్. --నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 04:35, 19 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వై.వి.రావు వంశవృక్షం

వై.వి.రావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతని కుమార్తె ప్రముఖ నటి లక్ష్మి (నటి); ఈమె కుమార్తె ఐశ్వర్య. వై.వి.రావు గారి ఇద్దరు భార్యలు వై.రుక్మిణి కూడా ప్రముఖ నాట్యకత్తెలు. వీరి వంశవృక్షం తయారుచేస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:50, 20 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

{{యెర్రగుడిపాటి వరదరావు వంశవృక్షం}} చేశాను--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 13:53, 20 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించిన కేబుల్ టీవీ పేజీ

బారత దేశంలో కేబుల్ టీవీ ద్వార కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యక్షంగా 60,000 వెయ్యిల మంది కేబుల్ ఆపరేటర్లుగా వారి వద్ద పనిచేసే వర్కులు , పరోక్షంగా అంటే వైర్ల కంపేనిల వర్కులు, వైర్ల అమ్మకం దార్లు వర్కులు, మీడీయా కూడా ఇలా మరో 2,50,000 మంది అదే విదంగా దేశం లో చూస్తే ఒక కోటి కుటుంబాలు కేబుల్ టీవీ పైన ఆదారపడి ఉన్నవి. ఇలాంటి కేబుల్ టీవీ పేజీ తొలగించారా ఉన్నదా అర్ధం కాలేదు తెలుపగలరు.--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 10:03, 22 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

బ్రహ్మజోస్యుల సుబ్రహమణ్యం

బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గారి పేరు ను సరిదిదిపెట్టి నందుకు ధన్యవాదులు. అదే అడుగ బోతున్నాను మీరు చేశారు. Thank you--దిగవల్లి రామచంద్ర (చర్చ) 05:22, 26 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అల్లువారి వంశవృక్షం

అల్లు రామలింగయ్య గారి వంశవృక్షం తయారుచేయగలరు. చిరంజీవి, నాగబాబు, పవన్, అల్లు అర్జున్ మొదలైన వారందరినీ అందులో చేర్చండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:39, 30 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారూ {{అల్లురామలింగయ్య వంశవృక్షం}} మరియు {{చిరంజీవి వంశవృక్షం}} తయారుచేసితిని--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 16:54, 1 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

దిగవల్లి వంశవృక్షము మూస సహాయం

దిగవల్లి వంశవృక్షము లో వెనిలా రంగు గడి పదకొండో తరం గడి లో పల్లవి భర్త పేరు "కళాపథ్ వెంకటరమణ" అని అప్పట్లో నాకు తెలిసినది చెప్పాను. ఇప్పడు నాకు కరెక్టుగాతెలిసినది వారింటిపేరు "కళాపటపు" కావున దయచేసి "కళాపథ్" ను "కళాపటపు" గా మార్చటానికి సహాయముచేయగోరుచున్నాను. ధన్యవాదం--దిగవల్లి రామచంద్ర (చర్చ) 14:03, 1 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

{{దిగవల్లి వంశవృక్షం}} సరిచేసాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:29, 1 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన

సర్,
నా పేరు వుక్కుం మహేష్ కుమార్ (vmakumar) డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా మండపేట (తూర్పు గోదావరి జిల్లా) లో పనిచేస్తున్నాను. నెను కొత్తగా వికిపీడియా లొ వ్యాసాలు రాసే ప్రయత్నం ప్ర్రారంభించాను.
ఈ విషయంలో నేను నాకు తెలిసిన, అవగాహన వున్న అంశాలపై తెలుగు వికిలో వ్యాసాలూ తీర్చి దిద్దే ప్రయత్నాలు చేయదలుచుకోన్నాను. ఈ ప్రయత్నంలో నాకు ఎదురయ్యే సందేహాలను సందేహనివృత్తికై వికీ సీనియర్ ల ముందు ఉంచుతున్నాను. నా ఈ మెసేజ్ మీకు చేరే కరెక్ట్ వేదిక ఈ చర్చా పేజీ అని భావించి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సర్, తొలి ప్రయత్నంగా “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే వ్యాసాన్ని రాసాను. ఇది గత కొన్ని రోజులనుండి రూట్ మారి “పూర్ణమ్మ” అనే వ్యాసంలో వేలీన మైనది. అసలు “పూర్ణమ్మ” అనే పేజీని ఎవరి ఖాతాలో సృష్టించబడినదో నాకు తెలియదు. ఆ పేజీలోకి నేను రాసిన వ్యాసం (“పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” పేరు మీద వున్నది) దారి మళ్ళించబడింది. వ్యాస విషయం ఒక్కటే కాబట్టి మళ్ళించాలని ఇతరులు చేసిన సూచనలు చదివాను. అయితే కొత్త కాబట్టి ఎలా స్పందించాలి. ఎక్కడ, ఎవరితో నా వాదన చెప్పాల్సి వుంటుంది తెలియడం లేదు. తెలుగు వికీ పరిచయ పేజీలు సూచనల పేజీలలోని కనిపించే తెలుగుపదాల మాలాంటి కొత్తవారికి ఒక పట్టాన్న అర్ధం కాకపోవడంతోను, ఇంకా వికీ రచన అలవాటు పడకపోవడం వలన ఏమి చేయాలో తెలియక మిన్నకుండడం జరిగింది. ఈ లోపులో పూర్ణమ్మ పేరు గల వ్యాసం లొకి మార్చబడింది. (వ్యాస విషయం మార్చనందుకు థాంక్స్) (మార్చినది లోహిత్ గారు కావచ్చు. వెంకర రమణ గారు కావచ్చు లేదా ఇతర వికీ సీనియర్లు ఎవరైనా కావచ్చు) ఈ సందర్భంలో నాకు వచ్చిన సందేహాలను మీకు తెలియ చేసుకొంటున్నాను. ఇది మీకు (నా మెసేజీ) కనిపిస్తుందో, లేదో, కనిపించాలంటే తెలుగు వికిలో ఎలా ప్రయత్నించాలో తెలియకుండానే ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాను. ఈ సందేహాలనే ఇంకో ఇద్దరు ముగ్గురు మన తెలుగు వికీ సీనియర్ లకు కూడా పంపించే ప్రయత్నం చేస్తాను. ఒకరైనా చూసి స్పందించగలరని ఆశిస్తాను. ఇక్కడ కొత్త వికీ ప్రవేశకుడిగా వాకు నాలుగు విషయాలకు సంబంధించి సందేహాలున్నాయి. మీకు వీలయితే సందేహ నివృత్తి చేయగలరు.

  1. మొదటిది

ఎవరైనా ఒకరు రాసిన వ్యాసాన్ని (వ్యాస విషయం మార్చనప్పటికి) వ్యాసాన్ని వేరే పేజీలోనికి మార్చవలేనని వేరే ఎవరైనా సూచన పంపిస్తే ఆ సూచనను ఆధారం చేసుకొని మరెవరైనా మార్చవచ్చా? ఇలా ఇంకో పేజీలోకి మార్చడానికి ఎవరికీ సాధికారత వుంది. సూచన చేయబడినప్పుడు, దానికి జవాబు రానపుడు, ఆ సూచన వున్నది అన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని ఎవరికి వారు నిర్ణేతలుగా మారి దారి మళ్ళింపు చేయవచ్చా ? ఈ విధంగా థర్డ్ పార్టీ నిర్ణేతగా ఎవరికీ వారు తమ వివేకానుసారం నిర్ణయాలు తీసుకోనవచ్చా ? వికీపీడియా “అందరిది, మార్పులు చేర్పులు ఎవరైనా చేయవచ్చు” అంటున్నారు. కాని మన “తెలుగు వికి”లో మార్పులు చేర్పులు చేసే సాధికారత నిజంగా ఎవరికున్నది? డెమొక్రసి లో అధికారం ప్రజలదే అన్నప్పటికీ, వారి తరుపున ఎన్నికైన ఏ కొద్ది మంది ప్రభుత్వవర్గాలే నిజమైన అధికారం చెలాయించడం చూస్తున్నాము. ఇక్కడ తెలుగు వికిలో మార్పులు చేర్పులును పర్యవేక్షించే అధికారం గాని సాధికారత గాని ఎవరికైనా/ఎన్నికైన ప్రతినిధివర్గం కైనా వున్నదా? సర్, నిజంగా ఇటువంటి వ్యవస్థాగతమైన పద్దతి లేకపోతే అది చెడు సంప్రదాయాలకు దారి తీసే ప్రమాదం వుంది. ఒకరు రాసిన వ్యాసాల్ని వేరొక పేజీలోకి మళ్ళించదానికి ఆకతాయిలు సిద్ధంగా వుంటారు. వ్యవస్థాగతమైన పర్యవేక్షణ లేకపోతే అటువంటి వారి IP అడ్రస్ ను బ్లాక్ చేయదమే మనం చేయగలం కాని వేరే సైట్స్ నుండి నెట్ అడ్రస్ ల నుండి అడ్రస్ లు మారుస్తూ ద్వంసo చేయడమే పనిగా పెట్టుకోనేవారిని ఏ విధంగా నిరోధించగలం? ఈ సందేహం నాకు చాల రోజుల నుండి తొలుస్తుంది. కాస్త వివరించగలరు. ఇది పైన పేర్కొన్న వ్యాసాన్ని విలీనం చేసినందుకని కాదు. జనరల్ గా అడుగుతున్నాను.

  1. రెండవదిబొద్దు పాఠ్యం

మన తెలుగు వికీలోని తెలుగు పద ప్రయోగాలు కొత్తగా వికీ లో ప్రవేశించేవారికి చాలా కొత్తగాను కొరుకుడు పడనట్లుగా ఉంటున్నాయి. తెలుగు మీడియం లో చదువుకొన్న వారికి కూడా అసలు అర్ధం కాకుండా ఉన్నంతగా వున్నాయి. ఉదాహరణకు ” వాడుకరి “ పద ప్రయోగం. USER అనే పదానికి సరిపడ చక్కని తెలుగు పదం అని తెలిసీ చాలా ఆనందించాను. కాని ఈ కొత్త తెలుగు పదం ఎంతమంది తెలుగు నెటిజన్లకు తెలుసంటారు. ఇటువంటి పదాలే మరికొన్ని ‘సముదాయ పందిరి’, ‘మొలకలు’, ’పరికరాల పెట్టె’,'మునుజూపు చూపు'బొద్దు పాఠ్యం. సర్ ఇటువంటి కొత్త పదాలని వికీ లో ఉంచేటప్పుడు సామాన్యులకు కూడా తెలిసేటట్లు బ్రాకెట్ లో ఇంగ్లీష్ పదాన్ని వుంచడం ఒక ప్రామాణిక పద్దతి. ఉన్నత ప్రమాణాలతో తెలుగు వికీ పరిచయ పేజీలను ఆశించే మాలాంటి వారికి, కొత్త వికీ రచయితలకు ఇది ఎంతో సహకారిగా వుంటుంది. మరో పద్దతిలో తెలుగు వికీ పరిచయ, సూచనల పేజీలలో (ఆర్టికల్స్, వ్యాసాలలోని తెలుగు పదాలకు ఇంగ్లీష్ సమానార్ధకాలవసరం లేదు) లో కనిపించే కొత్తగా వున్న తెలుగు పదాలకి సమానార్ధకాలుగా వున్న ఇంగ్లీష్ పదాలతో ఒక గ్లోసరీ ని ఏర్పాటు చేసి ఒక పేజీలో విడిగా ఇస్తే ఎంతో సహకారి గా వుంటుంది. ముఖ్యంగా తెలుగు భాష ఇంగ్లీష్ భాషతో కొత్త కొత్త పోకడలతో సంకరణం పొందుతున్న కంప్యూటర్ రోజులలో తెలుగు భాషను రక్షించుకోవడం కోసం తెలుగు వారి విజ్ఞాన సర్వస్వం గా తెలుగు వికీ రూపుదిద్దు కోవడానికి చేసే బృహత్ ప్రయత్నంలో వికీ పరిచయ, సూచనల పేజీలలో ఇంగ్లీష్ భాషకు కూడా కాస్త చోటివ్వవలిసినదిగా కోరుతున్నాము. ఒక భాషను పైకెత్తడానికి ఆ భాషలోని నూతన పద ప్రయోగాలను ఆహ్వానిస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో ఇంగ్లీష్ భాషను అంటరాని భాషగా చూడవద్దని మా కోరిక. తెలుగు భాషను ప్రాచుర్యం చేసే ప్రయత్నం లో ఇంగ్లీష్ భాషను కూడా కాస్త కలుపుకు పోవలిసినదిగా కోరుతున్నాము.

  1. మూడవది :వికీపీడియా లో వ్యాసాల విలీనానికి సంభందించినంతవరకు “హెడ్డింగ్” కు ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంది. ఉదాహరణకు ఒకే ఇతివృత్తంతో, ఒకే రకమైన హెడ్డింగ్ తో, రెండు ఆర్టికల్స్ వేర్వేరు కాలాలలో రాయబడినప్పుడు ఏ ఆర్టికల్ ని - ఏ ఆర్టికల్ లో విలీనమవ్వాలని ప్రతిపాదనలు చేయవచ్చు(ఎందుకంటే ఇతివృత్తం ఒకటేకాబట్టి) .

అంటే ఒకే హెడ్డింగ్ ఒకే ఇతివృత్తాంతం రెండు ఆర్టికల్స్ రాయబడి వున్నప్పుడు ఎక్కువ content వున్న వ్యాసంలో తక్కువ content వున్న వ్యాసాన్ని విలీనమవ్వాలని సూచన చేయాలా ? లేదా తక్కువ content వున్న వ్యాసం లో ఎక్కువ content వున్న వ్యాసాన్ని విలీనం చేయాలని సూచించాలా? . సర్ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే “పూర్ణమ్మ” హెడ్డింగ్ తో ఒక వ్యాసం చాల కొద్ది మేటర్ తో చాలా కాలం నుంచి తెలుగు వికిలో కొనసాగుతూ వుంది. అయితే నేను 2,3 నెలల క్రితం “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే వ్యాసాన్ని తోలి ప్రయత్నం గా వికిలో రాయగలిగాను. అయితే రెండింటి ఇతివృత్తాంతం ఒకటే (కన్యాశుల్కం) అయినప్పటికీ ఈ రెండవ వ్యాసంలోనే మేటర్ ఎక్కువగా వున్నది. ఇప్పుడు రెండు వ్యాసాలకు ఒకటే ఇతివృత్తాంతం కాబట్టి తోలి వ్యాసంలో (మేటర్ తక్కువున్నదానిలో) మలి వ్యాసం(మేటర్ ఎక్కువ వున్నదానిని) విలీనం చేయాలా? లేక ఒకటే హెడ్డింగ్ , ఇతివృత్తాంతం అయినప్పటికీ మలి వ్యాసం లో మేటర్ ఎక్కువ వున్నది కాబట్టి ఈ ఎక్కువ మేటర్ వున్న వ్యాసంలోనికి తక్కువ మేటర్ వున్న వ్యాసం విలీనం కావలెనా? ఇక్కడ నేను రాసిన వ్యాసాన్ని నాకన్నా ముందుగానే వున్న వారు రాసిన తొలి చిన్ని వ్యాసంలో కలిపివేశారు.(అయితే పేరు మారిందే కాని నేను రాసిన మేటర్ ని మార్చలేనందుకు కృతజ్ఞతలు) సర్ ఈ సందర్భంలో మన తెలుగు వారికి తెలుగులో విజ్ఞాన సర్వస్వం అందచేసే బృహత్ ప్రయత్నంలో ‘నేను’ రాసినది, ‘వేరేవారు’ రాసినది అంటూ చేసే వాదనలకన్నా, పేరు కోసం ప్రాకులాడడం కన్నా అది రీడర్స్ కు ఉపయోగంగా ఉందా లేదా వారిని కొత్త కొత్త విషయాలు తెలియచేసి విజ్ఞాన ఆధారితంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం అని తెలుసు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయమేమిటంటే ఏదైనా ఒక వ్యాసం (అది ఒక సాహిత్య వ్యాసం కావచ్చు లేదా ఒక చరిత్ర అంశం కావచ్చు, ఒక సామాజిక అంశం కావచ్చు) గురించి రాసే రచయితలకు, వేర్వేరు పరిశీలక దృక్పధాలు వుంటాయి. (ఒక్క మాథ్స్ తప్ప మిగిలిన సబ్జెక్టు లన్నింటికి సైన్సు తో సహా - సైన్సు కు సంబంధించిన అంశాలను వివరించడంలో కూడా వేర్వేరు శాస్త్రవేత్తలు విభిన్న ప్రతిపాదనలతో వేర్వేరుగా ఆలోచించడం సహజం). అలా వేర్వేరు దృక్పదాలతో ఇద్దరు రచయితలు ఒక ఫాక్ట్ అంశం పై తెలుగు వికిలో ఒకే హెడ్డింగ్ తో ఆర్టికల్స్ వేర్వేరు కాలాలలో రాసినప్పుడు ఆ ఆర్టికల్స్ లు అనివార్యంగా రెండు వేర్వేరు దృక్పధాలను ప్రతిబింబిస్తాయి. (సామాన్యంగా చూసేవారికి రెండు వ్యాసాలలోను ఒకటే హెడ్డింగ్, ఒకటే ఇతివృత్తాంతం కనిపించడం వలన ఒక దానిలో వేరొకటి విలీనం చేయవచ్చు అనే సూచనలు చేసే అవకాశం వుంది.) అటువంటి రెండు వ్యాసాలను విలీనాల పేరిట కలగాపులగం చేస్తే ఆ ఆర్టికల్ లో పరస్పర విరుద్ధతలు కనబడుతూ తెలుగు వికీ readers లను ఆ ఫాక్ట్ ని అర్ధం చేసుకోవడంలో తికమకకు గురిచేస్తాయి. ఈ విషయం కాస్త గమనించగలరు.

  1. నాల్గవది. :పూర్ణమ్మ” పేరు గల వ్యాసం లొకి మార్చబడిన నా అసలు వ్యాసాన్ని తిరిగి “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే హెడ్డింగ్ క్రిందకు తీసుకురావడం గురించి.
    1. ఒక కవి రాసిన కృతికి సరైన హెడ్డింగ్ ఆ రచయితే తెలియ చేస్తాడు. మహాకవి గురజాడ రాసిన కృతి(గేయకావ్యం) పేరు “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అంతేకాని “పూర్ణమ్మ” కాదు. అంటే గేయానికి సరైన హెడ్డింగ్ “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” మాత్రమే కాని “పూర్ణమ్మ” కాదు. గేయం కూడా సుప్రసిద్ధమైనది ఆ ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ పేరు తోనే . ఆ విధంగా చూస్తే ‘పూర్ణమ్మ’ అంటే ఎవరైనా కావచ్చు కాని ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ అంటే గురజాడ వారి గేయమే కళ్ళకు గుర్తుకొస్తుంది.
    2. నేను రాసిన వ్యాసం గేయానికి ఉద్దేశించినది కాబట్టే గేయ నామమైన ” పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” వ్యాసానికి పేరుగా తగినది. ఒకవేళ పూర్ణమ్మ యొక్క వ్యక్తిత్వం, శీలం , జీవితం ప్రాదాన్యంగా విశ్లేషించే వ్యాసానికి “పూర్ణమ్మ” అనే పేరు సమంజసంగా ఉండవచ్చు.
    3. ఒక కవి రాసిన కావ్యాన్ని స్మరించేటప్పుడు ఆ కవి తన కావ్యానికి వాడిన పేరునే స్మరించడం సత్సంప్రదాయం. షార్ట్ కట్ పేర్లు మన సౌలభ్యం కోసం పెట్టుకొన్నవే. వాటిని మౌఖికంగా స్వీకరించవచ్చు గాని లిఖిత రూపంలో పేర్కొనేటప్పుడు మాత్రం అసలు పేరును వాడాల్సివుంటుంది అని భావిస్తున్నాను..

అందువల్ల “పూర్ణమ్మ” అనే హెడ్డింగ్ కన్నా “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అన్న హెడ్డింగ్ పేరే సమంజసంగా వుంటున్నదనేది నా అభిప్రాయం. ముందు రాయబడ్డ వ్యాసం అనే ఏకైక కారణం చేత సరైన హెడ్డింగ్ కూడా కానటువంటి “పూర్ణమ్మ” వ్యాసంలో, సరైన హెడ్డింగ్ తో రాయబడిన తరువాయి వ్యాసాలు విలీనం కావాలనడం ఫలితంగా ఆ విలీన వ్యాసానికి సరైన హెడ్డింగ్ కుదరకపోవడం అంత సమంజసం కాదేమో వికి సీనియర్లు ఆలోచించాలి. ఉదాహరణకు “గురజాడ అప్పారావు” అనే వ్యాసాన్ని “అప్పారావు” అనే వ్యాసంలో (తొలుత రాయబడినడనే కారణం మీద) విలీనం చేసి ఆ విలీన వ్యాసానికి “అప్పారావు” అనే పేరు పెడితే ఎలా వుంటుంది.

అందుకే content ప్రాధాన్యతని పక్కన బెట్టి ముందు రాయబడ్డ వ్యాసంలోనే, తదుపరి వచ్చే వ్యాసాలన్నీ విలీనం కావాలంటే అది కేవలం ఒక హెడ్డింగ్, ఒకటి రెండు లైన్లు రాసి పక్కన పడేసే సంప్రదాయానికి తెర తీసినట్లవ్వవచ్చు. ఫలితంగా ఒక డిక్షనరీ ముందేసుకొని ‘పేజీ క్రియేటర్’ లు చేసే విన్యాసాలకు గాను, సమాచారం కోసం వెదికే తెలుగు వికీ రీడర్లకు లకు ‘పేర్లు’ తప్ప అసలు ‘సమాచారం’ దొరకని విచిత్రస్థితి ఎదురవ్వవచ్చేమో - వికీ సీనియర్లు కాస్త ఆలోచించాలీ. పై కారణాల చేత “పూర్ణమ్మ” పేరు గల వ్యాసం లొకి మార్చబడిన నా అసలు వ్యాసాన్ని తిరిగి “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” అనే హెడ్డింగ్ క్రిందకు తీసుకు రాగలరని కోరుతున్నాను. నా వరకు హెడ్డింగ్ ను “పూర్ణమ్మ” నుండి “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” కు మార్చడం నాకింకా తెలియదు. అందుకే మిమ్మలను కోరుతున్నాను. తోటి వికీ సీనియర్ గా ఈ విషయంలో నాకు (కొత్త వికీ ప్రవేశకుడికి) సరైన అవగాహన కల్పించగలరని ఆశిస్తున్నాను.

ఇట్లు
(vmakumar)
వుక్కుం మహేష్ కుమార్, B.Tech,
డి.సి.టి.ఒ, మండపేట
7702204915

--Vmakumar (చర్చ) 19:06, 15 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]