Jump to content

శ్వాస వ్యవస్థ

వికీపీడియా నుండి
(శ్వాసవ్యవస్థ నుండి దారిమార్పు చెందింది)

శ్వాస వ్యవస్థ (Respiratory system-rs) లోని ఊపిరితిత్తులద్వారా మన శరీరానికి

శ్వాస మార్గము

[మార్చు]

మానవులలో శ్వాస మార్గం అనేది శ్వాసక్రియ యొక్క ప్రక్రియతో ముడిపడివున్న శరీర నిర్మాణ శాస్త్రం యొక్క భాగం.

నిర్మాణము

[మార్చు]
పూర్తి శ్వాస వ్యవస్థ

శ్వాసమార్గాన్ని ఎగువ వాయుమార్గం, దిగువ వాయుమార్గాలుగా విభజించవచ్చు. ఎగువ వాయుమార్గం లేదా ఎగువ శ్వాసమార్గంలో ముక్కు, నాసికా మార్గాలు, నాసికా కుహరాలు (paranasal sinuses), కంఠం, స్వరతంత్రులు (vocal cords) పైని స్వరపేటిక భాగం ఉంటాయి. దిగువ వాయుమార్గం లేదా దిగువ శ్వాసమార్గంలో స్వరతంత్రుల కింది స్వరపేటిక భాగం, శ్వాసనాళం (trachea), ఫుఫుసనాళాలు (bronchi), ఊపిరితిత్తులు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో ఫుఫుసనాళాల శాఖలు (ప్రధమ, ద్వితీయ, తృతీయ ఫుఫుసనాళాలు), శ్వాసనాళికలు (bronchioles), వాయుగోళ నాళికలు (alveolar ducts) వాయుగోళాలు (alveoli) ఇమిడి ఉంటాయి.

శ్వాసమార్గంలో వహనభాగం (కండక్టింగ్ జోన్) ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో గాలిని లోనికి, బయటకు కొనిపోవుటకు ఉపయోగపడుతుంది. శ్వాసించు భాగం (రెస్పిరేటరీ జోన్) రక్తంలోనికి ప్రాణవాయువును అందించుటకు, రక్తంలోని బొగ్గుపులుసు వాయువును గ్రహించుటకు ఉపయోగపడుతుంది.

శ్వాసనాళం నుండి శాఖోపశాఖలు వెలువడి వాయుగోళాలుగా ముగియుటకు ముందు సుమారు 20 నుంచి 23 విభాగాలతో క్రమక్రమంగా చిన్నవవుతుంటాయి.[1][2]

ఎగువ శ్వాసమార్గం

[మార్చు]
ఎగువ శ్వాసనాళ వివరాలు.

ఎగువ శ్వాసమార్గం ఛాతీఎముకయొక్క కోణం (ఉరము వెలుపల) పైన, కంఠ బిలాల (గొంతులోని స్వరతంత్రుల) పైన లేదా స్వరపేటిక వద్దగల ఉంగరమును పోలిన (cricoid) మృదులాస్థి (cartilage) పైబడి శ్వాసవ్యవస్థ యొక్క భాగాలను సూచిస్తుంది. అలా స్వరపేటిక కొన్నిసార్లు ఎగువ వాయుమార్గంలోను, కొన్నిసార్లు దిగువ వాయుమార్గంలోనూ కలిసి ఉండును. ఈ స్వరపేటిక (larynx) అనేది కంఠధ్వని పెట్టె (voice box) అని కూడా పిలవబడుతుంది, సహ మృదులాస్థి కలిగి ఉండును అది ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ట్రాక్ట్ర్ లో నాసికా రంధ్రం (nasal cavity0, ఉపనాసికా రంధ్రాలు (paranasal sinuses), గొంతు (pharynx) (ముక్కుకి సంబంధించిన గొంతు, కొండ నాలుక నుంచి కంఠబిలం దాకా ఉన్న ప్రాంతం,, స్వరపేటికగొంతు), కొన్నిసార్లు స్వరపేటికతో సహా ఇమిడి ఉంటాయి.

దిగువ శ్వాస మార్గం

[మార్చు]

దిగువ శ్వాసమార్గం లేదా దిగువ వాయుమార్గం అనేది పూర్వాహారనాళం, వాయునాళం, శ్వాసనాళికలు (ప్రాథమిక, ద్వితీయ, తృతీయ), సూక్ష్మ శ్వాస నాళికలు (శ్వాస అంతిమ దశ సహా), ఊపిరితిత్తులు (వాయుకోశాలు సహా). ఇది కొన్నిసార్లు స్వరపేటికను కలుపుకుని కూడా.

శ్వాస వృక్షం

[మార్చు]
1. శ్వాసనాళం (గొంతుపీక) (Trachea)
2. ప్రధాన శ్వాసనాళం (Mainstem bronchus)
3. ఖండ శ్వాసనాళం (Lobar bronchus)
4. విభాగ శ్వాసనాళం (Segmental bronchus
5. అతిసూక్ష్మశ్వాసనాళిక (Bronchiole)
6. ఆల్వియోలార్ వాహిక (Alveolar duct)
7. వాయుకోశం (Alveolus)

శ్వాస వృక్షము లేదా శ్వాస నాళాల వృక్షము అనే పదము ఊపిరితిత్తులకు, వాయునాళం, శ్వాసనాళికలు, సూక్ష్మ శ్వాసనాళికలు సహా వాయుమార్గాలకు గాలిని సరఫరా చేసే దానియొక్క శాఖా నిర్మాణమును సూచించడానికి కూడా ఉపయోగిస్తారు.

  • శ్వాసనాళం (trachea)
    • ప్రధాన శ్వాసనాళం (main bronchus)
      • లోబర్ శ్వాసనాళం (lobar bronchus)
        • విభాగ శ్వాసనాళం (segmental bronchus)
          • వాహకత్వ సూక్ష్మశ్వాసనాళిక (conducting bronchiole)
            • అంత్య సూక్ష్మశ్వాసనాళిక (terminal bronchiole
              • రెస్పిరేటరీ సూక్ష్మశ్వాసనాళిక (respiratory bronchiole)
                • అల్వియోలార్ వాహిక (alveolar duct)
                  • అల్వియోలార్ తిత్తి (alveolar sac)
                    • శ్వాసవాయు గోనులు (alveolus)

అవయవాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Campbell, Neil A. (1990). Biology (2nd ed.). Redwood City, Calif.: Benjamin/Cummings Pub. Co. pp. 834–835. ISBN 0-8053-1800-3.
  2. Hsia, CC; Hyde, DM; Weibel, ER (15 March 2016). "Lung Structure and the Intrinsic Challenges of Gas Exchange". Comprehensive Physiology. 6 (2): 827–95. doi:10.1002/cphy.c150028. PMC 5026132. PMID 27065169.