హిమాచల్ ప్రదేశ్ జానపద నృత్యాలు
దేవ్ భూమి అని పిలవబడే హిమాచల్ ప్రదేశ్ అంటే మంచుతో కప్పబడిన శిఖరాలు, గొప్ప వారసత్వం, బాగా సంరక్షించబడిన సంస్కృతి కలిగిన ప్రాంతం. హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలోని ఉత్తరాన ఉన్న రాష్ట్రం, ఉత్తరానజమ్మూ, కాశ్మీరు, లడఖ్, పశ్చిమాన పంజాబ్, నైరుతిలో హర్యానా, ఆగ్నేయంలో ఉత్తరాఖండ్, దక్షిణాన ఉత్తర ప్రదేశ్ తో రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది.[1]హిమాచల్ సంస్కృతిలో జానపద నృత్యం అత్యంత ప్రశాంతమైన, శక్తివంతమైన భాగాలలో ఒకటి. గిరిజనులు, స్థానిక సామాజిక జనులు సాంప్రదాయ, రంగు రంగుల దుస్తులు ధరించి విస్తృతమైన నృత్యాల ద్వారా తమను తాము వ్యక్తీకరించడానికి ఇష్టపడతారు. వారి నృత్యాల ద్వారా,పాటల ద్వారా, ఇతర ప్రాంత ప్రజలు హిమచల్ ప్రాంత జనుల వారసత్వ సంస్కృతి, జీవన శైలి,వారి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వంటి చాలా విషయాలు తెలుసుకోవచ్చు.[2]మంచుతో ఆవృతమైన హిమాచల్ ప్రదేశ్ లో జనప్రియమైన పలు జానపద నృత్యాలు సజీవంగా వున్నాయి, వాటిలో ముఖ్యమైన 12 నృత్యాలను ఇక్కడ ఇవ్వడమైనది.
1.రాక్షస నృత్యం
[మార్చు]కిన్నౌర్ ప్రాంతం యొక్క పూర్వ-చరిత్ర యుగంలో లోతుగా పాతుకు పోయిన చరిత్ర కలిగిన ఈ జానపద నృత్యాన్ని రాక్షస నృత్యం అని పిలుస్తారు, ఇది హిమాచల్ ప్రదేశ్‌లో బాగా సంరక్షించ బడిన పురాతన నృత్యాలలో ఒకటి.నృత్య ప్రదర్శనలో దెయ్యాల ముసుగులు ధరించిన నృత్యకారులు ఉంటారు.నివాసితులు మంచి శక్తులతో దెయ్యలను తరిమి వేసే నృత్యదృశ్యం,తమ పంటలపై రాక్షస దాడిని(పంటలకు హాని చెసె దుష్టశక్తి)ఎదుర్కొని తరిమి,పంటనుసం రక్షించుకొవడం ఈ నృత్య ప్రదర్శన లోని నేపథ్యం.ఈ నృత్యం కృఇయాత్మకంగా,చురుకైన,వేగవంతమైన నృత్య కదలికలుఉంటుంది. అందుకే కొంతమంది దీనిని కిన్నౌర్ వాసులఉల్లాసభరితమైన జింక వంటినృత్యం అని అభివర్ణిస్తారు. ఘురే అని పిలువబడే ప్రధాన నర్తకుడి వేగవంతమైన, పాద ఘట్టనలు, దేహకదలికలను అనుసరిస్తూ పురుషు లు, స్త్రీలు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని వృత్తాకారంలో నర్తిస్తారు.[2]
రాక్షస(demon)నృత్యాన్ని ఛంభ నృత్యం అని కూడా పిలుస్తారు.ఇది పంజాబ్‌లోని భాంగ్రా నృత్యానికి సారూప్యతను కలిగి ఉంటుందని చెబుతారు. దీని మూలాలను హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ ప్రాంతంలో గుర్తించవచ్చు. చైటోల్, బిషు వంటి సంతోషకరమైన పండుగల సమయంలో పురుషులు, మహిళలు చేతులు పట్టుకుని నృత్యం చేయడం సాధారణం. నృత్యం అనేది మనిషి యొక్క రస భావ వ్యక్తీకరణ.[3] [4]
2.కయాంగ్ నృత్యం
[మార్చు]కయాంగ్ లేదా కయాంగ్ మాలా అనేది హిమాచల్ యొక్క సాంప్రదాయ జానపద నృత్యం, ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.నర్తించేవారు ఒకరి చేతిని ఒకదానికొకటి అడ్డంగా(కత్తెర ఆకారం(X)) పట్టుకోవడం వల్లఈ పదం ఉద్భవించింది.ప్రతి నర్తకి ఆకర్షనీయమైన దుస్తులుమరియు పూసల, సంప్రదాయ ఆభరణాలు ధరించి ఉంటుంది. నృత్యం ప్రారంభానికి ముందు, ప్రతి నర్తకి స్థానికంగా తయారుచేసిన ఆల్కహాలిక్ పానీయమైన గల్ప్ ఆఫ్ చాంగ్ తీసుకుంటాడు. ఈ నృత్యం ఉనా, కిన్నౌర్, చంబా, లాహౌల్ జిల్లాలతో ముడిపడి ఉంది.[2] కయాంగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని పురాతన నృత్యాలలో అగ్రగామిగా ఉంది.[3][5]
3.బకాయాంగ్ నృత్యం
[మార్చు]హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో నివసించే వారిచే ప్రదర్శించబడే బకాయాంగ్ నృత్యం హిమాచల్‌లోని అత్యంత ముఖ్యమైన నృత్యాలలో ఒకటి.ఈ నృత్యం చేసేవారు, ప్రధానంగా ఒకరికొకరు ఎదురెదురుగా మూడు లేదా ఇద్దరు వరుసలలో నిలబడే స్త్రీలు. ఈ మహిళలు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్న సాంప్ర దాయ జానపద సంగీతానికి అనుగుణ్యంగా ముందుకు వెనుకకు నిర్దిష్ట క్రమంలో కదులుతూ నర్తిస్తారు. ఇది వీక్షకులను మంత్ర ముగ్దులను చేసే నృత్యం.ప్రత్యేకంగా వ్యవసాయం సమయంలొ, పంట కోత సంబంధిత సందర్భాలలో, పండుగల సమయంలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.[2]హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రధాన, ప్రసిద్ధ నృత్యాలలో ఒకటి అయిన బకాయాంగ్ నృత్యం.కొన్ని మతపరమైన వేడుకలు లేదా పండుగ సందర్భాలలో లామాలచే కూడా నిర్వహించ బడుతుంది. ఈ నృత్యాన్ని అందమైన కిన్నౌరి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి చంకీ వెండి ఆభరణాలతో ప్రదర్శిస్తారు.[6]
4.జటారు కయాంగ్ నృత్యం
[మార్చు]హిమాచల్‌లోని స్థానికులకు పార్టీలు ఎలా జరుపుకోవాలో, పండుగను ఎలా జరుపుకోవాలో ఖచ్చితంగా తెలుసు. ప్రత్యేక సందర్భాలలో, పండుగల సమయంలో స్థానికులు ఈ నృత్యాన్ని ప్రధానంగా చూడవచ్చు. నిర్దిష్ట పండుగ పాటలు పాడుతున్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. సంగీతం ఊపందుకోవడంతో, నృత్యకారులు కూడా తమ చేతుల్లో చామర్‌తో తమ నాయకుడి స్టెప్పులను అనుసరిస్తూ ఆనందంగా నృత్యం చేయడం ప్రారంభిస్తారు.చమర్ అనే వాయిద్యం నుండి వచ్చే,ఏర్పడే సంగీతం, నర్తకులకు ఆగ్రహం రప్పించె మూలంహేతువుగా మారుతుంది నర్తకులు ఒకరితో ఒకరు నృత్య పోరాటం చేయడం ప్రారంభిస్తారు. నృత్యకారులు ఘురే అని పిలువబడే ప్రధాన నృత్యకారుని సూచనలు అనుసరిస్తారు.[2]ఈ నృత్యంలో, సంగీతకారుడు వాయిద్యాలను వాయిస్తుండగా, నృత్య నాయకుడు తన చేతుల్లో సంప్రదాయ వాయిద్యమైన చమర్‌తో ప్రదర్శన ఇస్తాడు. [7]
5.చోహరా నృత్యం
[మార్చు]చోహరా నృత్యం ముఖ్యమైన, పవిత్రమైన కార్యక్రమాలలో పురుషులు, మహిళలు ఇద్దరూ చేస్తారు. హిమాచల్ ప్రజలకు తమ పండుగలు, జాతరలను ఎంత ప్రేమ, ఉత్సాహంతో ఎలా జరుపుకోవాలో తెలుసు.ఈ జానపద నృత్యం హిమాచల్‌లోని సిమ్లా జిల్లా ప్రజలలో అత్యంత ప్రసిద్ధి చెందింది, ప్రతి ప్రత్యేక సందర్భంలో ముఖ్యాంశంగా కొనసాగుతుంది. ఈ నృత్యం ద్వారా హిమాచల్‌లోని గొప్ప అద్భుతాలను వీక్షించవచ్చు.[2][8]
6 షాండ్ షాబు నృత్యం
[మార్చు]జానపద నృత్యాల విషయానికి వస్తే లాహౌల్ స్థానికులు సంస్కృతిలో చాలా గొప్పవారు. హిమాచల్‌లోని లాహౌల్, స్పితి జిల్లాల్లో షాండ్ షాబు నృత్యం ప్రముఖమైనది. లాహౌల్ రాష్ట్రం అంతటా అనేక బౌద్ధ గొంపాలకు నిలయంగా ఉంది, ఈ నృత్యాన్ని ఈ గోంపస్ సన్యాసులు చేస్తారు.షాన్ అనే పదానికి బుద్ధుని ప్రార్థన పాట అని అర్థం. ఈ సాంప్రదాయిక షాండ్ సంగీతానికి ఎలా నృత్యం చేయాలో తెలిసిన నృత్యకారులను షాన్ నృత్యకారులు అంటారు.తమ పంట కోత కాలం పూర్తవుతున్న సమయంలో గిరిజన సమాజానికి చెందిన వారు కూడా ఈ నృత్యం చేస్తారు.ప్రదర్శనలో షెహనాయ్, తీగ వాయిద్యాలుగ(వీణ,మండోలిన్ వంటివి) సంగీత వాయిద్యాలుగా ఉపయోగించబడ తాయి. ఈ నృత్యాన్ని సాధారణంగా పండుగ సందర్భాలలో ప్రదర్శించే షబ్బో నృత్యం లాగా భావించ వచ్చు.[2] [9]
7.లాంగ్-దర్-మా నృత్యం
[మార్చు]దుష్ట/చెడ్డ రాజు నృత్యం అని కూడా పిలుస్తారు, ఈ ముసుగు నృత్యం రాష్ట్రంలోని ఇతర సాంప్రదా య హిమాచలీ నృత్యం వలె లేదు.ఇది గంటల తరబడి సాగుతుంది, లాంగ్ దర్-మా అనే దుష్ట రాజు హత్య కథను చెబుతుంది.ఈ నృత్యం ప్రధానంగా లాహౌల్ స్పితి జిల్లాలో చేసే అత్యంత ప్రసిద్ధ ముసుగు నృత్యాలలో ఒకటి.ఈ దుష్ట రాజు 838 నుండి 841 CE వరకు పాలించిన టిబెటన్ చక్రవర్తి. అతను బౌద్ధమత వ్యతిరేకి కాబట్టి అతని దుష్ట స్వభావం బౌద్ధులకు బాగా తెలుసు.[10][2]
8.నాటి నృత్యం
[మార్చు]నాటి అనేది హిమాచల్ ప్రదేశ్ యొక్క సాంప్రదాయ జానపద నృత్యం, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, గుర్తింపు పొందింది. నాటి అనేది భారతదేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాలలో పాడే సాంప్రదాయ జానపద పాటలను వివరించడానికి ఉపయోగించే స్థానిక పదం.కొండ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని కొన్ని జిల్లాలతో పాటు సిమ్లా, కిన్నౌర్, కులు, మండి, చంబా, సిర్మౌర్ తదితర జిల్లాల్లో ఇది ప్రజాదరణ పొందింది.నృత్యంలో పాల్గొనే పురుషులు, మహిళలు ఒకరి చేతిని ఒకరు నడుముకి అడ్డంగా పట్టుకుని, పెర్కషన్ వాయిద్యాల సంగీతం, దరువులకు అనుగుణ్యంగా కదులుతారు.గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద జానపద నృత్యంగా నాటి నృత్యం కూడా జాబితా చేయబడింది.[2]ఇది సిమ్లా నాటి, కులు నాటి, శివ్ బదర్ నాటి, సిర్మౌరి నాటి వంటి వివిధ రూపాల్లో ఉత్సాహంగా ప్రదర్శించబడుతుంది.కొత్త పంట కాలం అయినా, కుటుంబంలో పెళ్లి అయినా నాటి వేడుకల నృత్య ప్రదర్శన తప్పకవుంటుంది . ఇది ఒక కథ యొక్క అందమైన వర్ణన, ఉదాహరణకు, కులునాటి సంప్రదాయంగా రాస్-లీల వంటి కథలు లేదా హిందూ దేవుళ్లు కృష్ణుడు, గోపికలు సంబంధించిన కథలను చెబుతారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఏ కార్యకలాపంలోనైనా నాటి నృత్యాన్ని ముఖ్యమైన భాగంగా పరిగణించవచ్చు. [3]
9.ఝంఝర్ నృత్యం
[మార్చు]ఈ ప్రసిద్ధ నృత్యం హిమాచల్‌లోని చంబా జిల్లా నుండి ఉద్భవించింది, ప్రతి పండుగ సందర్భంగా ఈ గొప్ప నృత్య వేడుకలు జరుగుతాయి. సాంప్రదాయ, విస్తృతమైన రంగుల దుస్తులను ధరించి పురుషులు, మహిళలు ఇద్దరూ నృత్యం చేస్తారు. ప్రతి కోణంలోనూ ఆకట్టుకునే పాట ఇది. నృత్యం నెమ్మదిగా, లయతో ప్రారంభమవుతుంది, ఇది క్రమంగా దాని వేగాన్ని అధిరోహిస్తుంది. ఇది ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తుంది. ఏదైనా పండుగ సందర్భం, జాతర, పండుగలు ఈ నృత్యాన్ని పెద్ద సమూహాలలో ప్రదర్శిస్తారు .[2] [11]
10.జోరా నృత్యం
[మార్చు]హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలోని ప్రధాన నృత్య రూపాలలో జూర్ ఒకటి. ఏదైనా నృత్యం లేదా ఫెస్టివల్ ప్రదర్శనకు ఇదిప్రారంభ ప్రదర్శనగా వుంటుంది,అందుచే ఇది ముఖ్యమైన నృత్యం. ఇది ప్రకృతిలో చాలా పరస్పర అనుబంధంమై ప్రకృతి మమేకమై ఉన్న ఒక ఆహ్లాదకరమైన నృత్యం. నృత్యంలో నృత్యకారులు ఒకరితో ఒకరు సంభాషించుకునే paddhatilO ప్రశ్నలు, సమాధానాలు చెప్పడం అనేది సంగీత స్వరంలో అందించబడును. ఈ నృత్యం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే, ప్రతి పంక్తి 'హూ హూ' శబ్దంతో ముగుస్తుంది, నృత్యకారులు ఆనందంతో అరుస్తారు. ఈ నృత్యం డ్యాన్సర్‌లతో పాటు వీక్షకులకు కూడా ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది.[2] [12]
11.గి నృత్యం
[మార్చు]హిమాచల్ నృత్యాలలో గి నృత్యాన్ని ప్రత్యేకమైన జానపద నృత్యాల జాబితాలో చేర్చడం ఒక విశేషం. గి నృత్యం 3 విభాగాలతో యొక్క క్లిష్టమైన, వివరణాత్మక బీట్‌లతో ప్రదర్శించబడుతుంది. నృత్య ప్రదర్శనలో భాగంగా, గి డ్యాన్సర్లు వృత్తాకారంలో నిలబడి ఉండగా, మియాన్ అనే నాయక నర్తకుడు మధ్యలో చేతులు చాచి ఇతరులతో కలిసి నృత్యం చేస్తాడు. వివిధ రకాలైన గి నృత్యంలు కాలానుగుణంగా అభివృద్ధి చెందాయి., సమాజాన్ని బట్టి ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. [2][13]
12.రస నృత్యం
[మార్చు]హిమాచల్ యొక్క సాంప్రదాయ రస నృత్యం హిమాచలీ జానపద నృత్యం యొక్క అత్యంత అందమైన రూపాలలో ఒకటి. ఇది రాష్ట్రం యొక్క నిజమైన స్ఫూర్తిని సంగ్రహిస్తుంది. ఇది గిడ్‌లు, దేవతలు, సాంప్రదాయ సంగీత వాయిద్యాలు, పంటలు పండించడం, సాధనాలు వంటి ప్రజల సంస్కృతి, జీవనశైలి యొక్క అత్యంత ఆసక్తికరమైన అంశాలను మిళితం చేస్తుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ తమ సంప్రదాయ రంగుల దుస్తులను ధరించి రస ప్రదర్శనలో పాల్గొంటారు. పాద విన్యాసాలు, చేతి కదలికలు సరళంగా ఉంటాయి. నృత్య కదలికలు నేపధ్యంలో సంగీతం యొక్క బీట్‌లు, సౌండ్‌లను అనుసరిస్తాయి. నృత్యకారులు నెమ్మదిగా కలిసి ఒక వృత్తాన్ని సృష్టించి, ఒకరి నడుముకు అడ్డంగా చేతులు పట్టుకుని, ఎంతో ఆనందం, ఉత్సాహంతో నృత్యం చేస్తారు. [2] [14]
ఇవికూడా చదవండి
[మార్చు]- చత్తీస్‌గఢ్ జానపద నృత్యాలు
- కేరళ జానపద నృత్యాలు
- కాశ్మీర్ జానపద నృత్యాలు
- సిక్కిం జానపద నృత్యాలు
- మేఘాలయ జానపద నృత్యాలు
- త్రిపుర జానపద నృత్యాలు
- నాగాలాండ్ జానపద నృత్యాలు
- మణిపురి జానపద నృత్యాలు
- మిజోరం జానపద నృత్యాలు
- అరుణాచల్ ప్రదేశ్ జానపద నృత్యాలు
- జార్ఖండ్ జానపద నృత్యాలు
- భూటాన్ జానపద నృత్యాలు
మూలాలు
[మార్చు]- ↑ "Himachal Pradesh". britannica.com. Retrieved 2024-02-19.
- ↑ 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 "Traditional folk dances of Himachal pradesh". namasteindiatrip.org. Retrieved 2024-02-19.
- ↑ 3.0 3.1 3.2 "Folk dances of Himachal pradesh". caleidoscope.in. Retrieved 2024-02-16.
- ↑ "TheDemon dance". webindia123.com. Retrieved 2024-02-18.
- ↑ "5 traditional dances". nativeplanet.com. Retrieved 2024-02-18.
- ↑ "Dances and dramas of Himachal". himcivils.com. Archived from the original on 2024-02-19. Retrieved 2024-02-19.
- ↑ "jatar kayang". webindia123.com. Retrieved 2024-02-19.
- ↑ "Folk dances of Himachal pradesh". cgpsc.info. Retrieved 2024-02-18.
- ↑ "what are shand and shabu". abhipedia.abhimanu.com. Retrieved 2024-02-18.
- ↑ "Dances and dramas of Hp". himcivils.com. Archived from the original on 2024-02-19. Retrieved 2024-02-18.
- ↑ "Folk dances". cgpsc.info. Retrieved 2024-02-18.
- ↑ "folk dances of india" (PDF). youngintach.org/. Retrieved 2024-02-18.
- ↑ "Himachal arts". webindia123.com. Retrieved 2024-02-18.
- ↑ "Rasa Dance". indianetzone.com. Retrieved 2024-02-18.