బీహారు జానపద నృత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బీహార్ అనేక రకాల సాంప్రదాయ జానపదనృత్యాలతో సహా గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. బీహారు సంస్కృతి, వారసత్వం యొక్క అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి జానపద నృత్యాలు. [1]

బీహార్‌లోని కొన్ని ప్రసిద్ధ జానపద నృత్యాలు[మార్చు]

  • జాట్-జతిన్ నృత్యం(Jat-Jatin Dance)
  • బిడేసియా డ్యాన్స్(Bidesia Dance)
  • ఝిఝియా డ్యాన్స్(Jhijhiya Dance)
  • కర్మ నృత్యం(Karma Dance)
  • కజారీ డ్యాన్స్(Kajari Dance)
  • చౌ నృత్యం(Chhau Dance)
  • పైకా డ్యాన్స్(Paika Dance)

1. జాట్-జతిన్ నృత్యం(Jat-Jatin Dance)[మార్చు]

జాట్-జతిన్ నృత్యం

జాట్-జతిన్ అనేది బీహార్‌లోని ఒక ప్రసిద్ధ జానపద నృత్యం, దీనిని మిథిలాంచల్ ప్రాంతంలోని మహిళలు ప్రదర్శిస్తారు. ఈ నృత్యం పున్నమి సమయంలో వెన్నెల రాత్రులలో ప్రదర్శించ బడుతుంది, ఇక్కడ నృత్యం నేపధ్యం ప్రేమకథ.ఈ నృత్యం ప్రేమికులైనాజాట్, జతిన్లు విడిపోయిన దుఃఖకర పరిస్థితి నేపధ్యం.విక్షకులకుకరుణ,దుఖం,విషాదం, కలయిక, సంతోషం వంటి సన్నివేశాలను కన్నులకు కట్టినట్లు అనుభూతిని వీక్షకులకు కల్గిస్తుంది. ఉత్తర బీహార్‌ లో, ముఖ్యంగా మిథిలా, కోసి ప్రాంతంలో జాట్-జతిన్ కళారూపం అత్యంత ప్రాచుర్యం పొందింది. కరువులు, వరదలు, ప్రేమ, దుఃఖం, పేదరికం వంటి అనేక సామాజిక సమస్యలపై కూడా నృత్యం ప్రదర్శన ప్రతిబింబిస్తుంది. ఈ నృత్యం వివాహిత జంట యొక్క సున్నితమైన ప్రేమ, వివాదాన్ని,విరహాన్ని, ఎడబాటును వర్ణిస్తుంది.జాట్, జతిన్ జంటల చాలా ప్రేమగా,అన్యోన్యంగా ఊంటారు కానీ చెడు పరిస్థితుల కారణంగా విడివిడిగా ఎలా జీవించవలసి వచ్చిందో ఈ కథ చూపిస్తుంది.. ఇది వర్షాకాలంలో చంద్రకాంతి/వెన్నెల రాత్రుల్లో లో ఎక్కువగా ప్రదర్శించబడుతుంది. మహిళలు, జంటలు అర్ధరాత్రి నుండి తెల్లవారుజామువరకు నృత్యం చేస్తారు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు చేస్తారు.[1]

వయోజన బాలికలు, యువ గృహిణులు ప్రాంగణంలో గుమిగూడి, అర్ధరాత్రి నుండి సూర్యోదయం వరకు డోలు వాయిద్యం తో కలిసినృత్యం చేస్తారు.ఈ నృత్యం ద్వారా, పేదరికం, దుఃఖం, ప్రేమ, ప్రేమికులు లేదా భార్యాభర్తల మధ్య వాదనలు వంటి వివిధ సామాజిక సంబంధిత ఇతివృత్తాలు కూడా ప్రదర్శించబడతాయి.కొన్నిరకాల కథానాల్లో,నటీనటులు ప్రదర్శనకు వాస్తవికతను జోడించడానికి ముసుగులు ధరిస్తారు.జాట్-జతిన్ నృత్యం సంక్లిష్టమైనది కాదు;ఇది సున్నితమైన శారీరక కదలికలు,విన్యాసాలు కలిగి ఉంటుంది.అడుగులు చురుగ్గా, శక్తివంతంగా ఉంటాయి, నాలుగు అడుగులు ముందుకు, అదే సంఖ్య వెనుకకు వెళుతుంది. తాళాలు ఆరు, ఏడు లేదా ఎనిమిది తాళాలుగా ఉంచబడతాయి, అవి దాద్రా, టీవాటా, కెరవ. కాళ్ల కదలికలు లేద బవిన్యాసం చాలా క్లిష్టంగా ఉండవు, కానీ అవయవాల కదలికలు అందంగా ఉంటాయి. [2]

2.బిడేసియా డ్యాన్స్(Bidesia Dance)[మార్చు]

ఇది బీహార్‌లోని మరొక ప్రసిద్ధ జానపద నృత్యం. ఈ నృత్యం యొక్క కథాంశాలు,సామాజిక సమస్యలు, ధనిక, పేద, ఉన్నత తరగతి, దిగువ తరగతి వంటి విరుద్ధమైన అంశాలు, సాంప్రదాయ, ఆధునిక జీవనశైలి మధ్య వైరుధ్యం తదితరాలు.ఈ నృత్య రూపం 20వ శతాబ్దంలో జానపద రంగస్థల రూపంగా ఉద్భవించింది.బీహార్‌లోని భోజ్‌పురి మాట్లాడే ప్రాంతాలలో ఈ నృత్య రూపం ప్రబలంగా ఉంది.వృత్తిరీత్యా మంగలి అయినాభికారి ఠాకూర్‌చే జానపద రంగస్థల నాటకంగాఈ నృత్య రూపం ప్రారంభమైంది.భికారీ ఠాకూర్ తన కాలానికి చెందిన ప్రసిద్ధనాటక రచయిత, కళాకారుడు.భికారీ ఠాకూర్ ను షేక్స్పియర్ ఆఫ్ భోజ్‌పురీఅని కూడా పిలుస్తారు.అతను తన అభిప్రాయాలను ప్రదర్శించడానికి నృత్యాన్ని ఉపయోగించాడు. దానిని వ్యంగ్యంగా, వినోదాత్మకంగా ప్రేక్షకుల ముందు వుంచాడు.ఇది చాలా స్థానికులలోబాగా ప్రాచుర్యం పొందింది. ఈ నృత్య లో ఉపయోగించిన బిరహా పాటలు భర్తలవల్ల వెనుకబడిన స్త్రీల పోరాటాన్ని తెలియ జేస్తాయి. స్త్రీలు ఎలా ప్రవర్తించారో స్పష్టంగా తెలియజేస్తుంది.ఈ నృత్యంలో స్త్రీ పాత్రలు దుస్తులు, కృత్రిమ పొడవాటి వెంట్రుకల(సవరం)సహాయంతో పురుష కళాకారులచే ప్రదర్శించ బడతాయి. [1]

బిడేసియా యొక్క ఇతివృత్తాలు కఠినమైన సామజిక సమస్యల పోరాటాలపై మాత్రమే కాకుండా సున్నిత మైన విషయాలు, భావోద్వేగ పోరాటాలపై కూడా నొక్కి చెబుతాయి. బిర్హా యొక్క భావోద్వేగాలు లేదా విడిపోవడం యొక్క బాధలు బిడేసియాలో వ్యక్తీకరించబడతాయి, తద్వారా ఇంటి నుండి దూరంగా ఉన్న పురుషులచే ఒంటరిగా మిగిలిపోయిన మహిళల గురించి ఈ పాటల ద్వారా పాడతారు.బిడేసియా యొక్క మొత్తం రూపం శక్తివంతమైన నృత్యాలు, సంగీతం, హృదయాన్ని హత్తుకునే కథల మాధ్యమం ద్వారా చాలా ప్రభావవంతంగా రూపొందించబడింది, ఇది పాత రోజుల యొక్క వాస్తవిక చిత్రాన్ని చిత్రీకరిస్తుంది.పూర్వపు రోజులలో, పేద కార్మికులకు భోజ్‌పురి సమాజంలో మహిళల పేలవమై న స్థితి గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నించడం వంటి అనేక సామాజిక సంబంధిత అంశా లకు మూలమైనందున బిడేసియా ప్రసిద్ధి చెందింది. కులతత్వం, మతతత్వం కూడా అదే సాంస్కృతిక రాగాలలో తగిన జాగ్రత్తతో ప్రదర్శింపబడతాయి.కొన్నిసార్లు, బిడేసియా స్వరం వ్యంగ్యంగా ఉంటుంది. బిడేసియా నాటకాలు , రంగస్థలం యొక్క శైలులు వారి లయబద్ధమైన భాష, మధురమైన పాటలు, ఆకర్షణీయమైన సంగీతం కోసం బాగా ప్రాచుర్యం పొందాయి.. ఈ నాటకాలు భోజ్‌పురి సంస్కృతికి నిజమైన ప్రతిబింబాలు.బిడేసియా నృత్యంలో, పురుష నటుడు/నృత్యకారులువారే స్త్రీ పాత్రలు పోషిస్తారు. సాధారణంగా,వారు ధోతీ లేదా షర్ట్/చొక్కా ప్యాంటు ధరిస్తారు.స్త్రీ పాత్రల విషయంలోవ్యత్యాసం కనిపించడానికి, వారు కృత్రిమ పొడవాటి జుట్టును(సవరం) ఉపయోగిస్తారు. ఇటీవల అనేక కొత్త సామాజిక సంఘాలు, వినోద సాధనాలు అభివృద్ధి చెందినప్పటికీ, బిడేసియా భోజ్‌పురీలకు అత్యంత ప్రజాదరణ, ఉపశమింపచేసేదిగా పనిచేస్తుంది. [3]

3.ఝిఝియా నృత్యం(Jhijhiya Dance)[మార్చు]

ఝిఝియా నృత్యం

ఈ జానపద నృత్య రూపం బీహార్‌లోని కోషి ప్రాంతంలో ఉద్భవించిన ప్రార్థన నృత్యం. ఇది మొత్తం కరువు, భూమి పొడిగా మారి పగుళ్లు ఏర్పడినప్పుడు చేసే ఆచార నృత్యం.ఈ నృత్య రూపకాన్ని తరచుగా మహిళలు మాత్రమే ప్రదర్శిస్తారు. ఇందులో ప్రధాన గాయకుడు, హార్మోనియం వాయించే వ్యక్తి,వేణువు వాయించేవ్యక్తీ,, ఢోలక్(డోలు)వాయించే వ్యక్తి కూడా ఉన్నారు.. ఈ నృత్యం ద్వారా, ప్రజల వ్యవసాయానికి కీలకమైనది, ముఖ్యమైనది వర్షం కనుక జీవనాధార మైనవర్షం కోసం ఆశిస్తూ, వర్షప్రభువుఇంద్రుడిని ప్రార్థిస్తారు, శాంతింపజేస్తారు.నృత్యంతో వానతో పాటు, ప్రజలు ఆరోగ్యకరమైన పంట, సమృద్ది పంట ఉత్పత్తి కోసం ఇంద్ర భగవానుడి యెడ వారి విశ్వాసం, భక్తిని చూపించే పాటలను పాడతారు. [1]ఇది మహిళలకు చాలా గౌరవప్రదమైన పండుగ, చాలా ఉల్లాసంగా, వైభవంగా జరుపుకుంటారు.ఝిఝియా యొక్క నృత్యకారులు కళాత్మకంగా రూపొందించిన మట్టిప్రమీదలతో తయారుచేసిన దీపాలను వారి తలపై పెట్టుకుని,అవి పడకుండా సమతులనతో నృత్యం చేస్తారు.ఈ దీపా లలో నూనె లేదా నెయ్యి నింపి వెలిగిస్తారు.నృత్యకారులతో పాటు, ఈ ఆచార నృత్యం చేసేవారిలో ప్రధాన గాయకుడు, హార్మోనియం వాద్యకారుడు, బాన్సూరి వాద్యకారుడు, ఢోలక్ వాయించే వ్యక్తి కూడా ఉంటారు . పెర్కషన్(గంటలు లేదా తాళాల వంటి వాయిద్య పరికరాలు) వాయిద్యాలను వాయించేటందుకు ఇద్దరు మహిళా గాయకులు, ఇతర వాయిద్య కారులు ఉంటారు. [4]

4.కర్మ నృత్యం(Karma Dance)[మార్చు]

కర్మ నృత్యం

ఈ జానపద నృత్యాన్ని బీహార్, అనేక ఇతర రాష్ట్రాల గిరిజన సంఘాలు ప్రదర్శిస్తారు. ఈ నృత్యం వినోద ప్రయోజనాల కంటే ఎక్కువ మతపరమైన, సామాజిక ఆచారాల కోసం ప్రదర్శించ బడు తుంది.విధి యొక్క దేవుడైనకర్మ దేవతను సూచించే కర్మ వృక్షాన్ని ఆరాధించే ఒక రూపం నృత్యం. ఇది పురుషులు, మహిళలు ఇద్దరూ రెండు-అంచెల నిర్మాణాన్ని ఏర్పరుస్తారు.వారు వృత్తాకారంలో నృత్యం చేస్తారు,నృత్యకారులు ఒకరి చేతులను మరొకరు పట్టుకొని సవ్యదిశలో కదులుతారు, శీఘ్రమైన, శక్తివంతమైన, చురుకైన అడుగులు వేస్తూ, క్లిష్టమైన చేతి కదలికలతో పాటు.సాంప్రదాయ ధోల్, పాటలలయకు అనుగుణంగా నృత్యం చేస్తారు.నృత్యం ముగింపులో, డోలును వేగంగా, బిగ్గరగా కొట్టడం ప్రారంభిస్తారు, ప్రతి ఒక్కరూ సంతోషకరమైన ఉత్సాహంతో నృత్యం చేస్తారు. [1]

తూర్పు భారతదేశంలోని అనేక తెగలు, ముఖ్యంగా చోటా నాగ్‌పూర్ పీఠభూమిలో, 'కర్మ' అనే గిరిజన పండుగలో దీనిని నిర్వహిస్తారు. నర్తకులు ఒక వృత్తాకారంగా ఏర్పడి ఒకరి నడుము చుట్టూ మరొకరు చేతులు కట్టుకుని నృత్యం చేస్తారు.ఆదివాసీ ప్రజలు కర్మగా భావించే కర్మ చెట్టు చుట్టూ వృత్తాకారంలో నృత్యం చేస్తూ, ఒకరి నడుము పట్టుకుని వసంతానికి స్వాగతం పలుకుతూ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తారు.సాధారణ నమ్మకం ప్రకారం కర్మ వృక్షం శుభప్రదంగా భావించబడుతుంది,, అదృష్టాన్ని అందిస్తుందాని విశ్వసిస్తారు. [5]

5.కజారీ డ్యాన్స్(Kajari Dance)[మార్చు]

శ్రావణమాసములో వర్షాకాలానికి స్వాగతం పలికేందుకు ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు.ఇది వర్షాకాలం ప్రారంభం నుండి రుతువు ముగిసే వరకు మొత్తం ఋతువు ఉంటుంది. కజారీ పాటలతో నృత్యం ఉంటుంది.వాతావరణంలో మార్పు, వర్షాకాలం ప్రారంభమైనప్పుడు అనుభూతి చెందే ఆనందం, ఉత్సాహం, ప్రశాంతత, మానసిక ఉల్లాసాన్ని ఈ నృత్యం వ్యక్తపరుస్తుంది.ఈ పాట, వర్షం కారణంగా ప్రజల భావాలు, భావోద్వేగాలను, మన భూమి యొక్క అందాన్ని కూడా వివరిస్తుంది.ఈ ఋతువు ప్రారంభంలో తమ భావోద్వేగాలను, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, నృత్యం చేస్తూ కన్యలు, యువతులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.[1]పాటలు ప్రకృతిలో సంభవించిన ఆకస్మిక, ఆహ్లాదకరమైన మార్పును వివరిస్తాయి, గ్రామంలోని ప్రజలు అనుభూతి చెందే రిఫ్రెష్, రిలాక్సింగ్ అనుభూతిని కూడా వివరిస్తాయి. [6]

6.చౌ నృత్యం(Chhau Dance)[మార్చు]

చౌ నృత్యం

బీహార్ యొక్క మరొక ప్రసిద్ధ, సాంప్రదాయ జానపద నృత్యం చౌ.చౌ అంటే 'ముసుగు'. చౌ అనే పదం సంస్కృత పదం 'ఛాయ' నుండి పుట్టినది.ఛాయ అంటే నీడ.ఈ నృత్యం యుద్ధ కళలు, విన్యాసాలు, కథల సమ్మేళనం.పురుషులచే ప్రదర్శించబడుతుంది. చౌ సాధారణంగా శుభసంద ర్భాలు, పండుగల సమయంలో ప్రదర్శించబడుతుంది.నృత్యకారులు రంగురంగుల దుస్తులు, ముసుగులు ధరిస్తారు. వివిధ శైలులు, ముసుగులు, వేషధారణలతో ఆయా ప్రాంతాల్లో ప్రదర్శించబడే మూడు రకాల ఛౌ నృత్యాలు ఉన్నాయి.అవి: సెరైకెల్లా ఛౌ, మయూర్‌భంజ్ ఛౌ, పురూలియా ఛౌ.సెరైకెల్లా చౌ దాని సొగసైన, మనోహరమైన కదలికలకు ప్రసిద్ధి చెందింది, మయూర్‌భంజ్ఛౌ దాని శక్తివంతమైన కదలికలకు ప్రసిద్ధి చెందింది,అయితే పురూలియా ఛౌ దాని విస్తృ తమైన ముసుగులు, దుస్తులు, దాని కథా విధానానికి ప్రసిద్ధి చెందింది.ఛౌ నృత్య కారులు ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు కత్తులు, కవచాలను(డాలు) పట్టుకుంటారు. ఈ సాంప్రదాయ నృత్య రూపాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించే ప్రయత్నంగా చౌ యునెస్కో మానవాళి యొక్క సాంస్కృ తిక వారసత్వంగా చౌ ను గుర్తించింది.[1]

ఆదివాసీల యొక్క కథనం ప్రకారం చౌ నృత్యం ఒక శాస్త్రీయ నృత్యం. నృత్య ప్రదర్శనలో, నృత్యకారులు కొన్నిసార్లు ముసుగును ఉపయోగించరు. అన్ని జానపద నృత్యాల యొక్క సాధారణ లక్షణం అయిన పాట ల ఉపయోగం చౌలో పూర్తిగా లేదు.నర్తకి వివిధ సంజ్ఞల ద్వారా మానసిక స్థితి లేదా ఇతివృత్తాన్ని వ్యక్తీక రిస్తుంది. వీణ, వేణువు, మృదంగంల సంగీతం సహకారంతో ప్రదర్శించే ,వ్యక్తపరచే సున్నితమైన కళాత్మక హావభావాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.ఈ జానపద నృత్యాలన్నీ ఈ ప్రాంతంలోని పురాతన సంప్రదాయాలలో మూలాలను కలిగి ఉన్నాయి. [7]

7.పైకా డ్యాన్స్(Paika Dance)[మార్చు]

ఈ రకమైన సాంప్రదాయ జానపద నృత్యం ఒరిస్సాలోని యోధుల తరగతి అయిన పైకా సామాజికులచే/తెగ వారిచే ప్రదర్శించబడుతుంది.ఈ నృత్యాన్ని ముండా, ఓరాన్ తెగలు కూడా ప్రదర్శిస్తారు.పైకా అనేది ఒక రకమైన యుద్ధ లేదా యుద్ధ నృత్యం, ఇందులో విన్యాసాలు, యుద్ధ కళల కదలికలు ఉంటాయి, సాధారణంగా ఢోల్/డోలు, పేపాతో కూడిన వాయిద్య సంగీతం ఉంటుంది,పేపా అనగాఇది ఒక రకమైన బాకా(గాలిని వూదుతూసంగీత రవళి పుట్టించునది).ఈ నృత్య రూపం చురుకుదనం, ధైర్యం, ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంది.నృత్యం చేస్తున్నప్పుడు వారి వద్ద ఆయుధాలు ఉంటాయి; వారు తమ పనితీరులో భాగంగా నకిలీ(ఉత్తుత్తి) భీకర పోరాటంలో పాల్గొంటున్నప్పుడు వారి చేతుల్లో చెక్క కవచాలు(డాలు), కత్తులు పట్టుకుంటా రు.ఈ నృత్యం కళాకారుల శారీరక బలాన్ని ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు, పండుగలు, వేడుకల సమయంలో ప్రదర్శించబడు తుంది. ప్రదర్శకులు గట్టి ధోతీలు, రంగురంగుల తలపాగా లు కూడా ధరిస్తారు.[1]ఈ నృత్యం మనకు పదాతిదళం, దాని చురుకుదనం, ధైర్యం, ఉత్సాహాన్ని గుర్తు చేస్తుంది. ముఖ్యంగా మయూర్‌భంజ్ ప్రాంతంలో ఈ నృత్యం ప్రసిద్ధి చెందింది. ఈ నృత్య ప్రదర్శనకు చదునైన నేల అవసరం.నృత్యం లో ఈ ఆయుధాలను ఉపయోగించు నృత్యకారుల నైపుణ్యం, సామర్థ్యం వీక్షకులకు అవగతం అవుతుంది.`మండల్`రూపొందించిన వేగవంత మైన లయలతో నృత్యంపతాక స్థితికి చేరుకుంటుంది. ప్రదర్శనకారులు రంగురంగుల తలపాగా లు, గట్టి ధోతీలు ధరించి రెండు వరుసలలో నిలబడతారు. తమ చేతుల్లో చెక్క కత్తులు, కవచాలను పట్టుకుని,యోధులు భీకర నకిలీ యుద్ధంలో పాల్గొంటారు. [8]

ఇవికూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "folk dances of Bihar". caleidoscope.in. Retrieved 2024-02-22.
  2. "the jatjatin dance". Retrieved 2024-02-22.
  3. "the bidesia dance". indianetzone.com. Retrieved 2024-02-22.[permanent dead link]
  4. "The jishian dance bihar". indianetzone.com. Retrieved 2024-02-22.
  5. "The jishian dance bihar". prepp.in. Retrieved 2024-02-22.
  6. "ajari dance". dance.anantagroup.com. Retrieved 2024-02-22.
  7. "Bihar chhou dance". webindia123.com. Retrieved 2024-02-22.
  8. "dances of Bihar". bharatonline.com. Retrieved 2024-02-22.