వర్చువల్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫైల్
పొడి పేరు | VIAF |
---|---|
ప్రవేశపెట్టిన తేదీ | 6 ఆగస్టు 2003 |
నిర్వహించే సంస్థ | OCLC |
ఉదాహరణ | 106965171 |
వర్చువల్ ఇంటర్నేషనల్ అథారిటీ ఫైల్ (VIAF) అనేది అనేక జాతీయ లైబ్రరీల ఉమ్మడి అథారిటీ ఫైల్ ప్రాజెక్టు. దీన్ని ఆన్‌లైన్ కంప్యూటర్ లైబ్రరీ సెంటర్ (OCLC) నిర్వహిస్తుంది.
చరిత్ర
[మార్చు]1990ల చివరలో ఉమ్మడి అంతర్జాతీయ అథారిటీ ఉండాలనే చర్చ మొదలైంది. ఒక ప్రత్యేక ఉమ్మడి అథారిటీ ఫైల్‌ను సృష్టించేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత, ఇప్పటికే ఉన్న జాతీయ అథారిటీలను లింకు చేయాలనే కొత్త ఆలోచన వచ్చింది. దీనివలన ఎక్కువ సమయం, ఖర్చూ లేకుండానే ఉమ్మడి ఫైల్ వలన కలిగే అన్ని ప్రయోజనాలనూ కలుగుతుంది. [1]
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ 2003 లో నిర్వహించిన వరల్డ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్‌లో VIAF భావనను ప్రవేశపెట్టారు. US లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (LC), జర్మన్ నేషనల్ లైబ్రరీ (DNB), OCLC లు 2003 ఆగస్టు 6 న ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి. [2] బిబ్లియోథెక్ నేషనల్ డి ఫ్రాన్స్ (BnF) 2007 అక్టోబరు 5 న ప్రాజెక్టులో చేరింది.
2012 ఏప్రిల్ 4 న ఈ ప్రాజెక్టు OCLC యొక్క సేవగా మారింది. [3]
జాతీయ అధికార ఫైల్‌లను (జర్మన్ నేమ్ అథారిటీ ఫైల్ వంటివి) ఒకే వర్చువల్ అథారిటీ ఫైల్‌కి లింక్ చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ఫైల్‌లో, విభిన్న డేటా సెట్‌లలో ఉండే ఒకేలాంటి రికార్డులను ఒకదానితో ఒకటి లింకు చేసారు. VIAF రికార్డు ప్రామాణిక డేటా సంఖ్యను పొందుతుంది. ఒరిజినల్ రికార్డులలో ఉండే ప్రాథమిక "చూడండి", "ఇవి కూడా చూడండి" రికార్డులు ఇందులో ఉంటాయి. ఒరిజినల్ అథారిటీ రికార్డులను ఇది సూచిస్తుంది. పరిశోధనలకు, డేటా మార్పిడి, భాగస్వామ్యాల కోసం ఈ డేటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. పరస్పర నవీకరణ మెటాడేటా హార్వెస్టింగ్ (OAI-PMH) ప్రోటోకాల్ కోసం ఓపెన్ ఆర్కైవ్స్ ఇనిషియేటివ్ ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తుంది.
ఫైల్ నంబర్లను వికీపీడియా జీవిత చరిత్ర వ్యాసాల్లో చేరుస్తున్నారు. వికీడేటాలో కూడా వీటిని చేరుస్తున్నారు. [4]
VIAF క్లస్టర్‌లు
[మార్చు]VIAF క్లస్టరింగ్ అల్గోరిథంను ప్రతి నెలా నడుపుతారు. పాల్గొనే లైబ్రరీల నుండి మరింత డేటా జోడించబడినందున, అధికార రికార్డుల సమూహాలు కలిసిపోవచ్చు లేదా విడిపోవచ్చు. దీని వలన కొన్ని అధికార రికార్డుల VIAF ఐడెంటిఫైయర్‌లో కొంత హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.
పాల్గొనే లైబ్రరీలు, సంస్థలు
[మార్చు]ఇంగ్లీషు వికీపీడియా వ్యాసం పేరు | ఐడెంటిఫయరు | ప్రదేశం | దేశం |
---|---|---|---|
బిబ్లియోథెకా ఆలెక్జాండ్రినా | EGAXA | అలెగ్జాండ్రియా | ఈజిప్టు |
బిబ్లియోటెకా నేషనల్ డి చిలీ | BNCHL | శాంటియాగో | చిలీ |
బిబ్లియోటెకా నేషనల్ డి ఎస్పానా | BNE | మాడ్రిడ్ | స్పెయిన్ |
బిబ్లియోటెకా నేషనల్ డి పోర్చుగల్ | PTBNP | లిస్బన్ | పోర్చుగల్ |
బిబ్లియోథెక్ ఎట్ ఆర్కైవ్స్ నేషనాలెస్ డు క్విబెక్ | B2Q | క్విబెక్ | కెనడా |
బిబ్లియోథెక్ నేషనాల్ డి ఫ్రాన్స్ | BnF | పారిస్ | ఫ్రాన్స్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ గ్రీస్ | ΕΒΕ | ఏథెన్స్ | గ్రీస్ |
బిబ్లియోథెక్ నేషనాల్ డు రోయాం డు మారోక్ (BNRM) | MRBNR | రబత్ | మొరాకో |
బయోగ్రాఫిష్ పోర్టాల్ | BPN | ది హేగ్ | నెదర్లాండ్స్ |
బ్రిటిష్ లైబ్రరీ | లండన్ | ఇంగ్లాండు | |
డేనిష్ ఏజన్సీ ఫర్ కల్చర్ అండ్ పాలసెస్ | కోపెన్‌హాగన్ | డెన్మార్క్ | |
Danish Bibliographic Centre | DBC | బాలరప్ | డెన్మార్క్ |
జర్మన్ నేషనల్ లైబ్రరీ (DNB) | GND | ఫ్రాంక్‌ఫర్ట్ | జర్మనీ |
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేం ఐడెంటిఫయర్ | ISNI | లండన్ | యునైటెడ్ కింగ్‌డమ్ |
ఇజ్రాయిల్ మ్యూజియమ్ | జెరూసలెం | ఇజ్రాయిల్ | |
Istituto Centrale per il Catalogo Unico | ICCU SBN |
రోమ్ | ఇటలీ |
లెబనీస్ నేషనల్ లైబ్రరీ | LNL | బీరూట్ | లెబనాన్ |
లైబ్రరీ అండ్ ఆర్కైవ్స్ కెనడా | LAC | అట్టావా | కెనడా |
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ | LCCN | వాషింగ్టన్ | యునైటెడ్ స్టేట్స్ |
నేషనల్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీ ఇన్ జాగ్రెబ్ | NSK | జాగ్రెబ్ | క్రొయేషియా |
నేషనల్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీ ఆఫ్ స్లోవేనియా | ల్యుబ్లియానా | స్లోవేనియా | |
నేషనల్ సెంట్రల్ లైబ్రరీ | NCL CYT | తైపీ | తైవాన్ |
నేషనల్ డయట్ లైబ్రరీ | NDL | టోక్యో క్యోటో | జపాన్ |
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్ | NII CiNii |
టోక్యో | జపాన్ |
నేషనల్ లైబ్రరీ బోర్డ్ | NLB | – | సింగపూర్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఆస్ట్రేలియా | NLA | కాన్‌బెర్రా | ఆస్ట్రేలియా |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ బ్రెజిల్ | BLBNB | రియో డి జానీరో | బ్రెజిల్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ కటలోనియా | BNC | బార్సెలోనా | స్పెయిన్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఎస్టోనియా | ERRR | తల్లిన్ | ఎస్టోనియా |
నేషనల్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీ ఆఫ్ ఐస్‌లాండ్ (NULI) | UIY | రేజవిక్ | ఐస్‌లాండ్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఐర్లండ్ | N6I | డబ్లిన్ | ఐర్‌లాండ్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇజ్రాయిల్ | NLI | జెరూసలేమ్ | ఇజ్రాయిల్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ కొరియా | KRNLK | సియోల్ | కొరియా |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ లాట్వియా | LNB | రీగా | లాట్వియా |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ లక్సెంబర్గ్ | BNL | లక్సెంబర్గ్ | లక్సెంబర్గ్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెక్సికో | BNM | మెక్సికో నగరం | మెక్సికో |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ది నెదర్లాండ్స్ | NTA | ది హేగ్ | నెదర్లాండ్స్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ న్యూజీలాండ్ | వెల్లింగ్టన్ | న్యూజీలాండ్ | |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ నార్వే | BIBSYS W2Z |
ట్రాండ్‌హీమ్ | నార్వే |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ పోలండ్ | NLP | వార్సా | పోలండ్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ రష్యా | NLR | సెయింట్ పీటర్స్‌బర్గ్ | రష్యా |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లండ్ | ఎడింబరో | స్కాట్లాండ్ | |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా | కేప్‌టౌన్ ప్రిటోరియా |
దక్షిణాఫ్రికా | |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్ | SELIBR | స్టాక్‌హోమ్ | స్వీడన్ |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ వేల్స్ | అబెరిస్విత్ | వేల్స్ | |
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ది చెక్ రిపబ్లిక్ | NKC | ప్రాగ్ | చెక్ రిపబ్లిక్ |
నేషనల్ షెచెనిల్ లైబ్రరీ | NSZL | బుడాపెస్ట్ | హంగరీ |
పెర్సియస్ ప్రాజెక్ట్ | PERSEUS | మెడ్‌ఫోర్డ్ | యునైటెడ్ స్టేట్స్ |
RERO (లైబ్రరీ నెట్‌వర్క్ ఆఫ్ వెస్టర్న్ స్విట్జర్లండ్) | RERO | మార్టినీ | స్విట్జర్లండ్ |
రిపర్టోయిర్ ఇంటర్నేషనల్ డెస్ సోర్సెస్ మ్యూసికేల్స్క్వ్ | RISM | ఫ్రాంక్‌ఫర్ట్ | జర్మనీ |
సిస్టెమె యూనివర్సిటెయిర్ డి డాక్యుమెంటేషన్ | SUDOC | – | ఫ్రాన్స్ |
సిరియాక్ రిఫరెన్స్ పోర్టల్ | SRP | నాష్‌విల్ | యునైటెడ్ స్టేట్స్ |
స్విస్ నేషనల్ లైబ్రరీ | SWNL | బెర్న్ | స్విట్జర్లండ్ |
Narodowy Uniwersalny Katalog Centralny, NUKAT | NUKAT | – | పోలండ్ |
Union List of Artist Names – Getty Research Institute | ULAN JPG |
లాస్ ఏంజలెస్ | యునైటెడ్ స్టేట్స్ |
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ అగ్రికల్చరల్ లైబ్రరీ | NALT | బెల్ట్స్‌విల్ | యునైటెడ్ స్టేట్స్ |
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ | బెథెస్దా | యునైటెడ్ స్టేట్స్ | |
వాటికన్ లైబ్రరీ | BAV | – | వాటికన్ నగరం |
కల్చర్‌కనెక్ట్ | బ్రసెల్స్ | బెల్జియమ్ | |
వికిడేటా | WKP | బెర్లిన్ | అంతర్జాతీయం |
ఇవి కూడా చూడండి
[మార్చు]- అథారిటీ కంట్రోల్
- సబ్జెక్ట్ టెర్మినాలజీ (ఫాస్ట్) యొక్క ముఖ అనువర్తనం
- ఇంటిగ్రేటెడ్ అథారిటీ ఫైల్ (GND)
- ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అథారిటీ డేటా నంబర్ (ISADN)
- ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేమ్ ఐడెంటిఫైయర్ (ISNI)
- వ్యాసాల కోసం వికీపీడియా అధికార నియంత్రణ టెంప్లేట్
ప్రస్తావనలు
[మార్చు]- ↑ O'Neill, Edward T. (12 August 2016). "VIAF: Origins". Authority Data on the Web, a Satellite Meeting of the 2016 IFLA World Library and Information Congress. OCLC. Archived from the original (Video presentation) on 2018-07-13.
- ↑ Morris, Susan R. (September 2003). "Virtual International Authority". Library of Congress Information Bulletin. Library of Congress. Retrieved 2021-01-05.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Murphy, Bob (4 April 2012). "Virtual International Authority File service transitions to OCLC; contributing institutions continue to shape direction through VIAF Council" (Press release). OCLC (in ఇంగ్లీష్). Dublin, OH.
- ↑ Klein, Max; Renspie, Melissa (7 December 2012). "VIAFbot Edits 250,000 Wikipedia Articles to Reciprocate All Links from VIAF into Wikipedia". OCLC.