Coordinates: 26°19′27.084″N 89°27′3.6″E / 26.32419000°N 89.451000°E / 26.32419000; 89.451000

కూచ్ బెహార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cooch Behar
Koch Bihar
City
Top: Cooch Behar Palace, bottom: skyline of the city in 2018
Nickname: 
City of kings
Cooch Behar is located in West Bengal
Cooch Behar
Cooch Behar
Location in West Bengal, India
Cooch Behar is located in India
Cooch Behar
Cooch Behar
Cooch Behar (India)
Coordinates: 26°19′27.084″N 89°27′3.6″E / 26.32419000°N 89.451000°E / 26.32419000; 89.451000
Country India
StateWest Bengal
జిల్లాCooch Behar
Government
 • TypeMunicipality
 • BodyCooch Behar Municipality
 • ChairmanRabindra Nath Ghosh (All India Trinamool Congress)
Area
 • City8.29 km2 (3.20 sq mi)
Population
 (2011)[1]
 • City77,935
 • Density9,400/km2 (24,000/sq mi)
 • Metro
1,06,760
Languages
 • OfficialBengali[2][3]
 • Additional officialEnglish[2]
 • RegionalBengali, Rajbanshi
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
736101
Telephone code03582
Vehicle registrationWB-64/63
Lok Sabha constituencyCooch Behar (SC)
Vidhan Sabha constituencyCooch Behar Uttar (SC), Cooch Behar Dakshin, Natabari

కూచ్ బెహర్ లేదా కోచ్ బీహార్, భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తోర్సానది ఒడ్డున ఉన్నఒక నగరం.ఇది పురపాలికపట్టణం. ఈ పట్టణం కూచ్ బెహార్ జిల్లాకు ప్రధాన కార్యాలయం. భౌగోళికంగా ఇది 26°22′N 89°29′E / 26.367°N 89.483°E / 26.367; 89.483 అక్షాంశ, రేఖాంశాలవద్ద తూర్పు హిమాలయాల దిగువన ఉంది. ఉత్తర బెంగాల్ ప్రాంతంలో రాచరిక వారసత్వఅవశేషాలతో కూడిన ఏకైక ప్రణాళిక బద్ధమైన నగరం కూచ్ బెహార్.[4] కూచ్ బెహార్ ప్యాలెస్, మదన్ మోహన్ దేవాలయం ఉన్నపశ్చిమ బెంగాల్ ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఇది వారసత్వనగరంగా ప్రకటించబడింది.[5] జైపూర్‌కు చెందిన మహారాణి గాయత్రీదేవి తల్లి ఇల్లు ఈ నగరంలోనే ఉంది. బ్రిటీష్ రాజ్ సమయంలో, కోచ్ బీహార్ రాచరిక రాష్ట్రంగా ఉంది. దీనిని తరచుగా శివవంశంగా వర్ణించబడే కోచ్ రాజ్యం పాలించింది. ఈశాన్య భారతదేశం లోని కోచ్ తెగ నుండి వారి మూలాన్ని గుర్తించింది. 1949 ఆగష్టు 20 తర్వాత, కూచ్ బెహార్ జిల్లా ప్రధాన కార్యాలయంగా కూచ్ బెహార్ (కోచ్ బెహార్) నగరంతో రాచరిక రాష్ట్రం నుండి ప్రస్తుత స్థితికి మార్చబడింది.[6]

వ్యుత్పత్తి శాస్త్రం[మార్చు]

కూచ్ బెహర్ అనే పేరు రెండు పదాల నుండి ఉద్భవించింది.కూచ్,కోచ్ అనే పదం చెడిపోయిన రూపం, కోచ్ తెగల పేరు, బెహర్ అనే పదం విహార నుండి ఉద్భవించింది. అంటే భూమి, కోచ్ బెహర్ అంటే కోచెస్ భూమి అనే అర్థాన్ని సూచిస్తుంది .[7][8]

భౌగోళికం[మార్చు]

కూచ్ బెహార్ పట్టణం, పశ్చిమబెంగాల్ ఉత్తరంలో తూర్పు హిమాలయాల దిగువన, 26°22′N 89°29′E / 26.367°N 89.483°E / 26.367; 89.483 అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉంది. ఇది కూచ్ బెహార్ జిల్లాలో 8.29 చ.కి.మీ విస్తీర్ణంతో ఉన్న అతి పెద్దపట్టణం, ఇది జిల్లా ప్రధానకార్యాలయం.[9] టోర్సా నది పట్టణానికి పశ్చిమాన ప్రవహిస్తుంది. భారీ వర్షాలు తరచుగా బలమైన నదీ ప్రవాహాల వలన వరదల ముప్పులకు కారణమవుతుంది. అల్లకల్లోలమైన నీరు భారీ మొత్తంతో ఇసుక, ఒండ్రు మట్టిని, గులకరాళ్ళను తీసుకు వెళుతుంది. ఇది పంట ఉత్పత్తిపై అలాగే ఈ ప్రాంత జలవాతావరణ పరిస్థితిపై ప్రతికూలప్రభావాన్నిచూపుతుంది.[10]

కూచ్ బెహర్ పట్టణం, దానిచుట్టు పక్కల ప్రాంతాలు ఇంధనం, కలప కోసం పెరుగుతున్న అవసరాల కారణంగా అటవీ నిర్మూలనను ఎదుర్కొంటుంది. అలాగే వాహనాల రాకపోకలు పెరగడంవల్ల వాయుకాలుష్యం ఉంది. స్థానిక వృక్షజాలంలో అరటి, వెదురు, లతలు, ఇతర జల మొక్కలు, శిలీంధ్రాలు, కలప, గడ్డి, కూరగాయలు, పండ్లచెట్లు ఉన్నాయి.[11]

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కూచ్ బెహార్ పట్టణ సముదాయంలో 1,06,760 మంది జనాభా ఉన్నారు.అందులో 53,803 మంది పురుషులు,52,957 మంది మహిళలు ఉన్నారు.0–6 సంవత్సరాల వయస్సుగల జనాభా 7,910. మొత్తం జనాభాలో ప్రభావవంతమైన అక్షరాస్యత రేటు 91.75%గా ఉంది.[12]

2001 జనాభా లెక్కల ప్రకారం [13] కూచ్ బెహార్ పురపాలక సంఘ పరిధిలో 76,812 జనాభా ఉంది.లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 972మంది స్త్రీలు ఉన్నారు. జనాభాలో దశాబ్దాల వృద్ధి రేటు 7.86%గా ఉంది.జనాభాలో పురుషులు 50.6%, స్త్రీలు 49.4% ఉన్నారు. కూచ్ బెహార్ సగటు అక్షరాస్యత రేటు 82%గా ఉంది. ఇది జాతీయసగటు 64.84% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత రేటు 86% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 77% గా ఉంది.కూచ్ బెహార్‌ జనాభాలో 9% మంది 6 సంవత్సరాలకంటే తక్కువ వయస్సువారు ఉన్నారు.[9]

కూచ్ బెహార్‌లో అనుసరించే ప్రధానమతాలు హిందూ (76.44%) తరువాత ఇస్లాం (23.34%)మం దిఉన్నారు.[14] సాధారణంగా మాట్లాడే భాషలు బెంగాలీ, కాంతపురి.[14][15]

ప్రారంభ కాలం[మార్చు]

నృపేంద్ర నారాయణ్, కూచ్ బెహార్ మహారాజు

కూచ్ బెహార్ అస్సాంలోని కామరూప రాజ్యంలో 4వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ఒక భాగంగా ఉంది.13వ శతాబ్దంలోఈ ప్రాంతం కామత రాజ్యంలో భాగమైంది. దాదాపు సా.శ.1498 వరకు ఖేన్ రాజవంశీకులు పాలించారు. గౌర్ స్వతంత్ర పఠాన్ సుల్తాన్ అయిన అలావుద్దీన్ హుస్సేన్ షా చేతిలో ఖేన్ రాజవంశీకులు ఓడిపోయారు. కొత్త ఆక్రమణదారులు స్థానిక భూయాన్ ముఖ్యులు, అహోం రాజ్యపాలకుడు సుహుంగ్‌ముంగ్‌తో పోరాడారు. ఆ ప్రాంతంపై నియంత్రణ కోల్పోయారు. ఈ సమయంలో, కోచ్ తెగ చాలా శక్తివంతమైంది. తనను తాను కమటేశ్వర్ (కామత్ ప్రభువు)గా ప్రకటించుకుంది.కోచ్ రాజవంశాన్నిస్థాపించింది.

మొదటి ముఖ్యమైన కోచ్ పాలకుడు బిసు, తరువాత బిస్వా సింఘా అని పిలువబడ్డాడు. ఇతను సా.శ.1515లో అధికారంలోకి వచ్చాడు.[16] అతని కుమారుడు నర నారాయణ్ ఆధ్వర్యంలో, కామత రాజ్యం అత్యున్నత స్థాయికిచేరుకుంది.[17] నర నారాయణ్ తమ్ముడు,శుక్లధ్వాజ్ (చిలరాయ్), రాజ్యాన్ని విస్తరించడానికి దండయాత్రలు చేపట్టిన ప్రముఖ సైనిక జనరల్ గా వెలుగొందాడు .అతను దాని తూర్పుభాగానికి గవర్నర్ అయ్యాడు.

కోచ్ రాజ్య ప్రారంభ రాజధానిగా, కోచ్ బెహర్ స్థానం స్థిరంగా లేదు.కూచ్ బెహార్ పట్టణానికి మార్చబడినప్పుడు మాత్రమే స్థిరంగా మారింది.రూపనారాయణ్, ఒక తెలియని సాధువు సలహా మేరకు, రాజధానిని సా.శ. 1693-1714 మధ్య అత్తరోకోత నుండి గురియాతి (ప్రస్తుతం టోర్సా నది ఒడ్డున ఉన్న కూచ్ బెహార్ పట్టణం అని పిలుస్తారు)కి మార్చారు. దీని తరువాత, రాజధాని ఎల్లప్పుడూ ప్రస్తుత ప్రదేశంలో లేదా సమీపంలో ఉండేది.

సా.శ. 1661 లో, ప్రాణ్ నారాయణ్ తన రాజ్యాన్ని విస్తరించాలని అనుకున్నాడు. అయితే, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆధ్వర్యంలో బెంగాల్ సుబేదార్ మీర్ జుమ్లా కూచ్ బెహార్‌పై దాడి చేసి భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాదాపు ఎటువంటి ప్రతిఘటనను ఎదుర్కోలేదు.[18] కూచ్ బెహార్ పట్టణానికి ఆ తర్వాత ఆలంగీర్‌నగర్ అని పేరుపెట్టారు.[19] ప్రాణ్ నారాయణ్ కొద్దిరోజుల్లోనే తన రాజ్యాన్ని తిరిగి పొందాడు.

1772-1773లో, భూటాన్ రాజు కూచ్ బెహార్‌పై దాడిచేసి స్వాధీనం చేసుకున్నాడు. భూటానీయులను బహిష్కరించడానికి,కూచ్ బెహార్ రాజ్యం 1773 ఏప్రిల్ 5 న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది. ఆసమయంలో,కూచ్ బెహార్‌లో భూటాన్ నాణేలు ముద్రించబడ్డాయి.[20] భూటానీలను బహిష్కరించిన తరువాత, కూచ్ బెహార్ మళ్లీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రక్షణలో రాచరికరాజ్యంగా మారింది.[21][22]

కూచ్ బెహర్ రాజ భవనం శ్రేష్టమైన ఇటాలియన్ వాస్తుకళ తరువాత నిర్మించబడింది. రాజ భవనం గోపురం ఇటాలియన్ శైలిలోనిర్మించబడింది. ఇది సెయింట్ పీటర్స్ బసిలికా, వాటికన్ నగరం, రోమ్ గోపురంను పోలి ఉంటుంది. ఇది సా.శ.1887లో మహారాజా నృపేంద్ర నారాయణ్ పాలనలో నిర్మించబడింది.[19] సా.శ. 1878 లో మహారాజు బ్రహ్మబోధకుడు కేశబ్ చంద్ర సేన్ కుమార్తెను వివాహంచేసుకున్నాడు.ఈ సమూహం కూచ్ బెహార్ రాష్ట్రంలో పునరుజ్జీవనానికి దారితీసింది.[23] మహారాజా నృపేంద్రనారాయణ్ ఆధునిక కూచ్ బెహార్ పట్టణానికి వాస్తుశిల్పిగా ప్రసిద్ధి చెందాడు.[24]

స్వాతంత్ర్యం తరువాత[మార్చు]

బ్రిటీష్ పాలన ముగింపులో కూచ్ బెహార్ రాజు, భారత ప్రభుత్వానికి మధ్యజరిగిన ఒప్పందం ప్రకారం, మహారాజా జగద్దిపేంద్ర నారాయణ్ రాష్ట్ర పూర్తి అధికారం, అధికార పరిధిని 1949 సెప్టెంబరు 12 నుండి భారత ప్రభుత్వానికి బదిలీ చేశాడు.[6] చివరికి కూచ్ బెహార్ 1950 జనవరి 19న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భాగమైంది. కూచ్ బెహార్ పట్టణం దాని ప్రధాన కార్యాలయంగా ఉంది.[25]

ప్రభుత్వం, రాజకీయాలు[మార్చు]

పౌర పరిపాలన[మార్చు]

పట్టణం పౌర పరిపాలనకు కూచ్ బెహార్ పురపాలకసంఘం బాధ్యత వహిస్తుంది. పురపాలక సంఘంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది.రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, పర్యాటక రంగాలను చూస్తోంది.ఈ పట్టణం కూచ్ బెహార్ నియోజకవర్గంలో ఒక భాగం. లోక్‌సభకు (భారత పార్లమెంటు దిగువ సభ) ఒక సభ్యుడిని ఎన్నుకుంటుంది. పట్టణ ప్రాంతం కూచ్ బెహర్ దక్షిణ్ అనే ఒక శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభకు ఒక సభ్యుడిని ఎన్నుకుంటుంది.[26] కూచ్ బెహార్ పట్టణం, జిల్లా పోలీసు అధికార పరిధిలోకి వస్తుంది. కూచ్ బెహార్ పట్టణం జిల్లా కోర్టుకు నిలయం.

పౌర సేవలు[మార్చు]

కూచ్ బెహార్ బాగా ప్రణాళికాబద్ధమైన పట్టణం,[27] త్రాగునీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సేవలు స్థానిక పురపాలక సంఘం అందిస్తుంది. కూచ్ బెహార్‌లోని ఆరోగ్య సేవలలో ప్రభుత్వ యాజమాన్యంలోని జిల్లా ఆసుపత్రి, ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం, ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

కూచ్‌బెహర్ రాస్ చక్ర ఉత్సవ చిత్రం

కూచ్ బెహార్ పట్టణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉన్నారు.[28] కూచ్ బెహార్ అనేక జిల్లా-స్థాయి, డివిజనల్-స్థాయి కార్యాలయాలకు నిలయంగా ఉంది. పెద్ద ప్రభుత్వ-ఉద్యోగుల శ్రామిక శక్తిని కలిగి ఉంది. వ్యాపారం ప్రధానంగా రిటైల్ వస్తువులపై కేంద్రీకృతమై ఉంది,ప్రధాన కేంద్రాలు బిఎస్ రోడ్, రూపనారాయణ్ రోడ్, కేశబ్ రోడ్, భవానీగంజ్ బజార్ వద్ద ఉన్నాయి.

పట్టణానికి 4 కి.మీ.దూరంలోని తుఫ్ఫాన్ గుంజ్ మార్గంలో చకచకా అనే పారిశ్రామిక కారిడార్ నిర్మించబడింది. అక్కడ అనేక కంపెనీలు పరిశ్రమలు స్థాపించాయి.[29] సమీప గ్రామీణ ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారం.గ్రామీణ ప్రజలు పట్టణానికి పండ్లు, కూరగాయలను సరఫరా చేస్తారు. ఈ పాక్షిక-గ్రామీణ సమాజంలోని పేద వర్గాలు రవాణా, ప్రాథమిక వ్యవసాయం, చిన్న దుకాణాలు నిర్మాణంలో అధికసంఖ్యలో కూలీలుగా పాల్గొంటున్నారు.

పట్టణం అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్నందున సమీపంలో సరిహద్దు భద్రతా దళం పెద్ద సంఖ్యలో వారి ఉనికిని కలిగి ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చే పెద్ద జనాభాకు దారితీస్తుంది. కూచ్ బెహార్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పర్యాటకం నుండి వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ [30] కూచ్ బెహార్ పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి.

సంస్కృతి[మార్చు]

ప్రతి సంవత్సరం రాస్ పూర్ణిమ సందర్భంగా, పశ్చిమ బెంగాల్‌లోని అతిపెద్ద, పురాతన జాతరలలో ఒకటైన రాస్ మేళా కూచ్ బెహర్ పట్టణంలో నిర్వహిస్తారు. ఎబిఎన్ సీల్ కళాశాల సమీపంలోని రాస్ మేళా మైదానంలో కూచ్ బెహార్ పురపాలక సంఘం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆ సమయంలో ఈ జాతర మొత్తం ఉత్తర బెంగాల్ ప్రాంతానికి ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. భారతదేశం నలుమూలల నుండి, బంగ్లాదేశ్ నుండి కూడా వ్యాపారులు, విక్రేతలు ఉత్సవంలో పాల్గొంటారు. ఇంతకుముందు కూచ్ బెహార్ మహారాజులు రాస్ చక్రాన్ని తరలించడం ద్వారా జాతరను ప్రారంభించేవారు. ఇప్పుడు కూచ్ బెహార్ జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా ఆ పని అమలు చేయబడుతుంది. రాస్ చక్రం మత సామరస్యానికి చిహ్నంగా పరిగణిస్తారు.ఇది తరతరాలుగా ముస్లిం కుటుంబంచే చేయబడుతుంది. జాతర సందర్భంగా పొరుగున ఉన్న అస్సాం, జల్‌పైగురి, అలీపుర్‌దువార్, మొత్తం ఉత్తర బెంగాల్ నుండి కూచ్ బెహార్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు.

నవలా రచయిత అమియా భూషణ్ మజుందార్ కూచ్ బెహార్‌లో పుట్టి, పెరిగాడు. పనిచేశాడు.కూచ్ బెహర్, దాని ప్రజలు, సంస్కృతి, తోర్షా నది అతని నవలలలో పునరావృతమయ్యే అంశం. కాబ్‌వెబ్ అనే లాభాపేక్షలేని సంస్థ విజ్ఞానాన్ని, వాస్తవాలను ఉత్సాహంగా వ్యాప్తి చేస్తోంది. వారు ఈ యుగంలోని కొత్త సామాజిక దురాచారమైన అబద్ధ వార్తలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.[31]

పర్యాటకం[మార్చు]

కూచ్ బెహర్ ప్యాలెస్

కూచ్ బెహార్ పశ్చిమ బెంగాల్ లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటి.

కూచ్ బెహర్ ప్యాలెస్[మార్చు]

ఇది నగరంలో ప్రధాన ఆకర్షణ. ఇది 1887లో మహారాజా నృపేంద్ర నారాయణ్ హయాంలో లండన్‌లోని బకింగ్‌హామ్ రాజభవనం తరహాలో రూపొందించారు.ఇది 7,767 చ.మీటర్లు (51,309 చ.అ). విస్తీర్ణంలో శాస్త్రీయ పాశ్చాత్య శైలిలో ఇటుకలతో నిర్మించిన రెండు అంతస్తుల నిర్మాణం. మొత్తం నిర్మాణం 395 feet (120 m) పొడవు, 296 feet (90 m) వెడల్పుతో ఉంటుంది. దీని వరండా సొగసైన ఆకారపుతో లోహ గోపురం కలిగి ఉంది. దాని పైభాగంలో స్థూపాకార రకం వెంటిలేటర్ ఉంది. ఇది 124 feet (38 m) భూమి నుండి ఎత్తు ఉంటుంది. పునరుజ్జీవనోద్యమ నిర్మాణ శైలిలో ఉంది. ఈ గదులు హాళ్లలో ఉండే విలువైన వస్తువులు ఇప్పుడు లేవు. అసలు రాజభవనం మూడు అంతస్థులుగా ఉండేది, కానీ 19వ శతాబ్దపు భూకంపం కారణంగా ఒక అంతస్థుకు నష్టం సంభవించింది. ఈ రాజభవనం కోచ్ రాజుల యూరోపియన్ ఆదర్శవాదానికి ఆమోదం తెలుపుతుంది. వారు తమ భారతీయ వారసత్వాన్ని ఖండించకుండా యూరోపియన్ సంస్కృతిని స్వీకరించారు. [32]

సాగర్ దిగి[మార్చు]

కూచ్ బెహర్ సాగర్ దిఘి ప్రాంతం

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ నడిబొడ్డున ఉన్న "గొప్ప చెరువులలో" సాగర్దిఘి అనేపేరుతో ఒక సరస్సు ఉంది.ఇది సముద్రం లాంటి చెరువు. దాని గొప్ప ప్రాముఖ్యత దృష్ట్యా అతిశయోక్తిగా చెప్పుతారు. ఇది ప్రజలతో ప్రసిద్ధి చెందడంతో పాటు, ప్రతి శీతాకాలంలో వలస పక్షులను కూడా ఆకర్షిస్తుంది. దీనికి సమీపంలో జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, ఉత్తర బెంగాల్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిపాలనా భవనం, పశ్చిమాన బి.ఎస్.ఎన్.ఎల్. డివిజను కార్యాలయం వంటి అనేక ముఖ్యమైన పరిపాలనా భవనాలు దీని చుట్టూ ఉన్నాయి. పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం, జిల్లా గ్రంధాలయం, దక్షిణాన పురపాలక సంఘ భవనం, బిఎల్.ఆర్.ఒ. కార్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూచ్ బెహార్ ప్రధాన శాఖ బ్రాంచి, తూర్పున ఆర్.టి.ఒ కార్యాలయం, ఉత్తరాన విదేశీయుల రిజిస్ట్రేషన్ కార్యాలయం,జిల్లాకోర్టు మొదలైనవి ఉన్నాయి. ఇటువంటి భవనాలు చాలా వరకు రాచరిక వారసత్వపు అవశేషాలుగా మిగిలాయి.[33]

వాయు మార్గ సేవలు[మార్చు]

కూచ్ బెహార్ విమానాశ్రయం కోల్‌కతాకు రోజువారీ విమాన సేవలను అందిస్తుంది.[34] సమీప అంతర్జాతీయ విమానాశ్రయం సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా విమానాశ్రయం, సుమారు 160 km (99 mi) కూచ్ బెహార్ నుండి.ఇండిగో, స్పైస్ జెట్ ఈ ప్రాంతాన్ని ఢిల్లీ, కోల్‌కతా,గౌహతి,ముంబై, చెన్నై,బ్యాంకాక్, పారో,బ్యాంకాక్, చండీగఢ్ లకు అనుసంధానించే ప్రధాన వాహకాలు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Cooch Behar City". coochbeharmunicipality.com. Retrieved 26 November 2020.
  2. 2.0 2.1 "Fact and Figures". wb.gov.in. Retrieved 15 January 2019.
  3. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. p. 85. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 2 March 2019.
  4. Coochbehar Travel Archived 2019-10-13 at the Wayback Machine.
  5. The Tribune, Chandigarh, India – Nation.
  6. 6.0 6.1 "Brief Royal History of Cooch Behar 5". Archived from the original on 24 July 2011. Retrieved 22 October 2006.
  7. Pal, Dr. Nripendra Nath (2000). Itikathai Cooch Behar (A brief history of Cooch Behar). Kolkata: Anima Prakashani. pp. 11–12.
  8. The name Cooch Behar is a compound of two words: Cooch and Behar.
  9. 9.0 9.1 "West Bengal Census". Archived from the original on 19 July 2011. Retrieved 1 October 2006.
  10. Annual Plan on Agriculture 2003–04. Cooch Behar: Cooch Behar District Agriculture Office. p. 2.
  11. "West Bengal Tourism: Cooch Behar". Archived from the original on 15 July 2009.
  12. "Urban Agglomerations/Cities having population 100,000 and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 21 October 2011.
  13. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  14. 14.0 14.1 District Profile, Cooch Behar Government website Archived 15 జూలై 2010 at the Wayback Machine Accessed on 1 October 2006
  15. "Rangpuri | Ethnologue". ethnologue.com (in ఇంగ్లీష్). Retrieved 28 August 2019.
  16. Nath, D. (1989), History of the Koch Kingdom, C. 1515-1615, Mittal Publications, pp. 5–6, ISBN 8170991099
  17. "Royal History of Cooch Behar". Retrieved 22 October 2006.
  18. Pal, Dr. Nripendra Nath (2000). Itikathai Cooch Behar (A brief history of Cooch Behar). Kolkata: Anima Prakashani. p. 68.
  19. 19.0 19.1 Bhattacharyya, PK (2012). "Kamata-Koch Behar". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
  20. "Old Coins of Bhutan". Mintage World. Retrieved 10 October 2021.
  21. Pal, Dr. Nripendra Nath (2000). Itikathai Cooch Behar (A brief history of Cooch Behar). Kolkata: Anima Prakashani. p. 73.
  22. Bowman, John S., ed. (2000). Columbia Chronologies of Asian History and Culture. New York: Columbia University Press. pp. 385. ISBN 0-231-11004-9.
  23. Pal, Dr. Nripendra Nath (2000). Itikathai Cooch Behar (A brief history of Cooch Behar). Kolkata: Anima Prakashani. p. 75.
  24. "Royal History of Cooch Behar 5". Retrieved 22 October 2006.
  25. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; web12 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  26. "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. pp. 4, 23. Retrieved 18 April 2009.
  27. "North Bengal: Cooch Behar". Archived from the original on 8 November 2006. Retrieved 7 November 2006.
  28. "Employment in Cooch Behar". coochbehar.nic.in. Retrieved 29 April 2022.
  29. Industries in Cooch Behar, Cooch Behar Government Website Archived 15 జూలై 2010 at the Wayback Machine Accessed on 1 October 2006
  30. Tourism Development in Cooch Behar, Cooch Behar Government Website Archived 15 జూలై 2010 at the Wayback Machine Accessed on 1 October 2006
  31. hawabari.com
  32. "Rajbari in Cooch Behar town".
  33. "Tourist places of Cooch Behar".
  34. "Cooch Behar back on West Bengal's aviation map". The Times of India. 2023-02-22. ISSN 0971-8257. Retrieved 2023-03-01.

వెలుపలి లంకెలు[మార్చు]