Jump to content

కొడంగల్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°06′25″N 77°37′37″E / 17.107°N 77.627°E / 17.107; 77.627
వికీపీడియా నుండి
కోడంగల్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, కోడంగల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, కోడంగల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, కోడంగల్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°06′25″N 77°37′37″E / 17.107°N 77.627°E / 17.107; 77.627
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం కోడంగల్
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 53,673
 - పురుషులు 26,545
 - స్త్రీలు 27,128
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.15%
 - పురుషులు 58.77%
 - స్త్రీలు 33.34%
పిన్‌కోడ్ 509338

కొడంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] కోడంగల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన తాండూర్ నుండి 18 కి. మీ. దూరంలో కర్ణాటక సరిహద్దులో ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్ రాష్ట్ర రహదారి ఈ పట్టణం నుంచే వెళ్తుంది. హైదరాబాదు నుంచి నైరుతి వైపున 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ఉత్తరాన రంగారెడ్డి జిల్లా సరిహద్దును కల్గిఉంది. తాండూర్ పట్టణం ఇక్కడి నుంచి 17 కిలో మీటర్ల దూరాన ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నారాయణపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 249 చ.కి.మీ. కాగా, జనాభా 53,673. జనాభాలో పురుషులు 26,545 కాగా, స్త్రీల సంఖ్య 27,128. మండలంలో 10,981 గృహాలున్నాయి.[3]

భౌగోళికం

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో వాయవ్యం వైపున ఉంది. ఈ మండలానికి ఉత్తరాన రంగారెడ్డి జిల్లా, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రము, తూర్పున బొంరాస్‌పేట మండలం, దక్షిణమున దౌలతాబాదు మండలాలు ఉన్నాయి. కోడంగల్ 17° 6' ఉత్తర అక్షాంశము, 77° 37' తూర్పు రేఖాంశం మీదుగా ఉంది.

గణాంక వివరాలు

[మార్చు]

మండల జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 53542. ఇందులో పురుషుల సంఖ్య 26550, స్త్రీల సంఖ్య 26992. అక్షరాస్యుల సంఖ్య 25669.[4]

మండలంలోని విద్యాసంస్థలు

[మార్చు]

కోడంగల్‌లో 1969-70లో స్థాపించబడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. 2008-09 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం నూతనంగా డిగ్రీకళాశాలకు అనుమతి ఇచ్చింది. నారాయణ పేట రెవెన్యూ డివిజన్‌లోనే ఇది మొట్టమొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఇదివరకు జూనియర్ కళాశాల పూర్తయిన విద్యార్థులు డిగ్రీ అభ్యసన కొరకు రంగారెడ్డి జిల్లా తాండూరుకు వెళ్ళవలసి ఉండేది.

  • మండలంలోని ప్రాథమిక పాఠశాలలు: 46.
  • మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలలు: 15.
  • మండలంలోని ఉన్నత పాఠశాలలు: 11.

పశుసంపద

[మార్చు]

2007 నాటి పశుగణన ప్రకారం మండలంలో 13వేల గొర్రెలు, 11 వేల మేకలు, 2400 పందులు, 1700 కుక్కలు, 25వేల కోళ్ళు, 5700 దున్నపోతులు ఉన్నాయి.

దుద్యాల మండలం కలిసిన హస్నాబాద్ గ్రామం

[మార్చు]

కొడంగల్ మండలం లోని హస్నాబాద్ రెవెన్యూ గ్రామం వికారాబాద్ జిల్లాలో 2022 జూలై 22న కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలంలో విలీనం చేయబడింది.[5]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  • గమనిక: గతంలో 19 గ్రామాలు ఉన్న హస్నాబాద్ గ్రామంతో కలిపి ఈ మండలంలో 19 గ్రామాలు ఉండేవి. తరువాత కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలంలో హస్నాబాద్ గ్రామం విలీనం కావటం జరిగింది.[6]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. Census of India 2011, Provisional Population Totals, Andhra Pradesh, Published by Director of Census Operations AP, Page No 125
  5. telugu, NT News (2022-07-24). "ప్రత్యేక మండలంగా దుద్యాల". www.ntnews.com. Retrieved 2023-08-15.
  6. "ఇక నుంచి దుద్యాల మండలం |". web.archive.org. 2023-12-29. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇవికూడా చూడండి

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]